Gandhi death anniversary
-
ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా.. నివాళులు అర్పించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తానని, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసుకుందాం అని ట్వీట్ ద్వారా ఆయన పిలుపు ఇచ్చారు. ఈ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన జాతిపిత మహాత్మా గాంధీజీకి నివాళులర్పిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, మన దేశం పట్ల ఆయన దార్శనికతను సాకారం చేసేందుకు ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు, నా రాష్ట్రానికి, అతను ఎప్పటికీ మనకు ప్రియమైన గాంధీ తాతా అని ట్వీట్ చేశారు. జనవరి 30, 1948లో గాంధీజీ అమరులయ్యారు. దేశం కోసం మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడానికి ఈ రోజును ‘అమరవీరుల దినోత్సవం’గా కూడా పాటిస్తారు. On this Martyrs’ Day, I pay homage to the father of our nation Mahatma Gandhi ji. For the people of Andhra Pradesh, I vow to follow in his footsteps to realise his vision for our country. For me and my state, he will forever be our beloved Gandhi Thatha. #MahatmaGandhi — YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2023 -
బాపూజీకి జాతి నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో జాతిపితకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత ఆలోచనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం మన బాధ్యత అని ప్రధాని ట్వీట్ చేశారు. అమరజవాన్ల దినోత్సవం సందర్భంగా దేశం రక్షణ కోసం వీరోచితంగా పోరాడిన అమర సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి సేవ, ధైర్యసాహసాలు మరువలేనివని ప్రధాని కొనియాడారు. అహ్మదాబాద్: మహాత్మాగాంధీ ‘స్వదేశీ’ ఉద్యమానికి అసలైన నిర్వచనం.. తమ ప్రభుత్వం కార్యక్రమాలైన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. స్వాతంత్య్రం తరువాత భారత్‌ను పునర్నిర్మించాలన్న ఆయన ఆలోచన ఏళ్లపాటు పక్కన పెట్టారని, తాము అధికారంలోకి వచ్చాక దాన్ని అమల్లోకి తెచ్చామని అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరాన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ఏర్పాటు చేసిన కుడ్య చిత్రాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ కుడ్యచిత్రం బాపూజీకి నిజమైన నివాళి అని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. నిజం బతికున్నంత కాలం గాంధీ సజీవం మహాత్మాగాంధీ లేరని హిందుత్వ వాదులు భావిస్తున్నారని, కానీ సత్యం బతికున్నంత కాలం జాతిపిత సజీవంగా ఉంటారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. బాపూజీ 74వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్లో ‘ఫరెవర్ గాంధీ’ హ్యాష్‌ట్యాగ్‌తో నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ దగ్గరా రాహుల్ ఆదివారం జాతిపితకు అంజలి ఘటించారు. హిందుత్వవాదీ అయిన గాడ్సే మహాత్ముడిని కాల్చి చంపాడని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘నేను నిరాశకు గురైనప్పుడు... సత్యం, ప్రేమ మాత్రమే గెలుస్తుందన్న చరిత్రను గుర్తు చేసుకుంటాను. కొంతకాలం పాటు అది కనిపించకుండా ఉండొచ్చు... హంతకులు, నిరంకుశులు మాత్రమే ఉండొచ్చు. కానీ చివరికి వాళ్లు ఓడిపోతారు. అది నిత్యం మనసులో ఉంచుకోండి’’ అన్న మహాత్ముడి కోట్ని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా మహాత్మాగాంధీకి ట్విట్టర్లో నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో మహాత్ముడికి ఘన నివాళులర్పించింది. కాళీచరణ్‌కు ‘గాడ్సే భారత రత్న’ రాయ్‌పూర్‌లో జరిగిన ధర్మసంసద్‌లో మహాత్ముడిని కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో గత డిసెంబర్లో అరెస్టయి, గ్వాలియర్ జైల్లో ఉన్న మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌కు, మరో నలుగురు హిందూ మహాసభ నేతలకు ‘గాడ్సే–ఆప్టే భారతరత్న’ అవార్డును ప్రదానం చేసింది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హిందూమహాసభ జాతిపితను హత్య చేసిన నాథురామ్ గాడ్సేకి నివాళులర్పించింది. గాంధీ హత్యకేసులో గాడ్సే సహనిందితుడు అయిన నారాయణ ఆప్టేకు నివాళిగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆదివారం ‘గాడ్సే–ఆప్టే స్మృతి దివస్’ను నిర్వహించింది. 1948 జనవరి 30న గాడ్సే, ఆప్టేల అరెస్టుకు వ్యతిరేకంగా ‘గాడ్సే–ఆప్టే స్మృతి దివస్’ నిర్వహిస్తున్నామని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ తెలిపారు. మహాత్మాగాంధీకి జాతిపిత ఇవ్వడమేంటని మీరట్‌లోని హిందూ మహాసభ నేతలు ప్రశ్నించారు. -
బాపూజీ బాటలో...
మనసు పవిత్రం అయితే మాట కూడా పవిత్రమవుతుంది. దానికి మంత్రబలం లాంటిది వస్తుంది. బాపూజీ మాట ఎందరినో తమను తాము తెలుసుకునేలా చేసింది. తమ జీవితాన్ని కాంతి మంతమైన కొత్త బాటలోకి నడిపించుకు వెళ్లేలా చేసింది. దీనికి బలమైన ఉదాహరణ ఈ ముగ్గురు మహిళలు... మెడెలిన్ స్లెడ్ మీరాబెన్‌గా ఎలా మారింది? ‘మెడె లిన్ స్లెడ్ ఎవరు?’ అంటే టక్కున గుర్తుకురాకపోవచ్చు. అయితే ‘మీరాబెన్’ అంటే మాత్రం గాం«ధీజీ గుర్తుకు వస్తారు. బ్రిటిష్ సైనిక అధికారి సర్ ఎడ్మండ్ కుమార్తె అయిన మెడె లిన్‌కు సంగీతం వినడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఒకానొక సందర్భంలో ఫ్రెంచ్ రచయిత రోమైన్ రోలెండ్ గాంధీజీ జీవితంపై రాసిన పుస్తకం చదివింది. ఈ పుస్తకం తనను ఎంత ప్రభావితం చేసిందంటే ‘సబర్మతీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నాను’ అని గాంధీజీకి లేఖ రాసింది. ‘తప్పకుండా రావచ్చు’ అని ఆహ్వానిస్తూనే ఆశ్రమ క్రమశిక్షణ వాతావరణాన్ని గుర్తు చేశారు గాంధీ. 1925లో అహ్మదాబాద్‌కు వచ్చింది మెడెలిన్. గాంధీజీలో ఒక దివ్యకాంతిని దర్శించింది. ఆ కాంతి తనను పూర్తిగా మార్చేసింది. మద్యపానం, మాంసాహారం మానేసేలా చేసింది. ‘భగవద్గీత’ అధ్యయనం ఆమె జీవితాన్ని వెలుగుమయం చేసింది. తన పేరు ‘మీరాబెన్’గా మారింది. ఉద్యమాల్లో భాగంగా గాంధీజీతో పాటు జైలుకు కూడా వెళ్లింది. ‘సేవాగ్రామ్’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. రిషికేష్‌కు సమీపంలో ‘పశులోక్ ఆశ్రమం’ ఏర్పాటు చేసింది. బాపు తనకు రాసిన ఉత్తరాలను పుస్తకంగా ప్రచురించింది. కోట దాటి పేదల పేటకు వచ్చిన రాజకుమారి అమృత్‌కౌర్ పెరిగిన వాతావరణానికి, ఆ తరువాత ఉద్యమకారిణి గా ఆమె జీవితానికి ఎక్కడా పొంతన కనిపించదు. కోటలో రాజకుమారి పేట పేటకు తిరిగి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి స్ఫూర్తి గాంధీజీ. కపూర్థలా రాజు హరినామ్సింగ్ కుమార్తె అయిన అమృత్‌కౌర్ ఇంగ్లండ్‌లో చదువుకుంది. గాంధీజీకి ఆమె ఎన్నో ఉత్తరాలు రాసేది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆమె దిశను మార్చేసాయి. 1934లో గాంధీని కలుసుకుంది. ఆ తరువాత ఆశ్రమంలో చేరింది. తన ఖరీదైన రాచరిక జీవనశైలికి, ఆశ్రమ వాతావరణానికి బొత్తిగా సంబంధం లేదు. చాలా కష్టం కూడా అనిపించవచ్చు. కాని ఎండకన్నెరుగని రాజకుమారి సామాన్యురాలిగా మారి ఆ ఆశ్రమంలో సేవ చేసింది. గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శిగా 16 సంవత్సరాలు పనిచేసింది. ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. గాంధీజీ తనకు రాసిన ఉత్తరాలు ‘లెటర్స్ టు రాజకుమారి’ పేరుతో పుస్తకంగా వచ్చింది. వైద్యం నుంచి ఉద్యమం వరకు... కుంజా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) అనే చిన్న నగరం లో జన్మించింది సుశీల నయ్యర్. ఆమెకు ప్యారేలాల్ అనే అన్న ఉండేవాడు. అన్నాచెల్లెళ్లకు గాంధీజీ తత్వం అంటే బాగా ఇష్టం. ఎప్పుడూ దాని గురించి చర్చించుకునేవారు. దిల్లీలో వైద్యవిద్యను అభ్యసించింది సుశీల. 1939లో తన సోదరుడిని ‘సేవాగ్రామ్’లో చేర్పించడానికి వచ్చింది. అలా గాంధీజీతో పరిచయం పెరిగింది. పేదలకు ఆమె చేసే వైద్యసహాయం గాంధీజీ ప్రశంసలు అందుకునేలా చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. ఇదంతా వారి తల్లిదండ్రులకు మొదట్లో నచ్చలేదు. అయితే ఆ తరువాత కాలంలో వారి ఆలోచన విధానంలోనూ మార్పు వచ్చింది. మహత్మాగాంధీ: ఫైనల్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్, మహాత్మాగాంధీ: సాల్ట్ సత్యాగ్రహ... మొదలైన పుస్తకాలు రాసింది డా.సుశీల నయ్యర్. -
‘‘వై ఐ కిల్డ్ గాంధీ’’ సినిమా విడుదల ఆపండి
ముంబై: మహాత్మాగాంధీ వర్ధంతి రోజైన జనవరి 30న విడుదల కానున్న వై ఐ కిల్డ్ గాంధీ సినిమా విడుదల నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సినిమాతో జాత్యహంకార పోకడలు పెచ్చుమీరుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ ఒక లేఖ రాశారు. మహాత్ముని మార్గాలైన అహింస, శాంతిని స్మరించుకోవాల్సిన రోజు ఈ సినిమా విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్సీపీ ఎంపీ, నటుడు అమోల్ కొల్హె ఈ సినిమాలో మహాత్ముడిని చంపిన నాథూరామ్ గాడ్సే పాత్రని పోషించారు. -
గాంధీ సేవలు చిరస్మరణీయం: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలరాజు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీ, మళ్ల విజయ ప్రసాద్, రెహమాన్, కోలా గురువులు పాల్గొన్నారు. చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు.. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతిని ఏక తాటిపైకి తెచ్చిన గొప్ప నేత మహాత్మాగాంధీ అని కొనియాడారు. అహింసా గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు ఆయన సాటి చెప్పారన్నారు. గాంధీజీ ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చుతున్నారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమన్నారు. నాలుగు లక్షల మందికి పైగా ఒకేసారి ఉద్యోగాలను సీఎం వైఎస్ జగన్ కల్పించారన్నారు. చదవండి: నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా? -
గాంధీని రక్షించిన ఆ వంటవాడి కుటుంబం ఇప్పటికీ.....
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా మంగళవారం నాడు దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనపై కాల్పులు జరిపి హత్య చేసిన నాథూరామ్ గాడ్సే గురించి, ఆయనతోపాటు హత్య కుట్రలో భాగస్వామిగా ఉన్న నారాయణ్ ఆప్టేలను 1949, నవంబర్ 15న ఉరిశిక్ష విధించిన విషయం గురించి అన్ని పత్రికలు ప్రస్తావించాయి. అంతకుముందు 1917లోనే గాంధీపై హత్యాయత్నం జరిగిందని, అప్పుడు గాంధీకి కుట్ర గురించి వెల్లడించి ఆయన ప్రాణాలను రక్షించిన ఓ వంట మనిషి ఎన్నో చిత్ర హింసలకు గురయ్యారని, ఆయన మనమళ్లు ఇప్పటికీ కూలీలుగా బతుకుతున్నారనే విషయాలను కూడా ప్రస్తావిస్తే బాగుండేది. 1917, ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు బీహార్‌లోని తూర్పు కంపారన్ జిల్లాలోని మోతిహరి రైల్వే స్టేషన్లో ముజాఫర్‌బాద్ నుంచి వచ్చిన రైల్లో జాతిపిత గాంధీ దిగారు. అక్కడి భూస్వాములు ఇండిగో(నీలగిరి) చెట్లను పెంచాల్సిందిగా స్థానిక రైతులను వేదిస్తున్నారన్న వార్తలపై వాస్తవాలు తెలుసుకునేందుకు గాంధీ అక్కడికి వెళ్లారు. ‘ఎర్విన్’ అనే ఇండిగో తోటకు మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ బ్రిటిషర్ నుంచి భోజనానికి రావాల్సిందిగా గాంధీకి ఆహ్వానం అందింది (ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత హరీష్ చంద్ర చౌదరి రాసిన ‘చంపారన్కే స్వాతంత్రతా సేనాని’ పుస్తకం ప్రకారం). బ్రిటీష్ మేనేజర్ ఎర్విన్ గాంధీ రాగానే ఆయనకు విషయం కలిపిన పాలను ఇవ్వాల్సిందిగా తన వంటవాడైన బటక్ మియాకు ఆదేశించాడు. చెప్పినట్టు చేస్తే ఎంత డబ్బైనా ఇస్తానని, చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గాంధీ రాగానే బటక్ మియా విషం కలిపిన పాలను తీసుకొచ్చి గాంధీ ముందు నిలబడ్డాడు. అందులో విషం ఉందని, తమను చంపేందుకు తన యజమాని కుట్ర పన్నిన విషయాన్ని బటక్ మియా చెప్పేశాడు. ఆ నాటి ఈ కుట్రకు ప్రత్యక్ష సాక్షి భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆ కుట్ర నుంచి క్షేమంగా బయట పడిన గాంధీజీ రైతుల కష్టాలపై భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక ఘట్టమైన తొలి సత్యాగ్రహం జరిపారు. వంటవాడు బటక్ మియాది మోతిహరి సమీపంలోని సిస్వా అజ్గరీ అనే కుగ్రామం. గాంధీని చంపకుండా కుట్రను బయటపెట్టినందుకు ఆయన కుటుంబాన్ని ఆ గ్రామం నుంచి తరిమేశారు. ఆయన ఇంటి స్థలాన్ని శ్మశానంగా మార్చేశారు. బటక్ మియా కుట్రకు పాల్పడితే గాంధీజీ ఉండేవారు కాదు. ఆయన లేని స్వాతంత్య్ర పోరాటాన్ని ఊహించలేం. అయినప్పటికీ బటక్ మియా విషయాన్ని అందరూ మరచిపోయారు. 1950లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అవిభాజ్య చంపారన్‌కు హెడ్క్వాటర్గా ఉన్న మోతిహరిని సందర్శించారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ రైలు దిగినప్పుడు ఆయనకు స్వాగతం చెప్పేందుకు రైల్వే గేట్ల నుంచి జనం ఎగబడ్డారు. అందులో ఓ వ్యక్తిగా గట్టిగా మాట్లాడుతూ తనవైపు వచ్చేందుకు ప్రయత్నించడాన్ని రాజేంద్ర ప్రసాద్ గమనించారు. ఆ వ్యక్తిని బటక్ మియాగా గుర్తించి ఆయన వద్దకు వెళ్లి పలకరించారు. భుజం మీద చేయివేసి వెంట తీసుకెళ్లాడు. పట్టణంలో తన కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి కూడా బటక్ మియాను తీసుకెళ్లి తన పక్కనే కూర్చోపెట్టుకున్నారు. ఆయన చేసిన సహాయం ఎలాంటిదో ప్రజలకు చెప్పారు. చంపారన్ కలెక్టర్‌ను పిలిచి బటక్ మియా, ఆయన ముగ్గురు కుమారులకు 24 ఎకరాల భూమిని ఇచ్చి జాతి పురస్కారాన్ని అందజేయాలని ఆదేశించారు. అక్కడ గాంధీ సత్యాగ్రహం జరిగి వందేళ్లు అయింది. ఇప్పటికీ బటక్ మియా ముని మనవళ్లు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలవుతుందా ? అని ఎదురుచూస్తున్నారు. 2010లో బటక్ మియా కుటుంబం ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితుల గురించి ‘హిందుస్థాన్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించింది. దానిపై అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ స్పందించి నాడు రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హామీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఓ నివేదికను సమర్పించాల్సిందిగా తూర్పు, పశ్చిమ చంపారన్ మేజిస్ట్రేట్లను ఆదేశించారు. వారు ఎలాంటి నివేదిక ఇచ్చారో, అసలు నివేదిక ఇచ్చారో లేదో తెలియదు. గాంధీ వర్థంతి రోజున కూడా సిస్వా అజ్గరి గ్రామంలో బటక్ మియా దంపతుల సమాధులు దుమ్ముకొట్టుకుపోయి ఉన్నట్లు స్థానిక పత్రికల ద్వారా తెలిసింది. వారు మనమళ్లు అక్కడి ‘టైగర్ రిజర్వ్ ఫారెస్ట్’ సమీపంలో ఉన్న ఓ చిన్న స్థలంలో కూలినాలి చేసుకుంటూ బతుకుతున్నారట. హామీలు ఇవ్వడం మరచిపోవడం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు మన ప్రభుత్వాలకు అలవాట్లని ఈ వార్తా కథనం స్పష్టం చేస్తోంది. ఎవరో కళాకారుడు గీసిన బటక్ మియా చిత్తరువు తప్ప ఆయన ఫొటో కూడా అందుబాటులో లేదు. -
ఓ మహాత్మా! ఓ మహర్షి!!
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ ఈ రోజు అంటే, 1948, జనవరి 30వ తేదీన నాథూరామ్ గాడ్సే అనే ఆరెస్సెస్ కార్యకర్త హత్య చేశారనే వార్తను ఆకాశవాణిలో ప్రకటించినప్పుడు అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆకాశవాణిలో మాట్లాడుతూ ‘మన జీవితాల నుంచి ఓ దివ్య జ్యోతి వెళ్లిపోయింది. అంతటా చీకట్లు కమ్ముకున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఫిబ్రవరి 2వ తేదీన రాజ్యాంగ పరిషత్‌లో నెహ్రూ, గాంధీ గురించి అద్భుతంగా మాట్లాడారు. ‘ఆయన జీవితానికి ఓ పిచ్చోడు ముగింపు పలికాడు. ఇంతటి ఘోరానికి పాల్పడ్డ ఆ వ్యక్తిని నేను పిచ్చోడనే సంబోధిస్తా. గత కొన్ని ఏళ్లుగా, నెలలుగా దేశంలో విషం వ్యాపించింది. అది ప్రజల మెదళ్లను కూడా ప్రభావితం చేస్తోంది. ఆ విషాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. దాన్ని నామరూపాలు లేకుండా చేయాల్సిందే. పిచ్చిగానో, చెడుగానో దాన్ని అంతం చేయాలనుకోవడం పొరపాటు. మనల్ని వీడిపోయిన మన ప్రియతమ టీచరు దాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పాడో, అచ్చం అలాగే ఎదుర్కోవాలి’..........ఆకాశవాణిలో నెహ్రూ. ‘పోయిన ప్రముఖులకు నివాళి అర్పించడం సభలో ఆనవాయితో కావచ్చు. ఈ సందర్భంగా ఈ సభలో నేనుగానీ, ఇతరులుగానీ ఎక్కువ మాట్లాడటం సబబు కాకపోవచ్చు. నేను మాత్రం ఓ వ్యక్తిగా, ప్రభుత్వాధినేతగా సిగ్గుపడుతున్నాను. అమూల్యమైన సంపదను పరిరక్షించుకోవడంలో మనం విఫలమయ్యాం. గత కొన్ని నెలలుగా అనేక మంది అమాయకులు, మహిళలు, పిల్లలను రక్షించుకోవడంలో విఫలమవుతూ వస్తున్నాం. ఈ రోజు ఎంతో గొప్ప వ్యక్తిని రక్షించుకోలేకపోయామంటే అంతకన్నా సిగ్గుచేటు మనకు మరోటి లేదు. ఓ భారతీయుడు ఆయనపైకి చెయ్యెత్తినందుకు ఓ భారతీయుడిలా నేను సిగ్గుపడుతున్నాను. ఓ హిందువు ఆ పని చేసినందుకు ఓ హిందువుగా నేను సిగ్గుపడుతున్నాను. నిజంగా ఆ మహానుభావుడు ఎంతో బాధ పడి ఉంటారు. ఆయన బోధనా మార్గంలో నడవాల్సిన ఈ తరమే విఫలమైనందుకు ఆయన బాధ పడి ఉంటారు. ఆయన చూపిన మార్గాన్ని కాదని మరో మార్గాన మనం నడుస్తున్నందుకు ఆయన బాధ పడి ఉంటారు. ఆయన చేతులు పట్టుకున్న పిల్లాడి చేతులే ఆయన్ని పంపించినందుకు ఆయన బాధ పడి ఉంటారు.’ రాజ్యాంగ పరిషత్’ సభలో జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగంలోని ఓ భాగాన్ని గాంధీకి నివాళిగా ఇక్కడ ఇస్తున్నాం. -
రెండు నిమిషాలు ఆగిన భాగ్యనగరం
సాక్షి, హైదరాబాద్ : జంట నగరాలు రెండు నిమిషాలపాటు నిలిచిపోయాయి. గాంధీ వర్ధంతి సందర్భంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలన్న ప్రభుత్వం ఆదేశాలను ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆ సమయంలో రహదార్లపై వాహన రాకపోకలను అధికారులు ఎక్కడికక్కడే నిలిపివేశారు. ఆ సమయంలో వాహనదారులు హారన్లు కూడా మోగించలేదు. పాదాచారులు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోకొన్ని చోట్ల కూడా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారస్థులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు మౌనం పాటించినట్లు తెలుస్తోంది. బేగంపేట్ ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తా వద్ద దృశ్యం స్వాతంత్య్రం కోసం బలిదానం చేసిన వారి త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
బాపూ.. వందనం
-
ఓ పిచ్చోడు గాంధీని చంపాడు
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని ఓ పిచ్చివాడు చంపేశాడని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. గాంధీ సిద్ధాంతం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ‘స్వచ్ఛ్ గంగ- గ్రామీణ్ సహ్భాగిత’ పేరిట ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనివారం ఆమె ప్రసంగించారు. గంగానదీ తీరాన ఉన్న గ్రామ పంచాయతీ పెద్దలంతా గంగానది ప్రక్షాళన కోసం కృషి చేయాలని కోరారు. భారత ఆత్మ గ్రామాల్లోనే ఉందని గాంధీజీ అన్నారని.. జాతిపిత వర్ధంతి రోజున గంగానది ప్రక్షాళనకు గ్రామాల పెద్దలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టడం శుభపరిణామమని ఆమె అన్నారు. గంగానది ప్రక్షాళనకు గత 29 ఏళ్లుగా రూ. 4 వేల కోట్లు వ్యయం చేసినా ప్రయోజనం సిద్ధించలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. -
'గాడ్సే పుస్తకాన్ని రిలీజ్ చేస్తే ఒప్పుకోం'
పనాజి: నాధురాం గాడ్సే పేరిట రచించిన ఓ పుస్తకం విడుదల వివాదానికి దారి తీయనుంది. మహాత్మగాంధీ వర్థంతి రోజునే ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం కూడా ఆ వివాదానికి ఆజ్యం పోయనుంది. మహాత్మాగాంధీని నాధూరాం గాడ్సే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ గాడ్సేపైనే 'నాధురాం గాడ్సే-ది స్టోరీ ఆఫ్ యాన్ అస్సాసిన్' అనే పుస్తకం శనివారం విడుదలవుతోంది. దీనిని అనూప్ సర్దేశాయి రచించగా.. బీజేపీ నేత ఒకరు విడుదల చేస్తున్నారు. అదికూడా ప్రభుత్వం భవనం అయినటువంటి రవీంధ్ర భవన్లో. దీంతో ఈ పుస్తకాన్ని అసలు విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తూ, విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ గోవాలో కొత్తగా ఏర్పాటయిన పార్టీ గోవా ఫార్వార్డ్ పార్టీ హెచ్చరిస్తోంది. రవీంధ్ర భవన్ ఎదుట తాము సత్యాగ్రహానికి దిగుతామని హెచ్చరిస్తోంది. తాము ఆ భవన్ వైపు వచ్చే మార్గాలన్నింటిని మూసివేస్తామని, ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకావొద్దని వారు సూచిస్తోంది.