
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలరాజు, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీ, మళ్ల విజయ ప్రసాద్, రెహమాన్, కోలా గురువులు పాల్గొన్నారు. చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు..
మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, జాతిని ఏక తాటిపైకి తెచ్చిన గొప్ప నేత మహాత్మాగాంధీ అని కొనియాడారు. అహింసా గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు ఆయన సాటి చెప్పారన్నారు. గాంధీజీ ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చుతున్నారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమన్నారు. నాలుగు లక్షల మందికి పైగా ఒకేసారి ఉద్యోగాలను సీఎం వైఎస్ జగన్ కల్పించారన్నారు. చదవండి: నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా?
Comments
Please login to add a commentAdd a comment