
సాక్షి, చెన్నై : హిందూ ఉగ్రవాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యానించారు. మహాత్మగాంధీని హత్యచేసిన గాడ్సేతోనే దేశంలో ఉగ్రవాదం ఆరంభమైందని కమల్‌హాసన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవక్కురిచ్చిలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అరక్కురిచ్చిలో ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తాను ఈ వాఖ్యలు చేయడం లేదని వివరించారు.
‘గాంధీ విగ్రహం ముందు నిలబడి ఒక చెబుతున్నా..దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే. మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారని ఈ మాట చెప్పడం లేదు. ఎక్కడైనా ఇదే మాట చెబుతా’అని కమల్‌హాసన్ గాడ్సేపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలులతో పాటు పలు పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
Comments
Please login to add a commentAdd a comment