పెళ్లికొడుకును కాల్చి చంపారు.. | Groom killed in celebratory firing Sitapur | Sakshi
Sakshi News home page

పెళ్లికొడుకును కాల్చి చంపారు..

Published Thu, Feb 18 2016 12:00 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

పెళ్లికొడుకును కాల్చి చంపారు.. - Sakshi

పెళ్లికొడుకును కాల్చి చంపారు..

లక్నో:  ఉత్తరప్రదేశ్ సీతాపూర్లో వివాహ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపుగా వివాహ వేదికకు వస్తున్న వరుడు  అమిత్ రస్తోగి (28)ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీంతో  మరికొద్ది నిమిషాల్లో బాజా భజంత్రీలతో మార్మోగాల్సిన వివాహ వేడుక కాస్తా బంధువుల రోదనలతో శోకసంద్రంలా  మారిపోయింది.  వివరాల్లోకి వెళితే  స్థానిక ప్రేమ్ నగర్లోని గెస్ట్ హౌస్ బుధవారం  పెళ్లి వారితో సందడిగా ఉంది.  పెళ్లి బారాత్లో పెళ్లికొడుకు గుర్రంపై ఊరేగుతూ తరలి వస్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ వరుని తరపు నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు  ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో ఒక బుల్లెట్ వరుడు అమిత్ తలలోకి దూసుకుపోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. పెళ్లికొచ్చిన అతిథులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాగా స్పృహ తప్పిపడిపోయిన అతడిని లక్నోలోని  ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అమిత్  మరణించాడని వైద్యులు ధృవీకరించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు  మృతదేహాన్ని  పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.  దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. హంతకుల ఆచూకీ కోసం పెళ్లి వీడియో ఫుటేజ్ను పరిశీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement