భర్త బతికుండగానే వితంతు పెన్షన్‌ | Women Get Widow Pension While Husbands Are Alive | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 18 2018 9:37 AM | Last Updated on Sun, Nov 18 2018 11:46 AM

Women Get Widow Pension While Husbands Are Alive - Sakshi

మీడియాతో సందీప్‌ కుమార్‌

లక్నో : భర్త బతికుండగానే ఓ వివాహితకు వితంతు పెన్షన్‌ అందింది. ఇది చూసి నిర్ఘాంతపోయిన ఆమె భర్త ఆరాతీయగా అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సితాపుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అదే జిల్లాకు చెందిన సందీప్‌ కుమార్‌ (22) సతీమణికి ఇటీవల బ్యాంకు ఖాతాలో 3000 జమ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. ఈ డబ్బులెక్కడివని సందీప్‌ బ్యాంకు అధికారులను సంప్రదించగా..  వితంతు పెన్షన్‌ స్కీమ్‌లో భాగంగా వచ్చాయని తెలిపారు.

తను బతికుండగానే తన భార్యకు వితంతు పెన్షన్‌ రావడం ఏంటని సందీప్‌ షాక్‌కు గురయ్యాడు. తన భార్యకే కాకుండా అత్త, మరదలుకు కూడా వారి భర్తలు బతికుండగానే పెన్షన్‌ వచ్చిందని మీడియాకు తెలిపాడు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జిల్లా పరిపాలక అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దీనికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement