widow pension
-
బాబూ ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి! భర్త ఉన్నప్పటికీ వితంతు పింఛన్ ఇవ్వాలా?
ఎద్దు ఈనిందంటే మునుపటికొకడు గాటికి కట్టెయ్యమన్నాడట. టీడీపీ అధినేత చంద్రబాబు వాలకం అచ్చం అలానే ఉంది. నిత్యం ప్రభుత్వంపై బురద చల్లనిదే నిద్రపట్టని పచ్చ పత్రికల ఓనర్లు ఇష్టానుసారం అబద్ధాలు ప్రచారం చేస్తుండటం ఈమధ్య కాలంలో శ్రుతిమించింది. వాటికి తాళం వేస్తూ తబలా వాయించనిదే బాబుకూ నిద్రపట్టడం లేదు. భర్త, పిల్లలున్న మహిళకు వితంతు పింఛన్ ఎందుకిస్తున్నారంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ తన వాళ్లను వెనకేసుకొచ్చి ఎంపీడీఓ కార్యాలయం వద్ద గొడవకు దిగితే పోలీసులు కేసు పెట్టారు. ఇందులో ఏం తప్పుందో.. నిస్సిగ్గుగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేసిన చంద్రబాబే చెప్పాలి. తర్లుపాడు: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పోతలపాడుకు చెందిన రాచీటి వెంకట రమణమ్మ, లక్ష్మయ్య దంపతుల మూడో సంతానం పెరికె నాగులు. ఈమెకు 2010లో మార్కాపురం మండలం జమ్మనపల్లికి చెందిన పరిశపోగు సుబ్బయ్యతో వివాహమైంది. 2012 నవంబర్ 10వ తేదీన వీరికి బాబు జన్మించాడు. ఆ తర్వాత ఆరు నెలలకు భర్త అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి నాగులు వితంతు పింఛన్ తీసుకుంటోంది. 2018లో నంద్యాల సమీపంలోని గాజులపలి్లకి చెందిన పెరికె ఇర్మియతో ఈమెకు రెండో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. గర్భిణిగా ఉన్నప్పుడు స్థానిక సబ్సెంటరులో, అంగన్వాడీ కేంద్రంలో భర్త పేరు ఇర్మియగా నమోదు చేసుకుంది. ప్రభుత్వ వైద్యశాలలో కాన్పు రికార్డుల్లో కూడా భర్త పేరు ఇర్మియగా తెలిపింది. అత్తతో విభేదాల కారణంగా స్వగ్రామమైన పోతలపాడులో భర్తతో కలిసి నివాసముంటోంది. భర్త బేల్దారి పనుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చివెళ్తుంటాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు జూన్ చివరి వారంలో నాగులు అక్రమంగా వితంతు పింఛన్ పొందుతోందని పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. విచారిస్తామని చెప్పడమే తప్పా? జూలై 1వ తేదీన పింఛన్ అందించాల్సిన వలంటీర్ గ్రామస్తుల ఫిర్యాదు విషయం తెలుసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడాక పింఛన్ అందిస్తానని నాగులుతో చెప్పాడు. అధికారులు విచారణ చేస్తుండగా జూలై 6వ తేదీన నాగులు, మరికొందరు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని లోపల ఉంచి బయట గడియ పెట్టి ఆందోళనకు దిగారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మండలంలోని మీర్జపేటలో ఉన్న ఎంపీడీవో హుటాహుటిన కార్యాలయం వద్దకు వెళ్లారు. ఆయన్ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కార్యాలయంలోనికి వెళ్లి మాట్లాడుకుందామని బతిమాలినా వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎంపీడీవో విషయాన్ని తర్లుపాడు ఎస్ఐ వేముల సుధాకర్‌కు తెలుపడంతో ఆయన అక్కడకు చేరుకుని ఎంపీడీవోను లోపలికి పంపాలని వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. వినకపోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టి ఎంపీడీవోను లోనికి పంపారు. లిఖిత పూర్వకంగా అర్జీ ఇస్తే విచారించి, న్యాయం చేస్తానని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో ఆయనకు దరఖాస్తు చేసుకున్నారు. తన విధులకు ఆటంకం కల్పించి, దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఎంపీడీవో ఫిర్యాదు మేరకు గాయం శ్రీనివాసరెడ్డి, చెంచిరెడ్డి, నాగులుతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవం ఇలా ఉంటే పింఛన్ ఎందుకు తొలగించారని అడిగినందుకు కేసు పెట్టడం దారుణం అని చంద్రబాబు పచ్చమీడియా వార్తలకు వంతపాడుతూ దుర్మార్గంగా ట్వీట్ చేశారు. -
బతికుండగానే చంపేశారు
సాక్షి, శంషాబాద్ రూరల్: ఓ మహిళను బతికుండగానే అధికారులు చంపేశారు.. రికార్డుల్లో చనిపోయినట్లు నమోదు కావడంతో ఆమెకు వితంతు పింఛన్ మంజూరు కావడంలేదు.. పింఛన్ కోసం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగిన ఆమె చివరకు గ్రామసభలో తన గోడు వెళ్లపోసుకుంది.. తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కిరోసిన్ డబ్బాను చూపిస్తూ గ్రామసభలో ఆందోళనకు దిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని ముచ్చింతల్‌కు చెందిన బీర్ల మణెమ్మ(48) భర్త సత్తయ్య 2018లో మృతి చెందాడు. దీంతో ఆమె వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకుంది. ఎన్నిసార్లు పంచాయతీ అధికారుల చుట్టూ తిరిగినా పలు రకాల కారణాలు చెబుతూ వచ్చారు. చివరకు ఆమె కూడా చనిపోయినట్లు రికార్డులో నమోదు అయినందున పింఛను రావడంలేదని చెప్పారు. దీంతో సోమవారం జరిగిన గ్రామ సభకు కిరోసిన్ బాటిల్‌తో వచ్చి ఆందోళన చేపట్టింది. తనకు ఎలాంటి ఆధారం లేదని పింఛను మంజూరు చేయాలని వేడుకుంది. తనకు ప్రతి నెలా రేషన్ కూడా వస్తుందని, పింఛను మంజూరు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మణెమ్మ పేరుతో 2018 డిసెంబర్ వితంతు పింఛను మంజూరైంది. అప్పటి నుంచి వరుసగా మూడు నెలల పాటు ఆమె పింఛన్ డబ్బులు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో పింఛన్ నిలిచిపోయింది. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె పింఛన్ కోసం మళ్లీ దరఖాస్తు చేస్తే విషయం తెలిసింది. మణెమ్మ బతికి ఉన్నట్లు ఆమె పేరుతో పింఛను మంజూరు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తి చేశాం. – రాజుకుమారి, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ముచ్చింతల్. (చదవండి: నీ జీవితం నువ్వు చూసుకో.. భార్యకు మెసేజ్ చేసి హోంగార్డు ఆత్మహత్య) -
Aasara Pension: అందని ఆసరా గుర్తింపు కార్డులు..!
ముషీరాబాద్ భోలక్‌పుర్‌కు చెందిన మహిళకు వితంతు పింఛన్ మంజూరైంది. కొత్తగా పింఛను మంజూరు కావడంతో గుర్తింపు కార్డు కోసం తహాసిల్ ఆఫీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆశ్రయించింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదంటూ నాలుగైదు రోజులుగా సమాధానం చెబుతూ వచ్చి... చివరకు కార్డు వచ్చింది... ఒంటరిగా రా ఇస్తానని చెబుతున్నాడని ఆరోపిసూ సదరు మహిళ కుటుంబ సభ్యులు, బస్తీ వాసులతో కలిసి తహసీల్దార్ సమక్షంలోనే సదరు సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాక్షి, హైదరాబాద్: కొత్త ఆసరా ఫించన్‌దారులకు గుర్తింపు కార్డులు అందని ద్రాక్షగా తయారయ్యాయి. ఆసరా పింఛన్లు మంజూరైనా..గుర్తింపు కార్డులు పంపిణీ నత్తలకు నడకనేర్పిస్తోంది. గత నెలలో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల చేతులు మీదుగా ఫించను గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టినా... కనీసం 30 శాతం పూర్తి కాలేదు. కొందరికి కార్డు దక్కి మిగతా వారికి పంపిణీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో లబ్ధిదారులు తహాసిల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ సంబంధిత సిబ్బందిచే ఛీత్కారాలు, వేధింపులకు గురవుతున్నారు. మహిళలకు వేధింపులే... ఆసరా పించన్ల విషయంలో వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఒక వైపు సిబ్బంది, మరోవైపు దళారులు మహిళల పేదరికం, అవసరాన్ని ఆసరా చేసుకొని వివిధ రకాలుగా వేధించడం పరిపాటిగా తయారైంది. గుర్తింపు కార్డులు అందని వారు తమకు ఫించన్ మంజూరు కాలేదన్న భయం... కొందరు సిబ్బంది.. దళారులకు కలిసి వచ్చే అవకాశంగా తయారైంది. తాము సహకరస్తామంటూ తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. కార్డుల పంపిణీ అంతంతే.. సరిగ్గా మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఆఫ్‌లైన్ ఆసరా దరఖాస్తులకు, ఏడాది అనంతరం ఆన్లైన్ ఆసరా దరఖాస్తులకు మోక్షం లబించి కొత్త పింఛన్లు మంజూరైనా గుర్తింపు కార్డుల పంపిణీ అంతంత మాత్రంగా తయారైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం మీద సుమారు 80,824 మంది ఆసరా పింఛన్లు మంజూరైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 58,066 మంది వద్దులకు, 15,210 మంది వితంతులకు, 3,265 మంది వికలాంగులకు, 2,197 ఒంటరి మహిళలకు, ఇద్దరు బీడీ కార్మికులకు, 1,194 మంది కళాకారులకు, 892 యాలసిస్ బాధితులకు, ఆరుగురు ఫైలేరియా, ఇద్దరు చేనేత కార్మికులను అసరా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీ కింద 1.96 లక్షల మంది సరా పింఛన్లు పొందుతున్నారు. (క్లిక్ చేయండి: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్‌కు..!) -
కూతురి కోసం స్త్రీ జన్మను వీడి మగ బతుకులో
స్టేజ్ మీద నాటకం కోసం కాసేపు స్త్రీ పురుషుడిగా... పురుషుడు స్త్రీగా మారాలంటేనే కొంచెం కష్టం. కాని– తమిళనాడులో ఒక తల్లి 30 ఏళ్లుగా పురుష అవతారం ఎత్తి జీవిస్తోంది. భర్త చనిపోయాక కూతురిని పెంచుకోవడం కోసం ఆమె పురుషుడిగా మారింది. ‘ముత్తు మాస్టర్’గా టీ స్టాల్లో పని చేసే ఆమె స్త్రీ అని ఎవరికీ తెలియదు. పురుషాధిపత్య సమాజం ఎంత భయపెడితే ఆమె ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది? రాజ్యాలను కాపాడుకోవడానికి ఆడపిల్ల పుడితే మగపిల్లాడిగా పెంచిన ఉదంతాలు చరిత్రలో ఉన్నాయి. ఒంటరి స్త్రీలు ఈ మగ ప్రపంచంలో బతకాలంటే అవసరార్థం మగ అవతారం ఎత్తక తప్పదని రాజ్ కపూర్ ‘మేరా నామ్ జోకర్’లో పద్మిని పాత్ర ద్వారా చూపిస్తాడు. ఆమె ఆ సినిమాలో మగవాడి వేషం కట్టి బతుకు ఈడుస్తుంటుంది. అమోల్ పాలేకర్ తీసిన ‘దాయ్రా’ అనే సినిమాలో ఒక గ్రామీణ యువతి గ్రామస్తుల దాష్టికాలు భరించలేక, స్త్రీగా తనకు కలుగుతున్న అభద్రత నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా మగ ఐడెంటిటీలోకి మారిపోతుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే ఒక నిస్సహాయురాలైన వితంతువు తన కూతురిని పెంచుకోవాలంటే మగవాడి అవతారం ఎత్తక తప్పదని భావించి గత ముప్పై ఏళ్లుగా అలాగే బతుకుతున్నదని తెలిస్తే ఆశ్చర్యమూ బాధా కలుగుతాయి. ఆ స్త్రీ పేరు పెచ్చియమ్మాళ్. ఊరు తమిళనాడులోని తూతుకూడి జిల్లాలోని కతునాయకన్పట్టి. 20 ఏళ్ల వయసులో పెచ్చియమ్మాళ్ది తూతుకూడి జిల్లా. ఆమెకు వివాహం అయ్యాక గర్భంలో ఉండగా భర్త మరణించాడు. ఆ తర్వాత ఆమెకు కూతురు పుట్టింది. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. ఒంటరి స్త్రీగా కుమార్తెను కాపాడుకోవడానికి అదే జిల్లాలోని రెండు మూడు ఊళ్లలో ప్రయత్నించింది పెచ్చియమ్మాళ్. ఒంటరి స్త్రీ. పైగా వయసులో ఉంది. నిస్సహాయురాలు. అలాంటి స్త్రీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాలో అన్నీ ఎదుర్కొంది ఆమె. తన ప్రాణం, తన ఉనికి కంటే తన కుమార్తె ఉనికి ముఖ్యం అనుకుందామె. నా కూతురిని ఎలాగైనా బతికించుకోవాలి... తను కూడా రేపు పెద్దది అవుతుంది... దానికి కూడా ఒక మగ అండ ఉందనే భ్రాంతి కలిగించాలి అనే ఆలోచన ఆమెకు కలిగింది. మగ అవతారం ఎత్తడమే అందుకు విరుగుడు అనుకుంది. అంతే! జుట్టు కత్తిరించుకుని, లుంగీ చొక్కా ధరించి, పూర్తిగా పురుషుడిలా కనిపిస్తూ ప్రస్తుతం నివసిస్తున్న కతునాయకన్పట్టికి చేరుకుంది. అన్ని మగవాళ్ల పనులే ఆ పల్లెలో ఆమెను అందరూ మగవాడనే అనుకున్నారు. ఆమె తన పేరును ముత్తు అని చెప్పుకుంది. పైగా చేసేవన్నీ మగవాళ్ల పనులే. కూలి పనులు, పెయింటింగ్ పని, కొబ్బరి బోండాలు కొట్టే పని, ఎక్కువ కాలం ఆమె హోటల్లో పరోటా మాస్టర్‌గా, టీ మాస్టర్‌గా పని చేసింది. అందువల్ల ఆమెను ఆ ఊళ్లో అందరూ ‘ముత్తు మాస్టర్’ అని పిలుస్తారు. ముత్తు మాస్టర్ ఈ పనులన్నీ చేసుకుంటూనే కూతురిని పెంచి పెద్ద చేసుకుంది. ఆమెకు జీవితం ఇచ్చింది. ఊళ్లో అందరూ తండ్రీ కూతుళ్లు జీవిస్తున్నారని భావించేవారు. కూతురికి ‘తండ్రి అండ’ ఉండటం వల్ల ప్రత్యేకంగా సమస్యలు రాలేదు. ఇలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు 30 ఏళ్లుగా మగవాడిగా బతుకుతున్నది పెచ్చియమ్మాళ్. ఇప్పుడు ఆమె వయసు 57 సంవత్సరాలు. పెన్షన్ కోసం అసలు రూపం పెచ్చియమ్మాళ్‌కు వయసు మీద పడింది. మునుపటిలా కష్టపడలేకున్నది. తన బతుకు, కూతురి బతుకు కూడా అంతంత మాత్రమే. అందుకని ‘వితంతువు పెన్షన్’ కోసం ఇక అసలు అవతారాన్ని బయటపెట్టింది. తాను స్త్రీనని చెప్తే ఊరంతా ఆశ్చర్య పోయింది. నమ్మకమైన ఇద్దరు ముగ్గురు స్త్రీలకు తప్ప ఇప్పటి వరకూ ఆ సంగతి ఆ ఊళ్లో ఎవరికీ తెలియదు. పెచ్చియమ్మాళ్ ఆధార్ కార్డు ‘ముత్తు’ పేరుతోనే ఉంది. ఆమె దగ్గర భర్త డెత్ సర్టిఫికెట్ లేదు. అందువల్ల ఆమెకు వితంతు పెన్షన్ ఇవ్వడం సమస్యగా మారింది. ఈ విషయం అందరికీ తెలిసి తనకు సహాయం అందడం కోసం ఈ విషయాన్ని మీడియాకు బయటపెట్టింది. అయితే తాను ఇలా ఇక మీదట కూడా పురుషుడిగానే ఉంటానని. తాను చనిపోయాక ముత్తుగానే అందరూ గుర్తు చేసుకోవాలని ఆమె కోరింది. -
మూడో దశ కరోనాపై సర్కార్ హైఅలర్ట్
భువనేశ్వర్: కరోనా మూడో దశ కొత్త తరహాలో పంజా విసురుతుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిర్వహణ యంత్రాంగం అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. మూ డో దశ కరోనా సంక్రమణ నేపథ్యంలో శిశు సంరక్షణ, చికిత్స పట్ల నిర్వహణ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించి పరిస్థితులు చేయి దాటకుండా జాగ్రత్త వహించాలని కోరారు. వచ్చే వారంలోగా రాష్ట్రంలో కరోనా సంక్రమణ పరిస్థితి మరింత అదుపులోకి వస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ వితంతువులకు పింఛన్ రాష్ట్రంలో కోవిడ్–19 సంక్రమణతో ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలకు వితంతు పింఛన్ మంజూరుకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా మహమ్మారితో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన బాలలకు కూడా పింఛన్ మంజూరు చేస్తారు. మధుబాబు పింఛన్ పథకం కింద 15 రోజుల్లో ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
శభాష్ వలంటీర్!
సాక్షి, బద్వేలు అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థలోని వలంటీర్లు అందిస్తున్న సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బద్వేలు మున్సిపాలిటీలోని 23వ వార్డు సచివాలయం పరిధిలో పనిచేస్తున్న ముండ్లపాటి వరకుమార్ అనే వలంటీర్ అందిస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. 31వ వార్డులోని సురేంద్రనగర్‌కు చెందిన రాచర్ల లక్ష్మిదేవి 111612177 ఐడితో వితంతు పింఛన్ తీసుకుంటోంది. అయితే ఆమె కుమారుడికి అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా చెన్నైలో ఉండి చికిత్స చేయించుకుంటోంది. నిబంధనల ప్రకారం వరుసగా మూడునెలలు పింఛన్ తీసుకోకుంటే హోల్డ్‌లో ఉంచుతారు. (చదవండి: అయ్యో పాపం: పింఛన్ కోసం వెళ్లి..) ఇది గమనించిన వలంటీర్ స్థానిక వార్డు ఇన్చార్జి యద్దారెడ్డితో చర్చించాడు. అసలే పేదరికంతో ఉన్న మహిళకు పింఛన్ రాకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి చెన్నైకి వెళ్లి పింఛన్ అందించి రావాలని కోరాడు. దీంతో వలంటీర్ వరకుమార్ చెన్నైలోని ఆసుపత్రి వద్దకు వెళ్లి సదరు మహిళకు 3నెలల పింఛన్ అందించి తనలోని సేవా నిరతిని చాటుకున్నాడు. అసలే కష్టాల్లో ఉన్న తనకు సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చి పింఛన్ అందించిన వలంటీర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ కె.వి.కృష్ణారెడ్డి, సచివాలయ సిబ్బంది వరకుమార్‌ను అభినందించారు. -
వితంతు, ఒంటరి మహిళల పింఛన్ నిబంధనల మార్పు
సాక్షి, అమరావతి : ప్రభుత్వోద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనల నిర్వచనాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించి వాటికి మరింత స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వితంతు, ఒంటరి మహిళల పెన్షన్‌కు అర్హత నిబంధనలను మార్పుచేశారు. దీని ప్రకారం.. - వితంతు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు కేటగిరీ–2 పెన్షన్ వయస్సును 45 ఏళ్లుగా నిర్థారించారు. - పిల్లలు లేకపోయినా, మైనర్ పిల్లలున్న వితంతు, విడాకులు తీసుకున్న మహిళలు తిరిగి వివాహం అయ్యేంత వరకు లేదా సంపాదన మొదలయ్యే వరకు.. పిల్లలు మేజర్లు అయ్యే వరకు, లేదా మరణం.. వీటిల్లో ఏది ముందు అయితే అంతవరకు ఈ కుటుంబ పెన్షన్ లభిస్తుంది. ఈ కేటగిరీ–2 పెన్షన్ తీసుకునే కుటుంబంలో వేరే వ్యక్తులు కేటగిరీ–1 పెన్షన్‌కు అర్హులైనా వారికి ఆ పెన్షన్ వర్తించదు. ఇలా కాకుండా పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. - అలాగే, కుటుంబ పెన్షన్ తీసుకుంటున్న తల్లి మృతిచెంది.. వివాహం కాని కుమార్తె ఉంటే ఆమెకు పాతికేళ్లు వచ్చే వరకు పెన్షన్ ఇస్తారు. వివాహమయ్యే వరకు లేదా ఆమె సంపాదన మొదలు పెట్టే వరకు పెన్షన్ అందిస్తారు. వివాహ ధ్రువీకరణకు సంబంధించి రెవెన్యూ శాఖలోని గెజిటెడ్ ఆఫీసర్ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత కూడా పెన్షన్ తీసుకుంటున్నట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. - కుటుంబ పెన్షన్ పొందుతున్న తల్లికి వివాహమైన తరువాత విడాకులు తీసుకున్న కుమార్తె ఉంటే.. ఆ కుమార్తె ముందుగానే అంటే 45 సంవత్సరాల వయస్సులోపే తన తల్లి మరణానంతరం పెన్షన్ తనకు ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు తల్లి మరణానంతరం ఆమె ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటే అన్ని ఏళ్లపాటు పెన్షన్ ఇస్తారు. కాగా, మారిన నిబంధనలకు అనుగుణంగా ట్రెజరీ, పెన్షన్ పేమెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
భర్త బతికుండగానే వితంతు పెన్షన్
లక్నో : భర్త బతికుండగానే ఓ వివాహితకు వితంతు పెన్షన్ అందింది. ఇది చూసి నిర్ఘాంతపోయిన ఆమె భర్త ఆరాతీయగా అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సితాపుర్ జిల్లాలో చోటుచేసుకుంది. అదే జిల్లాకు చెందిన సందీప్ కుమార్ (22) సతీమణికి ఇటీవల బ్యాంకు ఖాతాలో 3000 జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ డబ్బులెక్కడివని సందీప్ బ్యాంకు అధికారులను సంప్రదించగా.. వితంతు పెన్షన్ స్కీమ్‌లో భాగంగా వచ్చాయని తెలిపారు. తను బతికుండగానే తన భార్యకు వితంతు పెన్షన్ రావడం ఏంటని సందీప్ షాక్‌కు గురయ్యాడు. తన భార్యకే కాకుండా అత్త, మరదలుకు కూడా వారి భర్తలు బతికుండగానే పెన్షన్ వచ్చిందని మీడియాకు తెలిపాడు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జిల్లా పరిపాలక అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దీనికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
పర్చూరు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా టెక్నికల్ కమిటీ మెంబర్ దామా నాగేశ్వరరావు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. 30 సంవత్సరాలకుపైగా ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగులు, రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో జీవించటానికి ఆధారమైన పెన్షన్ భద్రతను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. వితంతు పింఛన్ ఇవ్వడంలేదు సార్.. పీసీపల్లి: ‘నా భర్త క్యాన్సర్‌తో బాధపడుతూ రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. నాకు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నాడు. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయితే వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదు. రేషన్‌కార్డు కూడా లేదు’ అని మల్కాపురానికి చెందిన పొట్లూరి లక్ష్మి జగన్మోహన్రెడ్డికి సమస్యను వివరించింది. -
పురుషుడికి వితంతు పింఛన్
శ్రీకాకుళం ,ఇచ్ఛాపురం రూరల్: రాజకీయ ప్రయోజనాల కోసం భర్త బతికుండగానే కొంతమంది మహిళలను వితంతువులుగా మార్చేశారు అధికార పక్ష నేతలు. ఏకంగా పురుషుడికే వితంతు పింఛన్ మంజూరు చేయించేశారు. ఇది తప్పంటున్న అధికారులపై ఎదురు తిరిగారు. ప్రభుత్వం తమ చేతుల్లో ఉందంటూ సామాజిక బృందాలను సైతం బెదిరించేందుకు వెనుకాడలేదు. ఇచ్ఛాపురం మండల కేంద్రంలో శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజావేదికలో జరిగిన ఈ ఘటనతో మండల స్థాయి అధికారులు సైతం బెంబేలెత్తిపోయారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సామాజిక భద్రతా పింఛన్లు, స్కాలర్షిప్లు (2016 అక్టోబర్ నుంచి 2017 డిశంబర్ వరకు) పనులపై సామాజిక తనిఖీ బృందాలు వారం రోజుల నుంచి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం నిర్వహించిన ప్రజావేదికలో పలు విషయాలు బహిర్గతమయ్యాయి. అరకబద్ర గ్రామానికి చెందిన సాడి వరలక్ష్మీ మూడేళ్ల నుంచి చెన్నైలో ఉంటుండగా, ఆమెకు నెలనెలా వితంతు పింఛన్ ఇస్తున్నట్లు, ఈ మేరకు రూ.40వేలను స్వాహా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన మంగి ఈశ్వరరావు భార్య మంగి రమణమ్మ(28)ను వితంతుగా మార్చేసి రూ.14వేలు పింఛన్ తీసుకున్నట్లు సామాజిక బృందం గుర్తించింది. ఈ విషయం సామాజిక బృందం గుర్తించిన వరకు సదరు బాధితురాలికి తెలియకపోవడం గమనార్హం. బరంపురం పంచాయతీలో మృతి చెందిన బేపల పేరమ్మ, గుజ్జు చంద్రమ్మతో పాటు భర్తలు ఉన్న మరో పది మందికి వితంతు పింఛన్ వస్తున్నట్లు వెల్లడించారు. లొద్దపుట్టి, కొఠారీ గ్రామాలకు చెందిన ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలకు వికలాంగ, వితంతు పింఛన్ ఇస్తున్నట్లు గుర్తించారు. లొద్దపుట్టి గ్రామానికి చెందిన పురుషుడు సాడి వాసుకు వితంతు పింఛన్ వస్తున్నట్లు బహిర్గతమైంది. కుమారుడు ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ తల్లికి పింఛన్‌తో పాటు అదే గ్రామానికి చెందిన మరో తొమ్మిది మంది మహిళలకు భర్తలు ఉన్నప్పటికీ వారికి కూడా పింఛన్లు ఇస్తున్నట్లు గుర్తించారు. ఇదే పరిస్థితి 21 పంచాయతీల్లో ఉందంటూ సామాజిక బృందం పేర్లతో సహా వెల్లడించడంతో ప్రత్యేక ఆహ్వానితులు ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, జెట్పీటీసీ అంబటి లింగరాజు, ఏఎంసీ చైర్మన్ సాడి సహదేవ్‌లు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వం తమదని, పేదవారు కావడంతోనే అనర్హులను అర్హులుగా పరిగణించి ప్రభుత్వ పథకాలు కేటాయిస్తున్నామంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో జిల్లా అధికారులు డీఆర్డీఏ ఏపీడీ డీఎస్ఆర్ మూర్తి, డ్వామా ఏపీడీ అప్పలసూరి, విజిలెన్స్ అధికారి వెంకటరమణలు మౌనంగా ఉండిపోయారు. ఈ సామాజిక తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాల్లో 90 శాతం గత ఏడాది నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో అప్పటి డ్వామా పీడీ రోణంకి కూర్మనాథ్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఆయన సైతం మిన్నకుండిపోవడంతో మళ్లీ అవే సమస్యలు ఈ సామాజిక వేదికలో పునరావృత్తమయ్యాయి. కార్యక్రమంలో ఎస్ఆర్పీ ఈ పున్నంనాయుడు, ప్రత్యేకాధికారి బావన లవరాజు, ఎంపీడీఓ హనుమంతు సత్యం, ఎపిఓ ప్రమీల, అధికారులు పాల్గొన్నారు. -
మూడేళ్లయినా అందని సాయం..
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పాత గానసర గ్రామానికి చెందిన వలరోతు భాస్కర్‌రావు 2 ఎకరాల సొంత భూమికి తోడు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి పంటలు సాగు చేశాడు. వరుసగా రెండు సంవత్సరాలు నష్టం వచ్చింది. కూతురు ఝాన్సీ పెళ్లికి రూ. లక్ష అప్పు అయ్యింది. పంటలకు చేసిన అప్పు రూ. 2 లక్షలు కలసి.. మొత్తం ప్రైవేటు అప్పు రూ. 3 లక్షలు. వడ్డీ నెలకు నూటికి 3 రూపాయలు. ఇక అప్పుల బాధ తీరదని భావించిన భాస్కర్‌రావు 2014 డిసెంబర్ 24న పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్లు దాటిపోయింది. కానీ, భాస్కర్‌రావు భార్య లక్ష్మికి ఇంతవరకూ వితంతు పింఛను కూడా రావటం లేదు. ఇక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ఊసేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ. -
టీడీపీ వారి కాసుల పథకం..!
⇔ లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు.. ⇔ వితంతువులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని ప్రచారం ⇔ మాయమాటలు చెప్పి డబ్బు దండుకున్న టీడీపీ నాయకులు నగరంపాలెం (గుంటూరు) : పథకం అమలు చేయడంలో గతంలో ఎన్నో స్కాములు చూసుంటాం.. కానీ అసలు అమలుకాని పథకానికి లబ్ధి చేకూరుస్తామని డబ్బులు దండుకున్నారీ ఘనులు. ఈ విషయం శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థలో వెలుగు చూసింది. తెలిసిన వివరాల ప్రకారం.. గతంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ సాంఘిక కుటుంబ ప్రయోజన (ఎన్.ఎస్.బి.ఎఫ్) పథకం ద్వారా వితంతువులకు పింఛను అందించేది. అయితే.. కొంతకాలం తర్వాత పథకాన్ని నిలిపివేసింది. ప్రస్తుతం ఆ పథకం అమలు కానుందని, పథకం వర్తించేలా చేస్తామని కొందరు టీడీపీ నాయకులు వందలాది మంది మహిళల నుంచి డబ్బు దండుకున్నారు. సదరు మహిళలు ఉపా(మెప్మా పరిధిలోని ఓ విభాగం) సెల్ సిబ్బందికి దరఖాస్తులు అందిచడానికి వచ్చారు. సిబ్బంది నగరపాలక సంస్థకు సంబంధించి దరఖాస్తులన్నీ సిటిజన్ చార్టర్ కౌంటర్ ద్వారా తీసుకుంటారని చెప్పడంతో వారు అక్కడికి వెళ్లారు. ఉపా సెల్ సిబ్బంది చెప్పారని సిటిజన్ కౌంటర్ సిబ్బందికి చెప్పడంతో వారు కూడా దరఖాస్తులు తీసుకున్నారు. ఆశ చూపి.. డబ్బులు లాగి.. పింఛన్ల దరఖాస్తుల గురించి తెలుసుకున్న టీడీపీ నాయకులు పథకం ద్వారా ఒక్కో మహిళకు రూ.20 వేల వరకూ లబ్ధి చేకూరుతుందని, పథకం వర్తించాలంటే జన్మభూమి కమిటీ నాయకుల సిఫారస్ తప్పనిసరి అని మాయమాటలు చెప్పారు. దరఖాస్తులపై ఎమ్మెల్యే లేదా టీడీపీ నాయకుల సంతకాలు ఉంటేనే మంజూరు చేస్తారని వసూళ్లు ప్రారంభించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.500 చొప్పున, పథక లబ్ధికి మరో రూ.1500 చొప్పన వసూళ్లకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం వందల సంఖ్యలో మహిళలు దరఖాస్తులు అందించడానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి రాగా అసలు విషయం బయటపడింది. కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు వసూళ్ల పర్వంపై వైఎస్సార్ సీపీ నాయకులు ఇన్చార్జి కమిషనర్ చల్లా అనూరాధకు ఫిర్యాదు చేశారు. ఇన్చార్జి కమిషనర్ అనూరాధ సిటిజన్ కౌంటర్ వద్దకు డిప్యూటీ కమిషనర్ ఏసుదాసును పంపి ఆరా తీశారు. ప్రస్తుతం పథకం అమలులో లేదని దరఖాస్తులు తీసుకోవడం నిలిపివేయాలని సూచించారు. దీంతో అధికారులు దరఖాస్తులు స్వీకరించడం నిలిపివేశారు. దరఖాస్తులు అందజేయడానికి వచ్చిన మహిళలు ఆందోళన చేపట్టారు. పథకం అమలులో లేనప్పుడు దరఖాస్తులు ఎందుకు స్వీకరించారని ప్రశ్నించారు. అధికారులు లాలాపేట పోలీసుల సాయం కోరడంతో వారు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మహిళల ఆందోళన విషయం తెలుసుకున్నవైఎస్సార్ సీపీ బీసీ సెల్ నాయకుడు పల్లపు శివతో పాటు మరి కొంతమంది నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి ఇన్చార్జి కమిషనర్ చల్లా అనూరాధతో మాట్లాడారు. దీనికి కారణమైన సిబ్బందిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఇన్చార్జి కమిషనర్ చల్లా అనూరాధ స్పందిస్తూ కింది స్థాయి ఉద్యోగులు తెలియక దరఖాస్తులు స్వీకరించారని, ప్రస్తుతం పథకం అమలు లేదన్నారు. దీనిపై ఎలాంటి విచారణ జరగదన్నారు. -
సారూ... బతికే ఉన్నా
► చనిపోయిందని పింఛన్ రద్దు చేసిన అధికారులు ► ఇప్పించాలని మహిళ వేడుకోలు హత్నూర(సంగారెడ్డి): దశాబ్ధకాలంగా పొందుతున్న వితంతు పింఛన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రద్దు అయ్యింది. బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు ధ్రువీకరించి పింఛన్‌ను రద్దు చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన గుడ్లు లక్ష్మి (50) అనే మహిళ భర్త మొగులయ్య పదేళ్ల క్రితమే మృతి చెందాడు. నాటి నుంచి ఆమె వితంతు పింఛన్ పొందుతోంది. గత మూడు నెలలు నుంచి రాకపోవడంతో అధికారుల చుట్టూ తిరిగినా పింఛన్ రాలేదు. దీంతో బాధితురాలు లక్ష్మి కుటుంబీకులు హత్నూర ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి విచారించగా లక్ష్మి చనిపోయినందునే పెన్షన్‌ను కొట్టివేసినట్టు అధికారులు చెప్పడంతో ఒక్క సారిగా లక్ష్మి కుటుంబీకులు, బంధువులు అవాక్కయ్యారు. బతికి ఉన్న లక్ష్మిని చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? వితంతు పెన్షన్ ఎలా తొలగించారని అ«ధికారులను నిలదీశారు. దీంతో విషయం బయటకు వచ్చింది. బతికి ఉన్న తనను అధికారులు చంపివేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనకు పింఛన్‌ను మంజూరు చేయాలని అధికారులను వేడుకుంది. విచారణ చేస్తున్నాం ఈ విషయమై ఎంపీడీఓ ప్రమీల నాయక్‌ను సంప్రదించగా కంప్యూటర్ పొరపాటు జరిగిందని , విచారణ చేస్తున్నామని తెలిపారు. కొన్యాల గ్రామంలో లక్ష్మి అనే మహిళ చనిపోయిందని దీంతో గుడ్లు లక్ష్మి చనిపోయినట్లు పొరపాటును పెన్షన్‌ను తొలగించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆమెకు తిరిగి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీఓ పేర్కొన్నారు. – ఎంపీడీఓ ప్రమీల నాయక్ -
మూన్నేళ్ల సంది పింఛన్ వస్తలే..
♦ ఓ వితంతువు ఆవేదన .. ♦ అర్థాకలితో పిల్లలు అలమటిస్తున్నారు ♦ అధికారుల నిర్లక్ష్యమే కారణం మెదక్: చిన్నతనంలో భర్తను పోగొట్టుకున్న ఓ వితంతువుకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు నెలలుగా పింఛన్ రావడంలేదు. దీంతో ముగ్గురు పిల్లలతో పాటు తాను అర్థాకలితో అలమటిస్తున్నామని ఆమె కన్నీరు మున్నీరవుతోంది. మెదక్ మండలం హవేళిఘణాపూర్ గిరిజన తండాకు చెందిన లంబాడీ బూలి భర్త నాలుగేళ్ల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఆమెకు 2014 ఆగస్టు నుంచి పింఛన్ మంజూరైంది. అయితే వస్తున్న పింఛన్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో అధికారులు గత మూడునెలలుగా ఇవ్వడం లేదు. బాధితురాలికి పదేళ్లలోపు ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులులేని బూలి పిల్లలతో ఓ చిన్నపాటి పూరిపాకలో నివాసముంటోంది. దొరికిన నాడు కూలిపని చేస్తూ పిల్లలకు బువ్వ పెడతానని లేనినాడు ఉపవాసముంటున్నామని విలపిస్తూ తెలిపింది. పింఛన్ బంద్ కావడంతో మూడు నెలలుగా నిత్యం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని బాధితురాలు అధికారులను వేడుకుంటోంది. -
బతికుండగానే చంపేశారు
వైకల్యంతో మంచానికే పరిమితం మానవత్వాన్ని మరిచిన అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు ఈ అభాగ్యురాలిని ఆదుకునేవారెలేరా? భర్త ఉండగా అన్ని చూసుకున్నాడు. ఆరేళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో కాలం చేశాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో ఆమె వైకల్యానికి గురై మంచానికే పరిమితమైంది. గత ప్రభుత్వం ఆమెకు వితంతు పింఛన్ మంజూరు చేసింది. కానీ ఈ ప్రభుత్వంలోని అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు ఆమెను బతికుండానే రికార్డుల్లో చంపేశారు. వితంతు పింఛన్ నిలిపేశారు. వైకల్య భారంతో కార్యాలయాలకు వెళ్లలేకపోయినా.. అష్టకష్టాలు పడుతూ అధికారులు చుట్టూ అనేక మార్లు తిరిగినా కనికరం కలగలేదు. ఆదుకునేవారు లేక ప్రాణం నిలుపుకునేందుకు నాలుగు మెతుకుల కోసం ఆరాటపడుతున్న ఓ అభాగ్యురాలు ధీనగాథ ఇది. పెళ్లకూరు : నెల్లూరుజిల్లా పెళ్లకూరు మండలంలోని పునబాక పంచాయతీ, చవటకండ్రిగ దళితకాలనీకి చెందిన కత్తి సుబ్బమ్మ (38) శారీరకంగా బాగానే ఉండేది. భర్త తిరుపాలు బతికున్నాళ్లు ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఆరేళ్ల కిందట అతను అనారోగ్యంతో మృతి చెందాడు. వితంతువైన సుబ్బమ్మ అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది. ఈ క్రమంలో ఆమె వైకల్యానికి గురైంది. ఆదుకునేవారు లేక దిక్కుతోచని స్థితిలో ప్రాణం నిలుపుకోవడానికి ఆరాటపడుతూ మంచంలోనే సజీవిగా పడి ఉంది. ఈ క్రమంలో ఆమెకు గత ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పింఛన్లు తగ్గించేందుకు అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు (టీడీపీ కార్యకర్తలు) కలిసి 2015 డిసెంబరు నుంచి పింఛన్ నిలిపేశారు. వైకల్యంతో ఇబ్బంది పడుతున్నా.. పింఛన్ కోసం స్థానికుల సహకారంతో మండల కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగింది. కానీ చివరకు అక్కడి అధికారులు సుబ్బమ్మ మృతి చెందినట్లుగా జాబితాలో నమోదు చేసినట్లు చెప్పి పంపేశారు. తన పింఛన్‌ను పునరుద్ధరించమని ఐదు నెలలుగా ప్రాధేయపడుతున్నా.. అధికారులు కనీసం స్పందించకపోవడం మానవత్వాన్ని ప్రశ్నిస్తుంది. తనను ఆదుకునే అధికారులు, పాలకులు లేరా అంటూ ఆ అభాగ్యురాలు కన్నీటి పర్యంతమవుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరుతుంది. ఈ విషయమై ఎంపీడీఓ సరళని వివరణ కోరగా పరిశీలించి చర్యలు చేపడుతామన్నారు. -
పింఛను మింగేశారు
అంగన్వాడీ ఆయా ఆవేదన నాతవరం : ఎనిమిది నెలలుగా పింఛను సొమ్ము స్వాహాచేశారని మండలంలోని యం.బెన్నవరం గ్రామానికి చెందిన కందుకూరి రత్నం ఆరోపించింది. ఇందుకు సంబంధించి బుధవారం ఆమె తెలిపిన వివరాలిలావున్నాయి. అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ఈమెకు పదేళ్లుగా వితంతు పింఛను వస్తోంది. ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనల మేరకు గత డిసెంబర్ నుంచి పింఛను నిలిచిపోయింది. అర్హత ఉన్న అంగన్వాడీ ఆయాలందరికీ పింఛన్లు రావడంతో అన్యాయం జరిగిందని ఆమె సోమవారం మీకోసంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఆయన విచారణ జరిపి వెంటనే పింఛను ఇవ్వాలని ఆదేశించారు. డిసెంబర్ నెల నుంచి ఆమెకు పింఛను చెల్లించినట్టుగా ఆన్లైన్లో నమోదై ఉండటాన్ని గుర్తించిన డీఆర్డీఏ అధికారులు ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని ఆమెకు సూచించారు. ఈ మేరకు మండల పరిషత్ అధికారులను ఆమె బుధవారం సంప్రదించింది. సంతకం, వేలిముద్ర లేకుండా తన పింఛను స్వాహా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఎంపీడీవో యాదగిరీశ్వరరావును వివరణ కోరగా నిబంధనలు ప్రకారం పింఛను మంజూరు చేస్తామన్నారు. పింఛను స్వాహాపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. -
చనిపోయిన వితంతువుకు పింఛన్
ఆత్మకూరు(ఎం)(నల్లగొండ జిల్లా): చనిపోయిన వితంతు పింఛన్ ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతురాలి నుంచి వేలిముద్రలు తీసుకుని నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూర్.ఎం మండలం దుప్పెల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వితంతువు నాగుల చంద్రమ్మ(55) శనివారం అనారోగ్యంతో మృతిచెందింది. చంద్రమ్మకు ఇటీవల వితంతు పింఛన్ కింద ప్రభుత్వం రూ.1000 మంజూరు చేసింది. స్థానిక బీపీఎం రావుల వెంకటేశం ఆదివారం మృతురాలి ఇంటికి వెళ్లాడు. బయోమెట్రిక్ విధానం కావడంతో మృతురాలి వేలిముద్రలను తీసుకుని పింఛన్ డబ్బులను ఆమె కుటుంబీకులకు అందజేశారు. కాగా బీపీఎంపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బందెల స్వామిదాస్ కోరారు. బీపీఎం వివరణ.. బయోమెట్రిక్ ద్వారా చంద్రమ్మ మృతదేహం నుంచి వేలిముద్రలను సేకరించి పింఛన్ అందజేసిన విషయం వాస్తవమేనని బీపీఎం రావుల వెంకటేశం తెలిపారు. గ్రామంలో కొందరు పెద్దమనుషులు కోరడంతో ఈ పనిచేసినట్లు చెప్పారు. -
వికలాంగురాలికి వితంతు పింఛన్!
మల్కాజిగిరి సర్కిల్లో పింఛన్ల ప్రహసనం జాబితాలన్నీ తప్పుల తడకే.. అధికారుల నిర్లక్ష్యం... అర్హులకు అన్యాయం మల్కాజిగిరి : భర్త బతికుండగానే ఒక వికలాంగురాలికి విడో పింఛన్ మంజూరు చేశారు. మరో మైనర్ బాలికకు కూడా వితంతు కోటాలోనే పింఛన్ మంజూరైంది. ఇలాంటి సంఘటనలు మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో చాలా చోటు చేసుకుంటున్నాయి. అర్హులైన పింఛన్‌దారులను గుర్తించడంలో సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపాలకు ఈ ఉదంతాలే నిదర్శనం. మల్కాజిగిరి దుర్గానగర్‌లో నివాసముంటున్న వినయ్ అలియాస్ వినేందర్, శాంతాబాయిలిద్దరూ భార్యాభర్తలు, వీరిద్దరూ అంగవైకల్యం ఉన్నవారే. సదరం సర్టిఫికెట్ అందజేసిన వైద్యాధికారులు వినయ్‌కి 89 శాతం, శాంతాబాయికి 86 శాతం అంగవైకల్యం ఉన్నట్లుగా ధృవీకరించారు. గతేడాది నవంబర్ నెల వరకు వీరిద్దరూ వికలాంగుల కోటాలో పింఛన్ పొందారు. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత నాలుగు నెలల నుంచి వారికి పింఛన్ రావడం లేదు. ఇటీవల ఫిబ్రవరి నెల జాబితాలో మాత్రం శాంతాబాయి పేరు నమోదు అయింది. అయితే, ఆమెకు వికలాంగుల కోటాలో కాకుండా భర్త చనిపోయారని పేర్కొంటూ వితంతు పింఛన్ మంజూరు చేశారు. ఇక వినయ్‌కుమార్ పేరు జాబితాలో లేనేలేదు. ఆశ్చర్యకర విషయమేమిటంటే... వినయ్‌కుమార్ వికలాంగుల హక్కుల పోరాట సమితి మల్కాజిగిరి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. -
పురుషుడికి వితంతు పింఛన్
వరంగల్: పురుషుడికి వితంతు పింఛన్ మంజూరైంది. వరంగల్ నగరంలోని 53వ డివిజన్ దేశాయిపేట ఫిల్టర్ బెడ్ సమీపంలో 11-29-197 ఇంటినంబర్లో నివాసం ఉంటున్న రాజయ్య వికలాంగ పింఛన్ కోసం 5 సార్లు దరఖాస్తు చేసుకున్నాడు. 89 శాతం వికలాంగత్వ సరిఫికెట్నూ దరఖాస్తుతో పొందుపరిచాడు. అధికారులు అతనికి వితంతు పింఛన్ మంజూరు చేయడం గమనార్హం. పింఛన్‌పైనే ఆధారపడి బతుకున్న రాజయ్య పరిస్థితి అర్థం చేసుకొని పింఛన్ సరిచేయాలని బంధువులు కోరుతున్నారు. -
మళ్లీ పెళ్లి చేసుకున్నా.. వితంతు పింఛన్!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన తర్వాత వారి భార్యలు మళ్లీ పెళ్లి చేసుకున్నా కూడా ఇకపై వితంతు పింఛన్ అందుకోవచ్చు. ఈ మేరకు చట్టాన్ని సవరించనున్నట్లు సోమవారం మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగన్‌తివర్ వెల్లడించారు. మహారాష్ట్ర పౌర సేవలు(పెన్షన్) చట్టం-1982 ప్రకారం.. మరణించిన ఉద్యోగి భార్య మళ్లీ పెళ్లి చేసుకోనంతవరకూ ఆమెకు వితంతు పింఛన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. అయితే, ఈ చట్టం సరైంది కాదని, అందువల్ల దానిని తాము సవరించామని మంత్రి తెలిపారు. దీనికి గవర్నరు ఆమోదం లభించగానే, తగిన మార్పులు చేసి ఆర్డినెన్స్‌ను జారీ చేస్తామన్నారు. -
‘ఆసరా’లో వింతలెన్నో!
‘ఆసరా’లో ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదని పలువురు ఆందోళన చెందుతుండగా.. మరోవైపు ఓ యువకుడికి వితంతు పింఛన్ మంజూరు చేశారు అధికారులు. ఇక పెన్షన్ కింద ఇచ్చిన రూ. 500 నోట్లను దుకాణాల్లో తీసుకోవడం లేదని తాడ్‌బిలోలికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆ నోట్లను తిరిగి ఇచ్చేశారు. బాల్కొండలో గతనెల 8వ తేదీన ఎమ్మెల్యే చేతులమీదుగా పింఛన్ అందుకున్న లింబాద్రి పేరు ప్రస్తుత జాబితాలో లేకుండాపోయింది. వివరాలిలా ఉన్నాయి. పురుషుడికి వితంతు పెన్షన్.. ఎడపల్లి : పింఛన్ జాబితాల్లో విచిత్రాలు చోటు చేసుకున్నాయి. జాన్కంపేటలో ఇలాంటిదే చోటు చేసుకుంది. పురుషుడి పేరుతో వితంతు పెన్షన్ మంజూరు కావడంతో అందరూ అవాక్కవుతున్నారు. గ్రామానికి చెందిన గద్ద విజయ్ అనే వ్యక్తి పేరు ఆసరా పింఛన్ల జాబితాలో కనిపించింది. అయితే అది వింతువుల జాబితాలో ఉంది. ఆధార్ కార్డు నంబరుతో పాటు ఇంటి నంబరు సరిగానే ఉన్నాయి. ఇలా తప్పుడు పింఛన్ మంజూరు చేసిన అధికారులు తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. అర్హులైనవారు కాళ్లరిగేలా తిరుగుతున్నా పింఛన్ ఇవ్వని అధికారులు.. ఇలా తప్పుడు పేర్లతో పింఛన్లు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పింఛన్ కోసం ఆత్మహత్యాయత్నం నిజాంసాగర్ : వికలాంగుడిగా ఉన్న తన కుమారుడికి పింఛన్ రాలేదన్న ఆవేదనతో శుక్రవారం ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలిలా ఉన్నాయి. సింగితం గ్రామానికి చెందిన పద్మ యాదగిరి కుమారుడు నర్సింగ్(10) వికలాంగుడు. పింఛన్ల జాబితాలో నర్సింగ్ పేరు లేదు. దీంతో ఆవేదన చెందిన యాదగిరి.. శుక్రవారం కిరోసిన్ డబ్బాతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ చల్లుకొని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అతడిని అడ్డుకొని సముదాయించారు. లింబాద్రికి పింఛన్ రాలేదు బాల్కొండ : గతనెల 8వ తేదీన ఎమ్మెల్యే చేతులమీదుగా పింఛన్ అందుకున్న లింబాద్రి పేరు ప్రస్తుత ఆసరా పథకం జాబితాలో లేకుండా పోయింది. జాబితాలో పేరు లేకపోవడంతో అధికారులు పింఛన్ ఇవ్వలేదు. వివరాలిలా ఉన్నాయి. ముప్కాల్ గ్రామానికి చెందిన ఈరవత్రి లింబాద్రికి చేతులు, కాళ్లు పనిచేయవు. మానసిక వైకల్యంతోనూ బాధపడుతున్నాడు. ఆయనను ఆసరా పథకానికి ఎంపిక చేసిన అధికారులు.. గతనెల 8వ తేదీన ఆసరా పథకం ప్రారంభం రోజున ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా పింఛన్ అందించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశానుసారం పింఛన్ అందిస్తున్నామని ప్రకటించారు కూడా. కానీ అంతలోనే అతడి పేరు జాబితాలోంచి మాయమైంది. శుక్రవారం గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జాబితాలో పేరు లేకపోవడంతో అతడికి పింఛన్ ఇవ్వలేదు. లింబాద్రికి సదరం సర్టిఫికెట్ లేకపోవడం వల్లే పెన్షన్ రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే లింబాద్రి మానసిక వికలాంగుడు. మాటలు రావు. కాళ్లు కదలవు. తన చేతులతో ముద్దెడన్నం కూడా తినలేడు. అలాంటి వ్యక్తికి సదరం పేరుతో పింఛన్ ఇవ్వకపోవడం దారుణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ నోట్లు మాకొద్దు రెంజల్ : రూ. 500 నోట్లు తీసుకోవడానికి తాడ్‌బిలోలికి చెందిన పలువురు లబ్ధిదారులు తిరస్కరిస్తున్నారు. గ్రామంలో మూడు రోజులుగా పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పింఛన్ కింద ఇచ్చిన రూ. 500 నోట్లను తీసుకుని లబ్ధిదారులు దుకాణాలకు వెళ్లగా.. వాటిని తీసుకోవడానికి దుకాణాల యజమానులు తిరస్కరిస్తున్నారు. నోట్లు 2005 సంవత్సరానికి ముందు ముద్రించి నవని చెప్పి తిరస్కరిస్తున్నారని పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. 2005కు ముందు ముద్రించిన రూ. 500 నోట్లను బ్యాంకుల్లో తిరిగి ఇచ్చేయాలని గతంలో ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. అయినా చాలా దుకాణాల్లో 2005కు ముందు ముద్రించిన రూ. 500 నోట్లను తీసుకోవడం లేదు. పింఛన్ల కింద పలువురు లబ్ధిదారులకు 2005కు ముందు ముద్రించిన నోట్లు వచ్చాయి. దుకాణాల్లో వాటిని తీసుకోకపోవడంతో లబ్ధిదారులు అధికారులను కలిసి ఆ నోట్లను మార్చుకుంటున్నారు. పింఛన్ ఇక రాదేమోనని.. కోటగిరి : ఆసరా కల్పించాల్సిన పింఛన్ ఉసురు తీస్తోంది. లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ రాదేమోనన్న బెంగతో కొందరు గుండెపగిలి మరణిస్తున్నారు. చిక్కడ్‌పల్లికి చెందిన జింక పెద్దసాయిలు (68) అలాగే మరణించాడు. వివరాలిలా ఉన్నాయి. సాయిలుకు 10 గుంటల భూమి మాత్రమే ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తిగా నమోదయ్యాడు. దీంతో అతడి పేరు ఆసరా జాబితాలో లేకుండా పోయింది. అధికారులు ప్రకటించిన పింఛన్ మొదటి జాబితాలో పేరు లేకపోవడంతో సాయిలు ఆందోళనకు గురయ్యాడు. ఇక తనకు పెన్షన్ రాదేమోనని బాధపడ్డాడు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులు, సర్పంచ్ చుట్టూ తిరిగాడు. గ్రామ పంచాయతీ వద్ద కాసేపు ధర్నా చేశాడు. తనకు పింఛన్ ఇప్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నాడు. రాత్రి ఇంటికి చేరి తొమ్మిది గంటలకు భోజనం చేశాడు. చాతిలో నొప్పి వస్తోందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోగానే సాయిలు మరణించాడు. -
‘ఆసరా’ అభాసుపాలు
సంగారెడ్డి మున్సిపాలిటీ : భర్త బతికుండగానే భార్యకు వితంతు పింఛన్.. మరో వ్యక్తి ఎటువంటి ైవె కల్యం లేకున్నా.. అతడికీ పింఛన్.. అధికార పార్టీకి చెందిన ఓ నేతకు చేనేత కార్మికుడిగా గుర్తించి అతడికీ పింఛన్ పంపిణీ చేస్తున్నారు అధికారులు. తాము అర్హులమని పింఛన్లు ఇవ్వాలని ఆధారాలతో పాటు కాళ్లకు చెప్పులు అరిగే లా తిరుగుతున్నా వారిని కాదని అధికారులు అనర్హులకు పింఛన్ జాబితాలో చోటు కల్పించడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని 31 వార్డుల్లో వివిధ రకాల పింఛన్ల కోసం 5,360 దరఖాస్తులు రాగా 2,571 దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ పూర్తి చేయగా అందులో 1,900 వివిధ రకాల పింఛన్లను మంజూరు చేశారు. అందులో 22వ వార్డులో పింఛన్ జాబితాలో పట్టణంలోని టీఆర్ఎస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్, ఎమ్మెల్యే సన్నిహితుడుగా ఉన్న హెచ్ హరి కిషన్‌కు చేనేత కార్మికుడిగా గుర్తించి రూ. 1000 పింఛన్‌ను మంజూరు చేస్తూ అధికారులు బుధవారం మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రకటించిన జాబితాలో పేర్కొన్నారు. దీంతో పాటు సోమేశ్వర్వాడ 18వ వార్డుకు చెందిన సయ్యద్ నేహకు వికలాంగురాలిగా గుర్తించి గత నెలలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా రూ.1500 తీసుకున్నా.. బాలిక ప్రస్తుతం అధికారులు వితంతు పింఛన్‌ను మంజూరు చేశారు. 16వ వార్డులో సరస్వతి భర్త బతికి ఉండగానే ఆమెకు వితంతు పింఛన్ మంజూరు చేశారు. ఒకటో వార్డుకు చెందిన సుజాతకు కూడా భర్త బు చ్చిరాములు బతికే ఉండగా ఆమెకు సైతం వితంతు పింఛన్ మంజూరైంది. రజీయాబేగం భర్త బతికి ఉండగానే ఆమెకు వితంతు పింఛన్ మంజూరైం ది. వాస్తవానికి ఆమె భర్త వృద్ధ్యాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకు వితంతు పింఛన్ మంజూరు కావడం గమనార్హం. కమిషనర్ వివరణ : టీఆర్ఎస్ నాయకుడు పింఛన్ మంజూరు చేయడంపై ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ గయాజుద్దీన్‌ను వివరణ కోరగా కంప్యూటర్ ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో పొరపాట్లు జరిగాయని వాటిని సవరిస్తామన్నారు. అనర్హులకు పింఛన్ తొలగించి అర్హులకు అందజేస్తామని తెలిపారు. హరికిషన్ వివరణ : పింఛన్ మంజూరుపై టీఆర్ఎస్ నాయకుడు హరికిషన్‌ను వివరణ కోరగా తాను ఎలాంటి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోలేదని వివరణ ఇచ్చారు. తమది చేనేత సామాజిక వర్గం కాదని వివరణ ఇచ్చారు. -
పెన్షనర్ల గుండెల్లో టెన్షన్
►పింఛన్ల జాతరలో లక్షలాది మందికి తెగుతున్న బతుకు ఆధారం ► 3.34 మంది పింఛన్లను ఏరివేసిన కమిటీలు ►‘ఆధార్’ లేదని 1.63 లక్షల మందికి కోత ► కొత్తగా దరఖాస్తు చేసుకున్న 7.74 లక్షల మంది పెన్షన్లపై తేల్చని వైనం ► 13.18 లక్షల పింఛన్లు ప్రశ్నార్థకం ► ఖరారు చేసిన పింఛన్లకైనా బడ్జెట్లో సరిపడా నిధుల కేటాయింపుల్లేవు ► {పతి నెలా కావలసింది రూ. 451 కోట్లు.. కేటాయింపు రూ.1338 కోట్లే టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో 43.12 లక్షల మంది సామాజిక పింఛన్లు అందుకుంటుండగా.. ప్రభుత్వం బడ్జెట్లో ఆ పెన్షన్ల కోసం రూ. 1,338 కోట్లు కేటాయించింది. ఇందులో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ పింఛన్ల చెల్లింపులకే రూ. 650 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇక మరో రూ. 688 కోట్లు మాత్రమే ఉంటాయి. సెప్టెంబర్ నుంచి పెంచిన పింఛన్లు చెల్లించాలంటే.. నెలకు సుమారు రూ. 450 కోట్లు చొప్పున రూ. 3,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. కానీ.. బడ్జెట్ కేటాయింపుల ద్వారానే సర్కారు పింఛన్ల చెల్లింపులకు పరిమితులు విధించినట్లయింది. ఆ ప్రకారం.. సాధ్యమైనంత మేర పింఛన్లకు కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ క్రమంలో ఒకటి కాదు, వంద కాదు, వేయి కాదు.. ఏకంగా ఐదు లక్షలకు పైగా పింఛన్లను పరిశీలనల్లో అనేక రకాల సాకులతో నిర్దయగా ఏరిపారేశారు. పింఛన్లకు అర్హులుగా గత ప్రభుత్వం గుర్తించిన 2.61 లక్షల మంది దరఖాస్తులనూ కనికరించలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరో 5.60 లక్షల మందిపైనా దయచూపలేదు. మొత్తం మీద 13 లక్షల మందికి పైగా అర్హులను పెన్షన్లకు దూరం చేశారు. ఈ ఏరివేతలు, కోతలు ఇక్కడితో ఆగే సూచనలు కూడా లేవు. వడపోత కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, అందుకు ‘థర్డ్ పార్టీ’ సాయం కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పింఛన్‌దారుల జీవనాధారంపై ఏరివేత కత్తి నిరంతరం వేలాడుతూనే ఉంటుందన్నమాట!! హైదరాబాద్ ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరు! నెలకు వెయ్యి రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం దాదాపు 13.18 లక్షల మంది పింఛనుదారుల బతుకు ఆధారాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఎన్నికల సమయంలో.. వృద్ధాప్య, వితంతు పెన్షన్‌దారులకు రూ. 1,000 చొప్పున, వికలాంగులకు రూ. 1,500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత పెరగాల్సిన పింఛనుదారుల సంఖ్యను కుదిస్తోంది. సామాజిక భద్రత పేరుతో ప్రభుత్వాలు అందించే ఈ పింఛన్లలో భారీగా కోతలు పెడుతున్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా ఆర్భాటంగా పెంచిన పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుండగా.. రాష్ట్రంలో 13.18 లక్షల మంది పింఛనుదారుల భవితవ్యం గందరగోళంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 43.12 లక్షల పింఛన్లు ఉండగా.. సెప్టెంబరు 18 నుంచి 25వ తేదీ లోపు పరిశీలించిన గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు అనర్హత పేరుతో 3.34 లక్షల పింఛన్లను తొలగించారు. అలాగే ఆధార్ కార్డు లేదన్న కారణంగా మరో 1.63 లక్షల ఫించన్లను పక్కనపెట్టారు. ఇవికాకుండా.. సామాజిక పింఛన్లకు ఇంకా 2.61 లక్షల మంది అర్హులు ఉన్నారని గత ప్రభుత్వం రచ్చబండ సందర్భంగా గుర్తించిన దరఖాస్తులను బుట్టదాఖలు చేసింది. తాజా కసరత్తులో గ్రామ, మండల కమిటీలకు 5.60 లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రీవెరిఫికేషన్ పేరుతో ఈ దరఖాస్తులను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. (వీరిలో 2.40 లక్షల మంది దరఖాస్తుల కంప్యూటరీకరణ కూడా పూర్తయింది.) కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు ఇవ్వాలా? వద్దా? అన్నది తేల్చలేదు. పెరిగిన పింఛన్లు వస్తాయని చూస్తున్న దాదాపు 13 లక్షల మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సర్కారు సాయంతో ఇల్లు కట్టుకునాన పింఛన్ కట్... 2007లో ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా భవనాలు నిర్మించుకున్న వారిని సైతం జాబితా నుంచి అనర్హులుగా ప్రకటించారు. తామేమీ సొంతంగా గూడు నిర్మించుకోలేదని ప్రభుత్వ సహాయంతో నిర్మించిన గృహాలను సైతం ఓ కారణంగా చూపి పింఛన్లు రద్దు చేయడమేమిటని గ్రామసభల్లో ప్రశ్నించినా పట్టించుకోలేదు. నెలకు ఠంఛన్‌గా వస్తున్న రూ. 200 పింఛన్ సైతం రద్దు చేయడంతో వృద్ధాప్యంలో ఆసరా లేకుండా చేశారని పండుటాకులు నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు. కొత్త దరఖాస్తుదారులకూ పింఛన్ లేదు... అర్హులై ఉండి ఇన్నాళ్ళూ పెన్షన్ దక్కక బాధపడే వారంతా కొత్తగా దరఖాస్తు చేసుకుంటే పింఛన్ అందిస్తామని ప్రగల్భాలు పలికిన సర్కారు పెద్దలు.. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరికి కూడా గురువారం నుంచి ప్రారంభిస్తున్న పింఛన్ల జాతరలో పింఛన్ అందివ్వకపోవడం గమనార్హం. కొత్త దరఖాస్తులపై బుధవారం అర్థరాత్రి వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో కొత్తగా 49,000 దరఖాస్తులు స్వీకరించారు. 29,000 దరఖాస్తుల్ని అధికార యంత్రాంగం అప్లోడ్ కూడా చేశారు. కానీ వీరికి పింఛన్ అందించడంపై ఇంతవరకు ఏమీ తేల్చలేదు. వేలిముద్రలున్నా.. ఆధార్ కార్డు లేదంటూ కోత... ప్రతి నెలా పింఛన్ చెల్లించేప్పుడు లబ్ధిదారుల వేలిముద్రలను సరిపోల్చిన తర్వాతే పింఛన్ చెల్లిస్తున్నారు. వృద్ధుల వేలి ముద్రలు అరిగిపోయి ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో వారికి సంబంధించిన కుటుంబంలోని మరొకరి వేలి ముద్రలను కూడా సేకరించారు. వాటితో సరిపోలిన తర్వాతే పింఛన్ ఇస్తున్నారు. ప్రతి నెలా ఫిజికల్‌గా వెరిఫికేషన్ జరుగుతున్నప్పటికీ బోగస్ పేరుతో 3.34 మందిని ఏరివేయడం ప్రశ్నార్థకంగా మారింది. వేలిముద్రలతో సరిపోల్చుతూ ఇప్పటికే ఐదారేళ్లుగా పింఛన్ పొందుతున్నప్పటికీ ఆధార్ కార్డులేదన్న కారణంగా 1.63 లక్షల పింఛన్లను పక్కనపెట్టారు. పింఛన్లు పొందేందుకు అర్హులెవరు? కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి. మరే ఇతర పెన్షన్ పొందరాదు. వృద్ధాప్య పెన్షన్‌కు 65 ఏళ్ల వయసు పైబడి ఉండాలి చేనేత పెన్షన్లకు వయసు 50 ఏళ్ల పైబడి ఉండాలి. వితంతు పెన్షన్లు: వితంతువు అయి ఉండాలి. వయో పరిమితి లేదు. వికలాంగ పెన్షన్లు: 18 ఏళ్ల పైబడి 40 శాతం, అంతకుమించి అంగవైకల్యం ఉండాలి గీత పెన్షన్లు: కల్లు గీత కార్మికుడై 50 ఏళ్ల పైబడి ఉండాలి గ్రామాల్లో: గ్రామ సభ తీర్మానం చేసి సిఫారసు చేసిన వ్యక్తులకు ఎంపీడీవో ద్వారా చెల్లిస్తారు. పట్టణాల్లో: మునిసిపల్ వార్డు సభలు సిఫారసు చేసిన వ్యక్తులకు మునిసిపల్ కమిషనర్ల ద్వారా చెల్లిస్తారు. వేలాడనున్న వడపోత కత్తి... పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికి వడపోత నిరంతరం కొనసాగించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో గత కొన్నేళ్ళుగా పింఛన్లు తీసుకుంటున్న 43.12 లక్షల మందిలో అనర్హులుగా 4.97 లక్షల మందిని తేల్చారు. అనర్హుల జాబితాపై సెర్ప్ అధికారులు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు కుస్తీలు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఏరివేత అనంతరం 38.15 లక్షల మందే అర్హులుగా తేల్చారు. వడపోతను నిరంతరం కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కమిటీలు ధ్రువీకరించిన అర్హుల జాబితాను థర్డ్ పార్టీతో మరోసారి పరిశీలింపజేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు ఓ మంత్రి వెల్లడించారు. పింఛన్ల వడపోతపైనా సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. అర్హులై, ఆధార్ సీడింగ్ జరిగిన 37,02,936 మంది ఆధార్ నెంబర్లను వెబ్ ల్యాండింగ్‌తో సరిపోల్చాలని గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు అందాయి. ఈ కేటాయింపులతో ఎలా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాజిక భద్రత కింద బడ్జెట్లో రూ. 1,338 కోట్లు మాత్రమే కేటాయించారు. గత 5 నెలల కాలంలో 43.12 లక్షల మందికి పింఛన్ల కోసం ప్రతి నెలా రూ. 130 కోట్ల చొప్పున చెల్లించారు. ఆ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ. 650 కోట్లు అవుతున్నాయి. సెప్టెంబర్ నుంచి ఇక మిగిలిన ఏడు నెలల కాలానికి ప్రభుత్వం తేల్చిన 38.15 లక్షల మందికి (మెజారిటీ పింఛన్లు రూ. 1,000 చొప్పున, మరికొన్ని రూ. 1,500 చొప్పున) పింఛన్లు ఇవ్వాలన్నా నెలకు దాదాపు రూ. 450 కోట్ల చొప్పున మొత్తంగా రూ. 3,080 కోట్లు కావాలి. ఇప్పటికే గడిచిన ఐదు నెలల్లో చెల్లించిన మొత్తాన్ని కలిపితే కనీసంగా రూ. 3,730 కోట్లు అవసరం. బడ్జెట్లో రూ. 3,292 కోట్ల లోటు చూపిస్తున్న ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా సమకూర్చుతుందన్న విషయాన్ని చెప్పడం లేదు. ఈ లెక్కన ప్రస్తుత నిధులతో మూడో నెలలో పెంచిన పింఛన్ ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
పెంచుతారా?ముంచుతారా?
పండుటాకుల వంటి వృద్ధులు, విధి వంచితులైన వితంతువులు, వికలాంగులు- పిల్లలు దీపావళి కోసం ఎదురు చూసినట్టు.. ఈసారి మహాత్ముని జయంతి కోసం ఆత్రుతగా నిరీక్షించారు. కారణం.. తమ జీవితాలకు చిరు ఆశాకిరణంగా ఉన్న పింఛన్ మొత్తం..ఇతోధికమై మరింత వెలుగు నింపుతుందన్న ఆశే. అయితే పింఛన్ లబ్ధిదారుల అర్హత, అనర్హతలపై సర్కారు ఇటీవల క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలన, అనంతరం జాబితాల రూపకల్పన జాప్యం కావడంతో ఈనెల పెంచిన పింఛన్లను అందుకోవడం అటుంచి.. అసలు లబ్ధిదారులుగా మిగులుతామా లేక ఉన్న కొద్దిపాటి ఆసరాను కోల్పోతామా అన్న గుబులు లబ్ధిదారుల్లో రేగింది. సాక్షి, కాకినాడ : తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య, వితంతు పింఛన్‌ను రూ.200 నుంచి రూ.వెయ్యికి, వికలాంగ పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1500కు పెంచుతామని టీడీపీ వాగ్దానం చేసింది. ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చందబాబు నాయుడు గాంధీజీ జయంతి అయిన అక్టోబర్ రెండు నుంచి పింఛన్ల మొత్తాన్ని పెంచనున్నట్టు ప్రకటించారు. కాగా ఈనెల 19, 20, 21 తేదీల్లో పింఛన్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలన వివాదాస్పదమైంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో టీడీపీ కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో లబ్ధిదారుల్లో కొందరిని అనర్హులుగా జాబితాల నుంచి తొలగించడం, అధికార పార్టీకి చెందిన వారిని లబ్ధిదారులుగా చేర్చడానికే ఈ తంతు అన్న అనుమానం తలెత్తింది. మరోవైపు గడువు పెంచిన పింఛన్ల పరిశీలన తుది దశకు చేరుకున్నా జాబితాలు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపు తమకు వర్తిస్తుందో, లేదో; అనర్హత వేటు పడుతుందోనన్న దిగులు లబ్ధిదారులను కమ్ముకుంది. అనుచరుల లబ్ధికి టీడీపీ నేతల యత్నం జిల్లాలో 4,77,499 మంది పింఛన్‌దారులుండగా వీరిలో 2,16,679 మంది వృద్ధులు, 1,50,028 మంది వితంతువులు, 64,776 మంది వికలాంగులు ఉన్నారు. ఇంకా 34,891 మంది అభయహస్తం పింఛన్‌దారులతో పాటు 2,434 కల్లుగీత, 8,691 చేనేత కార్మికులున్నారు. వీరికి ప్రతి నెలా రూ.16.30 కోట్లు పింఛన్‌గా అందుతోంది. గతంలో ప్రతి నెలా ఠంచన్‌గా ఒకటో తేదీన అందిన పింఛన్ నాలుగేళ్లుగా నెలలో ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 4.77 లక్షలకు పైబడ్డ పింఛన్లలో ఇప్పటివరకు పరిశీలన జరిపినవి 4.58 లక్షలు. వీటిలో 3.75 లక్షల పింఛన్ల వివరాల్ని ఆన్లైన్లో నమోదు చేయగలిగారు. మిగతా వాటి నమోదుకు మరో వారం పడుతుందని అధికారులు అంటున్నారు. పరిశీలన జరిపిన పింఛన్లలో 32,500 మందిని అనర్హులుగా గుర్తించారు. మొత్తం పింఛన్ల పరిశీలన, ఆన్లైన్ నమోదు పూర్తయ్యే సరికి అనర్హుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం లక్ష మందిని అనర్హుల జాబితాలో చేర్చి, ఆ మేరకు తమ అనుచరులకు పింఛన్లు కట్టబెట్టే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారని, ఆ దిశగా పింఛన్లను మరింత వడపోయాలని ఇప్పటికే అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త పింఛన్లకు వేలల్లో దరఖాస్తులు మరో పక్క కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. గతేడాది నిర్వహించిన రచ్చబండ-2లో వచ్చిన దరఖాస్తుల్లో వృద్ధాప్య, వితంతు పింఛన్లకు సంబంధించి 27,257 మందిని అర్హులుగా గుర్తించారు. ఆ సమయంలోనే వికలాంగ పింఛన్ కోసం మరో 13,900 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరిలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు పింఛన్లు అందలేదు. ఇక ప్రతి వారం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌లలో కొత్తగా వేలాది మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. వికలాంగ పింఛన్‌కు అర్హులను గుర్తించేందుకు ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా సదరమ్ క్యాంపులు నిర్విహ ంచి గతంలో దరఖాస్తు చేసుకున్న 13,900 మందికి పరీక్షలు చేస్తున్నారు. వైకల్యం 80 శాతం పైబడి ఉన్న వారికి మాత్రమే రూ.1500 పింఛన్ పెంపు వర్తిస్తుందని ఇప్పటికే ప్రభుత్వం తేల్చిచెప్పింది. వైకల్యం 40 నుంచి 80 శాతం మధ్య ఉంటే ఇతర పింఛన్ల పెంపునే వర్తింప చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్ల సంఖ్యను బట్టి పెంపు అమలు చేస్తే జిల్లాకు రూ.45 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందో లేక మళ్లీ వాయిదా మంత్రం జపిస్తుందోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. పింఛన్ల పరిశీలన, నమోదు పూర్తి కాలేదన్న సాకుతో అక్టోబర్ 2న మొక్కుబడిగా కొందరికే పంపిణీ చేస్తారన్న అనుమానమూ వ్యక్తమవుతోంది. -
ఇక సొంత టీవీ
సాక్షి,బెంగళూరు : శాసన మండలిలో సభాకార్యాకలాపాలు నాలుగైదు రోజులతో పోలిస్తే బుధవారం కొంత ప్రశాంతంగా జరిగాయి. సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు. వృధ్యాప్య, వితంతు ఫించన్ల పంపిణీలో చోటుచేసుకుంటున్న ఆలస్యం, అక్రమాలను నివారించడానికి త్వరలో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వీ శ్రీనివాసప్రసాద్ పేర్కొన్నారు. ఈ విధానంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే అధికారులు వెళ్లి ఫించన్ మొత్తాన్ని అందిస్తారన్నారు. రాష్ట్రంలో ఉన్న తాండాలు, గొల్లరహట్టిలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తిస్తామని మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వన్యప్రాణుల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి అందించే పరిహారాన్ని ‘సకాల’ (నిర్థిష్ట సమయంలో చెల్లించడం) పరిధిలోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రామనాథ్‌రై విధానపరిషత్‌కు తెలిపారు. పరిహారం పెంచే విషయం పరిశీలనలో ఉందన్నారు. భూగర్భ జలాలు పెంచడంలో భాగంగా కొప్పళ, కోలారు, చిక్కబళ్లాపుర, గదగ్, బీజాపుర జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించామని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి శివరాజ్‌తంగడి పరిషత్‌కు తెలిపారు. వచ్చే ఏడాది మరో ఐదు జిల్లాలను ఇందుకు కోసం ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో శాశ్వత తాగునీటి సరఫరాకు రూ.45 వేల కోట్లను కేటాయించామని, అందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి హెచ్.కే పాటిల్ పరిషత్‌కు తెలిపారు.