మళ్లీ పెళ్లి చేసుకున్నా.. వితంతు పింఛన్! | Pension, widow married again ..! | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లి చేసుకున్నా.. వితంతు పింఛన్!

Published Tue, Feb 10 2015 6:44 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

Pension, widow married again ..!

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన తర్వాత వారి భార్యలు మళ్లీ పెళ్లి చేసుకున్నా కూడా ఇకపై వితంతు పింఛన్ అందుకోవచ్చు. ఈ మేరకు చట్టాన్ని సవరించనున్నట్లు సోమవారం మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగన్‌తివర్ వెల్లడించారు. మహారాష్ట్ర పౌర సేవలు(పెన్షన్) చట్టం-1982 ప్రకారం.. మరణించిన ఉద్యోగి భార్య మళ్లీ పెళ్లి చేసుకోనంతవరకూ ఆమెకు వితంతు పింఛన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. అయితే, ఈ చట్టం సరైంది కాదని, అందువల్ల దానిని తాము సవరించామని మంత్రి తెలిపారు. దీనికి గవర్నరు ఆమోదం లభించగానే, తగిన మార్పులు చేసి ఆర్డినెన్స్‌ను జారీ చేస్తామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement