![పురుషుడికి వితంతు పింఛన్](/styles/webp/s3/article_images/2017/09/2/71423597453_625x300.jpg.webp?itok=PyXed8aA)
పురుషుడికి వితంతు పింఛన్
వరంగల్: పురుషుడికి వితంతు పింఛన్ మంజూరైంది. వరంగల్ నగరంలోని 53వ డివిజన్ దేశాయిపేట ఫిల్టర్ బెడ్ సమీపంలో 11-29-197 ఇంటినంబర్‌లో నివాసం ఉంటున్న రాజయ్య వికలాంగ పింఛన్ కోసం 5 సార్లు దరఖాస్తు చేసుకున్నాడు.
89 శాతం వికలాంగత్వ సరిఫికెట్‌నూ దరఖాస్తుతో పొందుపరిచాడు. అధికారులు అతనికి వితంతు పింఛన్ మంజూరు చేయడం గమనార్హం. పింఛన్‌పైనే ఆధారపడి బతుకున్న రాజయ్య పరిస్థితి అర్థం చేసుకొని పింఛన్ సరిచేయాలని బంధువులు కోరుతున్నారు.