ఎద్దు ఈనిందంటే మునుపటికొకడు గాటికి కట్టెయ్యమన్నాడట. టీడీపీ అధినేత చంద్రబాబు వాలకం అచ్చం అలానే ఉంది. నిత్యం ప్రభుత్వంపై బురద చల్లనిదే నిద్రపట్టని పచ్చ పత్రికల ఓనర్లు ఇష్టానుసారం అబద్ధాలు ప్రచారం చేస్తుండటం ఈమధ్య కాలంలో శ్రుతిమించింది. వాటికి తాళం వేస్తూ తబలా వాయించనిదే బాబుకూ నిద్రపట్టడం లేదు.
భర్త, పిల్లలున్న మహిళకు వితంతు పింఛన్ ఎందుకిస్తున్నారంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ తన వాళ్లను వెనకేసుకొచ్చి ఎంపీడీఓ కార్యాలయం వద్ద గొడవకు దిగితే పోలీసులు కేసు పెట్టారు. ఇందులో ఏం తప్పుందో.. నిస్సిగ్గుగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేసిన చంద్రబాబే చెప్పాలి.
తర్లుపాడు: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పోతలపాడుకు చెందిన రాచీటి వెంకట రమణమ్మ, లక్ష్మయ్య దంపతుల మూడో సంతానం పెరికె నాగులు. ఈమెకు 2010లో మార్కాపురం మండలం జమ్మనపల్లికి చెందిన పరిశపోగు సుబ్బయ్యతో వివాహమైంది. 2012 నవంబర్ 10వ తేదీన వీరికి బాబు జన్మించాడు. ఆ తర్వాత ఆరు నెలలకు భర్త అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి నాగులు వితంతు పింఛన్ తీసుకుంటోంది.
2018లో నంద్యాల సమీపంలోని గాజులపలి్లకి చెందిన పెరికె ఇర్మియతో ఈమెకు రెండో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. గర్భిణిగా ఉన్నప్పుడు స్థానిక సబ్‌సెంటరులో, అంగన్‌వాడీ కేంద్రంలో భర్త పేరు ఇర్మియగా నమోదు చేసుకుంది. ప్రభుత్వ వైద్యశాలలో కాన్పు రికార్డుల్లో కూడా భర్త పేరు ఇర్మియగా తెలిపింది.
అత్తతో విభేదాల కారణంగా స్వగ్రామమైన పోతలపాడులో భర్తతో కలిసి నివాసముంటోంది. భర్త బేల్దారి పనుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చివెళ్తుంటాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు జూన్ చివరి వారంలో నాగులు అక్రమంగా వితంతు పింఛన్ పొందుతోందని పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.
విచారిస్తామని చెప్పడమే తప్పా?
జూలై 1వ తేదీన పింఛన్ అందించాల్సిన వలంటీర్ గ్రామస్తుల ఫిర్యాదు విషయం తెలుసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడాక పింఛన్ అందిస్తానని నాగులుతో చెప్పాడు. అధికారులు విచారణ చేస్తుండగా జూలై 6వ తేదీన నాగులు, మరికొందరు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని లోపల ఉంచి బయట గడియ పెట్టి ఆందోళనకు దిగారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మండలంలోని మీర్జపేటలో ఉన్న ఎంపీడీవో హుటాహుటిన కార్యాలయం వద్దకు వెళ్లారు. ఆయన్ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.
కార్యాలయంలోనికి వెళ్లి మాట్లాడుకుందామని బతిమాలినా వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎంపీడీవో విషయాన్ని తర్లుపాడు ఎస్‌ఐ వేముల సుధాకర్‌కు తెలుపడంతో ఆయన అక్కడకు చేరుకుని ఎంపీడీవోను లోపలికి పంపాలని వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. వినకపోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టి ఎంపీడీవోను లోనికి పంపారు. లిఖిత పూర్వకంగా అర్జీ ఇస్తే విచారించి, న్యాయం చేస్తానని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో ఆయనకు దరఖాస్తు చేసుకున్నారు.
తన విధులకు ఆటంకం కల్పించి, దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఎంపీడీవో ఫిర్యాదు మేరకు గాయం శ్రీనివాసరెడ్డి, చెంచిరెడ్డి, నాగులుతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవం ఇలా ఉంటే పింఛన్ ఎందుకు తొలగించారని అడిగినందుకు కేసు పెట్టడం దారుణం అని చంద్రబాబు పచ్చమీడియా వార్తలకు వంతపాడుతూ దుర్మార్గంగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment