nagulu
-
బాబూ ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి! భర్త ఉన్నప్పటికీ వితంతు పింఛన్ ఇవ్వాలా?
ఎద్దు ఈనిందంటే మునుపటికొకడు గాటికి కట్టెయ్యమన్నాడట. టీడీపీ అధినేత చంద్రబాబు వాలకం అచ్చం అలానే ఉంది. నిత్యం ప్రభుత్వంపై బురద చల్లనిదే నిద్రపట్టని పచ్చ పత్రికల ఓనర్లు ఇష్టానుసారం అబద్ధాలు ప్రచారం చేస్తుండటం ఈమధ్య కాలంలో శ్రుతిమించింది. వాటికి తాళం వేస్తూ తబలా వాయించనిదే బాబుకూ నిద్రపట్టడం లేదు. భర్త, పిల్లలున్న మహిళకు వితంతు పింఛన్ ఎందుకిస్తున్నారంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ తన వాళ్లను వెనకేసుకొచ్చి ఎంపీడీఓ కార్యాలయం వద్ద గొడవకు దిగితే పోలీసులు కేసు పెట్టారు. ఇందులో ఏం తప్పుందో.. నిస్సిగ్గుగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేసిన చంద్రబాబే చెప్పాలి. తర్లుపాడు: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పోతలపాడుకు చెందిన రాచీటి వెంకట రమణమ్మ, లక్ష్మయ్య దంపతుల మూడో సంతానం పెరికె నాగులు. ఈమెకు 2010లో మార్కాపురం మండలం జమ్మనపల్లికి చెందిన పరిశపోగు సుబ్బయ్యతో వివాహమైంది. 2012 నవంబర్ 10వ తేదీన వీరికి బాబు జన్మించాడు. ఆ తర్వాత ఆరు నెలలకు భర్త అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి నాగులు వితంతు పింఛన్ తీసుకుంటోంది. 2018లో నంద్యాల సమీపంలోని గాజులపలి్లకి చెందిన పెరికె ఇర్మియతో ఈమెకు రెండో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. గర్భిణిగా ఉన్నప్పుడు స్థానిక సబ్సెంటరులో, అంగన్వాడీ కేంద్రంలో భర్త పేరు ఇర్మియగా నమోదు చేసుకుంది. ప్రభుత్వ వైద్యశాలలో కాన్పు రికార్డుల్లో కూడా భర్త పేరు ఇర్మియగా తెలిపింది. అత్తతో విభేదాల కారణంగా స్వగ్రామమైన పోతలపాడులో భర్తతో కలిసి నివాసముంటోంది. భర్త బేల్దారి పనుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చివెళ్తుంటాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు జూన్ చివరి వారంలో నాగులు అక్రమంగా వితంతు పింఛన్ పొందుతోందని పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. విచారిస్తామని చెప్పడమే తప్పా? జూలై 1వ తేదీన పింఛన్ అందించాల్సిన వలంటీర్ గ్రామస్తుల ఫిర్యాదు విషయం తెలుసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడాక పింఛన్ అందిస్తానని నాగులుతో చెప్పాడు. అధికారులు విచారణ చేస్తుండగా జూలై 6వ తేదీన నాగులు, మరికొందరు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని లోపల ఉంచి బయట గడియ పెట్టి ఆందోళనకు దిగారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మండలంలోని మీర్జపేటలో ఉన్న ఎంపీడీవో హుటాహుటిన కార్యాలయం వద్దకు వెళ్లారు. ఆయన్ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కార్యాలయంలోనికి వెళ్లి మాట్లాడుకుందామని బతిమాలినా వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎంపీడీవో విషయాన్ని తర్లుపాడు ఎస్ఐ వేముల సుధాకర్‌కు తెలుపడంతో ఆయన అక్కడకు చేరుకుని ఎంపీడీవోను లోపలికి పంపాలని వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. వినకపోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టి ఎంపీడీవోను లోనికి పంపారు. లిఖిత పూర్వకంగా అర్జీ ఇస్తే విచారించి, న్యాయం చేస్తానని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో ఆయనకు దరఖాస్తు చేసుకున్నారు. తన విధులకు ఆటంకం కల్పించి, దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఎంపీడీవో ఫిర్యాదు మేరకు గాయం శ్రీనివాసరెడ్డి, చెంచిరెడ్డి, నాగులుతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవం ఇలా ఉంటే పింఛన్ ఎందుకు తొలగించారని అడిగినందుకు కేసు పెట్టడం దారుణం అని చంద్రబాబు పచ్చమీడియా వార్తలకు వంతపాడుతూ దుర్మార్గంగా ట్వీట్ చేశారు. -
నాగులు మృతి
ఖైరతాబాద్/అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్): తెలంగాణ వచ్చాక తమకు అన్యాయం జరిగిందంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బైకెలి నాగులు (55) చికిత్స పొందుతూ శని వారం మృతి చెందినట్లు సైఫాబాద్ పోలీ సులు తెలిపారు. ఈ నెల 10న రవీంద్రభారతిరోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న నాగులును సైఫాబాద్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలిం చారు. మెరుగైన చికిత్స అందిస్తున్నప్పటికీ 62 శాతం శరీరం కాలిపోవడంతో వైద్యానికి సహకరించక మృతి చెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్‌కు చెందిన బైకెలి నాగులు చిన్నప్పటి నుంచి తెలంగాణ వీరాభిమాని. ఎక్కడ సభలు, సమా వేశాలు జరిగినా చురుగ్గా పాల్గొనేవా డని కుటుంబ సభ్యు లు తెలిపారు. ఆయన కు భార్య స్వరూప, కూతురు స్నేహలత, కుమారుడు రాకేష్‌కుమార్ ఉన్నారు. వీరు ఇద్దరూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. నాగులు కుటుంబం బండ్లగూడలోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటోంది. నాగులు బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని ఎంవీ టవర్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తల్లి సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో హౌస్ కీపింగ్‌గా పనిచేస్తున్నారు. నా పిల్లల్ని ఆదుకోండి: మృతుడి భార్య ఎప్పుడూ తెలంగాణ ఉద్యమం అంటూ తిరిగే నాభర్త మంటల్లో కాలుతూ కూడా జై తెలంగాణ అంటూ నినదించిండు. నా భర్త మమ్మల్ని వీడి వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు. ఆయన భౌతికదేహాన్ని మొదట కీసర అమరవీరులస్థూపం వద్దకు, అక్కడి నుంచి బండ్లగూడకు తరలించి ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తాం. నా భర్త కోరిక మేరకు మా పిల్లలకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి మా కుటుంబానికి అండగా నిలవాలి. -
కాయలివ్వొద్దంటే చెట్టు వింటుందా?!
మనకెంత ప్రేమైనా ఉండొచ్చు..చెట్టు మీద, భూమి మీద, ఆకాశం మీద.వాటి కష్టాన్ని గుర్తించి చెట్టుని కాయొద్దని చెప్పినాభూమిని పండించొద్దని చెప్పినాఆకాశాన్ని వర్షించొద్దని చెప్పినాసూర్యుణ్ణి శక్తినివ్వొద్దని చెప్పినాఅవి వింటాయా!!ప్రకృతిలో ఉన్న దైవత్వమే.. నిస్వార్థంగా ఇవ్వడం.అలా ప్రకృతిలా.. ఇవ్వడమే తెలిసిన మట్టి మనిషి రైతు. ఆయన్ని ఆగమంటే.. చేసే పని ఆపమంటే..‘అయ్యా.. అందరికీ రిటైర్మెంట్ ఉంటుందినీకూ ఉంటే బాగుండు’ అని పిల్లలు పండుగ చేస్తే మాత్రం వింటాడా?! ఉద్యోగ విరమణ అంటే ప్రభుత్వ.. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు, అధికారులకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మాత్రం నిత్యం చెమటోడుస్తూ ఏళ్లకేళ్లు కుటుంబ పోషణ కోసం ఏటికి ఎదురీదే పరిస్థితుల్లో సైతం వ్యవసాయాన్ని దైవంగా భావించి సాగు చేసిన ఓ రైతుకు ఆయన కుటుంబం వ్యవసాయ విరమణ ఇచ్చింది! ‘ఇన్నేళ్లుగా మా ఉన్నతి కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసిన కాయ కష్టం చాలు.. మేము ఎదిగాం.. ఇక మీరు విశ్రమించండి’ అంటూ ఆ ముగ్గురు కుమారులు తమ తండ్రికి ఇచ్చిన భరోసా ఇది. ఖమ్మం సమీపంలోని రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన బాణోతు నాగులు ఐదు దశాబ్దాలుగా పుడమినే నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఎకరంన్నర పొలం సాగు చేసుకుని, బతుకు బండి నడుపుకుంటూ వస్తున్న నాగులుకు వ్యవసాయం అంటే అమితమైన ప్రేమ. ఏ వృత్తిలో అయితే కష్టపడుతున్నామో.. సమస్యలు ఎదుర్కొంటున్నామో.. ఫలితం సైతం అక్కడి నుంచే పొందాలన్నది ఆయన విధానం. అందుకే 50 ఏళ్ల సాగు జీవితంలో విత్తు మొలకెత్తినా.. ఎండిపోయినా.. చేనులో పంట పండకపోయినా.. పండిన మిర్చికి ధర రాకపోయినా ఆయన వీసమెత్తయినా చలించలేదు. విశ్రాంతి ఎరుగని రైతు నేల తల్లి అన్యాయం చేయదని నాగులు నమ్మకం. ఈ ఏడాది కాకపోతే మరో ఏడాది ప్రయత్నిద్దామన్న ఆయన పట్టుదల, నిరంతర శ్రమ, ఏ చేనుకు ఏ సమయంలో ఎటువంటి మందు వేయాలో.. అదును దాటకముందే సదరు పంటకు పురుగు సోకకుండా ఎలా కాపాడుకోవాలో ఆయనకు అనుభవం నేర్పిన విద్య. అందుకే నాగులు 65 ఏళ్ల వయసులోనూ గ్రామస్తులకు తలపండిన వ్యవసాయæదారుడిలా, మేలిమి పంటలను పండించే శాస్త్రవేత్తగా కనిపిస్తాడు. సాగుకు పెట్టుబడి లేని రోజుల్లో అప్పు చేసినా.. వ్యవసాయంలో వచ్చిన పంట దిగుబడి అప్పు కట్టడానికి సైతం సరిపోకపోయినా ఆయనలో ఆత్మవిశ్వాసం సడలలేదు. వ్యవసాయాన్ని విరమించి విశ్రాంతిని తీసుకోలేదు. ఇప్పుడైనా.. వ్యవసాయానికి తనను కుటుంబం దూరం చేస్తుందన్న బాధ ఒకవైపు ఉన్నా.. తన కొడుకులు ఉన్నతులు అయ్యారన్న సందేశాన్ని సమాజానికి చాటి చెప్పినట్లవుతుందనే, మనిషికి ఏదో ఒక స్థాయిలో సంతృప్తి అవసరమన్న భావనను పది మందికి తెలియజేయాలన్న లక్ష్యంతోనే నాగులు వ్యవసాయ విరమణకు అంగీకరించాడు. పోరు పెట్టి మాన్పించారు భార్య, కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతో ఎకరంన్నర భూమిని పదెకరాల వరకు పెంచిన ఘనత నాగులుది. ఆయనకు భార్య పూర్ణ, ముగ్గురు కొడుకులు. ఇందులో ఒక కొడుకు విజయవాడలో ఆబ్కారీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుండగా.. మరో కొడుకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇక మూడో కొడుకు తన దగ్గరే ఉన్నా.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుని తన కాళ్లపై తాను నిలబడగలిగే సామర్థ్యం తెచ్చుకున్నాడు. ‘‘మెరికల్లాంటి ముగ్గురు కొడుకులం ఉన్నాం.. ఇక నీకు వ్యవసాయంతో పనేంటి.. నీ కష్టాన్ని మేము చూడలేమంటూ..’’ ఆ కుటుంబ సభ్యులు చేసిన పోరుకు నాగులు ఎట్టకేలకు సరే అనాల్సి వచ్చింది. ఆధారపడే అవసరమే లేదు తమ పది ఎకరాల వ్యవసాయ భూమిని నాగులు ఈ ఏడాది నుంచి కౌలుకు ఇస్తున్నారు. కౌలు రైతు పడుతున్న కష్టం కళ్లారా చూసి తనకు తోచిన సలహా ఇస్తూ శేష జీవితాన్ని నాగులు, పూర్ణ దంపతులు గడిపేయదలచుకున్నారు. ఇక ఆ పదెకరాలకు వచ్చే కౌలు డబ్బులకు ఈ భార్యాభర్తలిద్దరే సర్వ హక్కుదారులు. ‘వ్యవసాయం చేసినప్పుడు ఏ రకంగానైతే ఆర్థిక స్వేచ్ఛను అనుభవించారో.. ఇప్పటికీ అదే స్వేచ్ఛ మీకు ఉండాలని’ ఆయన కుటుంబం ఆకాంక్షించింది. తల్లిదండ్రులు పడిన కష్టానికి.. విరమణతో తీర్చుకున్న రుణం నాగులు ‘వ్యవసాయ విరమణ’ వేడుకను ఆయన కుమారులు అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ ఏడాది మే 29వ తేదీన గ్రామంలో మేళతాళాలతో వచ్చి తండ్రిని ఘనంగా సత్కరించారు. ఐదు పదుల వ్యవసాయ జీవితంలో నాగులు తన కుటుంబాన్ని సంరక్షించిన తీరును, వృద్ధిలోకి తెచ్చిన వైనాన్ని అక్కడికి వచ్చిన ప్రతి అతిథి కొనియాడారు. తండ్రికి కష్టం రాకుండా కొడుకులు చూసుకోవడం.. ముదిమి వయసులో మేమున్నామంటూ తల్లిదండ్రులకు అండగా ఉండటం ఊరు ఊరునే కాదు.. జిల్లా ప్రజలందరినీ అబ్బురపరిచింది. ఇది ఇంకెందరికో స్ఫూర్తిదాయకంగా నిలవాలని ప్రతి ఒక్కరూ కాంక్షించారు. ఉద్యోగ విరమణ రోజున ప్రభుత్వ ఉద్యోగిని ఎలా సన్మానిస్తారో.. అదే విధంగా వ్యవసాయ విరమణకు సమ్మతించిన ఆ రైతుకు అరుదైన గౌరవం కుటుంబ సభ్యుల ద్వారా దక్కింది. ‘మా అమ్మానాన్న మా ఉన్నతి కోసం పడిన కష్టానికి గుర్తుగా ఈ సన్మానం’ అంటూ కుమారులు చేసిన ప్రసంగాలు ఆహూతులను కంటతడి పెట్టించాయి. ఈ తరహా వ్యవసాయ విరమణ ప్రతి రైతు కుటుంబానికి స్ఫూర్తిదాయకం కావాలన్నది ఆ గిరిజన కుటుంబం ఆకాంక్ష. – మాటేటి వేణుగోపాల్ రావు, సాక్షి, ఖమ్మం -
తాగడానికి భార్య డబ్బులివ్వలేదని..
మద్యానికి భార్య డబ్బులివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ తాగుబోతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతి శాంతినగర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గడ్డం నాగులు(58) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతండేవి. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నాగులు తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పిడుగుపాటుకి గేదెల కాపరి మృతి
-
అనుమానంతో తమ్ముడినే చంపేశాడు
కోడుమూరు (కర్నూలు): వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. కోడూమూరు ఎస్సీకాలనీకి చెందిన మద్దిలేటి, నాగులు(30) అన్నదమ్ములు. అయితే మద్దిలేటి భార్యకు, తన తమ్ముడు నాగులుకు మధ్య వివాహేతర సంబంధం ఉందని మద్దిలేటికి అనుమానం. కాగా, శుక్రవారం ఉదయం తన భార్య, తమ్ముడు సన్నిహితంగా ఉండటం చూసి ఆగ్రహంతో మద్దిలేటి కత్తితో నాగులుపై దాడి చేశాడు. దీంతో నాగులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.