వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
కోడుమూరు (కర్నూలు): వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. కోడూమూరు ఎస్సీకాలనీకి చెందిన మద్దిలేటి, నాగులు(30) అన్నదమ్ములు. అయితే మద్దిలేటి భార్యకు, తన తమ్ముడు నాగులుకు మధ్య వివాహేతర సంబంధం ఉందని మద్దిలేటికి అనుమానం.
కాగా, శుక్రవారం ఉదయం తన భార్య, తమ్ముడు సన్నిహితంగా ఉండటం చూసి ఆగ్రహంతో మద్దిలేటి కత్తితో నాగులుపై దాడి చేశాడు. దీంతో నాగులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.