maddileti
-
ఏ2 మద్దిలేటిని కస్టడీకి ఇవ్వండి
గద్వాల క్రైం: నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారన్న కేసులో అరెస్టయిన వారిలో ఏ2 (టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి)ని తమ కస్టడీకి ఇవ్వాలంటూ జాతీయ విచారణ ఏజెన్సీ (ఎన్ఐఏ) బృందం శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా, 2019 అక్టోబర్ 5న మల్దకల్ మండలం ఎల్కూరుకు చెందిన నాగరాజు అలియాస్ నాగన్న (ఏ1), నారాయణపేట జిల్లా మక్తల్ వాసి బండారి మద్దిలేటి (ఏ2), వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన వైనమోని బలరాం (ఏ3), జన గామ జిల్లా బాచణ్‌పేట్ వాసి జగన్ (ఏ4), మేడ్చల్ జిల్లా చాకిరిపురానికి చెందిన చుక్క శిల్ప (ఏ5), జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం పార్చర్ల వాసి గుంత రేణుక (ఏ6), హైదరాబాద్‌కు చెందిన మెంచు రమేశ్ (ఏ7), నలమాస కృష్ణ (ఏ8) ను గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరంతా సంఘ విద్రోహ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని యువతను నిషేధిత కార్యక్రమాల వైపు ప్రేరేపిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అప్పట్లో పలు నివాస గృహాల్లో సోదాలు నిర్వహించి విప్లవ సాహిత్యం, వివిధ లేఖలు, కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి (ఏ2)ని తమ కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టులో ఎన్ఐఏ బృదం పిటిషన్ వేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మాజీ మవోయిస్టుల ఇళ్లలో తనిఖీ చేసిన సమయంలో లభించిన ఆధారాలను బట్టి ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఎంత మంది ఉన్నారనే కోణంలో గద్వాల పోలీసుల సహకారంతో విచారణ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎన్ఐఏకు అనుమతి ఇవ్వొద్దంటూ హైకోర్టును నిందితుడి కుటుంబసభ్యులు ఆశ్రయించారు. -
మద్దిలేటిని కోర్టులో హాజరుపర్చాలి
సాక్షి, హైదరాబాద్: సీపీఐ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మక్తల్‌కు చెందిన తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాగ్‌లింగంపల్లిలోని టీపీఎఫ్ ఆఫీసులో ఓ రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరైన వీరిద్దరిని పోలీసులు నేరుగా కస్టడీలోకి తీసుకొన్నారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉండటమేగాక, చురుకైన కార్యకర్తలుగా పనిచేస్తూ.. కొత్త క్యాడర్‌ను నియమించడం, నిధులను సేకరించడం వంటివి చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ నిర్వహించే బంద్‌లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతిస్తున్నారని, అందుకే నిందితులను అరెస్ట్ చేశామని గద్వాల్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో అరెస్ట్ చేసిన నలమాస కృష్ణ, మద్దిలేటిని కోర్టులో హాజరు పర్చాలని వారి బంధువులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
పోలీసుల అదుపులో టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి!
ఊట్కూర్ (మక్తల్): మావోయిస్టులతో పరిచయాలున్నాయన్న అనుమానంతో మక్తల్‌కు చెందిన తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటిని శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ విద్యానగర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. ఆయన నుంచి సెల్ఫోన్లు, వివిధ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం మక్తల్‌లో ఉన్న తల్లి వెంకటమ్మ, ఇతర కుటుంబసభ్యులకు ఆదివారం తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన శంకరప్ప, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా రెండో కుమారుడు మద్దిలేటి ఉద్యమ బాటలో పయనించారు. మద్దిలేటి భార్యాపిల్లలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడే న్యాయవాది పరీక్షకు శిక్షణ పొందుతున్నారు. రాష్ట్రంలో విద్యార్థి దశ నుంచి ఉద్యమ బాటలో పయనించిన ఆయన చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. దీంతో ఆయన కదలికలపై పోలీసులు నిఘా వేయగా మావోలతో పరిచయాలు ఉన్నాయని అనుమానంతో పోలీసులు అదుపులో తీసుకున్నారు. -
మద్దిలేటి క్షేత్రంలో తిరుచ్చి వేడుకలు
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి తిరుచ్చి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితులు జ్వాలా చక్రవర్తి, ప్రధాన అర్చకుడు మద్దిలేటి స్వామిలు.. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మద్దిలేటి నరసింహస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీల్లో ఉత్సమూర్తులను కొలువుంచి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. పుష్పాలంకరణ శోభితుడై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. -
40 కిలోల గంజాయి స్వాధీనం
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని పద్మానగర్‌లో ఆదివారం సాయంత్రం ఇద్దరిని అరెస్ట్‌చేసి వారి వద్దనుంచి 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ సీఐ జయరామయ్య మద్దిలేటి, విజయలక్ష్మి అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
పెళ్లికి పట్టుబడుతున్న.. కేసీఆర్ దత్తపుత్రిక
సాక్షి, హైదరాబాద్: సొంత తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ప్రత్యూష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా..? తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యువకుడితో చిగురించిన ప్రేమ, పెళ్లి వరకు వెళ్లబోతోందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కన్నతల్లి మరణంతో, సవతి తల్లి పెంపకంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో ప్రత్యూషను మీడియా, బాలల హక్కుల సంఘాలు చొరవతో ఆస్పత్రిలో చేర్పించటం, ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, హై కోర్టుల స్పందనతో ప్రభుత్వ ఆధీనంలోని సంరక్షణ కేంద్రంలో నివసిస్తున్నఆమె యోగక్షేమాలను అధికారుల ప్రత్యేకంగా చూస్తూవస్తున్నారు. ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వోకేషనల్ పరీక్ష సైతం పాసైయ్యారు. అయితే, బీఎస్సీ నర్సింగ్ చేయటమే లక్ష్యంగా చెబుతూ వచ్చిన ప్రత్యూష.. తాజాగా తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటి రెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకున్నాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించారు. ఈ విషయాన్ని మహిళ సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా ప్రత్యూష తెలిపారు. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలు మార్లు కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నపటికీ.. ప్రస్తుతం తనకు ఇరవై ఏళ్లని, మేజర్‌నంటూ.. నా ఇష్టప్రకారం నేను కోరుకున్నది చేయాలంటూ ప్రత్యూష పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఎవరీ మద్దిలేటి రెడ్డి.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారీకాలనీకి చెందిన మద్దిలేటి రెడ్డి(27) బీఎస్సీ చదివి ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నారు. గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుని పరామర్శకు హైదరాబాద్‌కు వచ్చి అక్కడే చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించాడు. ఏ ఇబ్బంది ఉన్నా తనకు ఫోన్ చేయాలంటూ నంబర్ ఇచ్చాడు. నగరంలో ఉన్న రెండు రోజుల ప్రత్యూష వద్దకు వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లిపోయాడు. తర్వాత ప్రత్యూష ప్రభుత్వ సంరక్షణ గృహంలో చేరింది. అప్పటినుంచి మద్దిలేటికి ఫోన్లు చేస్తుండటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. హాస్టల్లో ఉండలేను.. పెళ్లి చేసుకుంటా ప్రత్యూష ప్రస్తుతం తాను హాస్టల్లో ఉండలేకపోతున్నానని, హాస్టల్ భోజనంలో సోడా ఉప్పు వేస్తున్నారని, ఉడకని బియ్యంతో అన్నం తినడం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పెడుతోందని బాలల హక్కుల కమిషన్ సభ్యులు అచ్యుతరావుకు ఆమె ఫోన్ చేసి చెప్పారు. మద్దిలేటిని పెళ్లి చేసుకున్నాకే తాను బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తానని వివరించారు. తాను ప్రేమించిన మద్దిలేటితోనే వివాహం జరిపించాలని కోరారు. ఆమెనే పెళ్లి చేసుకుంటా: మద్దులేటిరెడ్డి అవును.. ప్రత్యూషను ప్రేమించాను. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పి అమ్మ తులసమ్మను ఒప్పించాను. నేను పేదవాడినైనా, మాట తప్పే వాడిని కాదు. ఆమే తొలుత నాకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అందుకు మేమంతా అంగీకరించాం. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో ప్రత్యూషను పెళ్లి చేసుకుంటానని మద్దిలేటి తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలి : అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్సభ్యులు ప్రత్యూషను ఆస్పత్రి నుండి తీసుకెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత, ఆమెకు మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించ లేదు. పరిసరాలు, చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా ఆమె వాటన్నింటి నుంచి ఇప్పటికిప్పుడు బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆమెకు నిపుణులైన మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు. -
డీఈఈ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
చిత్తూరు జిల్లా మదనపల్లిలోని హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ కుప్పం బ్రాంచ్ 12 డీఈఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించారు. ఈ కార్యాలయంలో డీఈఈగా పనిచేస్తున్న మద్దిలేటి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బెంగళూరులోని ఎస్ఆర్పురంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు సమాచారం. అలాగే ఆయన నివాసంలోనూ సోదాలు చేపట్టారు. -
అనుమానంతో తమ్ముడినే చంపేశాడు
కోడుమూరు (కర్నూలు): వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. కోడూమూరు ఎస్సీకాలనీకి చెందిన మద్దిలేటి, నాగులు(30) అన్నదమ్ములు. అయితే మద్దిలేటి భార్యకు, తన తమ్ముడు నాగులుకు మధ్య వివాహేతర సంబంధం ఉందని మద్దిలేటికి అనుమానం. కాగా, శుక్రవారం ఉదయం తన భార్య, తమ్ముడు సన్నిహితంగా ఉండటం చూసి ఆగ్రహంతో మద్దిలేటి కత్తితో నాగులుపై దాడి చేశాడు. దీంతో నాగులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ట్రిబ్యునల్ తీర్పుతో పాలమూరుకు తీవ్ర నష్టం
గద్వాలటౌన్, న్యూస్‌లైన్: బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున ల్ ఎదుట సరైన వాదనలు వినిపించకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి మండిపడ్డా రు. సోమవారం టీపీఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పుతో పాలమూరు జిల్లా తీవ్రంగా న ష్టపోయిందని చెప్పారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సాగునీటి హక్కు లేకుండా పోయిందన్నారు. కేంద్ర జల సంఘం అనుమతి, నీటి కేటాయింపుల ఉత్తర్వులు లేకుండానే ట్రయల్ రన్ నిర్వహించారన్నారు. ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ వాదనలో నెట్టెంపాడు అంశమే లేకపోవడం దారుణమన్నారు. పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానీటిని అక్రమంగా సీమాంధ్ర నాయకులు తరలించుకపోతున్నారని ఆరోపించారు. ఆర్డీఎస్ నీటి వాటాలో ప్రతి ఏడాది 12 టీఎంసీల నీటిని కేసీ కెనాల్ ద్వారా తరలించుక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనాప్రభుత్వం స్పందించి నెట్టెంపాడు, కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు నీటి కేటాయింపులు చేసేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు జ్యోతి, ప్రభాకర్, కావలి మణ్యం, చిట్టెం కిష్టన్న, సుభాన్,తదితరులు పాల్గొన్నారు.