మద్దిలేటి క్షేత్రంలో తిరుచ్చి వేడుకలు
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి తిరుచ్చి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితులు జ్వాలా చక్రవర్తి, ప్రధాన అర్చకుడు మద్దిలేటి స్వామిలు.. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మద్దిలేటి నరసింహస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీల్లో ఉత్సమూర్తులను కొలువుంచి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. పుష్పాలంకరణ శోభితుడై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.