సాక్షి, చైన్నె: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –తిరుచ్చి, అధికారిక పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో ల్యాండ్ మార్క్ ఈవెంట్‌గా గ్లోబల్ అలుమ్ని మీట్ 2025 చైన్నె వేదికగా జరగనుంది. గిండి ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా జనవరి 4వ తేదీన ఈ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులను ఒకచోట చేర్చే విధంగా కార్యక్రమానికి నిర్ణయించారు. 930 మందికి పైగా సీఈఓలు, 1,300 మందికి పైగా వివిధ సంస్థల వ్యవస్థాపకులు. సహ–వ్యవ స్థాపకులు, 48,000 మంది పూర్వ విద్యార్థుల డైనమిక్ నెట్‌వర్క్‌తో ఎన్‌ఐటీ తిరుచ్చి ఈ వేడుకకు నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర ఐటీ మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ పాల్గొననున్నారు.
ఈ వివరాలను సోమ వారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఎన్‌ఐటీ తిరుచ్చి డైరెక్టర్ జి అఖిల ప్రకటించారు. అలాగే, ఈ మీట్‌బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రముఖులైన పూ ర్వ విద్యార్థులను ఒకే వేదిక మీదకు తీసుకు రావ డం, పభావవంతమైన సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక శక్తివంతంగా ఈ వేదిక మారనున్నట్టు వివరించారు.
2025లో అకడమిక్ ఎక్స లెన్స్, అత్యాధునిక పరిశోదన , క్రీడా సౌకార్యలు, వంటి వాటిని మెరుగు పరిచే దిశగా ప్రత్యేక కార్యాచరణలో ఉన్నామన్నారు. ఆవిష్కరణల కేంద్రం పరిశోధన– వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి, పూర్వ విద్యార్థుల– విద్యార్థుల మెంటర్‌షిప్‌కు అధికారిక వేదికను అందించడానికి, స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను ప్రోత్స హించడానికి, ల్యాబ్‌ను అందించడంతో పాటు పరిశ్రమ నేతృత్వంలో ప్రాజెక్ట్‌లను పెంచడానికి ఈ మీట్ దోహదకరంగా ఉంటుందన్నారు.
రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ప్లాట్‌ఫారమ్, గవర్నెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ టాలెంట్ , స్టార్టప్ ఆలోచనలను పెంపొందించడంతో పాటూ పరిశోధన మరియు ఆవిష్కరణలను చేయడమే లక్ష్యంగా నిర్ణయించామన్నా రు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కె మహాలింగం మాట్లాడుతూ, తమ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ విస్తారమైనదని, ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులని, ఇందుకు తగిన మార్గదర్శకత్వం, వ్యాపారం, నిధులు, ఆలోచనల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment