
స్వామివారిని దర్శించుకుంటున్నభక్తులు.
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతరకు శనివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. భక్తులు తొలుత మోయతుమ్మెద వాగులో స్నానం చేసి స్వామిని దర్శించుకున్నారు.
అనంతరం వాగు పక్కన చెలమను తోడి అందులో నుంచి తీసిన నీటితో వంకాయ కూర, చింతపండు చారు చేసుకొని అక్కడే భోజనాలు చేశారు. మరికొందరు వంకాయ, చిక్కుడు, టమాటాలను కలిపి కూర చేసుకోవడం గమనార్హం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జాతర సాగింది. జాతరకోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment