గద్వాలటౌన్, న్యూస్‌లైన్: బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున ల్ ఎదుట సరైన వాదనలు వినిపించకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి మండిపడ్డా రు. సోమవారం టీపీఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పుతో పాలమూరు జిల్లా తీవ్రంగా న ష్టపోయిందని చెప్పారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సాగునీటి హక్కు లేకుండా పోయిందన్నారు. కేంద్ర జల సంఘం అనుమతి, నీటి కేటాయింపుల ఉత్తర్వులు లేకుండానే ట్రయల్ రన్ నిర్వహించారన్నారు.
ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ వాదనలో నెట్టెంపాడు అంశమే లేకపోవడం దారుణమన్నారు. పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానీటిని అక్రమంగా సీమాంధ్ర నాయకులు తరలించుకపోతున్నారని ఆరోపించారు. ఆర్డీఎస్ నీటి వాటాలో ప్రతి ఏడాది 12 టీఎంసీల నీటిని కేసీ కెనాల్ ద్వారా తరలించుక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనాప్రభుత్వం స్పందించి నెట్టెంపాడు, కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు నీటి కేటాయింపులు చేసేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు జ్యోతి, ప్రభాకర్, కావలి మణ్యం, చిట్టెం కిష్టన్న, సుభాన్,తదితరులు పాల్గొన్నారు.
ట్రిబ్యునల్ తీర్పుతో పాలమూరుకు తీవ్ర నష్టం
Published Tue, Dec 10 2013 6:50 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
Advertisement