సాక్షి,బెంగళూరు : శాసన మండలిలో సభాకార్యాకలాపాలు నాలుగైదు రోజులతో పోలిస్తే బుధవారం కొంత ప్రశాంతంగా జరిగాయి. సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు.
వృధ్యాప్య, వితంతు ఫించన్ల పంపిణీలో చోటుచేసుకుంటున్న ఆలస్యం, అక్రమాలను నివారించడానికి త్వరలో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వీ శ్రీనివాసప్రసాద్ పేర్కొన్నారు. ఈ విధానంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే అధికారులు వెళ్లి ఫించన్ మొత్తాన్ని అందిస్తారన్నారు. రాష్ట్రంలో ఉన్న తాండాలు, గొల్లరహట్టిలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తిస్తామని మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
వన్యప్రాణుల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి అందించే పరిహారాన్ని ‘సకాల’ (నిర్థిష్ట సమయంలో చెల్లించడం) పరిధిలోకి తీసుకొస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రామనాథ్‌రై విధానపరిషత్‌కు తెలిపారు. పరిహారం పెంచే విషయం పరిశీలనలో ఉందన్నారు.
భూగర్భ జలాలు పెంచడంలో భాగంగా కొప్పళ, కోలారు, చిక్కబళ్లాపుర, గదగ్, బీజాపుర జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించామని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి శివరాజ్‌తంగడి పరిషత్‌కు తెలిపారు. వచ్చే ఏడాది మరో ఐదు జిల్లాలను ఇందుకు కోసం ఎంపిక చేస్తామన్నారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో శాశ్వత తాగునీటి సరఫరాకు రూ.45 వేల కోట్లను కేటాయించామని, అందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి హెచ్.కే పాటిల్ పరిషత్‌కు తెలిపారు.
ఇక సొంత టీవీ
Published Thu, Jul 24 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement