![‘నాపై చెప్పులు వేయాలనుకుంటే వేయండి’](/styles/webp/s3/article_images/2017/09/4/81474889178_625x300.jpg.webp?itok=5JhMVzr2)
‘నాపై చెప్పులు వేయాలనుకుంటే వేయండి’
సీతాపూర్: దాడులకు భయపడబోనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తన యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ సీతాపూర్లో రోడ్ షో సందర్భంగా తనపై అనూప్ మిశ్రా అనే వ్యక్తి చెప్పు విసరడంపై రాహుల్ స్పందించారు.
‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. నాపై చెప్పులు వేయాలకుంటే వేయండి. నేను మీకు భయపడను. వెనకడుగు వేయను. బస్సులో రోడ్ షో చేస్తుండగా నాపై ఎవరో విసిరిన చెప్పు నాకు తాకలేదు. నా పక్కనే ఉన్న వ్యక్తి చేతికి తగిలింది. మీ కోపమే మీ బలహీనత అని గుర్తుంచుకోండి. మీరు ఎన్ని దాడులు చేసినా నన్ను ఆపలేరు. విద్వేషం పట్ల నాకు నమ్మక లేదు. ప్రేమ, సౌభ్రాతృత్వం పట్ల నాకు అపార విశ్వాసముంద’ని రాహుల్ గాంధీ అన్నారు.