shoe hurled
-
ఇమ్రాన్ ఖాన్‌పై దాడి
లాహోర్ : ఇటీవలే మూడోపెళ్లిచేసుకుని, రెండో భార్య ఆరోపణలతో ఇబ్బందులపాలైన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు మరో చేదుఅనుభవం ఎదురైంది. పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) మంగళవారం గుజరాత్(పంజాబ్ ఫ్రావిన్స్)లో నిర్వహించిన సభలో ఆయనపై చెప్పులతో దాడి జరిగింది. వాహనం టాప్‌పైన నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో ఇమ్రాన్పైకి ఓ యువకుడు బూటువిసిరాడు. అయితే అదికాస్తా గురితప్పి పక్కనున్న నాయకుడికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన పీటీఐ కార్యకర్తలు.. షూ విరిసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదాదిన తర్వాత పోలీసులకు అప్పగించారు. బూటుదాడి జరగడంతో ఇమ్రాన్ తన ప్రసంగాన్ని కాస్త ముందుగానే పూర్తిచేసి వెళ్లిపోయారు. వరుస దాడులతో నేతల బెంబేలు : పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ముఖ్యనేతలంతా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా వారివారి వ్యతిరేకులు ఆందోళనలు, దాడులకు పాల్పడుతున్నారు. నిన్నటికి నిన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై బూటు దాడి జరింది. అంతకు కొద్ది రోజుల ముందే విదేశాంగ శాఖ మంత్రి ఖవాజాపై ఓ యువకుడు చెప్పులు విసిరాడు. ఇక ఇమ్రాన్పైనేతే.. గతవారం కూడా ఓ బూటుదాడి జరిగింది. -
మంత్రి ముఖంపై సిరా పోసి నిరసన!
ఇస్లామాబాద్: పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతోన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ముఖంపై స్థానికుడు ఒకరు సిరా పోశారు. పంజాబ్ ప్రావిన్సులో శనివారం రాత్రి జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ ముఖంపై ఓ వ్యక్తి సిరా చల్లాడు. రాజ్యాంగ చట్టాల పేరుతో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ ముస్లింల మనోభావలను దెబ్బతీసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని నిందితుడు ఆరోపించాడు. ఈ హఠాత్ పరిణామానికి స్పందించిన అక్కడి పోలీసులు వెంటనే అతణ్ని అరెస్టు చేశారు. సిరా పోసిన వ్యక్తిని ఫయాజ్ రసూల్‌గా గుర్తించారు. అతడికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని గుర్తించారు. నవాజ్ షరీఫ్‌పై చెప్పుతో దాడి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గర్హీ సాహూలో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన షరీఫ్‌పై ఓ యువకుడు షూతో దాడి చేశాడు. షరీఫ్ తన ప్రసంగం ప్రారంభించే కంటే ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. షూతో దాడి చేసిన యువకుడిని షరీఫ్ మద్దతుదారులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. -
నవాజ్ షరీఫ్‌పై షూ విసిరిన యువకుడు
-
మైకు దగ్గరకు రాగానే షూ..
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై లాహోర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఓ యువకుడు షూ విసిరిన ఘటన కలకలం రేపింది. వేదికపై షరీఫ్ మాట్లాడుతుండగా అనూహ్యంగా షూ ఆయనపైకి దూసుకొచ్చింది. లాహోర్‌కు సమీపంలోని గర్హి షాహులో జామియనీమియా సెమినరీకి మాజీ ప్రధాని హాజరైన క్రమంలో సెమినరీ మాజీ స్టూడెంట్ షరీఫ్పైకి షూ విసిరారు. ప్రేక్షకుల నుంచి విసిరన షూ నేరుగా షరీఫ్ ఛాతీకి తగిలింది. షూ విసిరిన యువకుడు వేదికపైకి వచ్చి నినదించడంతో అతడిని నిర్భందించిన నిర్వాహకులు పోలీసులకు అప్పగించారు. వివాదం సద్దుమణిగిన అనంతరం నవాజ్ షరీఫ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
తమన్నాపైకి బూటు విసిరిన యువకుడు
-
హైదరాబాద్: తమన్నాకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్‌నగర్‌లో ఆదివారం మలబార్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెపై ఓ యువకుడు బూటు విసిరాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కరీముల్లాగా గుర్తించారు. నగల షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తమన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా కరీముల్లా.. తమన్నాపైకి షూ విసిరాడు. అయితే అది ఆమెకు కొంతదూరంలో పడింది. అప్రమత్తమైన పోలీసులు బూటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై బౌన్సర్లు చేయి చేసుకున్నారు. కరీముల్లా.. ఎందుకు బూటు విసిరాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, సాయంత్రం కొండాపూర్‌లో మరో మలబార్ నగల దుకాణాన్ని తమన్నా ప్రారంభించనుంది. కాగా, ఇటీవల ఖమ్మంలో పర్యటించిన సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనా చెప్పు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. -
ఆర్కేనగర్లో చిన్నమ్మ వర్గానికి చేదు అనుభవం
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ వర్గానికి చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఆర్కే నగర్లో శశికళ వర్గానికి చెందిన సీఆర్ సరస్వతి ప్రచారం చేస్తుండగా.. ఓ వ్యక్తి ఆమెపైకి బూటు విసిరాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా శశికళ బంధువు టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. దినకరన్‌కు మద్దతుగా సరస్వతి ప్రచారం చేశారు. ఈ నెల 12న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 62 మంది బరిలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా టీటీవీ దినకరన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీప, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా కలైకోట్ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. -
హోంమంత్రిపై అసెంబ్లీ ముందే షూ విసిరాడు
గాంధీనగర్: గుజరాత్ హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆగ్రహంతో ఓ వ్యక్తి తన షూను ఆయనకు విసిరికొట్టారు. అది కూడా అతి చేరువ నుంచి. మొత్తం మీడియా అంతా పొగై ఉన్న సమయంలో గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోపంగా తన షూలు తీసి విసిరాడు. రెప్పపాటులో ఆ షూ ఆయనకు తగలకుండా పక్కకు పడిపోయింది. దీంతో అక్కడ అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ముందు గురువారం హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ మీడియా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చారు. సరిగ్గా మాట్లాడబోతుండగా గోపాల్ ఇతాలియా అనే వ్యక్తి నేరుగా అరుస్తూ షూ ఆయనపైకి విసిరేశాడు. అతడు ఒక నిరుద్యోగి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మధ్య జరిగిన గొడవల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అది కాకుండా నిరుద్యోగిగా ఉన్న అతడు రాష్ట్రంలో అభివృద్ధే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పాలనకు, అవినీతికి గుర్తుగా తన షూ ఇస్తున్నానంటూ విసిరి కొట్టాడు. మీడియా సమాచారం ప్రకారం ఈ యువకుడు అంతకుముందు నిరుద్యోగిత అంశంపై డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌తో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. షూ విసిరిన అతడు నేరుగా హోంమంత్రిపైకి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాడు. సెక్యూరిటీ, పోలీసులు నిలువరించడంతో మరింత గందరగోళం ఆగినట్లయింది. -
కేజ్రీవాల్ పై షూ విసిరాడు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం షూ విసిరేశాడు. హర్యానా రాష్ట్రంలోని రోహ్ తక్ జిల్లాలో ఆప్ నిర్వహస్తున్న ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు పెద్ద కుంభకోణం అని ర్యాలీలో ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో దుండగుడు కేజ్రీపై షూ విసిరాడు. దీంతో ఒక్కసారిగా ర్యాలీలో కలకలం రేగింది. చెప్పు విసిరిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గతంలో కూడా కేజ్రీపై పలుమార్లు దాడులు చేసిన విషయం తెలిసిందే. -
‘నాపై చెప్పులు వేయాలనుకుంటే వేయండి’
సీతాపూర్: దాడులకు భయపడబోనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తన యాత్రను అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ సీతాపూర్‌లో రోడ్ షో సందర్భంగా తనపై అనూప్ మిశ్రా అనే వ్యక్తి చెప్పు విసరడంపై రాహుల్ స్పందించారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. నాపై చెప్పులు వేయాలకుంటే వేయండి. నేను మీకు భయపడను. వెనకడుగు వేయను. బస్సులో రోడ్ షో చేస్తుండగా నాపై ఎవరో విసిరిన చెప్పు నాకు తాకలేదు. నా పక్కనే ఉన్న వ్యక్తి చేతికి తగిలింది. మీ కోపమే మీ బలహీనత అని గుర్తుంచుకోండి. మీరు ఎన్ని దాడులు చేసినా నన్ను ఆపలేరు. విద్వేషం పట్ల నాకు నమ్మక లేదు. ప్రేమ, సౌభ్రాతృత్వం పట్ల నాకు అపార విశ్వాసముంద’ని రాహుల్ గాంధీ అన్నారు.