
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై లాహోర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఓ యువకుడు షూ విసిరిన ఘటన కలకలం రేపింది. వేదికపై షరీఫ్ మాట్లాడుతుండగా అనూహ్యంగా షూ ఆయనపైకి దూసుకొచ్చింది. లాహోర్‌కు సమీపంలోని గర్హి షాహులో జామియనీమియా సెమినరీకి మాజీ ప్రధాని హాజరైన క్రమంలో సెమినరీ మాజీ స్టూడెంట్ షరీఫ్‌పైకి షూ విసిరారు.
ప్రేక్షకుల నుంచి విసిరన షూ నేరుగా షరీఫ్ ఛాతీకి తగిలింది. షూ విసిరిన యువకుడు వేదికపైకి వచ్చి నినదించడంతో అతడిని నిర్భందించిన నిర్వాహకులు పోలీసులకు అప్పగించారు. వివాదం సద్దుమణిగిన అనంతరం నవాజ్ షరీఫ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment