పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై లాహోర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఓ యువకుడు షూ విసిరిన ఘటన కలకలం రేపింది. వేదికపై షరీఫ్ మాట్లాడుతుండగా అనూహ్యంగా షూ ఆయనపైకి దూసుకొచ్చింది. లాహోర్‌కు సమీపంలోని గర్హి షాహులో జామియనీమియా సెమినరీకి మాజీ ప్రధాని హాజరైన క్రమంలో సెమినరీ మాజీ స్టూడెంట్ షరీఫ్‌పైకి షూ విసిరారు.