భారతీయ పాటకు గొంతు కలిపిందని..వైరల్! | Pakistan woman lip-syncs Indian song, penalised by authorities after video goes viral | Sakshi
Sakshi News home page

భారతీయ పాటకు గొంతు కలిపిందని..వైరల్!

Published Tue, Sep 4 2018 12:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

భారతీయ పాటకు గొంతు కలిపిందనే కారణంతో పాకిస్తాన్‌ ఎయిర్‌పోర్ట్‌ భద్రతా సిబ్బంది పాక్‌ యువతిపై చర్యలు చేపట్టింది. పాక్‌ జాతీయ జెండా ఉన్న టోపీని ధరించి ఇండియన్‌ సాంగ్‌ను ఆలపించిందనే కారణంతో ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే యువతిపై అధికారులు చర్యలు తీసుకోవడం చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

నియమావళిని ఉల్లంఘించినందుకు 25 ఏళ్ల మహిళా ఉద్యోగినికి ఇంక్రిమెంట్లు, పెర్క్స్‌ను నిలిపివేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అధికారులు ఆమెను హెచ్చరించారు.సోషల్‌ మీడియాలో ఎలాంటి వివాదాస్పద కార్యకలాపాల్లో తలదూర్చరాదని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తమ సిబ్బందిని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement