Airport authorities
-
ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు అన్ని సంస్థలు సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనువుగా తమనుతాము నిత్యం అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుండే హైదరాబాద్‌లోని జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. తనిఖీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సెల్ఫ్ చెక్ కియోస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు టర్మినల్లోకి ప్రవేశించడానికి ముందే తనిఖీలు చేయడం, బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాస్‌ల జారీ వరకు అన్ని సదుపాయాలను ఒకేచోట అందిస్తున్నట్టు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ ఈడీ ఎస్జీకే కిశోర్ అన్నారు. విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయకుండా సెల్ఫ్ చెక్ కియాస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. దీంతో టర్మినల్ వద్ద రద్దీ తగ్గడంతోపాటు ప్రయాణికులు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కొత్తగా ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద ప్రయాణికులు వారి బ్యాగ్‌లను వారే చెక్ చేసుకోవచ్చు. అక్కడే బోర్డింగ్ పాస్, బ్యాగ్ ట్యాగ్‌లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలు విమానం ప్రారంభమయ్యే గంట ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. -
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్‌పోర్టులు మూసివేత
మాస్కో: మాస్కో శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయగా వాటిని కూల్చేశామని తెలిపింది పుతిన్ సైన్యం. దీంతో అప్రమత్తమై నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపింది రష్యా రక్షణ శాఖ. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో విరుచుకుపడింది. మాస్కో సరిహద్దుల్లోని బ్రియాన్స్క్ ప్రాంతంలో క్రాస్నోగోర్స్క్ పట్టణంలో నాలుగు డ్రోన్లు ప్రవేశించడంతో వాటిని రష్యా సైన్యం కూల్చివేసింది. గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడటంతో అప్రమత్తమై ముందు జాగ్రత్తగా వ్నుకోవో, షెరెమెట్యెవో, డొమోడెడెవో, జుకోవ్స్కీ ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేశారు రష్యా అధికారులు. రష్యా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడులను ముమ్మరం చేసిందని గత ఆదివారం కూడా జరిగిన దాడుల్లో డ్రోన్లు రైల్వే స్టేషన్ పైకప్పు భాగంలోకి దూసుకుపోగా ఐదుగురు ప్రాణాలు కోలోయారని గుర్తు చేశారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది ఉండగా మరణించిన ఐదుగురిలో ఇద్దరు ఆసుపత్రికి తరలించడానికి నిరాకరించారని మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో మరణించారని తెలిపారు. అంతకుముందు ఇదే కుర్స్క్ ప్రాంతానికి చెందిన వొల్ఫినోలో కూడా ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇటీవలి కాలంలో మరింత బలాన్ని వెనకేసుకున్న ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో కోల్పోయిన ఒక్కో ప్రాంతాన్ని మెల్లగా తిరిగి చేజిక్కించుకుంటోంది. ఇది కూడా చదవండి: కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్ -
పంజాబ్ పర్యటన రద్దు.. ప్రధాని మోదీ తీవ్ర అసహనం
న్యూఢిల్లీ: పంజాబ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా.. పంజాబ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భఠిండా ఎయిర్పోర్ట్ అధికారులతో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ ఉదయం భఠిండా చేరుకున్నారు. చదవండి: (ఆకస్మికంగా ప్రధాని మోదీ పర్యటన రద్దు..) అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వేదిక వద్దకు వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మోదీ ప్రయాణిస్తోన్న కాన్వాయ్ మార్గంలో ఓ ఫ్లైఓవర్ వద్ద ఆందోళనకారులు రహదారిని బ్లాక్ చేశారు. దీంతో ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే ఉన్న ప్రధాని.. తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోయారు. చదవండి: (ప్రధాని పర్యటన రద్దు.. స్పందించిన పంజాబ్ ప్రభుత్వం) -
ఆ దేశాధ్యక్షుడినే అడ్డగించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది
లక్నో: మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్‌కి వారణాసి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన భారత్‌కు వచ్చారు. ఆరుగురు ప్రతినిధులతో కలిసి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్ళడానికి పృథ్వీరాజ్ సింగ్ విమాశ్రయానికి వచ్చారు. అయితే అధ్యక్షుడి బృందం లగేజీ పరిమితికి మించి ఉండటంతో అదనపు ఛార్జీలు చెల్లించమని కోరుతూ విమానాశ్రయ సిబ్బంది వారిని ఆపారు. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా సిబ్బంది వీరిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: రాజధర్మంపై ఆగని రగడ అయితే ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే కలగజేసుకున్న ఎయిర్ ఇండియా సిబ్బందికి తగిన సూచనలు చేయడంతో అనంతరం పృథ్వీరాజ్ బృందం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనను ఎయిర్‌పోర్టు డైరెక్టర్ అక్షదీప్ మాథుర్ ధ్రువీకరించారు. మారిషస్ అధ్యక్షుడిని అడ్డుకున్నారని తెలిసిన వెంటనే స్పందించి ఎయిరిండియా సిబ్బందితో మాట్లాడామన్నారు. భారత పర్యటనకు వచ్చిన ప్రముఖుల అదనపు లగేజీకి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఎయిరిండియా సిబ్బందికి విమానయానశాఖ సూచించినట్లు తెలుస్తోంది. చదవండి: సీఎం జగన్‌తో ముకేష్ అంబానీ భేటీ -
ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. సత్వరమే భద్రతా తనిఖీలను పూర్తిచేసే ముఖకవళికల(ఫేస్ రికగ్నైజేషన్) నమోదు ప్రక్రియను గతేడాది ఎయిర్‌పోర్టు అధికారులు ప్రారంభించారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది, రెండోదశలో భాగస్వామ్య సంస్థలను ఈ తనిఖీల పరిధిలోకి తెచ్చారు. మొత్తం ఎయిర్‌పోర్టు కమ్యూనిటీ ఫేస్ రికగ్నైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. డిజి యాత్ర ప్రాజెక్టులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేస్ రికగ్నైజేషన్ను దశలవారీగా జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. రోజూ సుమారు 55,000 మంది ప్రయాణికులు, 400 జాతీయ, అంతర్జాతీయ విమానాలు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల భద్రతలో భాగంగా ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన అధికారులు తాజాగా ముఖకవళికల నమోదుకు శ్రీకారంచుట్టారు. బ్యాగేజ్ తనిఖీల్లోనూ మరింత పటిష్టమైన ఆటోమేటిక్ ట్రేరిట్రైవల్ సిస్టమ్(ఏటీఆర్ఎస్) చేపట్టింది. ప్రస్తుతం డొమెస్టిక్ ప్రయాణికుల బ్యాగేజ్‌కి మాత్రమే ఈ ఏటీఆర్‌ఎస్‌ను పరిమితం చేశారు. ముఖ కవళికల నమోదు ఇలా.... ఎయిర్‌పోర్టు టర్మినల్ ప్రవేశమార్గంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కియోస్క్‌ల ద్వారా ప్రయాణికులకు వన్‌టైమ్ ఫేస్ రికగ్నైజేషన్ సదుపాయాన్ని కల్పిస్తారు. ఇందుకోసం ప్రయాణికులు ఫేస్ ఐడీతోపాటు, గుర్తింపు ధ్రువీకరణ, ఫొటోలను కియోస్క్‌ల వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం ఈ–బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేస్తారు. దీంతో ఎయిర్‌లైన్ డిపార్చర్ కంట్రోల్ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా తనిఖీ పూర్తవుతుంది. తర్వాత ప్రయాణికుల ఫేస్ రికగ్నైజేషన్‌తో టికెట్ అందజేస్తారు. ఒకసారి ఫేస్ రికగ్నైజేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు ఆ తరువాత పదే పదే నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా భద్రతా తనిఖీలను పూర్తిచేసుకొని వెళ్లిపోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో ఈ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో మరి కొద్దిరోజుల్లో డొమెస్టిక్ ప్రయాణికులకు దీనిని విస్తరించనున్నారు. తరువాత అంతర్జాతీయ ప్రయాణికులను ఈ ప్రక్రియలోకి తెచ్చే అవకాశం ఉంది. ఒక సారి ఫేస్ నమోదు పూర్తయిన తరువాత ఇతర ప్రవేశమార్గాల్లో, భద్రతా అధికారుల తనిఖీల్లో మరోసారి నమోదు చేసుకోవలసిన అవసరం ఉండదు. ఏటీఆర్ఎస్ బ్యాగేజ్.. ఎక్స్‌రే–బ్యాగేజ్ తనిఖీల్లో అత్యాధునిక ఆటోమేటిక్ ట్రే రిట్రైవల్ సిస్టమ్(ఏటీఆర్ఎస్)ను ప్రవేశపెట్టారు. ఇది సమగ్రమైన భద్రతా ప్రక్రియ. అన్ని డొమెస్టిక్ సెక్యూరిటీ మార్గాల్లో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో ప్రత్యేకంగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా బ్యాగుల తనిఖీ పూర్తవుతుంది. చెక్–పాయింట్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. వేగంగా, పటిష్టంగా బ్యాగ్ స్క్రీనింగ్ పూర్తవుతుంది. ఆటోమేటిక్ ట్రేలలో బ్యాగులు వేసిన తరువాత ఆటోమేటిక్ రోల్లో ఎక్స్‌రే–మెషీన్ల వైపు బ్యాగులు వెళ్తాయి. ఈ ట్రేలను కేబిన్ సైజ్ బ్యాగులు తనిఖీ చేసేలా ఏర్పాటు చేశారు. ప్రతి ట్రేకు ప్రారంభం నుంచి చివరి వరకు ఆర్ఎఫ్ఐడీ ట్రాకింగ్ ఉంటుంది. అనుమానాస్పద వస్తువులు ఉన్న బ్యాగులను తొలగించేందుకు ప్రత్యేక లైన్లు ఉంటాయి. అనంతరం అలాంటి బ్యాగులను అధికారులు స్వయంగా తనిఖీ చేసి నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఇంటీరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్(ఐఐడీటీ)లో సమీకృత ఏటీఆర్ఎస్ వ్యవస్థతో పాటు 2 ఎక్స్–రే మెషీన్లు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. -
భారతీయ పాటకు గొంతు కలిపిందని..వైరల్!
-
పొరుగు దేశం పాట పాడినందుకు పాక్ యువతిపై..
లాహోర్ : భారతీయ పాటకు గొంతు కలిపిందనే కారణంతో పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది పాక్ యువతిపై చర్యలు చేపట్టింది. పాక్ జాతీయ జెండా ఉన్న టోపీని ధరించి ఇండియన్ సాంగ్‌ను ఆలపించిందనే కారణంతో ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే యువతిపై అధికారులు చర్యలు తీసుకోవడం చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. నియమావళిని ఉల్లంఘించినందుకు 25 ఏళ్ల మహిళా ఉద్యోగినికి ఇంక్రిమెంట్లు, పెర్క్స్‌ను నిలిపివేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అధికారులు ఆమెను హెచ్చరించారు.సోషల్ మీడియాలో ఎలాంటి వివాదాస్పద కార్యకలాపాల్లో తలదూర్చరాదని ఎయిర్పోర్ట్ అధికారులు తమ సిబ్బందిని హెచ్చరించారు. కాగా పాక్ యువతి గత రెండేళ్లుగా సియోల్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. పాక్ యువతి చర్యపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణను ప్రారంభించింది. -
లైసెన్స్ జారీకి లంచం డిమాండ్
ఇద్దరు ఎయిర్‌పోర్టు అధికారులు అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: లైసెన్సు జారీకి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎయిర్‌పోర్టు అధికారులు శుక్రవారం సీబీఐకి చిక్కారు. హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్‌కు చెందిన సమీర్.. ‘మై టీ’ పేరుతో టీ కప్పుల బిజినెస్ ప్రారంభించాడు. అమెరికా, కెనడాలకు ఎగుమతి చేసేందుకు పైటో శానిటరీ లైసెన్స్ కోసం ప్లాంట్ క్వారంటైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అథారిటీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్న స ంబంధిత అధికారులు అతుల్ ఠాక్రే, మనోజ్.. సమీర్‌కు రూ.15 వేలు చొప్పున లంచం డిమాండ్ చేశారు. దీంతో సమీర్ ఈ విషయాన్ని సీబీఐకి ఈనెల 10న ఫిర్యాదు చేశాడు.