మాస్కో: మాస్కో శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయగా వాటిని కూల్చేశామని తెలిపింది పుతిన్ సైన్యం. దీంతో అప్రమత్తమై నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపింది రష్యా రక్షణ శాఖ.
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో విరుచుకుపడింది. మాస్కో సరిహద్దుల్లోని బ్రియాన్‌స్క్ ప్రాంతంలో క్రాస్నోగోర్స్క్ పట్టణంలో నాలుగు డ్రోన్లు ప్రవేశించడంతో వాటిని రష్యా సైన్యం కూల్చివేసింది. గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడటంతో అప్రమత్తమై ముందు జాగ్రత్తగా వ్నుకోవో, షెరెమెట్యెవో, డొమోడెడెవో, జుకోవ్‌స్కీ ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలను నిలిపివేశారు రష్యా అధికారులు.
రష్యా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడులను ముమ్మరం చేసిందని గత ఆదివారం కూడా జరిగిన దాడుల్లో డ్రోన్లు రైల్వే స్టేషన్ పైకప్పు భాగంలోకి దూసుకుపోగా ఐదుగురు ప్రాణాలు కోలోయారని గుర్తు చేశారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది ఉండగా మరణించిన ఐదుగురిలో ఇద్దరు ఆసుపత్రికి తరలించడానికి నిరాకరించారని మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో మరణించారని తెలిపారు.
అంతకుముందు ఇదే కుర్స్క్ ప్రాంతానికి చెందిన వొల్ఫినోలో కూడా ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇటీవలి కాలంలో మరింత బలాన్ని వెనకేసుకున్న ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో కోల్పోయిన ఒక్కో ప్రాంతాన్ని మెల్లగా తిరిగి చేజిక్కించుకుంటోంది.
ఇది కూడా చదవండి: కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్
Comments
Please login to add a commentAdd a comment