లైసెన్సు జారీకి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎయిర్‌పోర్టు అధికారులు శుక్రవారం సీబీఐకి చిక్కారు.
ఇద్దరు ఎయిర్‌పోర్టు అధికారులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: లైసెన్సు జారీకి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎయిర్‌పోర్టు అధికారులు శుక్రవారం సీబీఐకి చిక్కారు. హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్‌కు చెందిన సమీర్.. ‘మై టీ’ పేరుతో టీ కప్పుల బిజినెస్ ప్రారంభించాడు. అమెరికా, కెనడాలకు ఎగుమతి చేసేందుకు పైటో శానిటరీ లైసెన్స్ కోసం ప్లాంట్ క్వారంటైన్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ అథారిటీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్న స ంబంధిత అధికారులు అతుల్ ఠాక్రే, మనోజ్.. సమీర్‌కు రూ.15 వేలు చొప్పున లంచం డిమాండ్ చేశారు. దీంతో సమీర్ ఈ విషయాన్ని సీబీఐకి ఈనెల 10న ఫిర్యాదు చేశాడు.