న్యూఢిల్లీ: పంజాబ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా.. పంజాబ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భఠిండా ఎయిర్‌పోర్ట్ అధికారులతో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ ఉదయం భఠిండా చేరుకున్నారు.
చదవండి: (ఆకస్మికంగా ప్రధాని మోదీ పర్యటన రద్దు..)
అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వేదిక వద్దకు వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మోదీ ప్రయాణిస్తోన్న కాన్వాయ్ మార్గంలో ఓ ఫ్లైఓవర్ వద్ద ఆందోళనకారులు రహదారిని బ్లాక్ చేశారు. దీంతో ప్రధాని కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే ఉన్న ప్రధాని.. తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోయారు.
చదవండి: (ప్రధాని పర్యటన రద్దు.. స్పందించిన పంజాబ్ ప్రభుత్వం)
Comments
Please login to add a commentAdd a comment