న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం నేపథ్యంలో పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్ అయ్యింది. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని ర్యాలీని అడ్డుకున్నారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ధ్వజమెత్తారు. పోలీసులు నిరసనకారులలతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ నిరాకరించారని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తంచేశారు.
స్పందించిన పంజాబ్ ప్రభుత్వం
ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింత ఘటనపై పంజాబ్ ప్రభుత్వం స్పందించింది. ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని.. 10వేలమంది పోలీసులతో పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేశామని సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు. హెలికాఫ్టర్ ద్వారా రావాల్సిన ప్రధాని మోదీ.. ముందస్తు సమాచారం లేకుండా రోడ్డుమార్గంలో వచ్చేశారని .. అదే సమస్యకు కారణమైందని పేర్కొన్నారు. రోడ్డును క్లియర్ చేయాలని నిరసనకారులను తాను స్వయంగా అభ్యర్థించినట్టు సీఎం చన్నీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment