
లక్నో: మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్‌కి వారణాసి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన భారత్‌కు వచ్చారు. ఆరుగురు ప్రతినిధులతో కలిసి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్ళడానికి పృథ్వీరాజ్ సింగ్ విమాశ్రయానికి వచ్చారు. అయితే అధ్యక్షుడి బృందం లగేజీ పరిమితికి మించి ఉండటంతో అదనపు ఛార్జీలు చెల్లించమని కోరుతూ విమానాశ్రయ సిబ్బంది వారిని ఆపారు. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా సిబ్బంది వీరిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: రాజధర్మంపై ఆగని రగడ
అయితే ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే కలగజేసుకున్న ఎయిర్ ఇండియా సిబ్బందికి తగిన సూచనలు చేయడంతో అనంతరం పృథ్వీరాజ్ బృందం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనను ఎయిర్‌పోర్టు డైరెక్టర్ అక్షదీప్ మాథుర్ ధ్రువీకరించారు. మారిషస్ అధ్యక్షుడిని అడ్డుకున్నారని తెలిసిన వెంటనే స్పందించి ఎయిరిండియా సిబ్బందితో మాట్లాడామన్నారు. భారత పర్యటనకు వచ్చిన ప్రముఖుల అదనపు లగేజీకి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఎయిరిండియా సిబ్బందికి విమానయానశాఖ సూచించినట్లు తెలుస్తోంది. చదవండి: సీఎం జగన్‌తో ముకేష్ అంబానీ భేటీ