Mauritius President
-
పరిమితికి మించి లగేజీ ఉందని..
వారణాసి: రూలంటే రూలే. దేశానికి అధ్యక్షుడైనా కట్టుబడి ఉండాల్సిందే. అదే అమలు చేయాలనుకున్నారు అధికారులు. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి వచ్చిన మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపున్ వెంట పరిమితికి మించి లగేజీ ఉండటంతో అందుకు గాను అదనంగా ఫీజు చెల్లించాలని ఎయిరిండియా అధికారులు అడ్డుకున్నారు. ఆరుగురు సభ్యుల అధికార బృందంతోపాటు రెండు రోజుల పర్యటనకు కాశీకి వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. వెంట పరిమితికి మించి లగేజీ ఉండటంతో లాల్‌బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఆకాశ్‌దీప్ మాథుర్, జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మ వరకు వెళ్లింది. విదేశీ గౌరవ ప్రతినిధి అయినందున ఆయనకు మినహాయింపు ఇవ్వాలని తెలపడంతో కథ సుఖాంతమయింది. సాధారణంగా ఎయిరిండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ప్రయాణికులు 23 కేజీల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అంతకుమించి ప్రతి కేజీకి రూ.500, అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. -
ఆ దేశాధ్యక్షుడినే అడ్డగించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది
లక్నో: మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్‌కి వారణాసి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన భారత్‌కు వచ్చారు. ఆరుగురు ప్రతినిధులతో కలిసి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్ళడానికి పృథ్వీరాజ్ సింగ్ విమాశ్రయానికి వచ్చారు. అయితే అధ్యక్షుడి బృందం లగేజీ పరిమితికి మించి ఉండటంతో అదనపు ఛార్జీలు చెల్లించమని కోరుతూ విమానాశ్రయ సిబ్బంది వారిని ఆపారు. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా సిబ్బంది వీరిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: రాజధర్మంపై ఆగని రగడ అయితే ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే కలగజేసుకున్న ఎయిర్ ఇండియా సిబ్బందికి తగిన సూచనలు చేయడంతో అనంతరం పృథ్వీరాజ్ బృందం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ ఘటనను ఎయిర్‌పోర్టు డైరెక్టర్ అక్షదీప్ మాథుర్ ధ్రువీకరించారు. మారిషస్ అధ్యక్షుడిని అడ్డుకున్నారని తెలిసిన వెంటనే స్పందించి ఎయిరిండియా సిబ్బందితో మాట్లాడామన్నారు. భారత పర్యటనకు వచ్చిన ప్రముఖుల అదనపు లగేజీకి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఎయిరిండియా సిబ్బందికి విమానయానశాఖ సూచించినట్లు తెలుస్తోంది. చదవండి: సీఎం జగన్‌తో ముకేష్ అంబానీ భేటీ -
షాపింగ్ ఇష్యూ: దేశ అధ్యక్షురాలు రాజీనామా
నైజీరియా : మారిషస్ అధ్యక్షురాలు అమీన గురిబ్ ఫకిమ్ వచ్చే వారంలో తన పదవి నుంచి దిగిపోతున్నారు. ఆ విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నౌత్ ప్రకటించారు. మార్చి 12న దేశ 50వ స్వాతంత్య్ర దినోత్సవం అయి పోయిన తర్వాత తమ దేశ అధ్యక్షురాలు రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. ఒక చారిటీ సంస్థ ఇచ్చిన క్రెడిట్ కార్డును దుర్వినియోగపరిచి, పెద్ద మొత్తంలో షాపింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అధ్యక్షురాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ క్రెడిట్ కార్డును వాడి పెద్ద మొత్తంలో వస్త్రాలను, జువెల్లరీని అధ్యక్షురాలు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ క్రెడిట్ కార్డు ఖర్చుపై ప్రధాని స్పందించలేదు. దేశ ప్రయోజనాలకే తాము తొలి ప్రాధాన్యమిస్తామని మాత్రం ప్రధాని తెలిపారు. కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయిన గురిబ్-ఫకీమ్, 2015లో అధ్యక్షురాలు పదవి అలంకరించారు. ఐల్యాండ్ దేశంలో తొలి మహిళా అధ్యక్షురాలు ఈమే. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం నగదును ఆమె వెనక్కి ఇచ్చేసినట్టు తెలిపారు. తాను ఎవరి దగ్గర్నుంచి ఎలాంటి మనీని తీసుకోలేదని, ఏడాది దాటిన తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎందుకు ఈ విషయాన్ని మళ్లీ తవ్వి తీస్తున్నారంటూ మండిపడ్డారు. అధ్యక్షురాలికి జారీచేసిన ఈ క్రెడిట్ కార్డు ఎన్జీవో ప్లానెట్ ఎర్త్ ఇన్స్టిట్యూట్ అందించింది. స్కాలర్షిప్లు అందిస్తూ ఈ ఆర్గనైజేషన్ విద్యావ్యాప్తికి కృషిచేస్తుంది. ఈ విషయంపై ఎన్జీవో ప్లానెట్ ఎర్త్ ఇన్స్టిట్యూట్ కూడా ఇంకా స్పందించలేదు. -
మారిషస్ దేశాధ్యక్షుడు రాజీనామా
పోర్ట్ లూయిస్ : మారిషస్ దేశాధ్యక్షుడు కైలాష్ పుర్యాగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను జాతీయ అసెంబ్లీ స్పీకర్‌కు పంపినట్లు శనివారం ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2012లో దేశాధ్యక్షుడిగా కైలాష్ పుర్యాగ్ బాధ్యతలు స్వీకారించారు. అయితే ఈ ఏడాది దేశాధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని కైలాష్ నిర్ణయించారు. మరో ఐదు నెలల పాటు పదవిలో కొనసాగాలని మారిషస్ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కైలాష్ శనివారం రాజీనామా చేశారు.