అధికారులపై రాజకీయ ఒత్తిడులు తేవద్దు: ఏపీ జేఏసీ | we want old pension scheme only, demands ap jac | Sakshi
Sakshi News home page

అధికారులపై రాజకీయ ఒత్తిడులు తేవద్దు: ఏపీ జేఏసీ

Published Fri, May 5 2017 12:28 PM | Last Updated on Thu, Mar 28 2019 5:34 PM

we want old pension scheme only, demands ap jac

కాకినాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగుల పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ తక్షణమే విడుదల చేయాలన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులకు నూతన పీఆర్సీ అమలు చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇక నుండి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ శాశ్వత ప్రాతిపదికన జరపాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల బదిలీల్లో అధికారుల మీద రాజకీయ ఒత్తిడులు తీసుకురావద్దని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement