'ఉద్యోగులను కలెక్టర్లు వేధిస్తున్నారు' | Bopparaju venkateswarlu speaks over collectors harassment on revenue employees | Sakshi
Sakshi News home page

'ఉద్యోగులను కలెక్టర్లు వేధిస్తున్నారు'

Published Wed, Feb 22 2017 6:25 PM | Last Updated on Mon, Feb 17 2020 5:16 PM

'ఉద్యోగులను కలెక్టర్లు వేధిస్తున్నారు' - Sakshi

'ఉద్యోగులను కలెక్టర్లు వేధిస్తున్నారు'

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రెవిన్యూ ఉద్యోగులను కలెక్టర్లు వేధిస్తున్నారని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు సమయపాలన లేదనడం సరికాదన్నారు.

రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా రెవిన్యూ ఉద్యోగులే పని చేస్తున్నారని చెప్పారు. ఆఖరికి కొత్త సినిమా రిలీజైనా తామే పని చేస్తున్నామన్నారు. దళారీ వ్యవస్థ వల్ల ఉద్యోగుల విధులకు ఆటంకం కలుగుతోందన్నారు. ఎవరో తప్పు చేశారని అందరిని నిందించడం సరికాదని వెంకటేశ్వర్లు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement