పన్ను ఎవరు కట్టాలి? | Sakshi
Sakshi News home page

పన్ను ఎవరు కట్టాలి?

Published Sat, Apr 6 2024 5:09 AM

Landowner has to pay GST on a joint development agreement - Sakshi

ల్యాండ్‌ ఓనర్, బిల్డర్ల మధ్య సందిగ్ధం
చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే
కొత్తవైనా, రీ–డెవలప్‌మెంట్‌ అయినా 5 శాతం జీఎస్టీ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో గృహాలకు డిమాండ్‌ పెరుగుతుంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూలి్చవేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు.

ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్‌నగర్, ఈఎస్‌ఐ, బంజారాహిల్స్‌ వంటి ప్రాంతాలలో ఇలాంటి రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్‌ హౌస్‌లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్‌మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్‌ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూ యజమానులు, ఫ్లాట్‌ ఓనర్లతో బిల్డర్లు డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూ యజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్‌ అమ్ముకుంటాడు.
     
కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్‌ ఓనర్లకు, బిల్డర్లు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపరే చెల్లించాలని భూ యజమాని, ల్యాండ్‌ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది. భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్‌కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే. కాకపోతే భూ యజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్‌ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే.

Advertisement
Advertisement