Land owners
-
పన్ను ఎవరు కట్టాలి?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూలి్చవేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు. ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్‌నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో ఇలాంటి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూ యజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూ యజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు. కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిల్డర్లు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపరే చెల్లించాలని భూ యజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది. భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్‌కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే. కాకపోతే భూ యజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. -
ప్రపంచంలో బడా భూస్వామి ఎవరు?
ఆ ప్రముఖునికి ప్రపంచంలో అత్యధిక భూములున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, అడవులు, పట్టణ ప్రాంతాల్లో పలు భూములు, ఇళ్లు, విలాసవంతమైన మార్కెటింగ్ సముదాయాలు అతని సొంతం. సముద్ర తీరప్రాంతాలలో కూడా అతనికి ఆస్తులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతనికున్న భూములు, ఆస్తులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక కంపెనీనే ఉంది. ఈ అపార ఆస్తిపాస్తులు బ్రిటన్ రాజకుటుంబానికి సొంతం. వీటికి యజమాని బ్రిటన్ రాజు చార్లెస్- III. అతని తల్లి క్వీన్ ఎలిజబెత్- II మరణం తరువాత కింగ్ చార్లెస్ ప్రపంచంలోనే భారీ ఆస్తిపాస్తులకు యజమానిగా మారారు. ఇతను బతికి ఉన్నంత వరకూ ఈ ఆస్తిని అతని సొంత ఆస్తిగా పరిగణిస్తారు. దీనికి అతను ప్రైవేట్ యజమాని కాదు. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రిన్స్ చార్లెస్ ప్రపంచవ్యాప్తంగా 6.6 బిలియన్ ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ భూములు గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలలోనూ ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం సంపదలో 16.6 శాతం ఈ బ్రిటిష్ రాజుకు చెందినదేని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ది క్రౌన్ ఎస్టేట్ అనే సంస్థ ఈ ఆస్తిపాస్తులను పర్యవేక్షిస్తుంది. ఈ బ్రిటీష్ రాజుకు ఒక లక్షా 15 వేల ఎకరాల వ్యవసాయ, అటవీ భూములున్నాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల విలువైన భూములు, ఆస్తులు, బీచ్‌లు, మార్కెట్లు, నివాస స్థలాలు, కార్యాలయ సముదాయాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో క్రౌన్ ఎస్టేట్ వివిధ షాపింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ రాజుకు ఇసుక, కంకర, సున్నపురాయి, గ్రానైట్, ఇటుక, మట్టి, బొగ్గు, స్లేట్ తదితర వ్యాపారాలు కూడా ఉన్నాయి. 2022 సెప్టెంబరులో కింగ్ చార్లెస్- III సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతను $46 బిలియన్ల సామ్రాజ్యానికి అధిపతి. (ఒక బిలియన్ అంటే రూ. 100 కోట్లు) ఇందులో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్‌లో ఉంది. ఈ ఆస్తులను క్రౌన్ ఎస్టేట్ సంస్థ పర్యవేక్షిస్తుంది. కింగ్ చార్లెస్- III తరువాత అత్యధిక భూముల కలిగిన వ్యక్తిగా సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా నిలిచారు. ఇతనికి ఎనిమిది లక్షల 30 వేల చదరపు మైళ్ల భూభాగం ఉంది. ఈ జాబితాలో తరువాతి పేరు సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా. ఇతనికి వ్యక్తిగతంగా ఎనిమిది లక్షల 30 వేల చదరపు మైళ్ల భూభాగం ఉంది. ఇది కూడా చదవండి: చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు! -
అధికారులకు షాక్: సబ్‌స్టేషన్ అమ్ముతా.. కొంటారా ?
సాక్షి, నేలకొండపల్లి: విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఒకరు స్థలం దానంగా ఇవ్వగా, నేతలు, అధికారులు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేరకపోవడంతో ఆ దాత వినూత్నంగా నిరసనకు దిగాడు. దీంతో, అతడి నిరసన.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామానికి 2014లో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైంది. గ్రామానికి చెందిన రైతు ఆకుల నరసింహారావు 12 గుంటల భూమి ఇచ్చాడు. అప్పుడు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా ఉద్యోగం ఇస్తామని చెప్పినా, హామీ నెరవేరకున్నా పైసా జీతం లేకుండా పనిచేశాడు. గతంలో పలుమార్లు నిరసన తెలిపినా, ఆత్మహత్యయత్నానికి పాల్పడినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో, విసుగు చెందాడు ఈ క్రమంలో బుధవారం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన నరసింహారావు.. సబ్‌స్టేషన్ అమ్ముతున్నందున కావాల్సిన వారు తనను సంప్రదించాలని కోరాడు. ఈ విషయమై ఆయనతో మాట్లాడగా ఉద్యోగమైనా ఇవ్వాలని, లేకపోతే ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై అధికారులు ఇంకా స్పందించలేదు. ఇది కూడా చదవండి: రీసేల్.. రివర్స్ -
భూ హక్కుకు.. శ్రీరామరక్ష!
సాక్షి, అమరావతి: భూముల హక్కుదారుల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులేస్తోంది. భూమిపై కచ్చితమైన యాజమాన్య హక్కులను నిర్థారించేందుకు సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ధ్రువీకరించిన భూ యాజమాన్య హక్కుల(కన్ఫర్మ్డ్ టైటిల్ విధానం) వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భూ హక్కు యాజమాన్య చట్టంలో కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కీలక మార్పులు చేసింది. కొత్తగా రూపొందించిన భూ హక్కు యాజమాన్య చట్టానికి శాసనసభ ఆమోదం తెలిపింది. వివాదాల పరిష్కారానికి సరికొత్త మార్గం పలు వివాదాలతో ప్రస్తుతం భూముల యాజమాన్యం అత్యంత సంక్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. వివాదాలు లేకుండా ఉన్న కచ్చితమైన భూ హక్కుదారుల వివరాలు తెలుసుకోవడం క్లిష్టంగా మారింది. కన్ఫర్మ్డ్ టైటిల్ విధానంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) సాయిప్రసాద్ చెప్పారు. దేశంలో భూమిపై హక్కుల్ని నిర్థారించే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంది. ఒక వ్యక్తి అంతా సక్రమంగా ఉందని భావించి భూమి కొనుగోలు చేశాక, దానిపై తనకూ హక్కు ఉందని ఎవరైనా కోర్టుకు వెళితే అది వివాదంలో కూరుకుపోతోంది. అన్ని ఆధారాలు పరిశీలించి సివిల్ కోర్టు చేసిన నిర్థారణే ఇలాంటి కేసుల్లో అంతిమం. ఆ భూమిపై పలానా వ్యక్తికి మాత్రమే హక్కు ఉందని కచ్చితంగా చెప్పే వ్యవస్థ రెవెన్యూ శాఖలో లేదు. రెవెన్యూ రికార్డులు, ఆస్తుల్ని రిజిస్టర్ చేసే విధానం కూడా ఇలాంటి వివాదాలకు పరష్కారాలు సూచించేలా లేదు. వీటన్నింటికీ కన్ఫర్మ్డ్ టైటిల్ విధానం పరిష్కారం చూపనుంది. భూ యాజమాన్య హక్కుల రిజిస్టర్లు భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో ప్రతి గ్రామంలో ధ్రువీకరించిన భూ యాజమాన్య హక్కుల రిజిస్టర్లు తయారవుతాయి. ఆ రిజిస్టర్లలో ఆ గ్రామానికి చెందిన పక్కా యాజమాన్య హక్కులున్న భూముల వివరాలుంటాయి. ఎవరైనా ఆ భూములపై వివాదాలు సృష్టించేందుకు కోర్టుకెళ్లినా.. ఈ రిజిస్టర్ల ఆధారంగా కోర్టు వాటిని కొట్టేస్తోంది. దీనివల్ల భూ యజమానులకు భద్రత ఏర్పడుతుంది. ఇందుకోసమే అనేక మార్పులతో కొత్త భూ హక్కు యాజమాన్య చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న స్థిరాస్తుల రికార్డులను తయారు చేసి వాటిని పక్కాగా నిర్వహిస్తారు. ఈ హక్కుల రికార్డుల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేందుకు వీలవుతుంది. భూములకు సంబంధించిన డిజిటల్ రికార్డులు తయారవుతాయి. ఈ రికార్డుల నిర్వహణ బాధ్యతలు చూసేందుకు కొత్తగా రాష్ట్ర స్థాయిలో భూ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నారు. దీని చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ సంస్థ భూమి హక్కుల రియల్ టైమ్ డేటాను తయారు చేసి వాటిని నిర్వహిస్తుంది. హామీతో కూడిన హక్కుల యాజమాన్య విధానం అమల్లోకొస్తుంది. -
గ్రామకంఠం భూములకు యాజమాన్య హక్కు పత్రాలు
సాక్షి, అమరావతి: గ్రామకంఠం భూములకు యాజమాన్యహక్కు పత్రాలు జారీచేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. రీసర్వే తర్వాత గ్రామకంఠం భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తేలాక గ్రామకంఠం భూహక్కు రిజిస్టర్, వ్యక్తిగత గ్రామకంఠం భూహక్కు రిజిస్టర్ తయారు చేసి వాటి ప్రకారం భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ రికార్డ్ ఆఫ్ రైట్స్ (గ్రామకంఠం భూముల యాజమాన్యహక్కు పత్రాలు)రూల్స్–2022 పేరుతో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సోమవారం తుది నోటిఫికేషన్ జారీచేశారు. గతేడాది జూన్‌లో దీనికి సంబంధించి 1971 ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. తాజా నోటిఫికేషన్ ద్వారా దాని అమలుకు విధివిధానాలు జారీచేసింది. వీటి ప్రకారం రీసర్వే తర్వాత గ్రామాల్లోని గ్రామకంఠం భూములకు తహశీల్దార్లు భూయాజమాన్యహక్కు పత్రాలు జారీచేస్తారు. ఇప్పటివరకు అనుభవ హక్కే.. ఇప్పటివరకు గ్రామకంఠం భూములున్న వారికి వాటిని అనుభవించడం తప్ప వాటిపై హక్కు లేదు. తాతలు, తండ్రుల నుంచి వచ్చినా హక్కు పత్రాలు లేకపోవడం వల్ల వారికి వాటిపై ఎలాంటి రుణాలు వచ్చేవి కావు. అమ్ముకునేందుకు హక్కు ఉండేది కాదు. 2006లో వాటిని ప్రైవేటు భూములుగా పరిగణించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా వాటిని నిషేధిత భూముల జాబితాలోనే కొనసాగించారు. తాజాగా ఇటీవలే గ్రామకంఠాలను ప్రైవేటు భూములని స్పష్టం చేసి నిషేధిత భూముల జాబితా నుంచి పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రస్తుతం భూముల రీసర్వే జరుగుతుండడంతో గ్రామకంఠంలోని భూములను కొలుస్తున్నారు. సర్వే తర్వాత ఆ భూముల్లో ఎవరు ఉన్నారో నిర్థారించి వారికి భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వనున్నారు. అప్పటి నుంచి వాటిపై రుణాలు తెచ్చుకోవడంతోపాటు వారికి అమ్ముకునేందుకు, ఇతర హక్కులు వస్తాయి. రికార్డింగ్ అథారిటీ.. భూ యాజమాన్యహక్కు పత్రాలు ఎలా ఇవ్వాలి, విచారణ ఎలా చేయాలి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎన్నాళ్లకు గ్రామసభ పెట్టాలనే అంశాలపై నోటిఫికేషన్లో మార్గదర్శకాలు ఇచ్చారు. రీసర్వేలో గ్రామకంఠం ముసాయిదా భూహక్కు రిజిస్టర్‌ను తయారు చేస్తారు. దాని ఆధారంగా ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) తయారవుతుంది. ఆ తర్వాత గ్రామంలో అందరికీ నోటీసులిచ్చి గ్రామసభ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఆయా గ్రామాలకు రికార్డింగ్ అథారిటీని నియమిస్తారు. ఆ అధికారి గ్రామకంఠం స్థలాలపై గ్రామసభలో విచారణ చేసి అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తారు. వాటి ప్రకారం రికార్డు తయారు చేసి ఇస్తారు. వాటి ఆధారంగా తహశీల్దార్ ఆయా గ్రామాల్లో మళ్లీ గ్రామసభలు పెట్టి భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇస్తారు. వీటికోసం కార్యాలయాల చుట్టూ తిరక్కుండా మీ సేవ కేంద్రాల ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. గ్రామకంఠం భూములకు భూ యాజమాన్యహక్కు పత్రాలు ఇవ్వడం చరిత్రలో ఇదే ప్రథమం. దీనివల్ల అనేక భూ సమస్యలు పరిష్కారమవుతాయి. -
ఇక రిజిస్ట్రేషన్ల శాఖలో లొసుగులకు చెక్
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖలో ఇప్పటిదాకా ఉన్న చిన్న చిన్న లొసుగులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ లొసుగులను ఉపయోగించుకుని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా జరుగుతున్న పలు రకాల రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇటీవల పలు సవరణలు తెచ్చింది. డెవలప్మెంట్ అగ్రిమెంట్లలో భాగంగా బిల్డర్లు, భూ యజమానుల మధ్య జరిగే రిజిస్ట్రేషన్లలో అనేక లోపాలు ఉన్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ గుర్తించింది. ఈ తరహా రిజిస్ట్రేషన్లకు మొన్నటివరకు స్టాంప్ డ్యూటీ ఒక శాతం ఉండేది. తాజాగా చేసిన సవరణల ప్రకారం.. ఒప్పందంలో ఉన్నట్లు ఉమ్మడిగా వారి పేర్లపైనే ఉంచుకుంటే దానికి ఒక శాతమే కట్టించుకుంటారు. అలా కాకుండా విడివిడిగా పంచుకుంటే మాత్రం 4 శాతం స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. విక్రయ, జీపీఏ కింద జరిగే రిజిస్ట్రేషన్లపై స్టాంప్ డ్యూటీని కూడా సవరించారు. వీటిని ఆధారంగా చేసుకుని భూయజమానులు లేకుండానే ఆయన తరఫున మరో వ్యక్తి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుంటున్నారు. దీనికి 5 శాతం స్టాంప్ డ్యూటీ కడుతున్నారు. ప్రస్తుత విధానంలో అటార్నీ తీసుకున్న వ్యక్తి ఆ ఆస్తిని కొనుగోలు చేసి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, వేరే వారికి అమ్మినా స్టాంప్ డ్యూటీలో 4 శాతం తగ్గింపు ఉంటుంది. కానీ కొత్త విధానంలో అటార్నీ తీసుకున్న వ్యక్తి వేరే వారికి ఆ ఆస్తిని అమ్మితే 4 శాతం మినహాయింపు ఉండదని రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసింది. వారసత్వంగా వచ్చిన ఆస్తులను కుటుంబ సభ్యులు పంచుకుని చేయించుకునే రిజిస్ట్రేషన్లపై కూడా స్టాంప్ డ్యూటీని సవరించారు. గతంలో సంబంధిత ఆస్తిలో పెద్ద వాటా ఎవరికి వస్తుందో వారికి స్టాంప్ డ్యూటీ మినహాయించేవారు. మిగిలిన వాటాలపై ఒక శాతం స్టాంప్ డ్యూటీ కట్టించుకునేవారు. కానీ నూతన విధానంలో పెద్ద వాటాకు మినహాయింపు ఇచ్చి.. మిగిలిన వాటాలపై ఒక శాతంతోపాటు అదనంగా వచ్చిన వాటాపై మూడు శాతం డ్యూటీ విధిస్తున్నారు. ఈ మార్పులు చేయకముందు ప్రభుత్వానికి లెక్క ప్రకారం రావాల్సిన స్టాంప్ డ్యూటీ వచ్చేది కాదు. ఇలాంటి అంశాలను పునఃపరిశీలించి రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్తగా మార్గదర్శకాలు ఇచ్చారు. -
చురుగ్గా భూ సర్వే
సాక్షి, అమరావతి: రెండో దశ సమగ్ర భూ రీ సర్వే (వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు) పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 650 గ్రామాల్లో వచ్చే జనవరికల్లా రీ సర్వేను పూర్తి చేసే లక్ష్యంతో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల శాఖాధికారులు పనిచేస్తున్నారు. 646 గ్రామాల డ్రోన్ చిత్రాలు ఇప్పటికే అధికారులకు అందాయి. వాటి ద్వారా సర్వే కొనసాగిస్తున్నారు. 92 గ్రామాల్లో ఇప్పటికే రీ సర్వే చివరి దశకు చేరుకొంది. వీటికి కొత్త సరిహద్దులు నిర్ణయిస్తూ ఇచ్చే 13 నోటిఫికేషన్లు త్వరలో జారీ చేయనున్నారు. ఈ గ్రామాల తుది భూ రికార్డులను తయారు చేస్తున్నారు. 44 గ్రామాల్లో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 140 గ్రామాల్లో భూముల పట్టాదార్ పాస్ పుస్తకాలు, వెబ్‌ల్యాండ్ అడంగల్ తదితరాల పరిశీలన జరుగుతోంది. 439 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్ర స్థాయి నిజనిర్థారణ) జరుగుతోంది. డ్రోన్ చిత్రాల ఆధారంగా కొత్తగా తయారు చేసిన సరిహద్దులతో ఆ సర్వే నెంబర్ల భూమిని భూ యజమానుల సమక్షంలో కొలతలు వేస్తారు. గ్రామాల్లోని సచివాలయ సర్వేయర్లతో ఈ పని చేయిస్తున్నారు. మరో నాలుగు గ్రామాల డ్రోన్ చిత్రాలు త్వరలో అందనున్నాయి. ఇవికాకుండా 5,500 గ్రామాల్లో అడంగల్, ఆర్ఎస్ఆర్తో సరిదిద్దడం, భూయజమానుల రికార్డులతో సరిపోల్చడం వంటి పనులు జరుగుతున్నాయి. -
వాస్తవ సాగుదారులకే పంటరుణాలు
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమిస్తూ వ్యవసాయం చేసేవారికి.. వాస్తవ సాగుదారులకు మాత్రమే పంటరుణాలు అందనున్నాయి. సాగు చేస్తున్న భూ యజమానులతో సహా ప్రతి రైతు వివరాలను ప్రభుత్వం ఈ–క్రాప్‌లో నమోదు చేస్తోంది. దీని ఆధారంగా పంటరుణాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ).. ఇక ఈ–క్రాప్ డేటా ఆధారంగానే పంటరుణాలు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ సీజన్లో 90 లక్షల ఎకరాలు, రబీలో 60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద ఎత్తున భూములు కలిగిన రైతుల సంఖ్య 70 లక్షలకుపైగా ఉంటే.. వాస్తవ సాగుదారుల సంఖ్య మాత్రం 45 లక్షల నుంచి 50 లక్షలే. 60 నుంచి 70 శాతం సాగుభూములు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి. వీరిసంఖ్య 20 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ఉభయ గోదావరి, కోస్తా జిల్లాల్లో సాగుచేస్తున్న వారిలో భూ యజమానులకన్నా కౌలుదారులే ఎక్కువ. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కుదవపెట్టి పొందిన పంటరుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఆ వడ్డీలో కేంద్రం 3 శాతం రాయితీ ఇస్తుంది. సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులు సైతం వ్యవసాయం పేరిట పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని కేంద్రం ఇచ్చే రాయితీని వినియోగించుకుంటూ లబ్ధిపొందుతున్నారు. వారు ఏటా రెన్యువల్ చేయించుకోవడం లేదా కొత్త రుణాలు పొందడం పరిపాటిగా మారింది. బ్యాంకులకు నిర్దేశించిన రుణలక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకు ఈ రెన్యువల్స్ ఉంటున్నాయి. రుణాలు దక్కని వాస్తవ సాగుదారులు పంటరుణాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు. పంటల బీమాతోసహా ఇతర రాయితీలు వారికి దక్కేవికాదు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఈ–క్రాప్ ప్రామాణికంగా వాస్తవ సాగుదారులకు మాత్రమే సంక్షేమ ఫలాలు, రాయితీలు దక్కేలా గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీతో అండ చిన్న, సన్నకారు రైతులపై ఆర్థికభారాన్ని తగ్గించే లక్ష్యంతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాల పథకం కింద రూ.లక్ష లోపు పంటరుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. ఈ విధంగా ఖరీఫ్–2020 సీజన్‌కు సంబంధించి ఎన్ఐసీ రూపొందించిన పోర్టల్‌లో బ్యాంకర్స్ అప్లోడ్ చేసిన జాబితా ప్రకారం 11.03 లక్షలమంది రైతులకు రూ.6,389.27 కోట్ల మేర రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరయ్యాయి. వారికి 4 శాతం చొప్పున రు.232.35 కోట్ల వడ్డీ రాయితీ చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. ఈ జాబితాను ఈ–క్రాప్‌లో ఆధార్ నంబర్‌తో సరిపోల్చి చూడగా 6.67 లక్షల మంది మాత్రమే వాస్తవ సాగుదారులని తేలింది. సాగుచేసిన విస్తీర్ణం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పొందిన రుణాన్ని బట్టి చూస్తే వారికి చెల్లించాల్సిన వడ్డీ రాయితీ రూ.112.71 కోట్లు. ఈ మొత్తాన్ని రెండురోజుల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ఖాతాల్లో జమచేశారు. ప్రభుత్వ ఒత్తిడికి దిగొచ్చిన బ్యాంకర్స్ కమిటీ రుణాల మంజూరు, వడ్డీ రాయితీ చెల్లింపుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి రైతులతోపాటు కౌలుహక్కు ధ్రువీకరణపత్రం (సీసీఆర్సీ) పొందిన కౌలుదారులు, జేఎల్‌జీ గ్రూపులకు ఈ–క్రాప్ ఆధారంగానే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటరుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం బ్యాంకర్ల కమిటీని కోరింది. రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరు చేసి సకాలంలో చెల్లించినవారి వివరాలను మాత్రమే ఇకనుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాల (ఎస్వీపీఆర్) పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించింది. ప్రభుత్వ ఒత్తిడి ఫలితంగా ప్రస్తుత రబీ సీజన్ నుంచి ఈ–క్రాప్ ఆధారంగా లక్ష్యం మేరకు పంటరుణాల మంజూరు, పాత రుణాల నవీకరణ చేసేందుకు బ్యాంకర్ల కమిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ–క్రాప్ ఆధారంగా రుణాలిస్తాం ఈ–క్రాప్ ఆధారంగా వాస్తవ సాగుదారులకు రుణాలివ్వడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. మావద్ద రుణాలు పొందిన భూ యజమానుల వివరాలు మాత్రమే ఉంటాయి. ముందుగా మా వద్ద ఉన్న లోన్‌చార్జి రిజిస్టర్, ఈ–కర్షక్, ఈ–క్రాప్ పోర్టల్స్‌ను అనుసంధానించాలి. ఇందుకు ప్రభుత్వ సహకారం అవసరం. సాధ్యమైనంత త్వరగా ఈ పోర్టల్స్‌ను అనుసంధానించిన తర్వాత ఈ–క్రాప్ ఆధారంగా పంటరుణాల మంజూరుకు శ్రీకారం చుడతాం. – వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ ఆర్బీకేల్లో రుణాలు పొందినవారి జాబితాలు ఈ–క్రాప్ ఆధారంగా రుణాలు మంజూరు చే సేందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అంగీకరించింది. సోషల్ ఆడిట్లో భాగంగా అర్హత ఉండి రుణాలు రానివారి వివరాలు ప్రదర్శిస్తాం. సాగుదార్లతో జేఎల్‌జీ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. సీసీఆర్సీ కార్డులు జారీచేస్తున్నాం. రుణార్హత ఉన్న కౌలుదారుల జాబితాను కూడా లోన్చార్జ్ రిజిస్టర్కి అనుసంధానం చేస్తాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
కౌలు రైతులకు చకచకా కార్డులు
సాక్షి, అమరావతి: కౌలు రైతులు, వాస్తవ సాగుదార్లకు పంట సాగుహక్కుల కార్డు (సీసీఆర్సీ) అందచేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ చేపట్టిన ప్రత్యేక ప్రచారోద్యమానికి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. జూలై 20న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈనెల 7న ముగియనుంది. కౌలు రైతులు ప్రైవేట్ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకోవాలన్నది ఈ కార్డుల ఉద్దేశమని సీఎం వైఎస్ జగన్ పలు సందర్భాలలో స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కేవలం 11 నెలల కాలానికి ఇచ్చే ఈ కార్డులతో కౌలు రైతులు ప్రభుత్వం అందించే రాయితీ పథకాలు, వ్యవస్థాగత పరపతి పొందుతారు. ఏపీ పంట సాగుదారుల చట్టం–2019 ప్రకారం ఈ కార్డులు జారీ చేస్తారు. 11 నెలలు మాత్రమే చెల్లుబాటు.. ► పంట సాగుదారు కార్డుపై భూ యజమాని లేదా ప్రతినిధి, సాగుదారు, గ్రామపరిపాలనాధికారి (వీఆర్వో) సంతకాలు ఉంటాయి. ► 11 నెలల తరువాత సాగుదారు మళ్లీ కొత్తకార్డు పొందాల్సిందే. ► కార్డు పొందిన వారికి భూమిపై ఎటువంటి హక్కులు ఉండవు. ► ఈ కార్డుపై పంట రుణం తీసుకుంటే పూర్తిగా చెల్లించాల్సిన బాధ్యత సాగుదారుదే. ఒకవేళ రుణం కట్టకుంటే ఆ బాధ్యత భూ యజమానిపై ఉండదు. రుణం ఇచ్చిన బ్యాంకు భూ యజమానికి ఇబ్బంది కలిగించకుండా ప్రభుత్వం తగిన ఏర్పాటు చేసింది ► సాగుదారుడు భూమికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ► భూ యజమాని కుటుంబ సభ్యుల పేర్లతో సాగుదారు కార్డులు ఇవ్వరు. ► దేవదాయ భూములను సాగు చేస్తున్న వారు కూడా కార్డు పొందవచ్చు. ► దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో సాగుదారు కార్డు లభిస్తుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎమ్మార్వో కార్యాలయం దృష్టికి తేవాలి. ► ప్రస్తుత ఖరీఫ్‌లో సీసీఆర్సీ కార్డుదారులందరికీ నూటికి నూరు శాతం పంట రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తోంది. ► రైతు భరోసా కేంద్రాలలో వాస్తవ సాగుదారులు, భూ యజమానులను సమావేశపరచి కార్డుల జారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు భూ యజమానులు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. -
జమ్మూకశ్మీర్‌లో కొత్త నిబంధనలు!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో స్థిర నివాసానికి సంబంధించి కొన్ని నిబంధనలు మార్చే ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు, భూ యాజమాన్య హక్కులు, వృత్తి విద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి అక్కడ 15 ఏళ్ల స్థిర నివాసం ఉండాలన్న నిబంధనను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత బయటివారు తమ ఉద్యోగాలు, భూములు, విద్యాసంస్థల్లో సీట్లు కొల్లగొడతారని స్థానికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. -
ఐదేళ్ల బుడత.. భూ యజమాని
కోస్గి: ఐదేళ్ల బుడతడు భూ యజమానిగా మారి స్వయంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టదారు పాసు పుస్తకం అందుకున్నాడు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం లోదిపూర్‌కు చెందిన మోహన్‌రెడ్డి, లక్ష్మి దంపతులు చనిపోవడంతో వారిపేరు మీద ఉన్న 9 కుంటల భూమిని ఐదేళ్ల వారి కుమారుడు చరణ్ పేరున విరాసత్ చేశారు. ఈ మేరకు చరణ్ పేరుపై కొత్త పాసుబుక్కు రావడంతో నాయనమ్మ, తాతయ్యలతో వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి చేతుల మీదుగా పట్టదారు పాసు బుక్కు అందుకున్నాడు. ఐదేళ్లకే పట్టదారు అయ్యాడంటూ సభకు వచ్చిన వారు బాబును అభినందించారు. -
భూయజమానిపై కౌలు రైతులు దాడి
-
భూ యజమానుల కొమ్ముకాస్తున్న సర్కారు
► కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి ► పండించేవారికే రుణాలు మంజూరు చేయాలి ► ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ నేత రంగారావు విజయవాడ(భవానీపురం): పంటలు పండించే కౌలు రైతులను విస్మరించి భూ యజమానులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రంగారావు విమర్శించారు. 2011 కౌలుదారుల చట్టం ప్రకారం కౌలుగుర్తింపు కార్డులు, పంట రుణాలు, ఇన్పుట్స్, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం, రుణమాఫీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, దేవాలయ కౌలురైతుల కౌలురద్దు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం చలో విజయవాడ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, సాగుభూమిలో 70 శాతం భూమిని కౌలురైతులే సాగుచేస్తున్నారని తెలిపారు. ఎన్నికలముందు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలిచ్చి, రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని వాగ్దానం చేసిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. గతేడాడా ది పంటరుణాల కోసం కేటాయించిన రూ.59వేల కోట్లలో, రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ రికార్డుల ప్రకారం కౌలురైతులకు ఇచ్చింది కేవలం రూ.218 కోట్లేనని పేర్కొన్నారు. గుర్తింపు కార్డులు 16.5 లక్షల మందికి ఇవ్వాలన్నది లక్ష్యంకాగా కేవలం 4లక్షల మంది కి మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. ఇందులో 95వేల మందికి పంట రుణాలిచ్చారని, మిగిలిన రుణాలన్నీ భూస్వాములకు, భూయజమానులకు ఇచ్చారని చెప్పారు. రుణమాఫీలో 2.50లక్షల మంది కౌలు రైతులకు సంబంధించి రూ.570 కోట్లలో సగం మాత్రమే రద్దు చేశారని తెలిపారు. దీంతో కౌలు రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని సాగుచేస్తున్నారని చెప్పారు. నష్టపరిహారంపై చిత్తశుద్ధి లేదు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కరువు వల్ల పెట్టుబడులు పెట్టిన కౌలురైతులు నష్టపోయారన్నారు. పత్తి ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గిందని చెప్పారు. పత్తికి కనీస మద్దతు ధర దక్కలేదన్నారు. మిర్చి, మినుము పంటలకు తెగుళ్లు సోకి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మార్కెట్లో ధరలు లేక కౌలు రైతులు తీవ్రనష్టాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. సభ అనంతరం ర్యాలీగా బయలుదేరి అలంకార్ సెంటర్‌కు చేరుకున్నారు. వినతి పత్రం స్వీకరించిన డీడీఏ అలంకార్ సెంటర్‌కు చేరుకున్న కౌలు రైతుల నుంచి వ్యవసాయ శాఖ డెప్యూటీ డెరైక్టర్ బాలూనాయక్ వినతి పత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా డీడీఏ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు తాను వచ్చానని, మీ సమస్యలను తమ శాఖ డెరైక్టర్ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ఆయన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తారని చెప్పారు.