
కోస్గి: ఐదేళ్ల బుడతడు భూ యజమానిగా మారి స్వయంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టదారు పాసు పుస్తకం అందుకున్నాడు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం లోదిపూర్‌కు చెందిన మోహన్‌రెడ్డి, లక్ష్మి దంపతులు చనిపోవడంతో వారిపేరు మీద ఉన్న 9 కుంటల భూమిని ఐదేళ్ల వారి కుమారుడు చరణ్ పేరున విరాసత్ చేశారు.
ఈ మేరకు చరణ్ పేరుపై కొత్త పాసుబుక్కు రావడంతో నాయనమ్మ, తాతయ్యలతో వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి చేతుల మీదుగా పట్టదారు పాసు బుక్కు అందుకున్నాడు. ఐదేళ్లకే పట్టదారు అయ్యాడంటూ సభకు వచ్చిన వారు బాబును అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment