narayana peta
-
నారాయణపేట జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
-
5 నెలల పసికందును బావిలో పడేసిన తల్లి
-
ప్రభుత్వ భుములను కొట్టేసిన రెవెన్యూ సింబ్బంది
-
ఐదేళ్ల బుడత.. భూ యజమాని
కోస్గి: ఐదేళ్ల బుడతడు భూ యజమానిగా మారి స్వయంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టదారు పాసు పుస్తకం అందుకున్నాడు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం లోదిపూర్‌కు చెందిన మోహన్‌రెడ్డి, లక్ష్మి దంపతులు చనిపోవడంతో వారిపేరు మీద ఉన్న 9 కుంటల భూమిని ఐదేళ్ల వారి కుమారుడు చరణ్ పేరున విరాసత్ చేశారు. ఈ మేరకు చరణ్ పేరుపై కొత్త పాసుబుక్కు రావడంతో నాయనమ్మ, తాతయ్యలతో వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి చేతుల మీదుగా పట్టదారు పాసు బుక్కు అందుకున్నాడు. ఐదేళ్లకే పట్టదారు అయ్యాడంటూ సభకు వచ్చిన వారు బాబును అభినందించారు. -
ఆకాంక్షకు ఆమోదం!
‘పేట’ వాసులకు కేసీఆర్ జన్మదిన కానుక నారాయణపేట కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఉద్యమం ఫలం.. కలిసొచ్చిన ఎస్.ఆర్.రెడ్డి గెలుపు నేటి నుంచి మనుగడలోకి జిల్లా ఉదయం 6.45 గంటలకు ముహూర్తంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ సమయానికి జాతీయ జెండా ఆవిష్కరణ.. ఆ వెంటనే కలెక్టరేట్ ప్రారంభం హాజరుకానున్న ప్రజాప్రతినిధులు, అధికారులు నారాయణపేట : వలస జీవుల కేంద్రం.. వెనకబడిన ప్రాంతం... కరువుతో అల్లాడే రైతాంగం... ఇలా ఏ అంశంలో చూసుకున్నా నారాయణపేట ప్రాంతానికి వెనుకబాటు తనమే. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా.. అధికారుల పాలన చేరువ కావాలన్నా జిల్లాగా ఏర్పాటు చేయడమే మార్గమని ప్రజలందరూ ఆకాంక్షించారు.. కానీ 2016 సెప్టెంబర్‌లో చేపట్టిన జిల్లాల పునర్విభజన సందర్భంగా వారికి నిరాశే ఎదురైంది. అప్పట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలుగా విభజించగా.. నారాయణపేట వాసులకు చుక్కెదురైంది. దీంతో సకల జనులు రోడ్లపైకి వచ్చి ఉద్యమించారు.. బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలో తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారు.. ఓ దశలో ‘పేట’ ఎమ్మెల్యే ఏకంగా తన పదవిని త్యజించేందుకు సిద్ధమయ్యారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం మంత్రు లు, ఎమ్మెల్యేలను దూతలుగా పంపించింది.. ఇప్పట్లో జిల్లా ఏర్పాటు సాధ్యం కాకున్నా మరోసారి విభజన అంటూ జరిగితే జాబితాలో తొలి పేరు నారాయణపేటే ఉంటుందని భరోసా ఇవ్వడంతో ప్రజలు ఆందోళనలు విరమించారు.. అలా రెండేళ్లు గడిచిపోయాయి.. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.. ఈ సందర్భంగా ప్రచారం కోసం నవంబర్ 25న నారాయణపేటకు వచ్చిన అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈసారి రాజేందర్‌రెడ్డి గెలిపిస్తే జిల్లా చేయడం ఖాయమని హామీ ఇచ్చారు.. అనుకున్నట్లుగా ఎస్.ఆర్.రెడ్డి గెలవడం, టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దరిమిలా కేసీఆర్ తన హామీని నెరవేర్చుకున్నారు.. రాష్ట్రంలోని ములుగుతో పాటు నారాయణపేటను కూడా జిల్లా ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు.. ఈ జిల్లా ఆదివారం నుంచి మనుగడలోకి రానుండడంపై స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి పండగలకు దూరంగా 2016లో జిల్లాల పునర్విభజన చేపట్టిన సమయంలో అన్ని అర్హతలు ఉండి, డివిజన్ కేంద్రంగా కొనసాగుతున్న నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలని ఉవ్వెత్తున ఉద్యమించారు. జిల్లా సాధన సమితిగా ఏర్పడి అన్ని పార్టీ లు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టారు. పండగలు కూడా చేసుకోకుండా రోడ్లపైనే గడిపారు. అయినా వారి ఆకాంక్ష నెరవేరలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆయన పుట్టిన రోజైన 17వ తేదీ ఆదివారం నుంచి నారాయణపేట జిల్లాను మనుగడలోకి తీసుకొస్తూ ప్రకటన విడుదల చేయడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మదినం...‘పేట’కు వరం ఎన్నికల ప్రచారంలో భాగంగా అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నారాయణపేట బహిరంగ సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా రాజేందర్‌రెడ్డిని గెలిపిస్తే నారాయణపేట జిల్లాను ఇస్తానని ప్రకటించిన విషయం విదితమే. ఇచ్చిన మాట ప్రకారం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం డిసెంబర్ 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌పై అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన పూర్తి కావడంతో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు ఆమోదం తెలుపుతూ నారాయణపేట జిల్లా ఏర్పాటుపై జీఓ 19ను శనివారం విడుదల చేశారు. ఇలా కేసీఆర్ పుట్టిన రోజున కొత్త జిల్లా మనుగడడలోకి రానుండడం అంతటా సంబరాలు నెలకొన్నాయి. కాగా, డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు.. తుది నోటిఫికేషన్‌కు ఒక్క మార్పు మాత్రమే జరిగింది. డ్రాఫ్ట్‌లో కోయిల్‌కొండ మండలాన్ని కూడా నారాయణపేట జిల్లాలో ఉంచగా.. స్థానికుల మనోభావాల దృష్ట్యా ఆ మండలాన్ని మహబూబ్‌నగర్‌లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నారాయణపేట జిల్లాలో కోయిల్‌కొండ మండలం మినహా నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలు పూర్తిగా ఉండగా.. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి మండలాలు వస్తున్నాయి. మొత్తంగా నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మక్తల్, కోస్గి, ఊట్కూర్, మాగనూర్, కృష్ణ, నర్వ, మరికల్, మద్దూరు మండలాల్లోని 252 గ్రామాలతో జిల్లా ఏర్పాటవుతోంది. ఆనందంగా ఉంది నారాయణపేట డివిజన్ పరిధిలోని ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజున నూతన జిల్లాను ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 25న ఇక్కడకు వచ్చిన కేసీఆర్ నన్ను ప్రజలు గెలిపిస్తే జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నన్ను గెలిపించిన ఈ ప్రాంత ప్రజానీకం కోరిక మేరకు తన హామీని నెరవేరుస్తూ జిల్లాను ఇచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటా. నారాయణపేట జిల్లా అభివృద్ధి కోసం అనుక్షణం కృషి చేస్తా. – ఎస్.రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, నారాయణపేట -
ఒక డివిజన్.. 12 మండలాలు
నారాయణపేట : పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇందులో పూర్వ వరంగల్‌లోని ములుగు ఒకటి కాగా.. మహబూబ్‌నగర్ నుంచి విడదీసి నారాయణపేట జిల్లాను ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31న (జీఓ నెం.534) నోటిఫికేషన్ జారీచేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నారాయణపేట బహిరంగ సభకు హాజరైన అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాజేందర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు నారాయణపేటను 32వ జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు టీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతో నారాయణపేటను జిల్లాగా చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా వెల్లడించిన ముసాయిదాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 30 వరకు వెల్లడించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లా ఇలా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను ఇది వరకే నాలుగు జిల్లాలుగా విభజించారు. ప్రస్తుతం నారాయణపేటను జిల్లాగా ప్రకటించడంతో ఐదో జిల్లాగా అవతరించినట్లయింది. ఒక రెవెన్యూ డివిజన్(నారాయణపేట)తో పాటు12 మండలాలు ఉండేలా నారాయణపేట జిల్లాను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. నారాయణపేట రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే నారాయణపేట, ధన్వాడ, మరికల్, దామరగిద్ద, ఊట్కూరు, మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, మద్దూర్, కోస్గి, కోయిలకొండ మండలాలు ఉన్నాయి. ఈ 12 మండలాలతోనే జిల్లా ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. కలపాలి.. కలపొద్దు... నారాయణపేట నియోజకవర్గంలోని కోయిల్‌కొండ మండలం పస్తుతం మహబూబ్‌నగర్ రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో ఉంది. అయితే, కోయిలకొండను నారాయణపేట జిల్లాలో కలపకుండా మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఆ మండల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే మహబూబ్‌నగర్ ఉన్నందున తమను ఇక్కడే కొనసాగించాలనేది వారి డిమాండ్. అలాగే కోస్గి మండల ప్రజలు సైతం మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉంచాలని ఆందోళన బాట పట్టారు. ఇకపోతే ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ఉన్న దౌల్తాబాద్ మండల వాసులు నారాయణపేట జిల్లాలో తమ మండలాన్ని కోరుతున్నారు. వీరి డిమాండ్ గతంలో జరిగిన జిల్లాల పునర్విభజన నాటి నుంచే ఉంది. అయితే, చివరకు ఏయే మండలాలు ఏయే జిల్లాలో ఉండనున్నాయో తేలాల్సి ఉంది. తెరపైకి కొత్త డివిజన్లు, మండలాలు నారాయణపేట జిల్లా ప్రకటనతో కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆత్మకూర్, మక్తల్‌తో పాటు కోస్గిని సైతం రెవెన్యూ డివిజన్ చేయాలని ఆయా ప్రాంత వాసులు, రాజకీయనేతలు, నాయకులు డిమాండ్ చేస్తూ అధికారులకు వినతులను అందజేస్తున్నారు. ఇక ఊట్కూర్ మండలంలోని బిజ్వార్, పూలిమామిడి గ్రామాల ప్రజలు, నారాయణపేట మండలంలో కోటకొండ, అప్పక్‌పల్లి, దామరగిద్ద మండలంలో మొగల్‌మడ్కా, కానుకుర్తి, కోస్గి మండలంలో గుండుమాల్, మద్దూర్ మండలంలో భూనేడ్, కొత్తపల్లి, కోయిల్‌కొండ మండలంలో గార్లపాడు, కోత్లాబాద్ను మండలాలుగా చేయాలని స్థానికులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ప్రకటన జారీ చేయగా.. ఇవేవీ ఇందులో లేవు. దీంతో చివరి వరకు ఏమైనా జాబితాలో చేరతాయా, లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే నోట.. ఆత్మకూరు, అమరచింత మాట మక్తల్ నియోజకవర్గ కేంద్రం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండగా.. ఇదే నియోజకవర్గంలోని ఆత్మకూర్, అమరచింత మండలాలు మాత్రం వనపర్తి జిల్లాలో కొనసాగుతున్నాయి. అయితే, నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే జిల్లాలో ఉంటే బాగుంటుందని ఆ ప్రాంత జనం కోరుకుంటున్నారని చెబుతున్న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు నారాయణపేటలో గురువారం జరిగిన సభలో ప్రకటించారు. దీంతో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ రెండు మండలాలను నారాయణపేట జిల్లాలో చేర్చే అంశం పరిశలనకు వస్తుందని.. తద్వారా 14 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటుకావొచ్చని తెలుస్తోంది. 30 వరకు అభ్యంతరాల స్వీకరణ నారాయణపేట జిల్లా ప్రకటనపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయొచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జిల్లాలో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు కావాలనే ప్రతిపాదనలు, మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కలపాలనే వినతులు తదితర అంశాలపై పలువురు జిల్లా కలెక్టర్‌కు విన్నవించే అవకాశం ఉంది. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిశాక నారాయణపేట జిల్లాకు తుది రూపం వచ్చి ఫైనల్ గెజిట్ నెల తర్వాత వెలువరించనున్నారు. -
వలసలు ఆపుతాం.. ఉపాధి కల్పిస్తాం
సాక్షి, నారాయణపేట/ నారాయణపేట రూరల్: ఈసా రి ఎన్నికల్లో కమలంపువ్వు గుర్తుకు ఓటేసి అధికారం కట్టబెడితే పాలమూరు జిల్లాలో వలసలు నివారించి, ఉపాధి కల్పిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే సాగు, తాగునీరు లేక వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఎన్నికల ప్ర చారంలో భాగంగా ఆదివారం ఆయన నారాయ ణపేట మినీ స్టేడియం గ్రౌండ్లో కొత్తకాపు రతంగపాండురెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన నారాయణపేట, గ ద్వాల చేనేతను ఎవరూ పట్టించుకోవడం లేదన్నా రు. బీజేపీ ప్రభుత్వంలో హ్యాండ్లూమ్ పార్క్‌ను ఏర్పాటు చేసి కీర్తి పెంచుతామని చెప్పారు. కృష్ణా – వికారాబాద్ రైల్వేలైన్ మంజూరై, సర్వే పూర్తిచేసి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వని కారణంగా పెండింగ్‌లోనే ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజల కోరికను తీరుస్తూ నారాయణపేటను జిల్లా చేస్తామని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వడం తప్పా.. ఒక్కటీ పూర్తి చేయలేదని విమర్శించారు. జిల్లా ఆస్పత్రి చేస్తామని చెప్పి కనీసం భూమిపూజ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. ఆ రిజర్వేషన్లు సాధ్యం కాదు.. మతపరమైన రిజర్వేషన్లు సాధ్యంకావని, అందువల్లే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అమిత్‌షా అన్నారు. కొందరు దీనికి విరుద్ధంగా హామీ ఇచ్చి మోసంచేయడం సరికాదని అన్నారు. అమరవీరుల కుటుంబాలను విస్మరించి ఎలాంటి ఉపాధి చూపలేదన్నారు. ఎంఐఎంకు తలొగ్గి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని, బీజే పీ ప్రభుత్వం వస్తే ప్రతీ గ్రామంలో అధికారికంగా సెప్టెంబర్ 17న పండుగ చేస్తామన్నారు. దళిత సీ ఎం హామీని విస్మరించిన కేసీఆర్ ఏకకాలంలో పా ర్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే మోది చరీ ష్మా ముందు గెలవలేమని భావించి తన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్ కోసం ముందస్తుకు వెళ్లాడని, ప్రజాధనం దుర్వినియోగం చేయించాడ ని అన్నారు. రాష్ట్రానికి కాపలా కుక్కలాగా ఉంటానన్న కేసీఆర్, నాలుగున్నర ఏళ్లలో అవినీతి నక్క లా మరాడని విమర్శించారు. మైనార్టీలకు పెద్దపీ ట వేస్తామన్న కాంగ్రెస్ ఉర్దూ టీచర్ల నియామకం చేపడితే తెలుగు ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చర్చి, మసీదులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ దేవాలయాలను ఎందుకు విస్మరిస్తుందో చెప్పాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మాట్లాడుతూ కుటుంబ పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్కు చరమగీతం పాడి బీజేపీని గెలిపించుకుందామని అన్నారు . సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, సేడెం ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌పాటిల్, యాద్గిర్ జెడ్పీ మాజీ చైర్మన్ శరణ్‌భూపాల్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణయాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రభాకరవర్ధన్, మహేష్‌శెట్టి, ఎంపీపీ మణెమ్మ, జెడ్పీటీసీ లప్ప అరుణాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందునామాజీ, పట్టణ, మండల అధ్యక్షుడు బోయ లక్ష్మణ్, సాయిబన్న, లక్ష్మి, నర్సన్‌గౌడ్, సిద్రామప్ప, నాగిరెడ్డి, గుండప్ప, రామకృష్ణ. అశోక్, బందేష్, శంకరప్ప, రఘువీర్‌యాదవ్ పాల్గొన్నారు. సేవకుడిలా పనిచేస్తా ఆస్తులు కాపాడుకునేందుకు, వ్యాపారాలను అ భివృద్ధి చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చి డబ్బు, మద్యంతో గెలవాలనుకుంటున్న వారికి ఓటుతో బుద్ధిచెప్పాలి. తనను గెలిపిస్తే సేవకుడి లా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు ఒ క్కసారి బీజేపీని గెలిపించాలి. పదవుల కోసం పార్టీలు మారే నాయకులను నమ్మవద్దు. 30ఏళ్ల నుంచి ఒకే పార్టీలో సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న తనకు చట్టసభలోకి వెళ్లే అవకాశం కల్పించాలి. – రతంగపాండురెడ్డి, నారాయణపేట బీజేపీ అభ్యర్థి ‘పేట’లో బీజేపీ గెలవడమే నా కల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పడుతున్న నారాయణపేట నియోజకవర్గ ప్రజలు ఈసారి అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థిని పంపిస్తే నా కల తీరుతుంది. బీజేపీ సత్తాచూపి ఒక్కో కార్యకర్త 10ఓట్లు వేయించాలి. జిల్లా కోసం ఎస్‌ఆర్‌రెడ్డి రాజీనామా చేస్తే పట్టించుకోని కేసీఆర్, ఇప్పుడు గెలిపిస్తే జిల్లా ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ గెలిస్తే జిల్లాతో పాటు ‘పేట’ – కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి అవుతుంది. హిందూసమాజం పట్ల అసభ్యంగా మాట్లాడుతున్న ఓవైసీకి భజరంగ్‌దళ్ కార్యకర్తలు తలుచుకుంటే తగిన బుద్ధిచెప్తారు. – నాగురావు నామాజీ, కొడంగల్ బీజేపీ అభ్యర్థి -
కనికరం లేని కొడుకులు
తల్లికి పిల్ల భారమా.. చెట్టుకు కాయ భారమా..? అంటే భారం కానేకాదు అనేది ప్రకృతి ధర్మం. కానీ పిల్లకు మాత్రం తల్లి భారమే! అనే సమాధనం వస్తోంది నేడు. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిపై కొడుకుల కనికరం కరువైంది. వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచేసుకుని పెంచిన తల్లిని మాత్రం తరమేశారు తనయులు. దీంతో ఆ తల్లి అధికారులను ఆశ్రయించి న్యాయం కోసం వేడుకుంది. దేవరకద్ర, న్యూస్‌లైన్: వృద్ధాప్యంలో తల్లిని చేర దీ యాల్సిన కొడుకులు ఛీదరించుకున్నారు. ఇంటి నుంచి గెంటి వేయడంతో తనకు న్యాయం చేయాలని ఆ తల్లి అధికారులను ఆశ్రయించింది. మండలంలోని కౌకుంట్లకు చెందిన కృష్టారెడ్డి మృతి చెందగా ఆయనకు వారసత్వంగా ఉన్న పొలంతోపాటు కొంత కొనుగోలు చేసిన పొలం కలుపుకుని 9 ఎకరాలను ముగ్గురు కొడులు పురేందర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రా జేశ్వరెడ్డిలు పంచుకున్నారు. అయితే తల్లి బడుగుల పద్మమ్మ(65) గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కొంత కాలం గ్రా మంలో ఉండే చిన్న కొడుకు ఆశ్రయం కల్పించిన తరువాత తల్లిని ఇంటి నుంచి గెంటి వేశాడు. అక్కడ ఇక్కడ బంధువుల ఇళ్లలో, కూతుళ్ల వద్ద కొంత కాలం గడుపు తూ వచ్చింది. చివరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో నారాయణపేట ఆర్డీఓను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వే డుకుంది. వెంటనే విచారణ చేసి పద్మమ్మ కు న్యాయం కల్పించాలని దేవరకద్ర తహశీల్దార్‌కు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. మానవ హక్కుల సభ్యురాలు శాంత స్పం దించి వృద్ధురాలికి ఆశ్రయం కల్పించాలని గురువారం తహశీల్దార్ అంజిరెడ్డికి ఫిర్యా దు చేశారు. ఈ విషయమై ఆమె కొడుకుల ను పిలిచి విచారణ చేసి చర్యలు తీసుకుం టామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. -
దుకాణాల్లో చోరీ
నారాయణపేట, న్యూస్‌లైన్: కొంద రు గుర్తుతెలి యని వ్యక్తులు ఏకంగా తొమ్మిది దుకాణాల తా ళాలు పగుల గొ ట్టి రెండు షాపుల్లో దొంగతానికి పాల్పడ్డారు. దీనికి పోలీ సుల వైఫల్యమే కారణమంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట పట్టణంలోని ప్రధాన రహదారిపై చాలా దుకాణా లు ఉన్నాయి. ఎప్పటిలాగే నిర్వాహకులు మంగళవారం రాత్రి వాటికి తాళాలు వేసి ఇళ్లకు వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు స్థానిక యాద్గిర్రోడ్లోని వివిధ దుకాణ షట్టర్లకున్న తాళాలు పగులగొట్టారు. బాబా వైన్స్‌లో రూ.రెండువేలతో పాటు బీరుకాటన్ను, ఎదురుగా ఉన్న భారత్ బ్యాటరీస్‌లో రూ.12 వేలు అపహరించారు. అలాగే సునీల్ ఐస్‌క్రీం, ఓం ఫ్లయ్‌వుడ్ సెంటర్, లక్ష్మి ట్రేడర్స్, కేజీఎన్ ఆటోమొబైల్స్, సుజాత జనరల్ స్టోర్, కర్లి బ్రదర్స్ సూపర్ మార్కెట్, ఫైనల్ వరల్డ్ దుకాణాల తాళాలు విరగ్గొట్టి నా షట్టర్లు తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. ఉదయం బాధితులు వచ్చి గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యా దు చేశారు. సంఘటన స్థలాన్ని సీఐ లింగయ్య పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ముఠా పనే అయి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే క్లూస్‌టీం వ చ్చి ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించారు. అనంతరం వ్యాపారులు కొద్దిసేపు ఆందోళనకు దిగా రు. పోలీస్ పెట్రోలింగ్ లేకపోవ డం వల్లే తరచూ పట్టణంలో చోరీ లు జరుగుతున్నాయని వాపోయా రు. ప్రధాన కూడలిలో హైమాస్ట్ లైట్లు వెలగకపోవడంతో అంధకారం అలుముకుందన్నారు. సెం టర్చౌక్లోని సరాఫ్‌బజార్ నుంచి ర్యాలీ నిర్వహిస్తూ దుకాణాలను బంద్ చేయించారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీసుల గస్తీ ముమ్మరంగా చేయాలంటూ స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఏఓ ప్రేమ్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వ్యాపారులు హరినారాయణభట్ట డ్, సరాఫ్ నాగరాజు, దినేష్కుమార్లాహోటీ, శ్యాంసుందర్‌చారి, దిలిప్కుమార్వైకుంఠ్, ప్రకాశ్భట్ట డ్ తదితరులు పాల్గొన్నారు.