తల్లికి పిల్ల భారమా.. చెట్టుకు కాయ భారమా..? అంటే భారం కానేకాదు అనేది ప్రకృతి ధర్మం. కానీ పిల్లకు మాత్రం తల్లి భారమే! అనే సమాధనం వస్తోంది నేడు. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిపై కొడుకుల కనికరం కరువైంది. వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచేసుకుని పెంచిన తల్లిని మాత్రం తరమేశారు తనయులు. దీంతో ఆ తల్లి అధికారులను ఆశ్రయించి న్యాయం కోసం వేడుకుంది.
దేవరకద్ర, న్యూస్‌లైన్: వృద్ధాప్యంలో తల్లిని చేర దీ యాల్సిన కొడుకులు ఛీదరించుకున్నారు. ఇంటి నుంచి గెంటి వేయడంతో తనకు న్యాయం చేయాలని ఆ తల్లి అధికారులను ఆశ్రయించింది. మండలంలోని కౌకుంట్లకు చెందిన కృష్టారెడ్డి మృతి చెందగా ఆయనకు వారసత్వంగా ఉన్న పొలంతోపాటు కొంత కొనుగోలు చేసిన పొలం కలుపుకుని 9 ఎకరాలను ముగ్గురు కొడులు పురేందర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రా జేశ్వరెడ్డిలు పంచుకున్నారు. అయితే తల్లి బడుగుల పద్మమ్మ(65) గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కొంత కాలం గ్రా మంలో ఉండే చిన్న కొడుకు ఆశ్రయం కల్పించిన తరువాత తల్లిని ఇంటి నుంచి గెంటి వేశాడు. అక్కడ ఇక్కడ బంధువుల ఇళ్లలో, కూతుళ్ల వద్ద కొంత కాలం గడుపు తూ వచ్చింది.
చివరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో నారాయణపేట ఆర్డీఓను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వే డుకుంది. వెంటనే విచారణ చేసి పద్మమ్మ కు న్యాయం కల్పించాలని దేవరకద్ర తహశీల్దార్‌కు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. మానవ హక్కుల సభ్యురాలు శాంత స్పం దించి వృద్ధురాలికి ఆశ్రయం కల్పించాలని గురువారం తహశీల్దార్ అంజిరెడ్డికి ఫిర్యా దు చేశారు. ఈ విషయమై ఆమె కొడుకుల ను పిలిచి విచారణ చేసి చర్యలు తీసుకుం టామని తహశీల్దార్ హామీ ఇచ్చారు.
కనికరం లేని కొడుకులు
Published Fri, Feb 7 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement