మాతృ భాష స్థానంలో ఇంగ్లిష్ వచ్చిందన్నది అసత్యం
టెట్ కన్వీనర్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి కోరారు. స్కూల్ అసిస్టెంట్ (2ఏ) ఇంగ్లిష్ సబ్జెక్టులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, ఈ పేపర్‌లో పార్ట్–2లో మాతృభాష ఎంపిక పైనా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులో తలెత్తిన సమస్యను పరిష్కరించకపోవడంతో పరీక్ష సమయంలో మాతృభాష స్థానంలో ఇంగ్లిష్ మాత్రమే వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.
టెట్ ఎస్‌ఏ–2 ఇంగ్లిష్ పేపర్ రెండో సెక్షన్‌లో అభ్యర్థుల మాతృ భాషకు అనుగుణంగా తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా తదితర భాషలు ఉంటాయని, అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న భాషనే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ ఇక్కడ మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకుంటే ఇంగ్లిష్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోందని, వాస్తవానికి అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదులు కూడా అందలేదని తెలిపారు. టెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి అనుసరించిన విధానాలనే ఇప్పుడూ అనుసరించామని
కృష్ణారెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment