ఆ ప్రముఖునికి ప్రపంచంలో అత్యధిక భూములున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, అడవులు, పట్టణ ప్రాంతాల్లో పలు భూములు, ఇళ్లు, విలాసవంతమైన మార్కెటింగ్ సముదాయాలు అతని సొంతం. సముద్ర తీరప్రాంతాలలో కూడా అతనికి ఆస్తులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతనికున్న భూములు, ఆస్తులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక కంపెనీనే ఉంది.
ఈ అపార ఆస్తిపాస్తులు బ్రిటన్ రాజకుటుంబానికి సొంతం. వీటికి యజమాని బ్రిటన్ రాజు చార్లెస్- III. అతని తల్లి క్వీన్ ఎలిజబెత్- II మరణం తరువాత కింగ్ చార్లెస్ ప్రపంచంలోనే భారీ ఆస్తిపాస్తులకు యజమానిగా మారారు. ఇతను బతికి ఉన్నంత వరకూ ఈ ఆస్తిని అతని సొంత ఆస్తిగా పరిగణిస్తారు. దీనికి అతను ప్రైవేట్ యజమాని కాదు.
మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రిన్స్ చార్లెస్ ప్రపంచవ్యాప్తంగా 6.6 బిలియన్ ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ భూములు గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలలోనూ ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం సంపదలో 16.6 శాతం ఈ బ్రిటిష్ రాజుకు చెందినదేని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
ది క్రౌన్ ఎస్టేట్ అనే సంస్థ ఈ ఆస్తిపాస్తులను పర్యవేక్షిస్తుంది. ఈ బ్రిటీష్ రాజుకు ఒక లక్షా 15 వేల ఎకరాల వ్యవసాయ, అటవీ భూములున్నాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల విలువైన భూములు, ఆస్తులు, బీచ్‌లు, మార్కెట్లు, నివాస స్థలాలు, కార్యాలయ సముదాయాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో క్రౌన్ ఎస్టేట్ వివిధ షాపింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ రాజుకు ఇసుక, కంకర, సున్నపురాయి, గ్రానైట్, ఇటుక, మట్టి, బొగ్గు, స్లేట్ తదితర వ్యాపారాలు కూడా ఉన్నాయి.
2022 సెప్టెంబరులో కింగ్ చార్లెస్- III సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతను $46 బిలియన్ల సామ్రాజ్యానికి అధిపతి. (ఒక బిలియన్ అంటే రూ. 100 కోట్లు) ఇందులో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్‌లో ఉంది. ఈ ఆస్తులను క్రౌన్ ఎస్టేట్ సంస్థ పర్యవేక్షిస్తుంది. కింగ్ చార్లెస్- III తరువాత అత్యధిక భూముల కలిగిన వ్యక్తిగా సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా నిలిచారు. ఇతనికి ఎనిమిది లక్షల 30 వేల చదరపు మైళ్ల భూభాగం ఉంది. ఈ జాబితాలో తరువాతి పేరు సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా. ఇతనికి వ్యక్తిగతంగా ఎనిమిది లక్షల 30 వేల చదరపు మైళ్ల భూభాగం ఉంది.
ఇది కూడా చదవండి: చైనా జిత్తులకు అమెరికా, భారత్ పైఎత్తు!
Comments
Please login to add a commentAdd a comment