సంపన్న దేశాల్లో నార్వే నిజంగానే ముందుందా? | The most prosperous countries in the world revealed - but should Norway really be top? | Sakshi
Sakshi News home page

సంపన్న దేశాల్లో నార్వే నిజంగానే ముందుందా?

Published Sat, Dec 26 2015 6:53 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

సంపన్న దేశాల్లో నార్వే నిజంగానే ముందుందా?

సంపన్న దేశాల్లో నార్వే నిజంగానే ముందుందా?

ప్రపంచ అత్యంత సంపన్న దేశాల్లో నార్వే అగ్రభాగాన నిలిచింది. వరుసగా ఏడోసారి నార్వే తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. 2015 సూచీల ప్రకారం ఆర్థిక వ్యవస్థ, విద్య, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్యం పనితీరు ప్రమాణంగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 142 దేశాల్లో నార్వే అత్యధిక స్థానంలో ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన అన్ని విషయాల్లో ముందున్న స్విట్జర్లాండ్.. విద్యావ్యవస్థలో బలహీనంగా ఉండటంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హెల్త్ కేర్ లో 16వ ర్యాంకులో ఉన్న డెన్మార్క్..మూడో స్థానం... యూఎస్ పదకొండో స్థానాన్ని దక్కించుకోగా.. యూకె 2014-15 తో పోలిస్తే రెండు స్థానాలు కిందికి పడిపోయింది. అయితే వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక సంబంధాల అంశాల్లో బలహీన పడటంతో  సింగపూర్ కూడ 17వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సామాజిక పెట్టుబడి, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్య వ్యవస్థలు బలంగా కలిగిన నార్వే ర్యాంకింగ్ విషయంలో  2009 నుంచి విజయ పథంలో దూసుకుపోతోంది. అయితే 2013 తో పోలిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది పడిపోయిందని చెప్పాలి. నిరుద్యోగ సమస్యే అందుకు ప్రధాన కారణమౌతున్నట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి.  లెగటమ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి నాథన్ గామ్ స్టర్ అందించిన  ఉత్పత్తి సూచికల ఆధారంగా... నార్వే ఎక్కువ కాలంపాటు ముందు వరుసలో నిలవడానికి కారణం.. అక్కడ నిరుద్యోగులు... వైకల్యం, లేదా ఎర్లీ రిటైర్మెంట్ పెన్షనర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగం విషయంలో నార్వేలో 20-24 ఏళ్ళ మధ్య వయస్కులు మాత్రమే అధ్యయనాల్లో పాలుపంచుకున్నారు. దీంతో నార్వే అధికార నిరుద్యోగ స్థాయికంటే తక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యయనకారులు భావిస్తున్నారు.

2008 ఆర్థిక సంక్షోభం తర్వాత పొరుగు దేశాలతో పోలిస్తే నార్వేలో అధికార నిరుద్యోగ స్థాయి కృత్రిమంగా తక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. నిజానికి అధిక శాతం దేశాల్లో నిజమైన నిరుద్యోగ స్థాయిని వెల్లడించడంలేదని లండన్ మార్కెట్ ఆర్థిక వేత్త నిమా సమందజి అంటున్నారు. 2008 నుంచి ఉపాధి రేటును అధ్యయనం చేసిన ఆయన... ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడంలో ముఖ్యంగా నిరుద్యోగ స్థాయి ఆధారంగా సూచికలు నిర్థారిస్తామని, అదే నార్వేలోని నిజమైన గణాంకాలు అందుబాటులో ఉన్నట్లయితే ఆ దేశం వెనుకబడి ఉండేదని చెప్తున్నారు. చెప్పాలంటే వ్యాపారం ప్రారంభించడానికి బ్రిటన్ అత్యుత్తమ దేశం అని, వ్యవస్థాపకత విషయంలో బ్రిటన్ ఉత్తమ స్కోర్ సాధించిందని ఆయన చెప్తున్నారు.  మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిటన్ ప్రభుత్వం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను అమలు చేస్తోందని, దీంతో గణాంకాల ప్రకారం 28లో ఉండాల్సిన ఆర్థిక వ్యవస్థ 19 కి పడిపోయిందని చెప్తున్నారు. అయితే ఉపాధి విషయంలో మాత్రం అత్యధిక పెరుగుదల కనిపించిందని చెప్తున్నారు. అలాగే చైనా సంపన్నదేశాల వరుసలో 52వ స్థానంలో ఉన్నప్పటికీ... ఆర్థిక వ్యవస్థ విషయంలో ముందుంటుంది. అయితే వ్యక్తిగత స్వేచ్ఛలో 120 స్థానంలో ఉండటం వల్లనే ర్యాంకింగ్ లో వెనుకబడుతోందంటున్నారు. సౌదీ అరేబియాలో కూడ అదే పరిస్థితి కొనసాగుతోందని అధ్యయనకారులు చెప్తున్నారు. ఇటువంటి కొన్ని ప్రత్యేక అంశాలపై దృష్టి సారిస్తే.. దేశాలు ఎలా విజయవంతం అవుతున్నాయో తెలుస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement