World Of Statistics Report: List Of Top Countries With Highest Divorce Rate - Sakshi
Sakshi News home page

Most Divorce Rate Country List: ఈ దేశాల్లో విడాకుల కేసులు అధికం!

Published Tue, Jul 25 2023 7:14 AM | Last Updated on Tue, Jul 25 2023 10:35 AM

world of statistics report top countries with highest divorce rate - Sakshi

కుటుంబ విలువల గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు భారతదేశం గురించి గొప్పగా చెబుతారు. విలువలకు పట్టంకట్టే భారతీయ సంస్కృతి ఘనత మరోమారు ప్రపంచానికి తెలిసింది. వరల్డ్‌ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ ఇటీవల ఒక రిపోర్టును వెలువరించింది. దీనిలో అత్యధికంగా విడాకులు తీసుకుంటున్న దేశాల జాబితా ఉంది. ఈ పరిశోధనా సర్వే జాబితా ద్వారా భారత్‌ కుటుంబ విలువలను కాపాడే విషయంలో ముందున్నదని మరోమారు తేలింది. ఈ రిపోర్టును అనుసరించి భారత్‌లో విడాకుల కేసులు కేవలం ఒక్కశాతం మాత్రమే ఉన్నాయి. పలుదేశాల్లో 94 శాతం పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయని ఈ నివేదిక చెబుతోంది. 

వరల్డ్‌ స్టాటస్టిక్స్‌ అందించిన డేటాను అనుసరించి చూస్తే అసియా దేశాల్లో విడాకుల విషయంలో తూర్పు, పశ్చిమ దేశాలైన యూరప్‌, అమెరికాల్లో అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ఈ దేశాల్లో కుటుంబం ఏర్పడకముందే జంటలు విడాకులు తీసుకుంటున్నాయి.  ఈ రిపోర్టును అనుసరించి భారత్‌లో విడాకుల కేసులు కేవలం ఒకశాతం మాత్రమే ఉన్నాయి. భారత్‌ తరువాత అత్యల్ప స్థాయిలో విడాకులు నమోదవుతున్న దేశాల్లో వియత్నాం ఉంది. ఈ దేశంలో 7శాతం మేరకు విడాకుల కేసులు నమోదవుతున్నాయి. 

ఈ డేటాలో వెల్లడైన వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక విడాకులు పోర్చుగల్‌లో నమోదవుతున్నాయి. ఇక్కడ విడాకుల రేటు 94 శాతంగా ఉండటం గమనార్హం. అదేవిధంగా స్పెయిన్‌ కూడా విడాకుల విషయంలో తగ్గేదేలే.. అన్నట్లుంది. స్పెయిన్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశంలో విడాకుల రేటు 85 శాతంగా ఉంది. కాగా సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాలే విడాకులకు కారణమని ఈ నివేదిక వెల్లడించింది. 
ఇది కూడా చదవండి: పాస్‌పోర్ట్‌ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్‌ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా!
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement