rate
-
Year Ender 2024: నిరుద్యోగంతో అలమటిస్తున్నరాష్ట్రాలివే..
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ భారత్ నిరుద్యోగం విషయంలో పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలోని వివిధ రంగాలు వృద్ధిని చవిచూస్తున్నప్పటికీ, నిరుద్యోగితా స్థాయిలో ఆశించినంత మార్పు రాకపోవడం విశేషం. ఇటీవలే విడుదలైన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) అందించిన నివేదిక ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి జాతీయ నిరుద్యోగిత రేటులో తగ్గుదల కనిపించింది. 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులలో నిరుద్యోగితా రేలు 3.2 శాతానికి తగ్గింది. ఇది 2020-21లో 4.2 శాతంగా, 2021-22లో 4.1శాతంగా ఉంది. అగ్రస్థానంలో లక్షద్వీప్11.1 శాతం నిరుద్యోగితా రేటుతో కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అగ్రస్థానంలో ఉంది. పర్యాటకంపై ఆధారపడిన లక్షద్వీప్ ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగాన్ని గణనీయంగా తగ్గించలేకపోయింది. గోవా, అండమాన్, నికోబార్ దీవులు రెండూ 9.7శాతం నిరుద్యోగితా రేటును నమోదు చేశాయి. కాలానుగుణ ఉపాధి, ప్రభుత్వ రంగ ఉద్యోగాలపై ఆధారపడటం మొదలైనవి నిరుద్యోగానికి సవాలుగా నిలిచాయి. ప్రభుత్వ రంగంలో పరిమిత ఉద్యోగ అవకాశాల కారణంగా అధిక నిరుద్యోగ స్థాయి కొనసాగుతోంది. వైరుధ్యాన్ని ఎదుర్కొంటున్న కేరళ యువతనాగాలాండ్, కేరళ వరుసగా 9.1శాతం, 7.0శాతం రేట్లతో రెండవ స్థానంలో ఉన్నాయి. కేరళలోని యువత అధిక అక్షరాస్యత, తక్కువ ఉపాధి అవకాశాలనే వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తర భారతదేశంలో, హర్యానా పారిశ్రామిక కేంద్రంగా ఉన్నప్పటికీ 6.1% నిరుద్యోగిత రేటును నమోదు చేసింది. పారిశ్రామిక వృద్ధి ఒక్కటే ఉపాధికి హామీ ఇవ్వదని ఈ వైరుధ్యం సూచిస్తుంది.చండీగఢ్, మేఘాలయాలకు పలు సవాళ్లుఅదేవిధంగా 6.0శాతం నిరుద్యోగితా రేటుతో చండీగఢ్, మేఘాలయాలు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. చండీగఢ్ ప్రభుత్వం, అక్కడి సేవా రంగాలు రాష్ట్రంలోని యువతకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలను కల్పించలేకపోతున్నాయి. మేఘాలయలో పారిశ్రామిక అభివృద్ధి చెందకపోవడం ఉపాధికి ఆటంకంగా మారింది.తెలంగాణలో..జమ్ముకశ్మీర్, తెలంగాణలో నిరుద్యోగ రేటు 4.4శాతంగా ఉంది. జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ, ఆర్థిక సవాళ్లు నిరుద్యోగానికి కారణాలుగా నిలుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఐటీ రంగం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
బంగారం ఎక్కడ కొన్నా ఒకే రేటు..
దేశ వ్యాప్తంగా ఒకే బంగారం ధర లక్ష్యంతో ‘వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్’ విధానం అమలుకు కృషి చేస్తున్నట్లు అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) ప్రకటించింది. ‘‘మేము ఒకే ధర వద్ద బంగారం దిగుమతి చేసుకుంటాము, కానీ దేశీయ రిటైల్ ధరలు ఒక నగరం నుండి మరొక నగరానికి భిన్నంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఒకే రేటు కొనసాగాలని మేము కోరుకుంటున్నాము’’ అని జీజేసీ సెక్రటరీ మితేష్ ధోర్డా పేర్కొన్నారు.మండలి సభ్యులతో ఇప్పటికే ఈ విషయంపై 50కుపైగా సమావేశాలను నిర్వహించడం జరిగిందని, తమ ప్రతిపాదనకు ఇప్పటికే దాదాపు 8,000 జ్యూవెలర్స్ సూత్రప్రాయ ఆమోదం తెలిపారని వివరించారు. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న వార్షిక గోల్డ్ ఫెస్టివల్ ‘లక్కీ లక్ష్మీ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.ఈ లక్కీ లక్ష్మీ ఉత్సవంలో 1,500 మంది రిటైలర్లు అలాగే 9 వరకూ చైన్ స్టోర్స్ పాల్గొననున్నాయి. కొనుగోళ్లకు సంబంధించి రూ. 10 కోట్ల విలువైన బహుమతులను అందజేయడం జరుగుతుంది. బంగారంపై రూ. 25,000 కంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లు పండుగ కాలంలో ఖచ్చితమైన బహుమతులు అందుకుంటారు. బాలీవుడ్ నటి ముగ్దా గాడ్సే సీనియర్ జీజేసీ సభ్యులతో కలిసి ఈ ఉత్సమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. -
తగ్గనున్న ప్లాట్ఫారం టిక్కెట్ ధర
భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. త్వరలో రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పనుంది. ఇది ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది.ప్లాట్ఫారం టిక్కెట్ ధరను తగ్గించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్లాట్ఫారం టిక్కెట్ ధర రూ. 10గా ఉంది. దీని ధర రూపాయి తగ్గి రూ. 9 కానుంది. ఇది ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. రైల్వే స్టేషన్ లోనికి వెళ్లాలంటే ఎవరైనా సరే ప్లాట్ ఫారం టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణానికి వెళ్లేవారు టిక్కెట్ తీసుకుంటారు కాబట్టి వారు ప్రత్యేకంగా ప్లాట్ఫారం టిక్కెట్ తీసుకోనవసరం లేదు. అయితే ఎవరినైనా రైలు నుంచి రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్ లోనికి వెళ్లేవారు తప్పనిసరిగా ప్లాట్ఫారం టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.ప్లాట్ఫారం టిక్కెట్ లేకుండా ఎవరైనా స్టేషన్‌లోనికి ప్రవేశిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్లాట్ఫారం టిక్కెట్ కూడా రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చే మార్గాలలో ఒకటి. ప్రస్తుతం ప్లాట్ఫారం టికెట్ ధర రూ.10. అయితే జూన్ 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్లాట్ఫారం టిక్కెట్లపై జీఎస్టీని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.ప్లాట్ఫారం టికెట్‌తో పాటు రిటైరింగ్ రూమ్, బ్యాటరీతో నడిచే కారు తదితర సేవల రుసుము నుంచి కూడా జీఎస్టీని తొలగించారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న 5శాతం ఉన్న జీఎస్టీ భారం ప్రయాణికులకు తగ్గనుంది. ఫలితంగా ప్లాట్ఫారం టిక్కెట్ ధర రూ. 10 నుంచి రూ. 9కి చేరనుంది. -
పెరగనున్న చక్కెర ధర
ఇకపై తీపి తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల మధ్య చక్కెర మిల్లల నిర్వహణ వాటి యజమానులకు భారంగా మారింది. ఈ నేపధ్యంలో చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు కనీసం రూ. 42కి పెంచాలని నేషనల్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఫెడరేషన్ (ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్)ప్రభుత్వాన్ని కోరింది.మరోవైపు అక్టోబర్ ఒకటి నుండి ప్రారంభమయ్యే 2024-25 సీజన్‌కు చక్కెర కనీస అమ్మకపు ధర (ఎంఎస్పీ) ను పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం చక్కెర ధరను పెంచినట్లయితే, దాని ప్రభావం రిటైల్ మార్కెట్లో కనిపిస్తుంది. దీంతో చక్కెర ధర పెరిగేందుకు అవకాశముంది. చక్కెర ధర కిలోకు రూ.3 నుంచి 4 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.2019 నుండి చెరకు కనీస అమ్మకపు ధర కిలోకు రూ. 31 వద్ద కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెరకు రైతులకు చెల్లించే న్యాయమైన,లాభదాయక ధర (ఎఫ్ఆర్పీ)ని పెంచింది. ఎన్ఎఫ్సిఎస్ఎఫ్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ చెరకు కనీస అమ్మకపు ధరను సర్దుబాటు చేయడం అవసరమని, చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు రూ.42కి పెంచితే చక్కెర పరిశ్రమ లాభసాటిగా మారుతుందని పేర్కొన్నారు. -
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు
రోజు రోజుకి బంగారం ధరలు ఆకాశామే హద్దుగా పెరిగిపోతున్నాయి. తాజాగా, శుక్రవారం పసిడి ధరలు పెరిగాయి. ఏప్రిల్ 26న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల బంగారంపై రూ.440 పెరిగింది. కొన్ని నగరాల్లో ఇంకాస్త పెరగడం బంగారం కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, కరెన్సీ విలువ పడిపోవడంతో..ఇన్వెస్టర్లు అనిశ్చితి సమయాల్లో లాభాల్లో తెచ్చి పెట్టే బంగారంపై పెట్టుబడులు పెడుతుండడంతో పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఓ రోజు బంగారం ధరలు భారీగా పెరిగితే మరో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందివిజయవాడలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందిగుంటూరులో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందివైజాగ్‌లో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందిముంబైలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందిఢిల్లీలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,800గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,860గా ఉందిబెంగళూరులో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉందిచెన్నైలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,550గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,690గా ఉంది -
వామ్మో... ఇలా అయితే బంగారం కొనాలా.. వద్దా?
Gold Rate today: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ మీద షాకులిస్తున్నాయి. వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 12) పీక్కు చేరాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు 10 గ్రాములకు ఈరోజు ఏకంగా రూ.1090 మేర పెరిగాయి. ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి రూ.67,200 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1090 చొప్పున పెరిగి రూ.73,310 వద్దకు ఎగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ.67,200 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 ఎగిసి రూ.73,310 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.800 పెరిగి రూ.68,050 లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.880 చొప్పున పెరిగి రూ.74,240 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 ఎగిసి రూ.67,350 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 పెరిగి రూ.73,460 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ.67,200 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 ఎగిసి రూ.73,310 వద్దకు చేరింది. -
ఈ ఎన్నికల్లో బిర్యానీ రూ.150 అంతే.. కాస్ట్లీ అంటే కుదరదు!
లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడానికి వీల్లేదు. వారు ఖర్చు చేసే ప్రతి పైసాకు ఎన్నికల కమిషన్‌కు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ప్రచార సమయంలో తమ మద్దతుదారులకు ఇప్పించే ఛాయ్, సమోసాలకు ఖర్చుపెట్టిన డబ్బుకు కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపయోగించే 200కు పైగా వస్తువుల సవరించిన ధరల జాబితాను ఇటీవలి నోటిఫికేషన్లో ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు ఖర్చు పరిమితిని మించకుండా చూసుకోవడానికి వీటిని ఎన్నికల ప్రకటిచింది. ఈసీకి సమర్పించే ఖర్చుల వివరాల్లో ఆయా వస్తువులు, ఆహార పదార్థాలకు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువగా చూపించేందుకు వీలుండదు. పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితిని ఎలక్షన్ కమిషన్ ఈ సారి రూ.95 లక్షలకు పెంచింది. ఇది 2019 ఎన్నికల సమయంలో రూ. 70 లక్షలు ఉండేది. ఇందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వినియోగించే వస్తువులు, సేవల ధరలను కూడా ఈసీ స్వల్పంగా పెంచింది. ధరల జాబితాను ఉపయోగించి అభ్యర్థులు చేసే ఖర్చులను జిల్లా ఎన్నికల అధికారి మూల్యాంకనం చేస్తారు. చెన్నై జిల్లా ఎన్నికల అధికారి జె.రాధాకృష్ణన్ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. టీ ధరను రూ.10 నుంచి రూ.15కి, కాఫీ ధరను రూ.15 నుంచి రూ.20కి పెంచారు. అయితే చికెన్ బిర్యానీ ప్యాకెట్ ధరను మాత్రం రూ. 2019తో పోలిస్తే రూ.180 నుంచి రూ.150కు తగ్గించారు. మరోవైపు మటన్ బిర్యానీ ప్యాకెట్ ధరలో మార్పు లేదు. అది రూ. 200గా ఉంది. టీషర్టులు, చీరల ధరలు కూడా పెంచలేదు. ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనే వారికి అందించే ఆహారం, వాహనాలు, ప్రచార కార్యాలయాలు, సమావేశాల కోసం అద్దెకు తీసుకున్న ఇతర ఫర్నిచర్, వేదిక అలంకరణ ఖర్చులు, కూలీల ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యానర్లు, పోస్టర్లు, కుర్చీలు వంటి వస్తువులతో సహా అనేక అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి. జెండాలు, బాణాసంచా, పోస్టర్లు, దండలు, సాంస్కృతిక నృత్యాలతో సహా రాజకీయ నేతలకు స్వాగతం పలికేందుకు అయ్యే ఖర్చులు కూడా అభ్యర్థి ఖర్చుల్లోనే చేరుస్తారు. -
దేశంలో బంగారం ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25న దేశంలో బంగారం ధరలు ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,490గా ఉంది కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది -
నేడు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మాఘమాసం ముందు వరకు బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే పెళ్లి సీజన్ ప్రారంభంతో మార్కెట్ లో బంగారంపై డిమాండ్ పెరిగింది. పసిడి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఇక, ఫిబ్రవరి 21న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10లు తగ్గింది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పడిసి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,840 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,340 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది -
‘బంగారం’ లాంటి వార్తే.. తెలిస్తే ఈరోజే కొనేస్తారు!
Gold Rate today : పసిడి ప్రియులకు ఇది నిజంగా బంగారం లాంటి వార్తే. వారం రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గిపోయాయి. నిన్నటి రోజున స్పల్పంగా తగ్గిన పసిడి ధరలు ఈరోజు భారీగా దిగొచ్చాయి. వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు రూ.1000 పైగా తగ్గాయి. హైదరాబాద్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (ఫిబ్రవరి 14) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 లకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. పవిత్రమైన మాఘమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గడంతో మహిళలు, పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం పసిడి కొనుగోలుచేసేవారికి భారీ ఊరట లభిస్తోంది. దేశంలోని ఇతర నగరాల్లో.. ➦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,150 వద్ద, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.680 తగ్గి రూ.62,310 వద్ద కొనసాగుతోంది. ➦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.62,180 వద్ద ఉంది. ➦ చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 దిగొచ్చి రూ.57,500లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.650 క్షీణించి రూ.62,730 ఉంది. ➦ ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.600 తగ్గి రూ.57,000 లకు చేరింది. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. Silver Price : ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు (ఫిబ్రవరి 14) కేజీకి ఏకంగా రూ. 1500 తగ్గింది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75,500లుగా ఉంది. -
జీడిపప్పుకు సవాల్ విసిరిన వెల్లుల్లి!
వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ, జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని వైకుంఠ్‌పూర్, మనేంద్రగఢ్, చిర్మిరి, ఖడ్గవాన్‌తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని రూ.400 నుండి రూ.600కు విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి రూ.200కు విక్రయించగా, తరువాత అంతకంతకూ పెరుగుతూవస్తోంది. స్థానిక కూరగాయల వ్యాపారి రాజ్ కుష్వాహ తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో కిలో వెల్లుల్లి ధర రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.600 దాటింది. కూరల రుచిని పెంచే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం జీడిపప్పు ధరలతో వెల్లుల్లి ధర పోటీ పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మార్కెట్లో కిలో జీడి పప్పు ధర రూ. 800 నుంచి 1000 మధ్య ఉంటోంది. ప్రభుత్వం వెల్లుల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈసారి హోల్‌సేల్‌లో కూడా వెల్లుల్లి కిలో రూ.421 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో వెల్లుల్లి ధర రూ.600 దాటింది. గత శనివారం నుంచి కొత్త వెల్లుల్లి మార్కెట్లోకి రావడంతోనే వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరగడంపై ఈ ప్రాంత రైతు అమిత్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది అధికశాతం రైతులు వెల్లుల్లి సాగు చేశారన్నారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి ధర బాగా తగ్గిందన్నారు. దీంతో ఈ ఏడాది రైతులు వెల్లుల్లి సాగును తగ్గించారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి కొరత ఏర్పడింది. ఫలితంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత ఏడాది స్థానికంగా వెల్లుల్లి ఎక్కువగా పండడంతో గిట్టుబాటు ధర లభించక రైతులు తమ పంటలను నదులు, కాలువల్లో పడేశారు. గత సంవత్సరం, వెల్లుల్లి హోల్‌సేల్ ధర కిలో రూ. 40. మార్కెట్ ధర దీని కంటే తక్కువగా ఉంది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ఫలితంగా రైతులు ఈసారి వెల్లుల్లి సాగును తగ్గించారు. -
శుభ ముహూర్తాల వేళ పసిడి ప్రియులకు ఊరట!
Gold Rate today : దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతకు ముందు పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో పవిత్రమైన మాఘమాసం ప్రారంభమైంది. శుభ ముహుర్తాల వేళ బంగారం ధరల్లో పెరుగుదల లేకపోవడం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం. హైదరాబాద్‌తోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు (ఫిబ్రవరి 12) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద ఉండగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద ఉంది. ఇతర నగరాల్లో ఇలా.. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.58,300లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.63,600 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.63,100 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద స్థిరంగా ఉంది. -
బంగారం కొనుగోళ్లు... ఇదే మంచి తరుణమా?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఊరటనిచ్చాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధర ఈరోజు (ఫిబ్రవరి 9) స్వల్పంగా తగ్గింది. దీంతో ఈరోజు బంగారం కొనేవారికి ధరలు కాస్త దిగివచ్చినట్లయింది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.57,900 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.70 చొప్పున దిగొచ్చి రూ.63,160 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.57,900 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.70 తగ్గి రూ.63,160 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యల్పంగా రూ.10 తగ్గి రూ.58,390లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.10 చొప్పున తగ్గి రూ.63,710 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.58,050 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.20 తగ్గి రూ.63,310 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.57,900 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.70 తగ్గి రూ.63,160 వద్దకు చేరింది. cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు పెరిగాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.76,500 వద్ద ఉంది. ఇది క్రితం రోజున రూ. 76,000 లుగా ఉండేది. -
వివాదంలో అయోధ్యలోని రెస్టారెంట్ : నోటీసులు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య అనే నగరం గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన శ్రీ రామ జన్మభూమి దేవాలయం నిర్మాణ ప్రతిపాదన మొదలు, ఇటీవల ఘనంగా రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక దాకా ప్రతీదీ విశేషంగా నిలుస్తోంది. తాజాగా అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. తక్కువ ధరల్లో భక్తుల సేవలందించాల్సిన హోటల్ అధిక చార్జీలు వసూలు చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. శ్రీరాముడికి ఎంగిలి పళ్లు తినిపించిన అపర భక్తురాలైన శబరి పేరుతో ఏర్నాటైన రెస్టారెంట్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. శబరి రసోయిలో రెండు కప్పుల టీ , రెండు బ్రెడ్ ముక్కల కోసం ఏకంగా రూ. 252 వసూలు చేసింది. సంబంధిత బిల్లును కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత అన్యాయం అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఈ అంశం చివరికి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ఏడీఏ)కి చేరింది. దీంతో సదరు హోటల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది, లేని పక్షంలో ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఏడీఏ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ హెచ్చరించారు. अयोध्या | शबरी रसोई 55 रुपए की एक चाय 65 रुपए का एक टोस्ट राम नाम की लूट है, लूट सके तो लूट pic.twitter.com/rRrl6eRBaB — Govind Pratap Singh | GPS (@govindprataps12) January 24, 2024 ఒప్పందం ప్రకారం బడ్జెట్ కేటగిరీ కింద జాబితా చేయబడిన ఈ రెస్టారెంట్ భక్తులకు , యాత్రికులకు రూ. 10కి ఒక కప్పు టీ, రెండు టోస్ట్లను అందించాల్సి ఉంది. మరోవైపు ఈ ఆరోపణలు సదరు రెస్టారెంట్ ఖండించింది. ఇది ఫ్రీ గా తినాలనుకుని భావించిన కస్టమర్ల పన్నాగమని, బిల్లును సోషల్ మీడియాలో వైరల్ కావడం వెనుక కుట్ర ఉందని శబరి రసోయి రెస్టారెంట్ ప్రాజెక్ట్ హెడ్ సత్యేంద్ర మిశ్రా వ్యాఖ్యానించారు. తమ వద్ద పెద్ద పెద్ద హోటళ్లలో ఉండే సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. అథారిటీ నోటీసులకు సమాధానమిచ్చినట్టు తెలిపారు.. అరుంధతీ భవన్ పేరుతో కొత్తగా నిర్మించిన వాణిజ్య సముదాయంలో శబరి రసోయి ఉంది. ఇది రామ మందిరం సమీపంలోని తెహ్రీ బజార్లో అహ్మదాబాద్‌కు చెందిన కవాచ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ దీన్ని ఏర్పాటు చేసింది. -
Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి!
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (జనవరి 3) కాస్త తగ్గాయి. మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు నిన్నటి రోజున పెరిగి మళ్లీ ఈరోజు దిగివచ్చాయి. దీంతో కొత్త ఏడాదిలో బంగారం కొంటున్నవారికి కాస్త ఉపశమనం కలిగినట్లయింది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 చొప్పున తగ్గి రూ. 58,500 లకు దిగివచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల పసిడి ధర రూ. 270 చొప్పున తరిగి రూ.63,820 లకు క్షీణించింది. క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 58,500, రూ. 63,820 ఉండేవి. క్లిక్ చేయండి: దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు Silver Price Today: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా మోస్తరుగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 తగ్గింది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 80,000 లుగా ఉంది. ఇది క్రితం రోజున రూ.80,300 ఉండేది. -
వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే..
విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 4 శాతం తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. వరుసగా మూడో నెలలోనూ దీని ధర తగ్గింది. వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) రేటు స్వల్పంగా కుదించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 19 కిలోల సిలిండర్ ధరను రూ.1.50 కట్ చేశారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రేటు ప్రస్తుతం దేశ రాజధానిలో రూ.1,755.50, ముంబైలో రూ.1,708.50 ఉంది. అయితే, గృహాల్లో వినియోగించే ఎల్పీజీ ధర మాత్రం మారలేదు. 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ.903 ఉంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర 3.9 శాతం తగ్గింపుతో రూ.4,162.5కు చేరింది. జెట్ ఇంధన ధరల్లో నెలవారీ తగ్గింపు ఇది వరుసగా మూడోది. ఏటీఎఫ్ ధర నవంబర్‌లో దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ.6,854.25) డిసెంబర్లో రూ.5,189.25 లేదా 4.6 శాతం తగ్గింది. ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు.. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40 శాతం ఇంధనానికే ఖర్చవుతోంది. ఫ్యూయెల్ ధర తగ్గింపుతో ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థలపై కొంత భారం తగ్గనుంది. -
ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు..
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఉత్పత్తులు అన్నింటిపై ‘తయారీ తేదీ’ని, ‘యూనిట్ విక్రయ ధర’ను తప్పనిసరిగా ముద్రించాలన్న నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇలాంటి ఉత్పత్తులను వేర్వేరు పరిమాణాల్లో విక్రయిస్తారు కాబట్టి ‘యూనిట్ విక్రయ ధర’ ఎంతనేది వినియోగదారులకు తెలియాల్సిన అవసరం ఉందని, తద్వారా వారు కొనుగోలు విషయంలో తగు నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై తయారీ తేదీని లేదా దిగుమతి చేసుకున్న తేదీని లేదా ప్యాక్ చేసిన తేదీని ముద్రించేందుకు కంపెనీలకు వెసులుబాటు ఉండేది. దాన్ని ప్రస్తుతం మార్చారు. తయారీ తేదీని ముద్రించడం వల్ల సదరు ఉత్పత్తి ఎన్నాళ్ల క్రితం తయారైనదీ వినియోగదారులకు స్పష్టంగా తెలిసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే యూనిట్ ధరను ముద్రించడం వల్ల గ్రాముల లెక్కన ఖరీదు ఎంత ఉంటోందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 2.5 కేజీల గోధుమ పిండి ప్యాకెట్‌పై గరిష్ట చిల్లర ధరతో (ఎంఆర్పీ) పాటు కేజీ (యూనిట్) ధర ఎంత అనేది కూడా ముద్రించాల్సి ఉంటుంది. ఒకవేళ కేజీ కన్నా తక్కువ పరిమాణం ఉంటే ఎంఆర్పీతో పాటు గ్రాముకి ఇంతని ముద్రించాలి. -
2023 సామాన్యునికి ఏమిచ్చింది?
గడచిన 2020, 2021 సంవత్సరాల్లో కరోనా మహమ్మారి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దేశవ్యాప్తంగా అమలైన లాక్డౌన్, కరోనా ఆంక్షలు సామాన్యుల వెన్ను విరిచాయి. వ్యాపారాలు నిలిచిపోవడంతో చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే 2022లో పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. వ్యాపారాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయి. ఆ దశ దాటాక వచ్చిన 2023 సామాన్యులకు ఉపశమనం కలిగించింది. మాల్స్‌లో జనం బారులు దేశంలో జీడీపీ వృద్ధి కూడా ఊహించిన దాని కంటే అధికంగానే ఉంది. 2023లో మార్కెట్లలో మంచి ఆర్థికవృద్ధి కనిపించింది. రెస్టారెంట్లు జనాలతో నిండిపోయాయి. మార్కెట్లు, మాల్స్‌లో జనం గుంపులు గుంపులుగా కనిపించారు. ఇది జీడీపీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మించి 7.6 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల అద్భుతమైన పనితీరు కారణంగా రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఊహించిన దాని కంటే అధికంగా ఉంది ఉంది. రూ. 200 దాటిన టమాటా వ్యవసాయం పరంగా కూడా ఈ ఏడాది బాగానే ఫలితాలు వచ్చాయి. బియ్యం, ఇతర ధాన్యాల ఉత్పత్తి వృద్ధి చెందింది. ద్రవ్యోల్బణం విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువగానే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. జూలై-ఆగస్టులో టమాటా ధరలు కిలో రూ.200 దాటాయి. దీంతో ప్రభుత్వం టమాటాను రాయితీ ధరలకు విక్రయించాల్సి వచ్చింది. టమోటా తర్వాత ఉల్లి ధరలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు ఉల్లి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. తగ్గిన నిరుద్యోగిత రేటు 2023 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు తగ్గింది. జూలై-సెప్టెంబర్ 2023లో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 7.2 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.6 శాతంగా ఉంది. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.6 శాతంగా నమోదైంది. అదే సమయంలో మహిళా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. 2023 సంవత్సరం ఉపాధి రంగంలో మిశ్రమ సంవత్సరంగా నిలిచింది. ఇది కూడా చదవండి: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
పార్లమెంట్ క్యాంటీన్లో ఏమేమి దొరుకుతాయి? వెజ్, నాన్ వెజ్ ధరలు ఎంత?
నూతన పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇకపై ఇక్కడే పార్లమెంట్ కార్యకలాపాలన్నీ కొనసాగనున్నాయి. అయితే పార్లమెంటు గురించి మాట్లాడినప్పుడల్లా అక్కడి క్యాంటీన్ గురించిన ప్రస్తావన వస్తుంది. పార్లమెంటు క్యాంటీన్లో అతి చౌక ధరలకు లభించే ఆహార పదార్థాల గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతుంటుంది. పార్లమెంటు క్యాంటీన్లో ఏ ఆహారం ఎంత ధరకు దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2021వ సంవత్సరంలో పార్లమెంట్ క్యాంటీన్ రేట్ లిస్ట్‌లో మార్పులు చేశారు. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2021లో క్యాంటీన్ రేట్లను సవరించింది. దీంతో పలు ఆహార పదార్థాల రేట్లు పెరిగాయి. ఉదాహరణకు గతంలో చపాతీ రేటు రూ.2 ఉండగా, తర్వాత దానిని రూ.3కి పెంచారు. అలాగే చికెన్, మటన్ వంటకాల రేట్లు కూడా పెంచారు. పార్లమెంట్ క్యాంటీన్లో ఆహార పదార్థాల ధరలు ఇలా ఉన్నాయి. ఆలూ బోండా రూ.10, చపాతీ రూ.3, పెరుగు రూ.10, దోశ రూ.30, లెమన్ రైస్ రూ.30, మటన్ బిర్యానీ రూ.150, మటన్ కర్రీ రూ.125, ఆమ్లెట్ రూ.20, ఖీర్ రూ.30, ఉప్మా రూ.25, సూప్ రూ.25, సమోసా రూ.10, కచోరీ రూ. 15, పనీర్ పకోడా రూ. 50కు దొరుకుతుంది. ఇది కూడా చదవండి: ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి? -
ఈ దేశాల్లో విడాకుల కేసులు అధికం!
కుటుంబ విలువల గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు భారతదేశం గురించి గొప్పగా చెబుతారు. విలువలకు పట్టంకట్టే భారతీయ సంస్కృతి ఘనత మరోమారు ప్రపంచానికి తెలిసింది. వరల్డ్ ఆఫ్ స్టాటస్టిక్స్ ఇటీవల ఒక రిపోర్టును వెలువరించింది. దీనిలో అత్యధికంగా విడాకులు తీసుకుంటున్న దేశాల జాబితా ఉంది. ఈ పరిశోధనా సర్వే జాబితా ద్వారా భారత్ కుటుంబ విలువలను కాపాడే విషయంలో ముందున్నదని మరోమారు తేలింది. ఈ రిపోర్టును అనుసరించి భారత్‌లో విడాకుల కేసులు కేవలం ఒక్కశాతం మాత్రమే ఉన్నాయి. పలుదేశాల్లో 94 శాతం పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయని ఈ నివేదిక చెబుతోంది. వరల్డ్ స్టాటస్టిక్స్ అందించిన డేటాను అనుసరించి చూస్తే అసియా దేశాల్లో విడాకుల విషయంలో తూర్పు, పశ్చిమ దేశాలైన యూరప్, అమెరికాల్లో అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ఈ దేశాల్లో కుటుంబం ఏర్పడకముందే జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. ఈ రిపోర్టును అనుసరించి భారత్‌లో విడాకుల కేసులు కేవలం ఒకశాతం మాత్రమే ఉన్నాయి. భారత్ తరువాత అత్యల్ప స్థాయిలో విడాకులు నమోదవుతున్న దేశాల్లో వియత్నాం ఉంది. ఈ దేశంలో 7శాతం మేరకు విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ఈ డేటాలో వెల్లడైన వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక విడాకులు పోర్చుగల్‌లో నమోదవుతున్నాయి. ఇక్కడ విడాకుల రేటు 94 శాతంగా ఉండటం గమనార్హం. అదేవిధంగా స్పెయిన్ కూడా విడాకుల విషయంలో తగ్గేదేలే.. అన్నట్లుంది. స్పెయిన్ లాంటి అభివృద్ధి చెందిన దేశంలో విడాకుల రేటు 85 శాతంగా ఉంది. కాగా సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాలే విడాకులకు కారణమని ఈ నివేదిక వెల్లడించింది. ఇది కూడా చదవండి: పాస్‌పోర్ట్ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా! Divorce rate: 🇮🇳India: 1% 🇻🇳Vietnam: 7% 🇹🇯Tajikistan: 10% 🇮🇷Iran: 14% 🇲🇽Mexico: 17% 🇪🇬Egypt: 17% 🇿🇦South Africa: 17% 🇧🇷Brazil: 21% 🇹🇷Turkey: 25% 🇨🇴Colombia: 30% 🇵🇱Poland: 33% 🇯🇵Japan: 35% 🇩🇪Germany: 38% 🇬🇧United Kingdom: 41% 🇳🇿New Zealand: 41% 🇦🇺Australia: 43% 🇨🇳China: 44%… — World of Statistics (@stats_feed) May 1, 2023 -
భూమిపై పెరిగే బంగారం! టేబుల్ రేటు రూ.7కోట్లు.. కుర్చీ రూ.2 కోట్లు!
‘భూ మండలంలో యాడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరగుతుండాది. ఈడ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు ఎళ్తుండాది. గోల్డ్ రా ఇది. భూమిపై పెరిగే బంగారం పేరు ఎర్ర చందనం’ పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ప్రపంచమంతా ట్రెండింగ్ అయ్యింది. నిజంగా ఎర్ర చందనానికి ఉండే క్రేజ్ అలాంటిది మరి. చైనాలో అయితే.. ఎర్ర చందనంతో చేసిన కుర్చీ రూ.2 కోట్ల ధర పలుకుతోందట. ఈ మధ్య చైనా వెళ్లిన ఏపీ అటవీ శాఖ అధికారులకు అక్కడ ఎర్ర చందనం ధరలు తెలిసి మతిపోయినంత పనైందట. ఎర్ర చందనానికి చైనాలో ఉన్న మోజు అంతా ఇంతా కాదు. తమ ఇళ్లలో ఆ కలపతో చేసిన ఫర్నిచర్, గృహాలంకరణ వస్తువులు ఉండటం చాలా గొప్పగా భావిస్తారు. అందుకే ధర ఎంతైనా ఎర్ర చందనంతో తయారు చేసిన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. బీజింగ్‌లోని ఓ ఫర్నిచర్ షాపులో ఎర్ర చందనంతో చేసిన డైనింగ్ టేబుల్ ధర రూ.7 కోట్లు. ఒక సోఫా సెట్ రేటు రూ.5 కోట్లు. కుర్చీ ధర రూ.2 కోట్లు. ఎర్ర చందనం మార్కెట్‌పై అధ్యయనం చేసేందుకు ఇటీవల చైనా వెళ్లిన మన రాష్ట్ర అటవీ శాఖాధి కారులు అక్కడి రేట్లు చూసి నివ్వెరపోయారు. మన రాష్ట్రంలో ఎర్ర చందనం అక్రమ రవాణా ఎందుకు జరుగుతుందో, దాని కోసం స్మగ్లర్లు ప్రాణాలకు తెగించి మరీ ఎందుకు రిస్కు తీసుకుంటారో చైనాలోని ఫర్నిచర్ షాపుల్లోని వస్తువుల ధర చూసి అధికారులకు అవగతమైంది. గ్రేడ్లను బట్టి రేటు అంతర్జాతీయ మార్కెట్లో ఎర్ర చెక్క సి గ్రేడ్ అయితే టన్ను రూ.30 లక్షలు ఉంటుంది. మధ్యస్థంగా ఉంటే రూ.45 లక్షలు పలుకుతుంది. నాణ్యమైన ఏ గ్రేడ్ చెక్క అయితే రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుంది. చైనా వ్యాపారులు, అంతర్జాతీయ స్మగ్లర్లు ఈ ధరకు ఎర్ర చందనాన్ని కొనుగోలు చేస్తారు. జపాన్, మయన్మార్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో దీనికి డిమాండ్ ఉంది. అందుకే ప్రాణాలకు తెగించి శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఆ చెట్లు నరకడానికి ప్రయత్నాలు చేస్తారు. గత కొన్నేళ్లుగా అక్రమ రవాణాను అడ్డుకుని సీజ్ చేసిన 8 వేల టన్నుల ఎర్ర చందనం దుంగల్ని గతంలో అటవీ శాఖ వేలం వేసింది. ఇంకా 5,400 టన్నుల కలప ఉండగా రెండు నెలల క్రితం వేలం వేసి 320 టన్నుల్ని వేలం ద్వారా విక్రయించగా రూ.170 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా 5,100 టన్నుల కలపను త్వరలో వేలం వేయనున్నారు. త్వరలో గ్లోబల్ టెండర్లు పిలుస్తాం చైనాలో ఎర్ర చందనం వస్తువులకు మహా మోజు ఉంది. అక్కడి మార్కెట్ గురించి అధ్యయనం చేశాం. అందుకు అనుగుణంగా అటవీ శాఖ వద్ద ఉన్న కలపను వేలం వేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. తొలిసారి వేలంలో మంచి రేటు వచ్చింది. వచ్చే నెలలో మిగిలిన 5 వేల టన్నులకుపైగా దుంగల్ని వేలం వేసేందుకు మరోసారి గ్లోబల్ టెండర్లు పిలుస్తాం. ఎంఎస్టీసీ ద్వారా ఇంటర్నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ నిర్వహిస్తాం. మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. – మధుసూదన్‌రెడ్డి, అటవీ దళాల అధిపతి, పీసీసీఎఫ్ ఎంత ఎర్రగా ఉంటే అంత నాణ్యం ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఆ చెట్లను ఇష్టానుసారం నరికి అక్రమంగా రవాణా చేస్తుండటంతో ఎర్ర చందనం వృక్షాలు అంతరిస్తున్న జాబితాలోకి చేరాయి. అందుకే మన ప్రభుత్వం అడవుల్లో చెట్లను నరకడం చట్ట విరుద్ధంగా పేర్కొంది. అయినా అది సరిహద్దులు దాటిపోతూనే ఉంది. శేషాచలం అడవుల్లో సుమారు 5 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్ర చందనం చెట్లు ఉన్నాయని అంచనా. అవి ఎక్కడపడితే అక్కడ పెరగవు. వాటికి అంతా అనుకూలంగా ఉన్నచోట తొలి మూడేళ్లు వేగంగా పెరుగుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతుంటాయి. కనీసం 30 సంవత్సరాలకు గానీ మధ్యలోని చెక్క రంగు ఎరుపు రంగులోకి మారదు. అదే వంద నుంచి రెండు వందల సంవత్సరాలపాటు పెరిగితే లోపలి భాగం మరింత ఎర్రగా, వెడల్పుగా ఉంటుంది. కాబట్టి చెట్టుకు ఎన్నేళ్లుంటే అది అంత ఖరీదు. శేషాచలం అడవుల నేలలో అమ్ల శాతం, పోషకాలు, నీరు ఈ చెట్లు పెరగడానికి సరిపోతాయి. ఆ నేలలో ఉండే క్వార్ట్జ్ రాయి కూడా ఈ చెట్లు పెరగడానికి దోహదపడుతుంది. ఇక్కడ నేలలో ఉన్న సమ్మేళనం మరెక్కడా ఉండదని, నేలతోపాటు వాతావరణం అవి పెరగడానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతి -
ప్చ్.. ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు!
ఒకనొక సమయంలో ప్రపంచం మొత్తంమీద జనాభా పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు జనాభా తగ్గుతూవస్తోంది. దీనికి కారణం లో బర్త్ రేట్. దీనికారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలు తలెత్తనున్నాయి. Birth Rate : కొంతకాలం క్రితం వరకూ మనమంతా జనాభా నియంత్రణ గురించి మాట్లాడేవాళ్లం. అయితే ఇప్పుడు దీనికి రివర్స్ అయ్యింది. కొన్ని దేశాల్లో ఇప్పుడు జనాభా సంఖ్యను పెంచాలంటూ అక్కడి ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. భూమిపై తొలిసారి జనసంఖ్య తక్కువవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనివలన ఏమవుతుందనే ప్రశ్న మనందరిలో మెదులుతుంది. ప్రపంచంలో జననాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం మరణాల రేటు పెరగడం కాదు. జననాలు రేటు తగ్గడం. చైనా, భారత్‌లో కూడా 2.1 కంటే దిగువకు జనన రేటు.. సంతానోత్పత్తిలో మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేసే ఆర్థికవేత్త మాథియాస్ డోప్కే తెలిపిన వివరాల ప్రకారం జనన రేటు తగ్గుదల అనేది కొన్ని సంపన్న దేశాలు, దేశంలోని సంపన్న కుటుంబాలకు మాత్రమే పరిమితం కాలేదు. చైనా, భారత్, బ్రెజిల్, మెక్సికోతో సహా 15 పెద్ద ఆర్థిక వ్యవస్థలలో జనన రేటు 2.1 కంటే తక్కువగా ఉంది. ఇందులో అమెరికా వంటి సంపన్న దేశాలు, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్ కూడా ఉన్నాయి. తక్కువ జనన రేటుతో సమస్యలివే.. తక్కువ జననాల రేటు కారణంగా వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. గతంలో జపాన్,ఇటలీలలో ఎక్కువ మంది వృద్ధులు ఉండేవారు. కానీ ఇప్పుడు బ్రెజిల్, మెక్సికో,థాయ్‌లాండ్ కూడా ఈ జాబితాలో చేరాయి. సైకాలజిస్టులు తెలిపిన వివరాల ప్రకారం యువతకు సృజనాత్మకంగా ఆలోచించే శక్తి ఉంటుంది. యువత సమస్యను కొత్త మార్గంలో పరిష్కరిస్తుంది. యువత కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తుంటుంది. 2030 నాటికి, తూర్పు, ఆగ్నేయాసియా జనాభాలో సగం మంది 40 ఏళ్లు పైబడిన వారే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గుదల కారణంగా ఈ శతాబ్దం మధ్య నాటికి విద్యావంతులైన యువ కార్మికుల కొరత ఏర్పడుతుంది. జనం పిల్లలను కనాలని కోరుకోవడం లేదు. ఫలితంగా ప్రపంచంలో తక్కువ సంఖ్యలో యువత ఉంటుంది. ఫలితంగా దేశాభివృద్ధి కుంటుపడుతుంది. 1950-2021 మధ్య కాలంలో జననరేటు తగ్గుదల ఇలా.. దక్షిణ కొరియా: 86% చైనా: 81% థాయిలాండ్: 79% జపాన్: 77% ఇరాన్: 73% బ్రెజిల్: 72% కొలంబియా: 70% మెక్సికో: 70% పోలాండ్: 69% టర్కీ: 68% రష్యా: 67% సౌదీ అరేబియా: 67% మలేషియా: 66% మొరాకో: 66% ఉక్రెయిన్: 66% ఇటలీ: 65% కెనడా: 63% భారతదేశం: 63% పెరూ: 63% బంగ్లాదేశ్: 62% మయన్మార్: 62% స్పెయిన్: 62% వియత్నాం: 61% ఇండోనేషియా: 60% అల్జీరియా: 58% ఈజిప్ట్: 58% నేపాల్: 57% ఫిలిప్పీన్స్: 56% దక్షిణాఫ్రికా: 52% యునైటెడ్ స్టేట్స్: 52% ఫ్రాన్స్: 49% అర్జెంటీనా: 47% కెన్యా: 44% జర్మనీ: 43% యెమెన్: 42% ఘనా: 41% ఉజ్బెకిస్తాన్: 41% ఇరాక్: 40% యునైటెడ్ కింగ్డమ్: 39% పాకిస్తాన్: 37% నైజీరియా: 19% ఇది కూడా చదవండి: 17కు వ్యాపారం.. 19కి సెటిల్.. 22కు రిటైర్మెంట్.. అమెరికా కుర్రాడి సక్సెస్ స్టోరీ -
మాఫీ చేసిన రుణ వసూళ్లు పెంచుకోవాలి: బ్యాంకులకు ఆర్థిక శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు మాఫీ చేసిన (ఖాతాల్లో రద్దు) మొండి రుణాల (ఎన్పీఏలు)ల వసూళ్ల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచన చేసింది. వీటి వసూళ్ల రేటు తక్కువగా ఉండడంతో కనీసం 40 శాతానికి అయినా పెంచుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి ఐదేళ్ల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.7.34 లక్షల కోట్లను ఖాతాల్లో మాఫీ చేశాయి. ఇందులో 14 శాతాన్నే అవి వసూలు చేసుకోగలిగాయి. మాఫీ చేసినప్పటికీ వాటిని వసూలు చేసుకునే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. 2022 మార్చి నాటికి మాఫీ చేసిన రూ.7.34 లక్షల కోట్లలో రూ.1.03 లక్షల కోట్లనే వసూలు చేశాయి. ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు దీంతో 2022 మార్చి నాటికి నికరంగా మాఫీ చేసిన ఎన్పీఏల మొత్తం రూ.6.31 లక్షల కోట్లుగా ఉంది. ఈ విధమైన వసూళ్లు ఆమోదయోగ్యం కాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇలా వసూలయ్యే మొత్తం బ్యాంకుల నికర లాభాలను పెంచుతుందని పేర్కొన్నాయి. ఈ పరిస్థితిపై సమీక్ష చేయడానికి వీలుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ త్వరలోనే పీఎస్బీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పాయి. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం రూ.11.17 లక్షల కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు -
చైనా షాకింగ్ నిర్ణయం..పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా..
ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనాలో వేగవంతంగా జనాభా క్షీణించడంతో దాన్ని నియంత్రించేలా పలు చర్యలు ఇప్పటికే తీసుకుంది చైనా. ఇప్పుడు ఇంకాస్త ముందడుగు వేసి.. యావత్ ప్రపంచం విస్తుపోయేలా సంచలన నిర్ణయం తీసుకుంది. అవివాహితలు, ఒంటరి మహిళలు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనే వెసులుబాటుని ఇస్తోంది. పెళ్లైన జంటలకు మాత్రమే ఉండే పిల్లల సబ్సిడీలను అవివాహిత గర్భిణీలు కూడా పొందవచ్చునని చెబుతోంది. అవివాహిత స్త్రీల పిల్లల జనన నమోదును చట్టబద్ధం చేసింది. వారు కూడా వేతనంతో కూడిన ప్రశూతి సెలవులు కూడా తీసుకోవచ్చు అంటూ ఆఫర్లు ఇస్తోంది. ఈ మేరకు చైనాలోని అవివాహిత స్త్రీలు ప్రైవేట్ లేదా పబ్లిక్ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ చికిత్సను పొందవచ్చు. ఈ నేపథ్యంలోనే నైరుతి సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డులో విడాకులు తీసుకున్న 33 ఏళ్ల మహిళ దీన్ని ఆశ్రయించే తల్లి కాబోతోంది. ప్రస్తుత ఆమె 10 వారాల గర్భవతి. చాలా మంది ఒంటరి మహిళలు దీన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ఐవీఎఫ్‌ని సరళీకృతం చేస్తే గనుక ఇదొక పెద్ద మార్కెట్‌గా విస్తరించే అవకాశం ఉందంటున్నారు నిపుణలు. సాధారణ సంతానోత్పత్తి సేవలపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో ఐవీఎఫ్ చికిత్సకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆసియా పసిఫిక్ వ్యాపార అభివృద్ధి డైరెక్టర్ వైవ్ లిప్పెన్స్ హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రల్లో మహిళలందరికీ ఐవీఎఫ్ చికిత్స అందిస్తారనేది స్పష్టత లేదు. ఇప్పటివరకు ఎంత మంది మహిళలు దీన్ని ఉపయోగించుకున్నారనేది కూడా స్పష్టం కాలేదు. కానీ చాలా మంది మహిళలు ఐవీఎఫ్ సెంటర్లకు క్యూ కడుతున్నట్లు సమాచారం. జాతీయ ఆరోగ్య కేంద్రం మరిన్ని ఐవీఎఫ్ సెంటర్లను అందుబాటులో తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చైనా వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇంతకు మునుపు చైనా పెళ్లికాని మహిళలకు ఐవీఎఫ్ సేవలను నిషేధించింది. ఎప్పుడైతే జనాభా క్షీణించడం ప్రారంభించిందో అప్పటినుంచి చైనా పిల్లలను కనేలా ప్రజలకు బారీ ఆఫర్లు అందిస్తూ ప్రోత్సహించింది. ఈ క్రమంలో పలు నిబంధనలు ఎత్తి వేసి కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ ఐవీఎఫ్ చికిత్సా విధానం తెరమీదకు వచ్చింది. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో యాపిల్ జ్యూస్ వివాదం..యువతి అరెస్టు) -
'ప్రేమలో పడండి' అని విద్యార్థులకు సెలవులు మంజూరు!
చైనా ఎప్పుడూ దూకుడుగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజగా మరో వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చైనాలో జననాల రేటు పడిపోవటంతో.. పెంచే దిశగా రకరకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకోసం ప్రజలను ప్రోత్సహించేలా చైనా చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా ప్రస్తుతం 'ప్రేమలో పడండి" అంటూ విద్యార్థులకు సెలవులు కూడా మంజూరు చేసింది. ఈ మేరకు చైనాలో తొమ్మిది కళాశాలల్లోని విద్యార్థులను 'ప్రేమలో పడండి" అంటూ ఏప్రిల్ నెలలో వారం రోజులు సెలవులు ఇస్తున్నట్లు సమాచారం. చైనా స్థానికి మీడియా ప్రకారం...ఫ్యాన మీయి ఎడ్యుకేషన్ గ్రూప్ నిర్వహిస్తున్న మిన్యాంగ్ ప్లయింగ్ వొకేషనల్ కాలేజ్ మొదటి మార్చి 21 నుంచి వసంత విరామాన్ని ప్రకటించింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ..జీవితాన్ని ప్రేమించడం, ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోండి అని విద్యార్థులను ప్రొత్సహిస్తోంది చైనా. జనన రేటును పెంచడంలో భాగంగా చేస్తున్న ప్రయత్నం అని చెబుతుండటం విశేషం. అదీగాక జనన రేటును పెంచడానికి ప్రభుత్వానికి 20కి పైగా సిఫార్సులు వచ్చాయి. ఐతే నిపుణలు జనాబా క్షీణతను తగ్గించే ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూ..ఇదోక ప్రయత్నంగా తెరమీదకు తీసుకువచ్చి అమలు చేశారు. వాస్తవానికి 1980 నుంచి 2015 మధ్య విధించిన ఒక బిడ్డ విధానం చైనాను తన గుంత తనే తవ్వుకునేలా చేసింది. కరోనా మహమ్మారి తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల కారణంగా చైనాలో ఒక్కసారిగా జననాల రేటు ఘోరంగా పడిపోయింది. దీంతో చైనా జనాభాను పెంచేందుకు రకరకాలుగా యత్నిస్తున్నా.. అందుకు ప్రజలు సుముఖంగా లేరు. ఎందుకంటే ఎక్కవ మంది పిల్లల కారణంగా వారి సంరక్షణ, విద్యకు సరిపడే ఆదాయం లేకపోవడంతో విముఖత చూపిస్తున్నారు. ముగ్గురి కంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు పలు రాయితీలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా..ప్రజల నుంచి సానూకూల స్పందన రాకపోవడం గమనార్హం. దీంతో నిపుణులు జనాభా క్షీణతను నియంత్రించేలా ఇలా వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. (చదవండి: గాల్లో ఉండగానే హాట్ ఎయిర్ బెలూన్‌లో ఎగిసిపడ్డ మంటలు..) -
తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్.. గతేడాదితో పోలిస్తే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 4.44 శాతం క్రైం రేట్ పెరిగిందన్నారు. సైబర్ క్రైమ్ కేసులు 57 శాతం పెరిగాయి. 2022 లో రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎన్కౌంటర్లు జరగాయని, ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారన్నారు. 120 మంది మావోయిస్టులు లొంగిపోగా, వారి నుంచి 14 ఆయుధాలు, 12 లక్షల 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ వివరించారు. ‘‘కన్విక్షన్ రేట్ 50 నుండి 56 శాతానికి పెరిగింది. 152 మందికి జీవితకాలం శిక్ష పడింది. సీసీ కెమెరాలు ద్వారా 18,234 కేసులు ఛేదించాం. 431 మంది పై పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపించాం. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్‌కి 6,157 ఫిర్యాదులు వచ్చాయి.. వీటిలో 2,128 కేసులు నమోదు చేశాం. డయల్ 100 కి 13 లక్షల 77 వేళా 113 కాల్స్ వచ్చాయి. ఫింగర్ ప్రింట్స్ ద్వారా 420 కేసులను ఛేదించాం’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది 762 హత్యకేసులు నమోదయ్యాయి. 2,126 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 1176 డ్రగ్ కేసులు నమోదవ్వగా 2582 నిందితులను అరెస్ట్ చేశాం. మహిళలపై క్రైమ్ కేసులు 17,908 నమోదయ్యాయి. 2432 పొక్సో కేసులు నమోదు. 2022లో 24,127 దోపిడీ కేసులు నమోదయ్యాయి. 148 కోట్ల దోపిడీ జరగగా 74 కోట్లు రికవరీ చేశాం. 19,456 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 6,746 మంది ప్రాణాలు కోల్పోయారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక కోటి 65 లక్షల 84 వేల కేసులు నమోదు చేశాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 612 కోట్ల రూపాయల జరిమానాలు వేశాం. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 25 వేల సీసీ కెమెరాలున్నాయి. ఈ సంవత్సరం లక్షా 75 వేల కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం’’ అని డీజీపీ వెల్లడించారు. -
జూలైలో పుంజుకున్న ఉపాధి కల్పన
కోల్‌కతా: ఈ ఏడాది జూన్ నెలలో నిరుద్యోగ రేటు తగ్గిపోగా.. జూలైలో ఈ ధోరణి తిరిగి సానుకూలంగా మారినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తెలిపింది. జూలై 12 నుంచి చూస్తే మూడు రోజుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చి 7.29 శాతానికి చేరుకుందని పేర్కొంది. ఈ నెల 12న 7.33 శాతంగా ఉండగా, 13న 7.46 శాతం, 14న 7.29 శాతంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జూన్ నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.80 శాతంగా ఉందని సీఎంఐఈ అంతకుముందు నెలవారీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో 7.30 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.03 శాతం ఉన్నట్టు తెలిపింది.1.3 కోట్ల మందికి ఉపాధి కల్పన నష్టం జరిగిందని, సాగు రంగంలో పనులు లేకపోవడం వల్లేనని పేర్కొంది. తాజా గణాంకాలపై ఆర్థికవేత్త అభిరూమ్ సర్కార్ స్పందిస్తూ.. రుతువుల వారీగా ఏజెన్సీ సేకరించే గణాంకాల్లో లోపాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్నారు. -
అదంతా నాన్సెన్స్: ఎలన్ మస్క్
Fewer Kids Environment Theory: స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో తెర మీదకు వచ్చాడు. పర్యావరణం బాగుండాలంటే.. తక్కువ సంతానం కలిగి ఉండాలంటూ వినిపించే వాదనను ఆయన తోసిపుచ్చాడు. ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే.. అది వాతావరణానికి హాని అని అంటుంటారు. అందుకే తక్కువ మంది కనమని సలహాలిస్తుంటారు. అదంతా నాన్సెన్స్. జనాభా ఎంత పెరిగినా.. పర్యావరణానికి వచ్చిన నష్టం ఏం ఉండదు’’ అని ఆయన ఆల్ఇన్ సమ్మిట్( All-In Summit)లో వీడియో కాల్ ద్వారా వ్యాఖ్యానించారు. కనీసం మన సంఖ్యను కాపాడుకుందాం. అలాగని నాటకీయంగా జనాభాను పెంచాల్సిన అవసరం ఏమీ లేదు అని వ్యాఖ్యానించాడు ఏడుగురు బిడ్డల తండ్రైన ఎలన్ మస్క్. ఉదాహరణకు.. జపాన్‌లో జనన రేటు చాలా తక్కువ. కానీ, నాగరికతను కొనసాగించాలంటే.. జనాభా అవసరం ఎంతైనా ఉంది. దానిని మనం తగ్గించలేం అంటూ ఎలన్ మస్క్ వ్యాఖ్యలు చేశారు. అయితే జపాన్ పరిస్థితి ఇంతకు ముందు మస్క్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జపాన్ జనాభా తగ్గిపోవడం ఆందోళనకరమైన అంశంగా పేర్కొన్న ఆయన.. జనాభా రేటులో మార్పుతేకుంటే ఆ దేశం ఉనికికే ప్రమాదని హెచ్చరించారు కూడా. అభివృద్ధి చెందిన దేశాల్లో.. పిల్లలను తక్కువగా కలిగి ఉండడం వల్ల కార్బన ఉద్గారాల విడుదల తక్కువగా ఉంటుందని, ఒక కుటుంబంలో ఒక బిడ్డ తక్కువగా ఉంటే.. 58.6 మెట్రిక్ టన్నుల ఉద్గారం వెలువడకుండా ఉంటుందంటూ ఓ థియరీ ఈ మధ్య చక్కర్లు కొడుతోంది. అయితే.. మారుతున్న లైఫ్ స్టైల్, ప్రొ క్లైమాటిక్ పాలసీలతో ఆ ప్రభావాన్ని(కార్బన్ ఉద్గారాల వెలువడడం) తగ్గించొచ్చని ప్రత్యేకంగా ఓ నివేదిక వెల్లడైంది. "Some people think that having fewer kids is better for the environment. Environment's gonna be fine even if we doubled the population. Japan had lowest birth rate. Having kids is essential for maintaining civilization. We can't let civilization dwindle into nothing." — @elonmusk pic.twitter.com/i03zytLDTJ— Pranay Pathole (@PPathole) May 20, 2022 -
అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగా ఉంది. 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకూ బర్త్ రేషియో (జననాల నిష్పత్తి) పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 902 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోతూ ఉండటం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడిచిన మూడు దశాబ్దాల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు చెబుతున్నారు. చదవండి: టెలీ మెడిసిన్ సేవల్లో ఏపీ టాప్ చివరి స్థానంలో అనంత.. అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే చివరిస్థానంలో ఉంది. రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 937 మంది అమ్మాయిలు ఉన్నారు. అదే జిల్లాలో చూస్తే వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 902 మంది అమ్మాయిలు ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీన్నిబట్టి రమారమి వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా 908 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఎందుకిలా? కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలంటే ఇప్పటికీ చిన్నచూపు ఉంది. మగ సంతానానికి ఇస్తున్న ప్రాధాన్యత అమ్మాయిల విషయంలో ఉండడం లేదు. మారుమూల ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ. లింగనిర్ధారణ పరీక్షలు చేయించడం, అమ్మాయి అని తెలియగానే అబార్షన్ చేయించడం పరిపాటిగా మారింది. దీనివల్ల అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోంది. జిల్లాలో లింగనిర్ధారణ నిరోధక చట్టం ( పీసీ పీ అండ్ డీటీ) గట్టిగానే అమలు చేస్తున్నారు. ఎక్కడైనా లింగనిర్ధారణ చేశారని తేలితే తీవ్ర చర్యలుంటాయని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు అధికారులు హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ వైద్యుల (రేడియాలజిస్ట్/సోనాలజిస్ట్) పట్టాలు రద్దు చేయడానికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొందరు గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు కుమ్మక్కై లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఎవరైనా లింగనిర్ధారణ చేసినట్టు ఫిర్యాదు చేసి.. అది నిజమని తేలితే ఫిర్యాదుదారుడికి రూ.25 వేల బహుమతి ఇస్తారు. అలాగే ఆ ఫిర్యాదుపై విచారణ జరిగి డాక్టరుకు గానీ, నిర్వాహకులకు గానీ శిక్షపడితే రూ.లక్ష బహుమతి ఇస్తామని జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. నిఘా మరింత పెంచాం జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లపైనా నిఘా ఉంచాం. ఎక్కడైనా లింగనిర్ధారణ చేస్తున్నట్టు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయొచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరిస్తే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. – డాక్టర్ కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్ఓ రాయలసీమ జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య ఇలా.. జిల్లా అమ్మాయిలు వైఎస్సార్ జిల్లా 925 చిత్తూరు 924 కర్నూలు 908 అనంతపురం 902 -
తెలంగాణలో నిరుద్యోగం ఎంతంటే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.91 శాతంగా నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. 2021 సెప్టెంబర్ నుంచి నెలనెలా నిరుద్యోగ రేటు పెరుగుతోందని తెలిపింది. 2021 డిసెంబర్ చివరినాటికి దేశ వ్యాప్తంగా సరాసరి 7.91 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28 శాతంగా నమోదైనట్లు ఆ సంస్థ వివరించింది. అయితే జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా హరియాణాలో అత్యధిక నిరుద్యోగ రేటు నమోదైంది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 34.1 శాతం నమోదు కాగా తర్వాత స్థానాల్లో రాజస్తాన్ (27.1 శాతం) జార్ఖండ్ (17.3 శాతం), బిహార్ (16 శాతం), జమ్మూకశ్మీర్ (15 శాతం) ఉన్నాయి. దక్షిణాదిలో కర్ణాటకలో 1.4 శాతం, తెలంగాణలో 2.2 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 5.6 శాతం నమోదైనట్లు సీఎంఐఈ తెలిపింది. -
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
ఏపీలో తగ్గుతున్న పాజిటివిటీ రేటు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ వస్తోందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కరోనా నియంత్రణలోనే ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలుండగా అందులో 10 జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉన్నట్టు తేలింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే 5.74 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. కొన్ని జిల్లాల్లో అయితే ఒకటి కంటే తక్కువకు పాజిటివిటీ రేటు పడిపోయింది. గడిచిన వారం రోజుల్లో అంటే ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 4.68 లక్షల టెస్టులు చేయగా, 2.43 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఇది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువని అధికారులు వెల్లడిస్తున్నారు. పెద్ద జిల్లాల్లో ఒకటైన కర్నూలులో పాజిటివిటీ రేటు కేవలం 0.26 శాతంగా నమోదైంది. ఏ జిల్లాలోనూ అసాధారణంగా పాజిటివ్ కేసులు పెరిగిన దాఖలాలు లేవు. గడిచిన కొద్ది వారాలుగా క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. మాస్కులు విధిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వంటి మూడు పనులు చేస్తే పూర్తిస్థాయిలో కరోనాను నియంత్రించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. -
పప్పు దినుసుల ధర తగ్గేది ఎప్పుడు ?
వెబ్‌డెస్క్ : దేశంలో కంది, మినప, పెసర, శనగ, మసూరీ పప్పు దినులులు దాదాపు 27 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సమృద్ధిగా నిల్వలు ఉన్నా పప్పు దినుసుల ధరలు మాత్రం సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటుంన్నాయి. వంద రూపాయలు పెట్టనిదే కేజీ పప్పు దొరకని పరిస్థితి నెలకొంది. కేంద్రం నజర్ నిత్యవసర వస్తువుల పెరుగుదలపై కేంద్రం నజర్ పెట్టింది. ముఖ్యంగా పప్పు దినుసుల ధరల పెరుగుదలను కంట్రోల్ చేసేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో పప్పు ధాన్యాల నిల్వలు ఎంతున్నాయనే అంశంపై దృష్టి సారించింది. దీంతో రాష్ట్రాల వారీగా పప్పు ధాన్యం నిల్వలపై ఆరా తీసింది. ధరల భారం ఓ వైపు కరోనా గండం వెంటాడుతుండగా మరో వైపు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యుల రెక్కలు విరిచేస్తున్నాయి. ఇప్పటికే పెట్రోలు, మంచి నూనెల ధరలు ఆకాశాన్ని తాకుంతుండగా నెమ్మదిగా పప్పు దినుసుల ధరలు కూడా పైపైకి చేరుకుంటున్నాయి. వంట నూనెల వినియోగం ఇప్పటికే తగ్గిపోయింది. అయితే పప్పు దినుసుల ధరల పెరుగుదల గుబులు పట్టిస్తోంది. గడిచిన రెండేళ్లుగా అన్ని రకాల పప్పు ధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో జనవరి నుంచి జూన్ వరకు కంది, మినప, పెసర పప్పులు కేజీ ధరపై రూ. 10 అదనంగా పెరిగింది. ఈ పప్పు దినుసుల్లో తక్కువ రకం ధరలే రూ. 110కి పైగా ఉన్నాయి. ఇంతకు మించి ధరలు పెరిగితే సామాన్యులు తట్టుకోవడం కష్టమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. లెక్కలు చెప్పండి ఏ రాష్ట్రంలో ఏ పప్పు ధాన్యం ఎంత నిల్వ ఉందో చెప్పాలంటూ రాష్ట్రాలను కోరింది కేంద్రం. దీని ఆధారంగా దేశ వ్యాప్తంగా 28.66 లక్షల టన్నుల పప్పు ధాన్యం నిల్వలు ఉన్నట్టుగా తేలింది. ఈ వివరాలన్నీ నాఫెడ్ వెబ్సైట్లో పొందు పరిచింది. ఎక్కడైన పప్పు దినుసుల నిల్వలు తగ్గిపోతే మరొక చోటు నుంచి కొనుగోలు చేయాలని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కంది, పెసర, మినప పప్పు ధరలు పెరగకుండా చూడాలంటూ కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రకటనలకే పరిమితమా గతంలో మంచి నూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం సమీక్ష నిర్వహించింది. ధరలు తగ్గించేందుకు పన్నుల కేటగిరీల్లో మార్పులు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. అయితే క్షేత్ర స్థాయిలో ధరలు ఏమీ తగ్గలేదు. డిసెంబరు వరకు ఆయిల్ ధరలు తగ్గవని వ్యాపారులు అంటున్నారు. ఇప్పుడు పప్పు ధాన్యాల విషయంలోనూ ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి : Oil Prices: అమెరికాలో కరువు.. ఇండియా వంటగదిలో పిడుగు -
సంతానం.. పడిపోతోంది అమాంతం!
సాక్షి, అమరావతి: ‘పది మంది పిల్లా పాపలతో చల్లగా ఉండండి’.. అని పూర్వకాలంలో పెద్దలు దీవించేవారు. కానీ ఇప్పుడు అందరూ ఒకరిద్దరికే పరిమితమైపోతున్నారు. ఫలితంగా పునరుత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేటు–టీఎఫ్ఆర్) గణనీయంగా పడిపోయింది. జాతీయ సగటు కంటే రాష్ట్ర టీఎఫ్ఆర్ భారీగా తగ్గిపోయింది. దీనివల్ల భవిష్యత్‌లో జనాభా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క ఏపీలోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఈ రేటు తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక మహిళ సగటున 2.9 మందికి జన్మనిస్తుండగా.. ఏపీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకొచ్చేసరికి అది 1.7కంటే తగ్గిపోయింది. సాధారణంగా 2.1 శాతం కంటే ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతే జనాభా పెరగదు. ఈ నేపథ్యంలో.. కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ తాజాగా నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. అవి.. 70 ఏళ్ల క్రితం ఒక్కొక్కరు ఆరుగురికి జన్మ ► డెబ్భై ఏళ్ల క్రితం భారత్‌లో సగటున ఒక్కో మహిళ ఆరుగుర్ని కనేవారు. ఇప్పుడా సగటు 2.2కు పడిపోయింది. ► 2006–08 మధ్య కాలంలో భారత్ సగటు ఫెర్టిలిటీ రేటు 2.7 ఉండగా, తాజాగా అది 2.2కు దిగజారింది. ► సాధారణంగా 15 ఏళ్లు దాటి 49 ఏళ్లలోపు మహిళలను పునరుత్పత్తి ప్రక్రియకు అర్హులుగా భావిస్తారు. ► ప్రతి వెయ్యి మంది జనాభాకు 183 మంది పునరుత్పత్తి సామర్థ్యమున్న మహిళలు ఉంటారు. ► వీరు సరైన వయస్సులో పిల్లలకు జన్మనిస్తేనే జనాభా వయస్సుల్లో అసమానతలు లేకుండా ఉంటాయి. ఏపీలో భారీగా తగ్గిన సంతానోత్పత్తి కానీ, రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా సంతానోత్పత్తి ప్రక్రియ భారీగా తగ్గుతూ వస్తోంది. జాతీయ సగటు 2.2గా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 1.6గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహిళ సగటున 1.7 మందికి జన్మనిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఆ సంఖ్య 1.5 మాత్రమే. 2006–08 మధ్య కాలంలో సగటున 1.9గా ఉన్న సంఖ్య ఇప్పుడు మరింత తగ్గి 1.6కు చేరింది. నిజానికి.. 2.1 కంటే తగ్గితే జనాభా పెరుగుదలకు ఇబ్బందని నిపుణుల అభిప్రాయం. ఇద్దరు కాదు ఒకరే ముద్దు.. దక్షిణాదిలో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఒకరు కాదు.. ఇద్దరు ముద్దు అంటూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేవారు. ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల్లో ఇద్దరు వద్దు.. ఒకరే ముద్దు అంటూ దానినే పాటిస్తున్నారు. లేటు మ్యారేజీలు, పిల్లలను ఆలస్యంగా కనడం తదితర కారణాలతో సంతానోత్పత్తి సమస్యగా మారింది. దీనికి తోడు ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల కూడా అది తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇవీ నష్టాలు.. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. దక్షిణాదిలో ఏ రాష్ట్రం చూసుకున్నా 1.7 కంటే ఎక్కువ లేదు. ఇలా జనాభా తగ్గుతూపోతే యువత తగ్గిపోయి వర్క్ ఫోర్స్ (పనిచేసే వారి సంఖ్య) పడిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. చదవండి: స్మార్ట్ టౌన్ల ప్రాజెక్ట్ టేకాఫ్.. సకల వసతులతో లే అవుట్ల అభివృద్ధి రాజధానిలో రూ.3 వేల కోట్ల పనులకు ప్రభుత్వ గ్యారెంటీ -
దిగివస్తున్న బంగారం ధరలు
-
కొత్త జంటలకు బంఫర్ ఆఫర్!
టోక్యో: జపాన్‌లో జననాల రేటు దారుణంగా పడిపోవడంతో ఆ దేశం వినూత్నంగా ఆలోచించింది. అక్కడి యువతి యువకులను పెళ్లి చేసుకునేలా ప్రోత్సాహించి జననాల రేటు పెంచేందుకు కొత్త జంటకు 6 లక్షల యెన్లను జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జననాల రేటు తిరిగి గాడిన పడుతుందని జపాన్ ఆలోచించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ప్రోత్సాహక బహుమతి కింద 6 లక్షలు యెన్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 4 లక్షలకు కంటే ఎక్కవ) ఇవ్వనుంది. అంతేగాక పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ ప్రోత్సాహం ఎంతగానో ఉపయోగపడుతుందని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. (చదవండి: 516కు పైగా ఆపరేషన్స్.. అయినా కానీ..) ఈ పథకాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా విధించింది. పెళ్లి చేసుకునే జంట మొదట వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, వారి వయసు 40 ఏళ్లకు మించి ఉండకూడదు. వార్షిక ఆదాయం 5.4 లక్షల కంటే తక్కువగా ఉన్న వారే ఈ ప్రోత్సాహక బహుమతికి అర్హులుగా జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది దేశ వ్యాప్తంగా 8.65 లక్షల మంది మాత్రమే జన్మించడంతో రానురాను జననాల రేటు పడిపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దేశంలో జననాల రేటును తిరిగి పెంచేందుకు జపాన్ ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రోత్సాహాకాన్ని ఆ దేశ యువతీ యువకులు ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారో, జననాల రేటు పెరుగుదలకు ప్రభుత్వ ప్రయత్నం తోడ్పడుతుందో లేదో వేచి చూడాలి. (చదవండి: చైనా ముప్పు; భారత్- జపాన్ కీలక ఒప్పందం) -
రంగారెడ్డిలో ఎక్కువ.. నారాయణపేటలో తక్కువ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గటం లేదు. రంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉంది. కరోనా పాజిటివిటీ రేటు ఏయే జిల్లాల్లో ఏ స్థాయిలో ఉందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ అధ్యయనం చేసింది. ఈ మేరకు ఆ నివేదికను తాజాగా విడుదల చేసి ప్రభుత్వానికి అందజేసింది. మొత్తం పరీక్షల్లో పాజిటివ్ కేసుల శాతం ఆధారంగా పాజిటివిటీ రేటును తయారుచేశారు. ఆ నివేదిక ప్రకారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 7.2 % పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది. అత్యంత తక్కువగా 3.4% నారాయణపేట జిల్లాలో ఉందని వెల్లడించింది. అత్యంత ఎక్కువగా కేసులు నమోదవుతున్న జీహెచ్ఎంసీలో మాత్రం పాజిటివిటీ రేటు 6.3 శాతముంది. అంటే పదో స్థానంలో జీహెచ్ఎంసీ నిలిచింది. రెండోస్థానంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో7%, మూడో స్థానంలో ఉన్న మహబూబాబాద్ జిల్లాలో 6.7% పాజిటివిటీ రేటున్నట్లు ఆ నివేదిక తెలిపింది. ఐసీయూ పడకలకు అదే స్థాయిలో.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీల బోధనాస్పత్రుల్లో కరోనా కోసం ప్రభుత్వం 30,302 పడకలను కేటాయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక తెలిపింది. అందులో ప్రభుత్వాస్పత్రుల్లో 8,868 పడకలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 9,484 పడకలు, ప్రైవేట్ బోధనాస్పత్రుల్లో 11,950 పడకలు కరోనా కోసం కేటాయించినట్లు తెలిపింది. వాటిల్లో సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ పడకలున్నాయి. కరోనా వైరస్ కేసులు తగ్గకపోయినా ఆçస్పత్రులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని నివేదిక తెలిపింది. ఐసో లేషన్, ఆక్సిజన్ పడకలకు జూలై నుంచి డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉన్న కరోనా పడకల్లో జూలైలో ఐసోలేషన్ పడకలు 33.89% నిండిపోగా, అదే నెలలో ఆక్సిజన్ పడకలు 41.80%, ఐసీయూ పడక లు 15.14% నిండిపోయాయి. ఆగస్టులో ఐసోలేషన్ పడకల ఆక్యుపెన్సీ 24.09 శాతానికి పడిపోగా, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 38.19 శాతానికి తగ్గింది. అయితే ఐసీయూ పడకల ఆక్యుపెన్సీ మాత్రం 17.50 శాతానికి పెరిగింది. సెప్టెంబర్‌లో సాధారణ ఐసోలేషన్ వార్డుల్లో ఆక్యుపెన్సీ 12.95 శాతానికి పడిపోగా, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 27.33 శాతానికి తగ్గింది. ఐసీయూ పడకల్లో ఆక్యుపెన్సీ కాస్తంత పెరిగి 17.82 శాతానికి చేరుకుంది. అక్టోబర్‌లో అంటే ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఐసోలేషన్ పడకల ఆక్యుపెన్సీ 10.63 శాతానికి, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 24.37 శాతానికి పడిపోయాయి. ఐసీయూ పడకల్లోనూ ఆక్యుపెన్సీ కాస్తంత తగ్గి 16.96 శాతానికి చేరుకుంది. కరోనా మరణాల్లో 26వ స్థానం..దేశంలో తక్కువ కరోనా మరణాల రేటు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం ఊరటనిచ్చే అంశమని వైద్య, ఆరోగ్యశాఖ ఆ నివేదికలో తెలిపింది. జాతీయ స్థాయి సగటు మరణాల రేటు 1.50 శాతముంది. ఇక దేశంలో అత్యధిక కరోనా మరణాల రేటు పంజాబ్‌లో ఉంది. అక్కడ వైరస్ మరణాల రేటు 3.10 శాతముంది. ఆ తర్వాత రెండోస్థానంలో నిలిచిన మహారాష్ట్రలో కరోనా మరణాల రేటు 2.60%, మూడో స్థానంలో ఉన్న గుజరాత్లో 2.40%, నాలుగో స్థానంలో నిలిచిన పశ్చిమబెంగాల్లో 1.90% ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ రకంగా తెలంగాణ 26వ స్థానంలో ఉంది. తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ పదో స్థానంలో నిలిచింది. మిజోరాంలో మరణాల రేటు సున్నా ఉండగా, ఆ తర్వాత దాద్రానగర్ హవేలీలో 0.10% మరణాల రేటు ఉంది. కేరళలో 0.40% వైరస్ మరణాల రేటున్నట్లు నివేదిక తెలిపింది. 5,937 వైద్య పోస్టుల మంజూరు..కరోనాను నియంత్రించేందుకు రూ.1,369 కోట్లు మంజూరు చేసింది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని భర్తీ చేసింది. అందుకోసం 5,937 వైద్య సిబ్బందిని భర్తీ చేసేందుకు జీవోలను జారీచేసినట్లు ఆ నివేదికలో ప్రస్తావించింది. -
విస్తీర్ణం తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాల్లో 2014లో అపార్ట్మెంట్ సగటు విస్తీర్ణం 1,400 చ.అ.గా ఉండేది. కానీ, 2019 నాటికది 1,020 చ.అ.లకు తగ్గింది. అత్యధికంగా ముంబైలో ఫ్లాట్ల సైజ్లు 45 శాతం మేర తగ్గిపోయాయి. 2014లో ఇక్కడ ప్రాపర్టీల సగటు విస్తీర్ణం 960 చ.అ. కాగా.. ఇప్పుడది 530 చ.అ. పడిపోయింది. పుణేలో అయితే క్షీణత 38 శాతంగా ఉంది. ప్రస్తుతమిక్కడ సగటు విస్తీర్ణం 600 చ.అ.లుగా ఉంది. ఇక, ఎన్సీఆర్లో 6 శాతం క్షీణతతో 1,390 చ.అ.లకు, బెంగళూరులో 9 శాతం క్షీణించి 1,300 చ.అ.లకు, చెన్నైలో 8 శాతం క్షీణతతో అపార్ట్మెంట్ సగటు సైజ్ 1,190 చ.అ.లకు చేరింది. హైదరాబాద్‌లో సగటు అపార్ట్మెంట్ విస్తీర్ణం 1,570 చ.అ.లుగా ఉంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఇదే అతిపెద్ద విస్తీర్ణం. ఐదేళ్ల క్రితం కోల్‌కతాలో ఫ్లాట్ సైజ్ 1,230 చ.అ.లుగా ఉండేది. ఇప్పుడక్కడ సగటు విస్తీర్ణం 9 శాతం క్షీణించి 1,120 చ.అ.లుగా ఉంది. విభాగాల వారీగా విస్తీర్ణం ఎంత తగ్గిందంటే.. రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాల విస్తీర్ణం ఐదేళ్లలో 28 శాతం తగ్గాయి. 2014లో 750 చ.అ.లుగా ఉన్న అఫడబుల్ హౌజ్ సైజ్లు 2019 నాటికి 540 చ.అ.లకు తగ్గిపోయాయి. రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ధర ఉన్న మధ్యస్థాయి గృహాల విస్తీర్ణం 17 శాతం తగ్గాయి. 2014లో 1,150 చ.అ.లు కాగా.. ఇప్పుడవి 950 చ.అ.లకు క్షీణించాయి. రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల ధర ఉన్న ప్రీమియం హోమ్స్ విస్తీర్ణం 21 శాతం తగ్గాయి. 2014లో 1,450 చ.అ.లుండగా.. ఇప్పుడవి 1,140 చ.అ.లకు తగ్గిపోయాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉన్న లగ్జరీ గృహాల సైజ్ 18 శాతం క్షీణించాయి. 1,640 చ.అ. నుంచి 1,350 చ.అ.లకు తగ్గాయి. రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ గృహాల విస్తీర్ణం 8 శాతం తగ్గాయి. ఐదేళ్ల క్రితం ఆయా ఫ్లాట్ల సైజ్ సగటు 2,400 చ.అ.లు ఉండగా.. ఇప్పుడవి 2,200 చ.అ.లకు తగ్గిపోయాయి. తక్కువ విస్తీర్ణం గృహాలకే డిమాండ్.. ప్రధాన నగరాల్లో అందుబాటు గృహాలకు డిమాండ్ పెరగడమే అపార్ట్మెంట్ల విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణమని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. అఫడబుల్ హౌసింగ్‌కు ప్రభుత్వం రాయితీలు ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఈ గృహాల వైపే మొగ్గుచూపుతున్నారన్నారు. అయితే ఆయా అఫడబుల్ గృహాలు రూ.45 లక్షల లోపు ధర 850 చ.అ. బిల్టప్ ఏరియాను మించకూడదు. అప్పుడే ప్రభుత్వం నుంచి రాయితీలు అందుతాయి. అంతేకాకుండా అఫడబుల్ గృహాలకు జీఎస్టీ కూడా తక్కువే. ఇతర గృహాలకు జీఎస్టీ 5 శాతం ఉంటే అఫడబుల్ ప్రాజెక్ట్‌లకు ఒక్క శాతమే ఉంది. -
కొత్త ఇసుక పాలసీ..
ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఇసుక పాలసీ గురువారం నుంచి అమలులోకి రానుంది. జిల్లాలో ఇప్పటికే ఆరు స్టాక్‌పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇసుకను వినియోగదారులకు సులభంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇసుకను స్టాక్పాయింట్లకు తరలిస్తున్నారు. దీని కోసం రవాణా ధరలు కూడా నిర్ణయించారు. సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఇసుక అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బుధవారం క్యాబినెట్ సమావేశం తర్వాత దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయనున్నదని ఆయన వెల్లడించారు. గోదావరి ర్యాంపుల నుంచి ఇసుకను బయటకు తీసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా జిల్లాలో వేర్వేరు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఆరు స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. పోలవరం, తాళ్లపూడి మండలం బల్లిపాడు, కొవ్వూరు మండలం కాపవరం, ఏలూరు నగరం, కరుగోరుమిల్లి, చించినాడ సమీపంలోని ఇలపర్రులో స్టాక్‌పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలకు ఇప్పటికే ఇసుకను తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. ప్రస్తుతం జిల్లాలో మూడు రకాల ఇసుక అందుబాటులో ఉంది. ఒకటి ఓపెన్ రీచ్‌ల ద్వారా, రెండు బోట్ల ద్వారా డీసిల్టింగ్ చేయడం, మూడు రైతుల పొలాల్లో మేట వేసిన ఇసుకను తవ్వడం. అయితే ప్రస్తుతం గోదావరి వరద కారణంగా ఓపెన్ రీచ్‌లు, రైతుల పొలాల్లో నీరు ఉండటం వల్ల తవ్విన ఇసుక అందుబాటులో లేదు. పడవల్లో డీసిల్టింగ్ చేసిన ఇసుక మాత్రమే అందుబాటులో ఉంది. ఇలాంటివి జిల్లాలో 15 రీచ్‌లు ఉండగా, 11 రీచ్‌లు పనిచేస్తున్నాయి. వినియోగదారులకు అందేదిలా.. బోట్లలో నుంచి తీసుకువచ్చిన ఇసుకను ముందుగానే ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. కొత్త పాలసీ వచ్చిన తర్వాత విధివిధానాలు వస్తాయి. మీసేవా ద్వారా, లేకపోతే వెబ్సైట్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన తర్వాత సరఫరా చేస్తారు.ఎవరైనా ఇసుక తమ వాహనాల్లో ఇసుక తీసుకువెళ్తామంటే ఆ విధంగా కూడా అనుమతిస్తారు. లేనిపక్షంలో ప్రభుత్వం రిజిస్టర్ చేసిన వాహనాల ద్వారా ఇసుకను పంపిస్తారు. ఇసుక తవ్వకాలు, రవాణాలో ఎటువంటి అక్రమాలూ జరగకుండా అన్ని రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఇసుక తరలించే వాహనాలను నిరంతరం ట్రాకింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనుంది. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలన్నింటికీ స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులు కోరిన చోటకు ఇసుక రవాణా చేసే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 250 వాహనాలను యజమానులు ఇసుక తరలించేందుకు రిజిస్టర్ చేయించుకున్నారు. రవాణాకు ధర నిర్ధారణ ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.4.90 ధర నిర్ణయించారు.15 కిలోమీటర్లలోపు ఉంటే ఈ ధర గిట్టుబాటు కానందున దాని కోసం వేరే ధర నిర్ణయించనున్నారు. 15 కిలోమీటర్లు దాటిన ప్రాంతాలకు ఈ ధరనే నిర్ణయిస్తారు. స్టాక్ యార్డు నుంచి దూరాన్ని బట్టి రేటు ఉంటుంది. అన్ని స్టాక్ యార్డుల వద్ద టన్ను ఇసుక రూ.375కే సరఫరా చేస్తారు. అయితే ఏలూరు స్టాక్ యార్డు రేటులో మాత్రం ధర తేడా ఉంటుంది. రూ.375 తో పాటు గోదావరి నుంచి ఏలూరుకు సుమారు 85 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వరకూ రవాణాకు అయిన వ్యయాన్ని కూడా వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. -
బీజేపీ ‘దుంప’ తెంచుతుందా?
ఉల్లి ధరలు పెరిగిపోయి ప్రభుత్వాలు పడిపోయిన ఘటనల్ని చూశాం. వెల్లుల్లి రైతుల దీనావస్థ ఎన్నికల్లో ప్రచారం అంశంగా మారడమూ చూశాం. ఈసారి ఎన్నికల్లో ఆ పాత్ర బంగాళదుంప పోషిస్తుందా? కేజీ ఆలూకి మార్కెట్లో మూడు, నాలుగు రూపాయలు కూడా రాకపోతే రైతులు ఎలా బతుకుతారు? చెమటోడ్చి పండించిన పంట అమ్ముడుపోకుండా కళ్లెదుటే కుళ్లిపోతుంటే ఆ రైతన్నల గుండెలు పగిలి పోతున్నాయి. ఉత్తరప్రదేశ్ రైతులు ఈ ఎన్నికల్లో బీజేపీ దుంప తెంచుతారా? వారిలో నెలకొన్న అసమ్మతి జ్వాలలు కమలనాథుల్ని ఎంతవరకు తాకుతాయి?.. ఉత్తరప్రదేశ్‌లో బంగాళదుంపల ఉత్పత్తి భారత్‌లో జరిగే ఉత్పత్తిలో 30 శాతానికి పైగా ఉంటుంది. కానీ మూడేళ్లుగా దుంపల ధరలు రోజు రోజుకీ పడిపోవడంతో రైతన్నలు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఆగ్రా, హాత్రస్, మ«థుర, అలీగఢ్ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఉన్న పలు లోక్‌సభ నియోజకవర్గాలు ప్రస్తుతం కమలనాథుల చేతుల్లోనే ఉన్నాయి. బీజేపీ నేతలే ఎంపీలుగా ఉన్నారు. దీంతో రైతుల ఆగ్రహ జ్వాలలు వారినెక్కడ తాకుతాయోనన్న ఆందోళన ఉంది. ‘గత ఐదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం బంగాళదుంపలు సాగు చేస్తున్న రైతులకి ఏమీ చేయడం లేదు. వారికెందుకు ఓటు వెయ్యాలి’ అని ప్రధానమంత్రికి మనీయార్డర్ పంపించిన ప్రదీప్ శర్మ ప్రశ్నిస్తున్నారు. ఆగ్రా జిల్లా బరౌలీ అహీర్కి చెందిన ఈ రైతు నాలుగేళ్లలోనే రూ.35 లక్షలు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ‘ఆలూ రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పెద్ద నోట్ల రద్దు అనేది పంటలకు పట్టిన చీడలాంటిది. అప్పట్నుంచే ధరలు పాతాళానికి పడిపోయాయి. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు ఎలా పడిపోయాయంటే.. కేజీ బంగాళదుంప పండించాలంటే ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? సగటున రూ.8. అదే మార్కెట్లో అమ్ముకుంటే వాళ్లకి కేజీకి మూడు, నాలుగు రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అంటే పెట్టుబడి వ్యయంలో సగానికి సగం అన్నమాట. అంత నష్టాన్ని ఏ రైతు భరించగలడు? హాత్రస్ జిల్లాలో విజయ శర్మ అనే రైతుకి ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ సీజన్లో 8 వేల కిలోల బంగాళదుంపలు పండాయి. తన పంట పండిందనే అనుకున్నాడు. తీరా మండీకి తీసుకెళ్తే కిలోకి నాలుగు రూపాయలు మించి రాలేదు. అంతేకాదు కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచడానికి కేజీకి రెండున్నర రూపాయలు వసూలు చేస్తారు. వాటి రవాణాకి తడిసి మోపెడు ఖర్చు అవుతుంది. ‘సాధారణంగా మే, జూన్‌లో ఆలూ ధరలు పెరుగుతాయి. కానీ గత మూడు సీజన్లుగా వేసవిలో కూడా తక్కువ ధరకే పంటను తెగనమ్ముకోవాల్సి వస్తోంది’ అని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పెద్ద నోట్ల రద్దు రైతు నడ్డి విరిచేసింది. రద్దు తర్వాత కేజీ రూపాయికి అమ్ముకున్న రోజులూ ఉన్నాయి. అంతకు ముందు కేజీ 11 రూపాయలకి అమ్మాను’ అంటూ శర్మ కన్నీరుమున్నీరయ్యారు. బీజేపీకి రైతుల సెగ తగులుతుందా? కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో సహజంగానే రైతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగానే నెలకొంది. ‘మోదీ చరిష్మా కలిగిన నాయకుడే. సందేహం లేదు. కానీ మా సమస్యలు కూడా పట్టించుకోవాలి కదా. అలాగని ప్రత్యామ్నాయ పార్టీలు సరిగా లేవు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలదో తెలీదు. ప్రాంతీయ పార్టీలపై మాకు నమ్మకం లేదు. ఉన్నంతలో ఆర్ఎల్డీ కాస్త నయం’ అని రాజేశ్ చౌధరీ అనే రైతు అభిప్రాయం. ఆలూ ఎగుమతి విషయంలో కేంద్రం ధరల్ని నియంత్రించడం వల్లే క్వింటాళ్ల కొద్దీ దుంపలు స్థానిక మార్కెట్లలోనే ఉండిపోయాయి. దీంతో ధరలు పడిపోయాయి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ క్వింటాలుకు రూ.487కి ఆలూ కొనుగోలు చేస్తామని చెప్పినా ఆచరణలో సాధ్యం కాలేదు. అందుకే ఈ ప్రాంతంలో బీజేపీపై పలువురు రైతులు అసంతృప్తిగా ఉన్నారు. కానీ ప్రత్నామ్నాయంగా సరైన పార్టీ కనిపించకపోవడంతో ఎన్నికల్లో ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. 916 - 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దుకి ముందు ఆగ్రా, మథుర, హాత్రస్ మండీలలో క్వింటాలు ఆలూకు పలికిన ధర 532 - 2016 డిసెంబర్లో ఆ మూడు మండీలలో ధర 41.8% పడిపోయింది. వంద కేజీలకు రూ.532 మాత్రమే రైతులకి వచ్చాయి -
యాక్సిస్ బ్యాంకు కూడా తగ్గించేసింది
ముంబై: ప్రముఖ ప్రయివేటు యాక్సిస్ బ్యాంకు కూడా వడ్డీరేటులో కోత పెట్టింది. అంచనాలకనుగుణంగానే యాక్సిస్ కూడా వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. సేవింగ్ ఖాతాలపై చెల్లించే వడ్డీరేటును 50 బీపీఎస్ పాయింట్లను తగ్గించింది. దీంతో ప్రస్తుత వడ్డీరేటు 3.5శాతంగా ఉండనుంది. పొదుపు ఖాతాల్లోని నిధులపై ఇచ్చే వడ్డీ రేటును యాక్సిస్ బ్యాంక్ అర శాతం తగ్గించింది. 3.5 శాతానికి కుదించింది. రూ. 50లక్షల వరకు వరకు నిల్వ (బ్యాలెన్స్) ఉన్న ఖాతాలకు ఈ రేట్ల కోత వర్తిస్తుంది. రూ.50లక్షలకుపైన 4శాతంవడ్డీ చెల్లించనుంది. కాగా రిజర్వ్ బ్యాంక్ తాజా రివ్యూ లో కీలక వడ్డీరేటులో పావు శాతం కోత విధించడంతో ప్రభుత్వ రంగబ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా కూడా సేవింగ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును 3.5శాతంగా నిర్ణయించింది. మరో పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే పొదుపు ఖాతాల (రూ.50లక్షలలోపు) వడ్డీరేటును 3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
మళ్లీ రెక్కలు
ఇసుక యూనిట్ ధర రూ.3 వేలు ర్యాంపులు తగ్గడంతో డిమాండ్ సొమ్ము చేసుకుంటున్న నిల్వదారులు అమలాపురం : ఒకవైపు గోదావరిలో వరద... మరోవైపు జిల్లాలో ఒకటి రెండు ర్యాంపులకు మాత్రమే అనుమతి... ఇంకొక వైపు శ్రావణమాసంలో భారీగా నిర్మాణాలకు శంకుస్థాపనలు జరగడంతో ఇసుకకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఇదే అక్రమ నిల్వదారులకు కాసులు పంట పండిస్తోంది. యూనిట్ ధర రూ.2,500ల నుంచి రూ.3 వేలు పెంచి అక్రమ నిల్వదారులు దొడ్డిదారిన ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రకారం ర్యాంపు బాట నిర్వహణ, కూలీలకు యూనిట్‌కు రూ.425 మాత్రమే వసూలుకు అనుమతి ఉంది. జిల్లావ్యాప్తంగా ఇసుక ర్యాంపులకు అనుమతి ఉన్న సమయంలోనే ఈ నిబంధన అమలు కాలేదు. ర్యాంపు ఎగుమతి, బాట నిర్వహణకు వసూలు చేయడమే కాకుండా యూనిట్‌కు అదనంగా రూ.500 చొప్పున వసూలు చేసేవారు. వీటిని అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు జేబులో వేసుకున్న విషయం తెలిసిందే. గడువు పూర్తికావడంతోపాటు, వరద పోటెత్తడంతో ర్యాంపులు మూతపడ్డాయి. ప్రస్తుతం కడియం మండలం వేమగిరి, పి.గన్నవరం మండలంలో ఒక ర్యాంపు వద్ద తవ్వకాలు సాగుతున్నాయి. దీనిని ముందే గుర్తించి ఇసుక అక్రమ వ్యాపారులు భారీగా ఇసుకను నిల్వ చేశారు. శ్రావణమాస డిమాండ్ ఏర్పడడంతో అదను చూసి ధర పెంచి అమ్మకాలు చేస్తున్నారు. వినియోగదారులు సైతం ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేస్తుండడంతో అక్రమార్కులకు కాసుల వర్షం కురుస్తోంది. జిల్లాలోనే కాకుండా విశాఖ, విజయనగరం వంటి ప్రాంతాలకు ఎగుమతి జోరుగా సాగుతుండడం కూడా ధర పెరుగుదలకు కారణమైంది. లారీల యజమానులు సైతం కిరాయి పెంచివేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక అధికారులు పట్టుకుంటే ఇబ్బందని చెబుతూ ధరలను అమాంతంగా పెంచారు. రావులపాలెం నుంచి రెండు యూనిట్ల లారీ అమలాపురం తరలిస్తే ఇసుకకు రూ.ఆరు వేలు, కిరాయి మరో రూ.ఆరు వేల చొప్పున రూ.12 వేలు అవుతోందని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. అదే కాకినాడ వంటి ప్రాంతాలకు మరో రూ.మూడు వేలు రవాణా ఖర్చులవుతున్నాయి. ఇసుక అక్రమ వ్యాపారులు గతంలో రహస్య ప్రాంతాల్లో నిల్వలు చేసేవారు. వీటిమీద మైన్స్, రెవెన్యూ శాఖల నిఘా ఉండడంతో అక్రమార్కులు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాల సమీపంలో భారీ ఎత్తున ఇసుక నిల్వ చేస్తున్నారు. అధికారులు ఆరా తీస్తుంటే నిర్మాణాలకు తీసుకువచ్చామని చెబుతూ కళ్లు గప్పుతున్నారు. ఆనక ఇసుక అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఇదే పంథాలో ఇసుకను ఊరూరా నిల్వ చేసి సొమ్ములు చేసుకుంటున్న వ్యాపారులు సైతం పెరిగిపోయారు. అడపాదడపా అధికారులు దాడి చేసినా అవి చాలా తక్కువ మొత్తంలోనే. ఆత్రేయపురం మండలం వెలిచేరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి తరలిస్తుండగా ఒక లారీని గుర్తించి పోలీసులు గురువారం సీజ్ చేశారు. అయితే ఇక్కడ నుంచి శుక్రవారం యథావిధిగా ఇసుక రవాణా జరగం గమనార్హం. ఇసుక ధర పెరుగుదల ప్రభావం ప్రభుత్వం చేపట్టిన సీసీరోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలపై సైతం పడింది. ఇంత ధరలో ఇసుక కొనుగోలు చేసి నిర్మాణాలు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తివేయడంతో పనులు నిలిచిపోతున్నాయి. అధికారులు అక్రమ నిల్వలపై దాడులు చేసి ఉన్న ఇసుకను తక్కువ ధరకు అమ్మకాలు జరిగేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. -
గ్యాస్ మంట
కొవ్వూరు : ఇకపై జనం నెత్తినే వంట గ్యాస్ సబ్సిడీ పడనుంది. దీనికి కేంద్రం సుముఖంగా ఉన్నట్టు లోక్‌సభలో కేంద్రమంత్రి దర్మేంద్రప్రధాన్ లిఖితపూర్వకంగా వెల్లడించడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జూలై నుంచి గ్యాస్ సిలిండర్‌పై రూ.4 పెంచనున్నట్టు ఆయన ప్రకటించడంపైనా ఆందోళన రేగుతోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 15,72,415 గృహావసర వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి ప్రతి వినియోగదారునికీ మొత్తం 12 సిలిండర్లు సబ్సిడీపై లభిస్తున్నాయి. అంత కంటే ఎక్కువ వినియోగిస్తే సబ్సిడీ లేకుండా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సబ్సిడీని పూర్తిగా తొలగించే వరకు లేదా మార్చి 2018 వరకు, లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతినెలా రూ.4 చొప్పున సిలిండర్ ధరను పెంచుతున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. 2014 నుంచి సబ్సిడీ 2014 నవంబర్ నుంచి వంటగ్యాస్‌పై కేంద్రం రాయితీ ఇస్తోంది. దీనిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేస్తోంది. ముందుగా లబ్ధిదారుడు ప్రభుత్వం అందించే సబ్సిడీ సోమ్ముతో కలిపి సిలిండర్ ధర చెల్లించి కొనుగోలు చేస్తే తర్వాత సబ్సిడీ సొమ్ము జమ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ సబ్సిడీ సోమ్ము రూ.200లకు పైబడి ఉండేది. ఈనెల రూ.41కి తగ్గిపోయింది. గ్యాస్ ధర ఆధారంగా సబ్సిడీ నిర్ధారణ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పుడు కేంద్రం యత్నిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.ఐదు కోట్ల భారం: తాజాగా సిలిండర్ ధర రూ.4 చొప్పున పెంచడం వల్ల జిల్లాలో వినియోగదారులపై నెలకు రూ.63 లక్షలకుపైగా భారం పడుతున్నట్టు అంచనా. ఈ లెక్కన ఏడాదికి రూ.7కోట్లకుపైగా భారం పడుతుందని తెలుస్తోంది. సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తే..! అదే సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తే భారం పదిరెట్లు పెరగనుంది. ఉదాహరణకు ఆగస్టులో ఒక్కో సిలిండర్‌పై రూ.41 చొప్పున సబ్సిడీ అందించాలని చరుము కంపెనీలు నిర్ణయించాయి. ఈ లెక్కన లెక్కిస్తే జిల్లాలో మొత్తం లబ్ధిదారులపై నెలకు రూ.6,44,69,015 చొప్పున సబ్సిడీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ లెక్కన ఈ భారం ఏడాదికి సుమారు రూ.77.33కోట్లు ఉంటుందని అంచనా. క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చుతగ్గుల వల్ల గ్యాస్ ధరలల్లో స్వల్ప మార్పులున్నా.. సబ్సిడీ ఎత్తివేస్తే వినియోగదారులపై రెట్టింపు భారం పడుతుందనడంలో సందేహం లేదు. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో మళ్లీ పేదలు వంటగ్యాస్ భారం తగ్గించుకోవడం కోసం కట్టెల పొయ్యిల వైపు అడుగులు వేయక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. సమజసం కాదు మార్చి నుంచి అన్ని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ తొలగిస్తామని ప్రకటించడం సమజసం కాదు. ఇప్పటికే సిలిండర్ పొందాలంటే సబ్సిడీ సోమ్ము కలిపి చెల్లించాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సిలిండర్‌పై నెలకు రూ.4ల చొప్పున ధర పెంచడం పేదలపై మరింత భారం పడుతుంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటనపై స్పదించకపోవడం బాధాకరం. తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కొవ్వూరు ఇబ్బందే గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని ఇక నుంచి పూర్తిగా ఎత్తి వేస్తామని చెప్పడం సరికాదు. మహిళలు చాలా బ్బంది పడాల్సి వస్తోంది. సిలిండర్‌కు రూ.4 చొప్పున పెంచుతామని చెప్పడం కూడా తగదు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. కావూరి కుమారి, మహిళా సర్పంచ్ వేగేశ్వరపురం -
టమాటా.. ధర వింటే మంట..
♦ పండ్లతో పోటీ పడుతున్న రేటు ♦ రెండు వారాలుగా చుక్కల వీధుల్లో విహారం ♦ కిలో రూ.100కు చేరిన వైనం ♦ బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు ♦ జిల్లాలో పడిపోయిన కొనుగోళ్లు ♦ గణనీయంగా తగ్గిన దిగుమతులు మండపేట : టమాటాకూ ఓ రోజొచ్చింది. నాడు అమ్మిన రూపాయి పక్కనే రెండు సున్నాలు చేర్చుకుని పండ్లతో పోటీ పడుతోంది. కొనుగోలు చేయాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తిపోయేలా దీని ధర వికటాట్టహాసం చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో యాపిల్ ధర రూ.100, దానిమ్మ రూ.80, ద్రాక్ష రూ.80 ఉండగా.. దాదాపు ప్రతి ఒక్కరూ నిత్యావసరంగా వినియోగించే టమాటా కూడా రూ.100 రికార్డు స్థాయి ధరతో వాటి సరసన చేరిపోయింది.దాదాపు ప్రతి ఒక్కరూ వంటకాల్లో నిత్యం టమాటాను అధికంగా వినియోగిస్తుంటారు. ఇళ్లలో కూరలు, రసం, సాంబారు, వివిధ పచ్చళ్ల తయారీలో టమాటా వినియోగిస్తారు. అలాగే, హోటళ్లు, రెస్టారెంట్లలో కూరలతోపాటు చెట్నీలు, టిఫిన్ల తయారీలో వీటి వినియోగం ఎక్కువే. ఈసారి చిత్తూరు జిల్లాలో దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడంతోపాటు, ఉన్న పంట తమిళనాడుకు ఎక్కువగా ఎగుమతి జరుగుతోంది. ఆ ప్రభావంతో టమాటా ధర పెరుగుతోందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో కిలో ఒక రూపాయి మాత్రమే పలికిన రోజులున్నాయి. రెండు వారాల క్రితం వరకు జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట, అమలాపురం తదితర మార్కెట్లలో రూ.20 నుంచి రూ.25 మధ్య ఉన్న దీని ధర అమాంతం పెరుగుతూ వస్తోంది. గడచిన రెండు రోజుల వ్యవధిలో రూ.20 మేర పెరిగి ఆదివారానికి రూ.100కు చేరుకుంది. రికార్డు స్థాయిలో పెరిగిన ధరతో టమాటా కొనుగోలు చేయాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కిలోకు పది టమాటాల వరకూ తూగుతుండగా ఒక్కొక్కటి రూ.10 పలుకుతోందని వినియోగదారులు వాపోతున్నారు. పండ్లతో పోలిస్తే టమాటా ధరలే అధికంగా ఉన్నాయని అంటున్నారు. తగ్గిన వినియోగం ధర ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు టమాటా కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. తప్పదనుకుంటే పావుకిలో నుంచి అరకిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు కూడా టమాటా దిగుమతులను, అమ్మకాలను తగ్గిస్తున్నారు. టమాటా ప్రధానంగా సాగయ్యే చిత్తూరు జిల్లా నుంచి మన జిల్లాకు ప్రతి రోజూ 80 టన్నుల టమాటాలు దిగుమతి అవుతుంటాయి. ధర విపరీతంగా పెరిగి, అమ్మకాలు పడిపోతున్న నేపథ్యంలో ఆదివారం 15 టన్నులు మాత్రమే దిగుమతి అయినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క 25 కిలోల టమాటా బాక్సు కొనుగోలు చేస్తుంటే అందులో దెబ్బతిన్నవి మూడు కిలోలకు పైగా ఉంటున్నాయని, దీంతో తాము నష్టపోవాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు టమాటాల లభ్యత తక్కువగా ఉండటంతో కొందరు వ్యాపారులు బెంగళూరు నుంచి హైబ్రీడ్ టమాటాలు దిగుమతి చేసుకుంటున్నారు. వీటి ధర కూడా రూ.80 వరకు ఉంటోంది. చిత్తూరులో కొత్తగా వేసిన పంటల దిగుబడులు వచ్చేవరకూ ధరలు ఇలా కొనసాగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. -
కూర ‘గాయాలు’
చుక్కల్లో ధరలు వినియోగదారుల బెంబేలు పది రోజుల వ్యవధిలో దాదాపు రెట్టింపు కొద్ది రోజులు ఇంతేనంటున్న వ్యాపారులు మండపేట /కాకినాడ రూరల్ : కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పది రోజుల వ్యవధిలో దాదాపు రెండింతలకు పైగా పెరిగి దడపుట్టిస్తున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతుంటే కూరగాయలు వాటి పక్కన చేరాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూరగాయల పంటలకు అపార నష్టం వాటిల్లడమే ఇందుకు కారణమని వ్యాపారులు అంటున్నారు. లంక భూముల్లోను, మెట్ట ప్రాంతంలోను కూరగాయలు సాగుచేస్తుంటారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కడియం, సీతానగరం, కె గంగవరం, కపిలేశ్వరపురం మండలాల్లోని లంక భూముల్లో సుమారు 20 వేల ఎకరాల్లో దొండ, బెండ, బీరకాయ, చిక్కుడు, కాకర, మునగ, టమోటా, కాలీఫ్లవర్, ఆనబ తదితర పంటలు సాగవుతున్నాయి. మెట్ట, చాగల్నాడు ప్రాంతాల్లోని వేలాది ఐదు వేలకు పైగా ఎకరాల్లో అన్ని రకాల కూరగాల సాగు జరుగుతోంది. కూరగాయల ధరలు భారీగా పెరగడానికి వేసవి ఉష్ణోగ్రతలే కారణమని వ్యాపారులు అంటున్నారు. జూన్ మొదటి వారం వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండటం, గతంతో పోలిస్తే ఈసారి 45 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావడం జిల్లాలో సాగయ్యే ఆయా కూరగాయల పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఎండవేడి తాళలేక మొక్కలు మాడిపోవడంతో ప్రస్తుతం కూరగాయలు దొరకడం గగనంగా మారిందని రైతులు, వ్యాపారులు అంటున్నారు. కర్ణాటక, మహరాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే ఉల్లిపాయలు, బంగాళదుంప, బీట్రూట్, అల్లం, క్యాబీజీ తదితర రకాల ధరల్లో పెద్దగా మార్పు లేనప్పటికి స్థానికంగా సాగయ్యే వంకాయలు, బెండకాయలు, దొండ, బీరకాయ మొదలైన కాయగూరలు ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. పది రోజులు క్రితం వరకు ఉన్న ధరలు దాదాపు రెట్టింపై వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. తొలకరి వర్షాలతో వేసిన కూరగాయల పంటలు కొద్ది రోజుల్లో దిగుబడులు వచ్చినా, జూలైలో గోదావరికి వరదలు రానుండటంతో లంక భూములు ముంపునకు గురై పంటలకు నష్టం వాటిల్లే అవకాశముండటం ఆందోళనకు గురిచేస్తోంది. మెట్టలోని కూరగాయల పంటలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ప్రైవేటు మార్కెట్లో ధరలు ఇలా ఉంటే తోపుడు బండ్లు, సైకిళ్లపై అమ్మకాలు చేసే వారి వద్ద ఈ ధరలు మరింత అధికంగా ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరికొద్ది రోజులు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని వ్యాపారస్తులు చెబుతున్నారు. -
దుంప తెంపింది..!
- తగ్గిన ధర.. దిగుబడి పతనం - నష్టాల పాలవుతున్న పెండలం రైతులు - ఎకరానికి రూ.60 వేల నష్టం - ఇక పంటలు సాగుచేయలేమంటున్న రైతులు - చేదెక్కిస్తున్న చేమ పిఠాపురం: పెండలం సాగు రైతును నిండాముంచేసింది. ఒక్కసారిగా ధర పతనం కావడంతోపాటు దిగుబడి తగ్గిపోవడంతో రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టాలు రావడంతో ఇక పంటలు సాగు చేయడం సాధ్యం కాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం మండలంలోని రేవడి నేలల్లో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పొలాల్లో సాగుచేసిన ఈ పంటను గత వారం రోజుల నుంచి తవ్వుతున్నారు. ఈ ఏడాది ఈ పంటసాగులో దిగుబడి నిరాశాజనకంగానే ఉండగా ధర రెండు వంతులకు పడిపోవడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. గత ఏడాది పది టన్నుల పెండ్ల ధర రూ. 1.60 లక్షలుండగా ఈ ఏడాది రూ.లక్షకు పడిపోవడంతో కోలుకోలేని నష్టాలను చవిచూడాల్సి వస్తోందంటున్నారు. పిఠాపురం మండలం విరవాడ, విరవ, మంగితుర్తి, కోలంక, కుమారపురం, జల్లూరు, ఎఫ్‌కేపాలెం తదితర గ్రామాలతోపాటు జిల్లాలో కోనసీమ ఏరియాలోని రావులపాలెం పరిసర గ్రామాల్లోనూ, మెట్ట ప్రాంతాలైన ధర్మవరం, ఉత్తరకంచి, లంపకలోవ, లింగంపర్తి, ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండల గ్రామాల్లోనూ సుమారు 3,500 ఎకరాల్లో çసాగు చేశారు. ప్రస్తుతం పెండలం పంట తుది దశకు చేరుకోవడంతో దాన్ని తవ్వి తీస్తున్నారు. ఈ పంటకి వరి, చెరుకు పంటలకన్నా ఎక్కువ పెట్టుబడి ఎకరానికి రూ.లక్షకు పైగా అవ్వగా ధర పతనం కావడంతోపాటు దిగుబడి భారీగా తగ్గిపోవడంతో ఎకరానికి రూ.40 మాత్రమే ఆదాయం వస్తుండడంతో అప్పుల పాలవుతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దిగుబడి పతనం ఎకరానికి 14 టన్నులు దిగుబడి రావల్సిన పెండ్లం దిగుబడి ఈ ఏడాది ఐదు నుంచి ఆరు టన్నులకు పడిపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ధర పతనం కాగా దిగుబడి సైతం పడిపోవడంతో ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టం వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు వ్యవసాయశాఖ పట్టించుకోకపోవడం వంటి కారణాలతో నష్టాలు చూడాల్సి వస్తోందంటున్నారు. ఆగిన ఎగుమతులు ఇదిఇలా ఉంటే ఒడిశాలో స్థానిక ప్రజలకున్న ఆనవాయితీ ప్రకారం వివాహాల సమయంలో ఒక్కో కుటుంబం 100 కేజీల వరకూ పెండలం వినియోగిస్తుంటారు. అందువల్ల మన జిల్లాలో ఉత్పత్తయిన పెండలంలో 80 శాతం ఒడిశా రాష్ట్రానికి ఎగుమతవుతోంది. ప్రసుతం ఒడిశాలో సీజన్ కాకపోవడంతో పెండలం కొనుగోలుకు వ్యాపారులెవరూ రాకపోవడంతో ఇక్కడ అమ్మకాలు నిలిచిపోయాయి. తద్వారా ధర పాతాళానికి పడిపోయింది. ఒడిశాలో తప్ప ఈ కూర పెండలం దుంపలను ఎక్కడా ఎక్కువగా వినియోగించకపోవడంతో గతంలో ఎప్పుడు లేనంతగా ఏకంగా టన్నుకు రూ.6 వేలకు పైగా ధర పడిపోవడం ఇదే మొదటిసారని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అంతరపంటగా చేమ దిగుబడి నిరాశాజనకమే... పెండలంలో అంతరపంటగా సాగు చేసిన చేమ పంట సైతం ఆశాజనకంగా లేకపోవడంతో కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. అంతరపంటగా సాగు చేసిన చేమ ఎకరానికి టన్ను నుంచి రెండు టన్నుల వరకు దిగుబడి వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దుంప సక్రమంగా ఊరకపోవడంతోపాటు ధరకూడా కిలో రూ.2 వరకు మాత్రమే పలుకుతుండడంతో ఏమాత్రం ఆదాయం వచ్చే మార్గం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఆదుకునే వారు లేరు మేము రైతులమేనన్న విషయం ఎవరూ గుర్తించరు. మాకు రుణమాఫీ వర్తించదు. ఏవిధంగానూ సాయం అందదు. ప్రస్తుతం ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టాలు పాలై అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కు తోచనిస్థితిలో ఉన్నాం. దిగుబడి దెబ్బతీసి ధర లేక కొనేవారు రాక ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. అడబాల పాపారావు, పెండలం రైతు, విరవాడ, పిఠాపురం మండలం వ్యాపారం లేదు గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత దారుణంగా ధర పడిపోవడం చూడలేదు. దిగుబడి తగ్గిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కొనేవారు రావడం లేదు. దీంతో మేము కొనుగోలు చేయడం లేదు. అలాఅని ఇక్కడి వ్యాపారులు కొనడం లేదు. ఇక పెండలం వ్యాపారం చేయడం మనేయాలని నిర్ణయించుకున్నాం. బాలిరెడ్డి వెంకటేశ్వరరావు, పెండలం వ్యాపారి, ధర్మవరం , ప్రత్తిపాడు మండలం. -
దిగొస్తున్నారు.. ధర పెంచుతున్నారు
- రూ. 1400లకు పెరిగిన బొండాలు ధర - మొదట్లో రూ. 1,150లు మాత్రమే - గత సీజన్లో రూ.1800లు వరకు కొనుగోళ్లు - రైతులకు అండగా నిల్చిన వైఎస్సార్ సీపీ నేతలు - రూ.1500 వరకు పెంచాలని డిమాండ్ - ధర పెరుగుదల కోసం రైతులు ఎదురుచూపులు - కేరళ ఎగుమతులు పెరగడంతో ధర పెంచుతున్న మిల్లర్లు - కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లపై అనుమానాలు మండపేట : మొదట్లో 75 కిలోల బొండాలు బస్తా రూ.1,150లు మించి కొనుగోలు చేయని మిల్లర్లు ముందెన్నడూ లేనివిధంగా సీజన్ ఆరంభంలోనే ధర పెంచుతున్నారు. ఊహించని విధంగా ఇప్పటికే రూ.1400లు వరకు పెరగ్గా కేరళ డిమాండ్ మేరకు ఈ ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది ఆరంభంలోనే అమ్మకాలు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతాంగం ఈ సీజన్లో ఆచీతూచీ అడుగేస్తున్నారు. ధాన్యం అమ్మకాలు మందకొడిగా సాగుతుండగా ప్రస్తుత మిల్లింగ్, భవిష్యత్తు స్టాకుల కోసం మిల్లర్లు ధర పెంచక తప్పడం లేదని తెలుస్తోంది. జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాలతోపాటు మెట్టలోని మొత్తం 4.2 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరిగింది. 80 శాతం మేర బొండాలు రకాన్నే సాగుచేశారు. వాతావరణం అనుకూలించడడంతో ఈ సీజన్ ఆశాజనకంగా సాగింది. ఎకరానికి కొన్నిచోట్ల 47 బస్తాల నుంచి 50 బస్తాలకు పైబడి దిగుబడి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 13.77 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి లక్ష్యం కాగా దానిని అధిగమించి రైతులు దిగుబడులు సాధించారు. మాసూళ్లు మొదలుకావడంతో ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తుతాయని భావించిన మిల్లర్లకు ఈసారి చుక్కెదురైంది. సాగు కోసం చేసిన అప్పులు, ఎరువుల దుకాణాల బాకాయిలు చెల్లించేందుకు సాధారణంగా సన్నచిన్నకారు రైతులు దళారులకు కళ్లాల్లోనే ధాన్యాని అమ్మేస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని సీజన్ ఆరంభంలో ధర తగ్గించేసి రైతుల వద్ద ధాన్యం అయిపోయిన తర్వాత మిల్లర్లు, దళారులు ధర పెంచడం పరిపాటి. ఈ క్రమంలో మిల్లర్లు, స్టాకులు పెట్టుకున్న దళారులు భారీగా లాభపడుతున్నారు. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైంది. కేరళలో డిమాండ్ లేదంటూ మొదట్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాని మిల్లర్లు కొనుగోళ్లు సీజన్ ముగిసిన అనంతరం ధర పెంచడం ప్రారంభించారు. 75 కేజీల బస్తా ధర క్రమంగా పెంచుతూ రూ.1800లు వరకు పెంపుదల చేశారు. రబీ సీజన్ మాసూళ్లు దగ్గరపడే వరకు రూ.1800లుండగా మార్కెట్లోని ధాన్యం రావడం ప్రారంభించే సరికి ఒక్కసారిగా ధరను రూ.1,150లకు తగ్గించేశారు. గత ఏడాది ఇదే తరహాలో మొదట్లో ధరను తగ్గించేయడం, తమవద్ద ఉన్న ధాన్యం అయిపోయిన తర్వాత మిల్లర్లు ధరను పెంచడంతో మోసపోయిన రైతాంగం ఈసారి అమ్మకాలు చేసేందుకు ఆచితూచీ అడుగేస్తున్నారు. పెంచకుంటే ఉద్యమిస్తాం : వైఎస్సార్ సీపీ కేరళలో ఉన్న డిమాండ్ మేరకు 75 కేజీల బస్తా రూ.1500లు వరకు కొనుగోలు చేసే వీలుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసూళ్ల ఆరంభంలోనే పేర్కొన్నారు. ఈ మేరకు కంగారు పడి అమ్మకాలు చేయరాదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ కోరారు. రూ.1500 కొనుగోళ్లు చేయకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని, అందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. రూ. 1500లకు కొనుగోలు చేయాలి ప్రస్తుతం కేరళ మార్కెట్ దృష్ట్యా బస్తా రూ. 1500లు వరకు కొనుగోలు చేసే వీలుంది. ఆ దిశగా కొనుగోళ్లు జరపడం ద్వారా రైతులకు మేలు చేయాలి. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వారి పక్షాన ఉద్యమిస్తాం. వేగుళ్ల లీలాకృష్ణ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్. -
డిపాజిట్లపై ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ
ముంబై: ప్రభుత్వం రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు మరోషాకిచ్చింది. టెర్మ్ డిపాజిట్లపై రేట్లలో భారీ కోత పెట్టింది. మీడియం టెర్మ్, లాంగ్ టెర్మ్ డిపాజిట్ల పై రేట్లను సమీక్షించింది. ఈ మేరకు కోటి రూపాయల లోపు డిపాజిట్ల మెచ్యూరిటీపై చెల్లించే వడ్డీరేటులో 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25శాతంగా నిర్ణయించింది. ఏప్రిల్ 29, 2017 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్టు ఎస్బీఐ అధికారికంగా వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయలలోపు డిపాజిట్లపై ఎస్బీఐ గరిష్ఠంగా 6.75 శాతంతో పోలిస్తే 6.25 శాతం వడ్డీని అందించనుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఏడు రోజుల నుంచి రెండు సంవత్సరాల మధ్య ఉండే స్వల్పకాలిక డిపాజిట్లకు చెల్లించే వడ్డీ రేటును మాత్రం యథాతథంగా ఉంచింది. అలాగే సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటుపై కూడా కోత పెట్టింది. ఇప్పటిదాకా 7.25శాతంగా వున్న ఈ రేటును 6.75శాతంగా నిర్ణయించింది. మూడేళ్లనుంచి పదిసం.రాల లోపు ఉన్న టెర్మ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లను తగ్గించి 6.50శాతంగా ఉంచింది. సంవత్సరం నుంచి 455 రోజుల డిపాజిట్లపై 6.90 శాతం అత్యధిక రేటును అందిస్తోంది. ఎస్బీఐ నిధుల ఆధారిత రుణ రేట్లను మార్చలేదు. వార్షిక ఎంసీఎల్ఆర్ ఎనిమిది శాతంగా ఉంది. -
చివరికి పెరిగింది
భీమవరం/పెరవలి : ధాన్యం ధర అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం మిల్లర్లు ఏ–గ్రేడ్ ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,200 పైగా చెల్లిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు బస్తా రూ.950 మాత్రమే పలికిన ధర అమాంతం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 5.60 లక్షల ఎకరాల్లో వరి వేశారు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ.. పంట చేతికి వస్తున్న తరుణంలో వాతావరణం అనుకూలించింది. దిగుబడులు పెరగటం.. ఇప్పుడు ధాన్యం ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఎంతోకొంత కోలుకునే పరిస్థితి కనిపిస్తోంది. దాళ్వాలో ఎంటీయూ–1010, ఎంటీయూ–1156, ఎంటీయూ–1121 రకాలను సాగు చేశారు. వీటిలో ఎంటీయూ–1165 రకం దిగుబడి బాగా వస్తోంది. ఎకరానికి 50 నుంచి 60 బస్తాల వరకు పండిందని రైతులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో ఇప్పటికే వరి కోతలు పూర్తికాగా.. డెల్టాలో మాసూళ్లు ఊపందుకున్నాయి. మాసూళ్లు ప్రారంభ సమయంలో యంత్రం సాయంతో కోసిన ధాన్యానికి బస్తాకు రూ.950 మాత్రమే చెల్లించారు. అప్పట్లో ధాన్యం విక్రయించిన రైతులు నష్టపోయారు. పెరిగిన ధరలు ఇలా మిల్లర్లు 75 కిలోల ఏ గ్రేడ్ ధాన్యానికి చేరా రూ.1,200 నుంచి రూ.1,220 వరకు చెల్లిస్తున్నారు. వరి కోత యంత్రంతో మాసూళ్లు చేసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో బస్తాకు రూ.1,100 ఇస్తున్నారు. సార్వా సీజన్లో ఆరుదల ధాన్యాన్ని కేవలం రూ.1,050కి కొనుగోలు చేయగా.. దాళ్వాలో ప్రస్తుతం రూ.150కి పైగా అదనంగా చెల్లిస్తున్నారు. దళారుల మాయాజాలం ఇప్పటికే సగం మంది రైతుల నుంచి బస్తా రూ.950 చొప్పున దళారులు ధాన్యం కొనుగోలు చేశారు. దానిని నిల్వచేసి ఇప్పుడు మిల్లర్లకు పెరిగిన ధరకు విక్రయిస్తున్నారు. సీజన్ మొదట్లో ధాన్యాన్ని అమ్ముకున్న రైతులు నష్టపోయారు. ఇప్పుడు మిల్లర్లు ధర పెంచినా.. దళారులు మాత్రం రూ.1,050కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. నేరుగా మిల్లర్లకు ధాన్యం అమ్ముకునే అలవాటు లేని రైతులు దళారుల చేతిలో మోసపోతుండగా.. మిల్లులకు తీసుకెళ్లి విక్రయించే రైతులకు మాత్రం మంచి ధర లభిస్తోంది. వీడని నల్లమచ్చ సమస్య ఎంటీయూ–1156 రకం ధాన్యాన్ని పండించిన రైతులు దిక్కుతోచని స్థితిలోనే రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ రకం ధాన్యం తల భాగంలో చిన్నపాటి నల్లమచ్చ వస్తోందని చెబుతున్నారు. ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐ నిరాకరిస్తున్నందు వల్ల కొనేది లేదని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. డెల్టా ఆయకట్టులోని 56 వేల హెక్టార్లలో 1156 వరి సాగు చేయగా.. ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకు దిగుబడులు వస్తున్నాయి. ఈ ధాన్యాన్ని కొనేవారు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఐకేపీ కేంద్రాలైనా కొనుగోలు చేస్తాయనుకుంటే.. వాటికి లింకింగ్ వ్యవస్థగా రైస్‌మిల్లర్లే వ్యవహరిస్తున్నారు. రైస్‌మిల్లర్లు ఆ ధాన్యాన్ని వద్దంటే తాము చేయగలిగిందేమీ లేదని ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు సైతం మొహం చాటేస్తున్నారని రైతులు వాపోతున్నారు. -
పసిడి కంకులు పండినా.. కురవని సిరుల వాన
దగాపడిన అన్నదాత రబీ వరి దిగుబడి ఘనం.. ధర చూస్తే దైన్యం ఆరుగాలం శ్రమించినా రైతుకు దక్కని లాభం బస్తా ధాన్యం రూ.900 నుంచి రూ.950కి కొంటున్న దళారులు అంతంతమాత్రంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రకృతి కరుణించి.. నేలతల్లి ఒడిలో పసిడి కంకులు పండించిన వేళ.. సిరుల రాశులు పొంగిపొరలుతాయనుకున్న అన్నదాత.. షరా మామూలుగానే మరోసారి దగా పడ్డాడు. అవసరమైన సమయంలో ప్రభుత్వం తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. ఇదే అదునుగా అటు దళారులు, ఇటు ధాన్యం వ్యాపారులు ధర తగ్గించేయడంతో రేయింబవళ్లు కష్టపడి పంట పండించిన రైతులు నష్టపోతున్నారు. దీంతో అమ్మబోతే అడవి అన్నతీరుగా రైతు పరిస్థితి మారింది. అమలాపురం : అనావృష్టిని అధిగమించి.. ఆరుగాలం శ్రమించి.. డెల్టా రైతులు రబీ వరి సాగు చేశారు. మంచి ధరకు అమ్ముకుంటే లాభాలు కళ్లజూడవచ్చనుకున్నారు. ఏలేరు పరిధిలో నీటి ఎద్దడి వల్ల పోయిన పంట పోగా దక్కిన నాలుగు గింజలతో కనీసం పెట్టుబడులైనా పొందాలని ఆశించారు. కానీ వారి ఆశలను అటు ప్రభుత్వం.. ఇటు దళారులు, ధాన్యం వ్యాపారులు వమ్ము చేశారు. కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవడంతో.. లాభాల మాట దేవుడెరుగు.. రైతులు నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో సుమారు 4.75 లక్షల ఎకరాల్లో రబీ వరిసాగు జరిగింది. ఇందులో గోదావరి డెల్టా పరిధిలో 4 లక్షల ఎకరాలు కాగా, ఏలేరు ప్రాజెక్టు పరిధిలో 75 వేల ఎకరాల్లో సాగు చేసినట్టు అంచనా. రెండుచోట్లా కలిపి సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు లెక్కలు వేశారు. ఏలేరులో నీటి ఎద్దడి వల్ల సుమారు 20 వేల ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రైతులు రూ.17 కోట్ల మేర నష్టపోయారు. డెల్టాలో ఎకరాకు సగటున 48 బస్తాల దిగుబడి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో 55 నుంచి 60 బస్తాల దిగుబడి కూడా రావడంతో లాభాలు పొందవచ్చని రైతులు ఆశించారు. కానీ ధాన్యం అమ్మకాల వద్దకు వచ్చేసరికి వారు నిలువునా మోసపోతున్నారు. ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,470 కాగా, 75 కేజీల బస్తా రూ.1,102 చొప్పున, గ్రేడ్-ఎ రకం బస్తా రూ.1,132 చేసి కొనుగోలు చేయాలి. కానీ ఏలేరు, డెల్టాల్లోని పలుచోట్ల సాధారణ రకం బస్తా ధాన్యాన్ని వ్యాపారులు కేవలం రూ.900 నుంచి రూ.950 చేసి మాత్రమే కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో రైతులు బస్తాకు రూ.200 నుంచి రూ.250 చొప్పున ఎకరాకు రూ.9 వేల వరకూ నష్టపోయే దుస్థితి నెలకొంది. దీంతో కొంతమంది రైతులు అమ్మకాలు నిలిపి కళ్లాల్లోనే ధాన్యం నిల్వ ఉంచేశారు. ధాన్యం వ్యాపారులు, దళారుల వద్ద ముందస్తు అప్పులు చేసిన రైతులు మాత్రం.. వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. యంత్రాల ద్వారా కోత కారణంగా ధాన్యంలో తేమ (నెమ్ము) 25 శాతం పైబడి ఉందని వంక పెడుతూ మద్దతు ధరకు కోత పెడుతున్నారు. అక్కరకు రాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో 285 ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకూ మూడో వంతు కేంద్రాలు కూడా తెరుచుకోలేదు. పైగా 17 శాతం తేమ వంటి నిబంధనల కారణంగా తెరిచిన ఆ కొద్దిపాటి కేంద్రాలవైపు రైతులు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెట్టుబడికి సరిపోతుంది పండిన పంట పెట్టుబడికి సరిపోతుంది. పెదపూడి గ్రామంలో రెండెకరాల్లో కౌలుకు సాగు చేశాను. ఎకరానికి 40 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. 50 బస్తాలు వస్తుందనుకుంటే చివరిలో దోమ సోకి ఎకరాకు పది బస్తాల దిగుబడి తగ్గింది. యంత్రంతో కోసిన పంట 75 కేజీలు బొండాలు రకానికి రూ.1000, సన్నాలకు రూ.900 చొప్పున ధాన్యం కమిషన్ వ్యాపారులు ఇస్తున్నారు. దీనివల్ల మరింత నష్టపోయేలా ఉన్నాను. - వీవీ రమణ, కౌలురైతు, పెదపూడి -
అరటి ధర హాసం
జోరందుకున్న ఎగుమతులు మార్కెట్‌యార్డులో సందడి రైతుల్లో ఆనందం రావులపాలెం : లారీల సమ్మెతో కొద్ది రోజులుగా ఎగుమతులు తగ్గి ఢీలా పడిన అరటి రైతులు తాజాగా ధరలు పెరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రావులపాలెం అరటి మార్కెట్ యార్డు నుంచి ఎక్కువ శాతం గెలలు ఎగుమతయ్యే ఒరిశా రాష్ట్రంలో ఈ నెల 14న సంక్రాంతి పండుగ నేపథ్యంలో అక్కడ వ్యాపారులు కొనుగోళ్ళుకు పోటీ పడుతున్నారు. దీంతో ధరలు ఊపందుకున్నాయి. ఒడిశాలో సంక్రాంతికి మామిడి, పెండ్లంతో పాటు అరటి పండ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా కొత్తగా పెళ్లయిన దంపతులు వీటిని దేవాలయాల్లో సమర్పించడం ఆనవాయితీ. దీంతో వ్యాపారులు రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున గెలలు కొనుగోలు చేసి ఒడిశాకు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు ఎగుమతులు పెరిగాయి. మన రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో శుభకార్యాలు, పూజలు ప్రసుత్తం ఎక్కువగా ఉండటంతో అరటి గెలలకు డిమాండ్ పెరిగింది. యార్డు పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల్లో నిన్నమొన్నటి వరకూ లారీల సమ్మెతో గెలలు కోయని రైతులు పెరిగిన ధరతో కోతలు ముమ్మరం చేశారు. స్థానిక వ్యాపారులతో పాటు తమిళనాడు, ఒడిశా నుంచి కూడా వ్యాపారులు కొనుగోళ్ళుకు రావడంతో అరటి గెలలకు మంచి ధర లభిస్తోంది. ప్రస్తుతం యార్డు పరిధిలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట, కపిలేశ్వరపురం, మండపేట, పి.గన్నవరం, పెనుగొండ, పెరవలి, మార్టేరు మండలాల నుంచి రోజుకు 10 నుంచి 20 వేలు గెలలను రైతులు అమ్మకానికి తీసుకువస్తున్నారు. దీంతో తమిళనాడు, ఒడిశా, బీహర్ తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 15 నుంచి 20 లారీల సరుకు నిత్యం రవాణా అవుతోంది. రోజుకు సుమారు రూ.15 నుంచి 20 లక్షల వ్యాపారం సాగుతోంది. ప్రస్తుతం మార్కెట్ జోరును బట్టి ఈ నెలాఖరు వరకూ ఇదే రీతిలో ధరలు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు పెరిగాయి నిన్నమొన్నటి వరకూ లారీల సమ్మెతో ఎగుమతులు తగ్గి కొనుగోళ్లు అంతమాత్రంగా చేసేవాళ్లం. ప్రసుత్తం ఒరిస్సాతో పాటు తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వినియోగం పెరడంతో ధర పెరిగింది. దీంతో ఎగుమతులు జోరందుకున్నాయి. మరో రెండు వారాల పాటు ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది. - కోనాల చంద్రశేఖరరెడ్డి, వ్యాపారి. -
పెంపుపై కొబ్బరి రైతుల పెదవి విరుపు
అమలాపురం : కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు జిల్లా రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.550 పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ (సీఏసీపీ) సిఫారసు మేరకు కేంద్రం ఈ ధర నిర్ణయించింది. ప్రస్తుతం ఎండుకొబ్బరి కనీస మద్దతు ధర క్వింటాల్ సాధారణ రకం రూ.5,950 ఉంది. తాజా పెంపుతో ఇది రూ.6,500కి పెరిగింది. బాల్‌కోప్రా రూ.6,240 ఉండగా, తాజాగా రూ.6,790కి చేరింది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే క్వింటాల్‌కు రూ.575 పెంచగా, తరువాత కనీస మద్దతు ధర పెంచింది ఈసారే. కానీ పెరిగిన పెట్టుబడులతో పోలిస్తే ఈ పెంపువల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎండు కొబ్బరి ధర క్వింటాల్ రూ.7 వేల నుంచి రూ.7,200 వరకూ ఉంది. ఇదే సమయంలో పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర సహితం రూ.7 వేలు ఉంది. దీంతో ఎండుకొబ్బరి తయారీ పెద్దగా జరగడం లేదు. పచ్చికాయ ధర తగ్గినప్పుడు రైతులు ఎండు కొబ్బరి తయారు చేస్తూంటారు. నాఫెడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలు చేసినప్పుడు కనీస మద్దతు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలీ రేట్లు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు తమకు నిరాశ కలిగించిందని కొబ్బరి రైతులు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రైతులతో కలిసి కోనసీమకు చెందిన రైతులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి సురేష్‌ప్రభులను గత ఏడాది అక్టోబరులో కలిశారు. పెట్టుబడులతోపాటు రైతు కుటుంబాలకు అయ్యే ఆదాయ వ్యయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఎండుకొబ్బరికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.17 వేలు చెల్లించాలని కోరారు. వారి సూచనల మేరకు సీఏసీపీ చైర్మన్ విజయ్పాల్శర్మను కలిసి ఇదే డిమాండ్‌పై వినతిపత్రాలు అందజేశారు. కనీసం రూ.10 వేలు చేసినా ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని రైతులు ఆశించారు. అయితే వారి ప్రయత్నాలను పట్టించుకోని కేంద్రం.. ఈసారి పెంపును రూ.550కే పరిమితం చేసింది. తమిళనాడు కాంగాయంతోపాటు మన జిల్లాలోని కోనసీమలోనే ఎండు కొబ్బరి ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. ఈ ఉత్పత్తి పైనే అంబాజీపేట మార్కెట్లో 80 శాతం లావాదేవీలు జరుగుతూంటాయి. ధర పెంపు స్వల్పంగా ఉండడంవల్ల ఎండు కొబ్బరి తయారీ పరిశ్రమ కోలుకునే అవకాశం లేదని రైతులు, వ్యాపారులు అంటున్నారు. ‘పాత ధర మీద ఎంతో కొంత పెంచితే చాలన్నట్టుగా ఉంది సీఏసీపీ పరిస్థితి. ‘ఈమాత్రం దానికి సమీక్షలు.. సమావేశాలు.. నివేదికలు కోరడాలెందుకు? అసలు సీఏసీపీ ఎందుకు?’ అని అంబాజీపేటకు చెందిన రైతు, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
సత్యదేవుని సన్నిధిలో వ్రతాలు ప్రియం
నుంచి టిక్కెట్ల ధర పెంపు - 30 శాతం పెరగనున్న వ్రత ఆదాయం - ఈఓ నాగేశ్వరరావు వెల్లడి అన్నవరం : సత్యదేవుని సన్నిధిలో వ్రత నిర్వహణ భక్తులకు ప్రియం కానుంది. రూ.150, రూ.300, రూ.700 వ్రతాల టిక్కెట్ల ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 15 శాతం నుంచి 33 శాతం వరకూ పెరగనున్నాయి. నిర్వహణ వ్యయం పెరిగినందున వ్రతాల టిక్కెట్ల ధరలు పెంచాలని దేవస్థానం పాలకవర్గం గతంలోనే నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ వైవీ అనూరాధ మంగళవారం ఆమోదించారని దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. విజయవాడలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను మంగళవారం కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు. పెంపు ఇలా.. రూ.150 వ్రత టిక్కెట్ రూ.200కు, రూ.300 టిక్కెట్‌ను రూ.400కు, రూ.700 టిక్కెట్‌ను రూ.800కి పెంచుతున్నారు. అయితే రూ.1,500, ఏసీ మండపంలో నిర్వహించే రూ.2 వేల వ్రత టిక్కెట్ల ధరలను పెంచడం లేదని ఈఓ తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వ్రతాల ద్వారా సుమారు రూ.23.70 కోట్ల ఆదాయం వచ్చింది. వ్రతాల టిక్కెట్ల పెంపు ద్వారా 30 శాతం అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వ్రత విభాగం ద్వారా రూ.27 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే టిక్కెట్ల ధరలను పెంచడంవలన ఈ ఆదాయం రూ.30 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీంతోపాటు వ్రత పురోహితులకు దేవస్థానం చెల్లించే పారితోషికం కూడా పెరగనుంది. ప్రసాదం బరువు, ధర పెంపు సత్యదేవుని ప్రసాదం ధరను కూడా పెంచనున్నారు. ప్రస్తుతం వంద గ్రాముల ప్రసాదం రూ.10కి విక్రయిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్యాకెట్ బరువును 125 గ్రాములకు పెంచి రూ.15కి విక్రయించనున్నట్టు ఈఓ తెలిపారు. ప్రసాదం తయారీలో వాడే ముడి సరుకులు గోధుమ, పంచదార, నెయ్యి, యాలకులతోపాటు వంటగ్యాస్ ధర కూడా పెరగడంతో తయారీ వ్యయం భారీగా పెరిగిందన్నారు. వాస్తవానికి బరువు 25 గ్రాములు పెంచినందున దాని ప్రకారం ధర రూ.2.50 పెరుగుతుందని, కానీ ప్రసాదం తయారీలో వస్తున్న నష్టాన్ని అధిగమించేందుకు, చిల్లర సమస్య తలెత్తకుండా ఉండేందుకు మరో రూ.2.50 కలిపి రూ.15కి విక్రయించాలని నిర్ణయించినట్టు ఈఓ తెలిపారు. 2016-17లో ప్రసాదం విక్రయాల ద్వారా దేవస్థానానికి రూ.19.61 కోట్ల ఆదాయం రాగా, 2017-18లో రూ.21.50 కోట్లు వస్తుందని అంచనా వేశారు. తాజా పెంపుదల కారణంగా ఈ ఆదాయం రూ.24 కోట్లు ఉండగలదని అంచనా వేస్తున్నారు. -
మీనం.. ధర దీనం
ఏలూరు (సెంట్రల్) : చేపల ధర తగ్గిపోవడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎండలు ముదిరిపోవడంతో చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతోంది. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు చేపల పట్టుబడి పడుతున్నారు. డిమాండ్‌కు మించి సరుకు మార్కెట్‌ను ముంచెత్తుతుండడంతో చేపల ధర ఒక్కసారిగా పడిపోయింది. వారం, పది రోజుల క్రితం వరకు శీలావతి కిలో రూ.105 నుంచి రూ.110 మధ్య పలకగా వారం రోజులుగా ధర పడిపోయింది. కిలోకు రూ.30 వరకు తగ్గి రూ.85కు చేరగా, కిలో రూ. 80కు విక్రయించే ఫంగస్ రూ.35 తగ్గి రూ.45కు చేరింది. శనివారం మార్కెట్లో శీలావతి కిలో రూ.85, ఫంగస్ రూ.45 వరకు వ్యాపారులు విక్రయాలు జరిపారు. నిత్యం 60 టన్నుల ఎగుమతులు కైకలూరు, ఆకివీడు, కొల్లేరు గ్రామాలు, పెదపాడు మండలాల నుంచి ఏలూరు మార్కెట్‌కు నిత్యం భారీస్థాయిలో చేపలు వస్తాయి. మార్కెట్లో అమ్మకాలు పోను మిగిలిన చేపలను వ్యాపారులు ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏలూరు మార్కెట్ నుంచి యూపీ, ఒడిశా, హౌరా, కోల్‌కతాలకు ప్రతి రోజు 50 టన్నుల నుంచి 60 టన్నుల వరకు ఎగుమతులు జరుగుతాయి. ఇటీవల చేపల దిగుబడి పెరిగిపోవడంతో ఒక్క ఏలూరు మార్కెట్ నుంచే 100 టన్నుల వరకు చేపలు ఎగుమతి జరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో గణపవరం, నారాయణపురం, భీమవరం ప్రాంతాల నుంచి ప్రతి రోజూ 500 నుంచి 600 టన్నుల వరకు ఎగుమతులు జరుగుతున్నాయి. మరోవైపు రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడంతో చేపలు చనిపోతాయనే భయంతో కూడా ఎక్కువగా పట్టుబడి పడుతున్నారు. అయితే ధర పతనంతో నష్టపోతున్నామని, అయినకాడికి అమ్ముకోకపోతే పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నెల రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ధర పతనంతో నష్టాలు వారం రోజులుగా చేపల ధరలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. వేసవికాలం నేపథ్యంలో చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. దీంతో రైతులు చేపలను పట్టుబడి చేసి మార్కెట్లకు తీసుకువస్తున్నారు. చేపలు మార్కెట్‌ను ఎక్కువగా రావడంతో ధరలు పడిపోయాయి. – మిడత రామ్‌తేజ, చేపల వ్యాపారి కొనేవారు కరువు రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చేపలు చెరువుల్లో బతికే అవకాశం లేదు. దాంతో చేపలను ఎక్కువగా పట్టుబడులు చేస్తున్నారు. చేపల దిగుబడి పెరిగింది కానీ ధరలు లేకుండా పోయాయి. రైతులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. – ఎ.గణేష్, చేపల వ్యాపారి నష్టాలు తప్పవు చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో పట్టుబడి చేస్తున్నాం. చేపలు పట్టుబడి చేస్తున్న సమయంలో చాలా వరకు చేపలు చనిపోతున్నాయి. మార్కెట్లో చేపలు ఎక్కువగా ఉండడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో గిట్టుబాటు ధర రాక నష్టాలు తప్పేలా లేవు. – ఎం.చింతయ్య, రైతు, పోతునూరు -
గ్యాస్ ధరలు తగ్గించాలని ధర్నా
నరసరావుపేటటౌన్ : పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు అట్లూరి విజయకుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సామాన్య ప్రజలను సైతం పీక్కుతింటున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఇప్పటికే అనేకమార్లు గ్యాస్ ధరలు పెంచి వినియోగదారుల నడ్డివిరిచారని ఆగ్రమం వ్యక్తంచేశారు. నాయకులు బోయిన సుబ్బారావు, బెల్లంకొండ వెంకట్, మణికంఠ, హరిబాబు తదితరులున్నారు. -
అరటి ధర హాసం
సంక్రాంతితో జోరందుకున్న ఎగుమతులు తమిళనాడులో పెరిగిన డిమాండ్ రావులపాలెం : కొద్ది రోజులుగా ధర లేక వెలవెలబోయిన రావులపాలెం (కొత్తపేట) అరటి మార్కెట్ యార్డులో ఎగుమతులు జోరందుకున్నాయి. అరటికి ధర పెరగడంతో రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ గిట్టుబాటు ధరలేక నష్టాలు చవిచూసిన రైతులకు పెరిగిన ధరలు కొంత ఉపశమనం కలిగించాయి. తమిళనాడులో అరటి దిగుబడి తగ్గడంతో అక్కడి వ్యాపారులు రావులపాలెం మార్కెట్‌కు రావడంతో ధరలు పెరిగాయి. సంక్రాంతికి వినియోగం పెరిగే అవకాశాలు ఉండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు ఎగుమతులు పెరగడంతో ధరలు ఊపందుకున్నాయి. యార్డు పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల్లో నిన్నమొన్నటి వరకూ గెలలు కోయని రైతులు పెరిగిన ధరతో కోతలు ముమ్మరం చేశారు. 80 శాతం పంట పూర్తి కావడంతో ఉన్న 20 శాతం పంటలో పక్వానికి వచ్చిన ప్రతీ గెలను రైతులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ ధరల లేక నష్టపోయిన రైతులు పెరిగిన ధరలతో కాస్త కోలుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం యార్డు పరిధిలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట, కపిలేశ్వరపురం, మండపేట, పి.గన్నవరం, పెనుగొండ, పెరవలి, మార్టేరు మండలాల నుంచి రోజుకు 10 నుంచి 20 వేల గెలను అమ్మకానికి తీసుకువస్తున్నారు. తమిళనాడు, ఒరిస్సా, బీహర్, తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 15 నుంచి 20 లారీల సరుకు రవాణా జరుగుతోంది. రోజుకు సుమారు రూ.15 నుండి రూ.20 లక్షల వ్యాపారం జరుగుతుంది. ఎగుమతులు పెరిగాయి నిన్నమొన్నటి వరకూ సరైన ధర లేక అంతమాత్రంగా కొనుగోళ్లు జరిగాయి. ప్రసుత్తం తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో వినియోగం పెరడంతో ధర పెరిగింది. ఎగుమతులు కూడా జోరందుకున్నాయి. మరో రెండు వారాల పాటు ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది. - కోనాల చంద్రశేఖరరెడ్డి, వ్యాపారి పెరిగిన ధరలు ఊరటనిస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అరటి సాగులో తీవ్ర నష్టాలు చవిచూశాం. చాలా రోజుల తరువాత అరటి ధరలు పెరగడం ఊరటనిస్తోంది. మరి కొద్ది రోజులు మార్కెట్ ఇదే విధంగా ఉంటే రైతులు నష్టాల నుంచి బయటపడతారు. - నామాల ఏసుప్రసాద్, రైతు, ర్యాలి -
మీనం.. ధర హీనం
15 రోజుల్లో కేజీకి రూ.14 తగ్గుదల పెద్ద నోట్ల రద్దుతో మందగించిన ఎగుమతులు పట్టుబడులు నిలిపేసిన రైతులు భీమవరం అర్బన్ : కొంతకాలంగా స్థిరంగా ఉన్న చేపల ధరపై పెద్ద నోట్లు రద్దు ప్రభావం పడింది. దీంతో రెండు వారాలుగా చేపల ధరలు పతనమవుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో కేజీకి రూ.14 మేర ధర పతనం కావడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. పట్టుబడుల వేళ ధర పతనంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చాలామంది రైతులు పట్టుబడులను నిలిపేశారు. అయితే ఎక్కువ కాలం ఆగే పరిస్థితి లేదని, మేత ఖర్చు పెరిగిపోవడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తే అసలుకే మోసం వస్తుందని వారు వాపోతున్నారు. పెద్దనోట్ల రద్దుతో మందగించిన ఎగుమతులు భీమవరం మండలంలోని వెంప, పెదగరువు, శ్రీరామపురం, గూట్లపాడు, ఈలంపూడి, దెయ్యాలతిప్ప, రామాయణపురం, కొత్తపూసలమర్రు, కొమరాడ, ఎల్‌వీఎన్‌పురం, గొల్లవానితిప్ప, దొంగపిండి, లోసరి తదితర గ్రామాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో చేపలు, 4 వేల ఎకరాల్లో వనామీ రొయ్యలు సాగు చేస్తున్నారు. ఉప్పుటేరు, బొండాడ డ్రెయిన్, మందచేడు, కోటిమొగ డ్రెయిన్లను ఆనుకుని ఎక్కువగా శిలావతి, కట్ల, రూప్‌చంద్, ఫంగస్, గడ్డి చేప, జాడిమోస్ వంటి సప్పనీటి చేపలను పెంచుతున్నారు. భీమవరం కేంద్రంగా నిత్యం సుమారు 700 టన్నులు కోల్‌కతా, పాట్నా, తిరువిడి, ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. అయితే నెలన్నర క్రితం పెద్దనోట్లు రద్దు చేయడంతో క్రమేపీ ఎగుమతులు మందగిస్తూ వచ్చాయి. నగదు కష్టాల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. 15 రోజుల క్రితం శిలావతి కేజీ మార్కెట్లో రూ.104 ఉంటే ప్రస్తుతం రూ.90 పలుకుతోంది. రెండు కేజీల కట్ల చేప 103 నుంచి రూ.91కి, ఫంగస్ రూ.62 నుంచి రూ.56కి పడిపోయింది. రూప్‌చంద్ పదిరోజుల కిందట కేజీ రూ.90 ఉంఽడగా నేడు రూ.60 పలుకుతోంది.గడ్డిచేప రూ.70, జాడీమోస్ రూ.65 పలుకుతున్నాయి. నిలిచిన పట్టుబడులు చేప ధర ఒక్కసారిగా తగ్గడంతో పట్టుబడులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. పట్టుబడికి వచ్చిన చేపలను మేపేందుకు భారీ పెట్టుబడులు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిలావతి, కట్ల, రూప్‌చంద్, ఫంగస్ చేపలకు పెట్టే మేతను బట్టి 7 నెలలు లోపు పట్టుబడికి రావాల్సి ఉంది. అయితే కొంతకాలంగా వాతావరణ పరిస్థితుల కారణంగా చేప ఎదుగుదల మందగించింది. దీంతో రైతులకు ఖర్చు అధికమైంది. కుదేలైన కౌలు రైతులు చేపల ధర పతనంతో కౌలు రైతులు కుదేలయ్యారు. చెరువును బట్టి ఒక్కో ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు కౌలు ఉంది. ఈ ఏడాది చేపల మేతల ధర విపరీతంగా పెరగడం, పట్టుబడి వేళ ధర పతనం కావడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వారు గగ్గోలు పెడుతున్నారు. -
ఎస్బీఐ బల్క్ డిపాజిట్ల రేట్లు తగ్గింపు
న్యూఢిల్లీ: బల్క్ డిపాజిట్ల రేట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.9 శాతం వరకూ తగ్గించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో డిపాజిట్లు భారీగా వచ్చిన నేపథ్యంలో రూ.1-10 కోట్ల బల్క్ డిపాజిట్ల రేట్లను తగ్గించామని, ఈ తగ్గించిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. 18-210 రోజుల డిపాజిట్లపై రేట్లను 5.75 శాతం నుంచి 3.85 శాతానికి, ఏడాది నుంచి 455 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై రేట్లను 6% నుంచి 4.25%కి, ఏడు రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై రేట్లను 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించామని ఎస్బీఐ తెలిపింది. -
బండ బాదుడు
-గ్యాస్ సిలిండర్‌పై రూ.39 పెంపు -జిల్లా వినియోగదారులపై రూ. 2.10 కోట్లు భారం తణుకు: నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటితోపాటు తాజాగా గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు గుదిబండగా మారింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ.39 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులకు పెనుభారమయ్యింది. పెరిగిన ధరతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.2.10 కోట్లు మేర భారం పడనుంది. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతున్న చమురు కంపెనీలు తాజాగా రాయితీ గ్యాస్ సిలెండర్లపై భారం మోపడం సమంజసం కాదని మధ్యతరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాపై భారం... జిల్లాలో మొత్తం 7.50 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో సుమారు 2 లక్షల మంది దీపం గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారు. హెచ్‌పీ, భారత్, ఇండేన్ గ్యాస్ డిస్టిబ్యూటర్ కేంద్రాలు 42 ఉండగా వీటి ద్వారా ప్రతి నెలా 5.40 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. రోజుకు దాదాపు 50 వేల మంది సిలిండర్ బుకింగ్ చేసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సబ్సిడీపై ఇస్తున్న గ్యాస్ సిలెండర్ ధర రూ.537 కాగా నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో రూ. 72 చొప్పున రాయితీ మొత్తం జమ అవుతోంది. ఈనెల 1 నుంచి రాయితీపై పంపిణీ చేసే గ్యాస్ సిలిండర్‌పై రూ.39 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నులన్నీ కలిపితే పెంచిన ధరతో కలిపి గ్యాస్ సిలెండర్ ధర రూ.576కు చేరింది. ఈ లెక్కన జిల్లా వినియోగదారులపై దాదాపు రూ.2.10 కోట్ల భారం పడనుంది. ధరలు పెంచడం దారుణం పప్పుల ధరలు ఆకాశాన్నంటడంతో వంటింటి బడ్జెట్ పెరిగింది. ఇలాంటి సమయంలో గ్యాస్ సిలిండర్ ధర పెంచడం దారుణం. ఆదాయానికి ఖర్చులకు పొంతన ఉండటం లేదు. ధరలు ఇలా పెంచుకుంటూ వెళితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎలా బతికేది. ఎం.సరస్వతి, గృహిణి, తణుకు ఎలా బతికేది.. కార్తీకమాసం కావడంతో ఇప్పటికే కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతోపాటు ఇటీవల పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేశారు. దీనికి తోడు ఇప్పుడు గ్యాస్ సిలెండర్ ధరను ప్రభుత్వం పెంచేసింది. ఇలా ధరలు పెంచుకుంటూపోతే ఎలా బతికేది.? కె.నాగమణి, గృహిణి, దువ్వ -
ఘాటు తగ్గిన మిర్చి
– ధర పతనంతో రైతుల కుదేలు – గత సీజన్లో పది కిలోలు రూ. 500 – ప్రస్తుతం రూ.80 – కూలి ఖర్చులు కూడా రాక వదిలేస్తున్న రైతులు ఆచంట : అన్నదాతను కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. అయితే అతివష్టి లేకపోతే అనావష్టి. రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పడిస్తున్నా ఫలితం మాత్రం పూర్తిస్థాయిలో దక్కడం లేదు. దిగుబడులు బాగుంటే ధరలు ఉండటం లేదు. ధర ఉంటే ప్రకతి వైపరీత్యాలు తెగుళ్లు. ప్రతి సీజన్లోనూ రైతుకు ఏదో ఒక విధంగా ఆపద వచ్చి పడుతూనే ఉంది. ఈసారి పచ్చిమిర్చి పండించిన రైతులదీ ఇదే దుస్థితి. జిల్లాలో 3,500 వేల ఎకరాల్లో సాగు ఈ వేసవిలో పచ్చిమిర్చి ధర హోల్‌సేల్ మార్కెట్లో పది కేజీలు రూ. 400 నుంచి రూ.500 పలికింది. ధర బాగుండడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో రైతులు మిర్చి సాగుపై ఎక్కువ ఆసక్తి చూపారు. ప్రస్తుతం జిల్లాలో 3,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గోదావరి తీరప్రాంతంలోని మండలాలు, లంక భూములతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో ఎక్కువగా మిర్చిని సాగు చేస్తున్నారు. ధర పతనం.. రైతుల దైన్యం మిర్చి ధర గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి పతనమైంది. వేసవి సీజన్లో పది కేజీలు రూ.400 పైగా పలకగా ప్రస్తుతం రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరితో పోలిస్తే పచ్చిమిర్చి ఖర్చుతో కూడిన సాగు. ఎకరాకు సుమారు రూ.40 వేలుపైనే ఖర్చవుతుంది. నెలా 15 రోజుల వరకూ పంట కాపుకు రాదు. దాదాపు నాలుగు నెలల వరకూ కోతలు కోయవచ్చు. రైతులు ఆశించినట్టుగానే ఈసారి మిర్చిసాగు ఆశాజనకంగానే ఉంది. చీడ పీడల ప్రభావం ఉన్నా అది దిగుబడిపై పెద్దగా ప్రభావం చూపలేదు. గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి. ఎకరాకు మూడు క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తోంది. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్లను ముంచెత్తింది. దీంతో ధరలు నేలచూపులు చూశాయి. మొక్కలనే కాయలు వదిలేస్తున్న రైతులు ప్రస్తుతం మార్కెట్లో పలుకుకుతున్న ధరలు చూస్తుంటే మిుర్చి కోయకుండా వదిలివేయడమే ఉత్తమమని రైతులు భావిస్తున్నారు. పంటను నెలకు మూడుసార్లు వరకూ కోత కోస్తారు. ఎకరాకు కనీసం ఆరుగురు కూలీలను వినియోగిస్తే రెండు రోజులపాటు కోత సాగుతుంది. ఒక్కో కూలీకి రోజుకు రూ.200 చెల్లించాలి. రెండు రోజుల పాటు కోత సాగితే రూ.2,400 కోత కూలి ఖర్చు అవుతుంది. దిగుబడి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకూ వస్తోంది. మార్కెట్లో క్వింటాల్ రూ.700– రూ.800 మధ్య పలుకుతోంది. మూడు క్వింటాళ్లకు రూ.2,100 నుంచి రూ.2,400లోపు ఆదాయం వస్తోంది. లాభం సంగతి అలా ఉంచితే రవాణా ఖర్చులకు చేతి సొమ్ము వదులుతోంది. రెండు రోజుల శ్రమా వథాగా మారుతోంది. దీంతో రైతులు ఎందుకొచ్చిందిలే అని తయారైన కాయలను మొక్కలనే వదిలేస్తున్నారు. కొంతమంది రైతులు మాత్రం పరువుకోసం పంటను కోస్తున్నారు. దళారుల దందా ఆరుగాలం శ్రమించిన రైతులకు ఏమీ మిగలకపోయినా దళారులు మాత్రం దండుకుంటున్నారు. రైతుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్న కమీషన్‌దారులు చిరు వ్యాపారులకు పది కేజీలు రూ.120 వరకూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారులు చిల్లరగా కేజీ రూ.20 చేసి విక్రయాలు సాగిస్తున్నారు. 30 ఏళ్లుగా సాగు చేస్తున్నా ఇతడు పెనుగొడం మండలం మదనగూడెంకు చెందిన కౌలు రైతు కుడిపూడి వెంకటేశ్వరరావు. 30 ఏళ్లుగా పచ్చిమిర్చి సాగుచేస్తున్నాడు. ఈ ఏడాది 8 కుంచాల్లో సాగు చేశాడు. ఎకరాకు 35 బస్తాలు మక్తా చెల్లించేలా రైతుతో ఒప్పందం చేసుకున్నాడు. అప్పులు చేసి 30 వేలకుపైనే పెట్టుబడులు పెట్టాడు. పంట బాగా పండింది. దిగుబడులు బాగున్నాయి. కోసిన కాయలు సిద్ధాంతం మార్కెట్‌కు తీసుకెళితే పది కేజీలు రూ.70 చేసి కొనుగోలు చేశారు. దిగుబడి ఎక్కువగా ఉండడంతో ధర లేదని కమీషన్ వ్యాపారులు చెప్పుకొచ్చారు. కనీసం కూలీలకు కూడా సొమ్ములు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో లాభం రాకున్నా పరువు పోకూడదని సాగు చేస్తున్నానని ఆవేదనతో చెప్పారు. ‘ కుడిపూడి వెంకటేశ్వరరావు, మదనగూడెం, పెనుగొండ మండలం -
ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యలు
–ధర పడిపోయే ప్రమాదం –స్థానిక సాగుదారుల భయం భీమవరం: ఆక్వా హబ్‌గా అభివృద్ది చెందుతున్న జిల్లాలోని రొయ్యల రైతుల గుండెల్లో ఇతర రాష్ట్రాల రొయ్యలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. భీమవరం, నెల్లూరు ప్రాంతాల వ్యాపారులు ఇటీవల కాలంలో గుజరాత్, పశ్చిమబెంగాల్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో రొయ్యల కొనుగోలు ప్రారంభించడంతో ఇక్కడి రొయ్యలకు ధరలు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు గుర్తిస్తే కొనుగోలు నిలిపివేస్తామంటూ ఎగుమతిదారులు ఇటీవల ప్రకటించడంతో రొయ్యల రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిన తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యల దిగుమతులు గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించాయంటున్నారు. యాంటిబయోటిక్స్ అవశేషాలు రొయ్యల పిల్లల హేచరీలు, రొయ్యల మేతల నుంచి వచ్చే అవకాశం ఉన్నా కేవలం రైతులను బాధ్యులను చేస్తూ కొనుగోలు నిలిపివేస్తామంటూ ప్రకటనలో గుప్పించడం వెనుక కొనుగోలుదారులు ధరలు తగ్గించే హ్యుహం ఉందనే ఆరోపణలు విన్పించాయి. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో రొయ్యలు, దాదాపు లక్షన్నర ఎకరాల్లో చేపలను సాగుచేస్తున్నారని అంచనా. భీమవరం పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 21 రొయ్యలను శుద్దిచేసే ప్రొసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. రొయ్యల సాగుపై ప్రత్యక్షంగా, పరొక్షంగా వేలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు ఏడు జిల్లాల్లో రొయ్యల సాగుచేస్తున్నా దాదాపు 70 శాతం ఎగుమతులు భీమవరం ప్రాంతం నుంచే కావడం విశేషం. రొయ్యల ఎగుమతులు ద్వారా 2014లో రాష్ట్రానికి సుమారు 8,732 కోట్లు ఆదాయం వచ్చిందంటే రొయ్యలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అవగతమవుతోంది. – గుజరాత్,పశ్చిమబెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో కొనుగోలు..... మన రాష్ట్రం నుంచి రొయ్యలు ఎక్కువగా యుఎస్ఏ, చైనా, థాయిలాండ్, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ప్రధానంగా భీమవరం ప్రాంతం నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ముందుగా జిల్లాలోని సముద్రతీర ప్రాంతంలో వరిసాగుకు ఉపయోగపడని భూముల్లో మాత్రమే టైగర్ రొయ్యల సాగు ప్రారంభమైంది. అయితే దీనిలో రైతులు నష్టాలను చవిచూడడంతో టైగర్ రొయ్యలసాగుకు రైతులు స్వస్తి చెప్పి స్కాంపి రొయ్యల పెంపకం చేపట్టారు. అయితే స్కాంపి రొయ్యలు సరిౖయెన ఫలితాలు ఇవ్వలేదు. వెనువెంటనే వనామి రొయ్యల పెంపకం చేపట్టారు. వనామి పెంపకం ద్వారా రొయ్యల రైతులు మంచిఫలితాలు పొందడంతో రొయ్యల చెరువుల విస్తీర్ణం ఘననీయంగా పెరిగింది. సన్న,చిన్నకారు రైతులు సైతం రొయ్యల సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఇటీవల ప్రతికూల వాతావరణంతో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదే సందర్భంలో యాంటిబయోటిక్స్ వాడకం అంటూ వ్యాపారులు రైతులను బెదిరించడం ప్రారంభించారు. దీనికితోడు గుజరాత్,పశ్చిమబెంగాల్, ఒరిస్సా తదితర‡ రాష్ట్రాల నుంచి రొయ్యల కొనుగోలు చేస్తున్నారు. ––రొయ్యల ధరలు తగ్గించడానికి ఎగుమతిదారులకు అవకాశం... రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు, ఇతరరాష్ట్రాల నుంచి దిగుమతులు కారణంగా రొయ్యల ధరలు తగ్గించడానికి రొయ్యల ఎగుమతిదారులకు మంచి అవకాశమని రైతులు వాపోతున్నారు. 2000 సంవత్సరంలో యాంటిబయోటిక్స్ అవశేషాలంటూ ధరలు ఘననీయంగా తగ్గించి రైతులను నష్టాల పాలుచేశారని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇబ్బడిముబ్బడిగా రొయ్యలు వస్తున్నాయంటూ ధరలు తగ్గించేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. –అక్కడ ప్రొసెసింగ్ యూనిట్లు లేకపోవడమే కారణం..... ఒరిస్సా, గుజరాత్, ప శ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో రొయ్యల సాగు చేస్తున్నా అక్కడ రొయ్యల మేతలు తయారుచేసే కంపెనీలు, ప్రొసెసింగ్ యూనిట్లు లేవు. గతంలో అక్కడ రొయ్యల సాగు తక్కువగా ఉండడంతో తెలుగురాష్ట్రాల నుంచే రొయ్యల మేతలు, మందులు దిగుమతి చేసుకునేవారు. అక్కడ ఉత్పత్తి చేసిన రొయ్యలను ప్రధానంగా భీమవరం,నెల్లూరు ప్రాంతంల్లోని వ్యాపారులు కొనుగోలు చేసేవారు. అయితే ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల్లోను రొయ్యల సాగు విస్తీర్ణం విఫరీతంగా పెరిగింది. రొయ్యలను నిల్వచేయడానికి అవసరమైన ప్రొసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో రొయ్యల పట్టుబడి పట్టిన వెంటనే తక్కువ ధరకైనా అమ్మకాలు చేసేవారు. దీనితో భీమవరం ప్రాంతంలోని వ్యాపారులు, ఏజెంట్లు కిలోకు రూ. 100 తక్కువ ధరకు కొనుగోలు చేసి భీమవరం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యలు ఇబ్బడి ముబ్బడిగా రావడంతో వ్యాపారులు, ఏజెంట్లు తక్కువ ధరకు లభించే ఇతర రాష్ట్రాల రొయ్యలను కొనుగోలు చేయడానికి ఆశక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే పద్దతి కొనసాగితే ఇక్కడి రొయ్యల ధర ఘననీయంగా తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –కంటెయినర్స్‌లో రొయ్యల తరలింపు.... భీమవరం ప్రాంతంలోని రొయ్యల వ్యాపారులు ఒరిస్సా, గుజరాత్, ప శ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన రొయ్యలను కంటెయినర్స్‌లో భీమవరం తీసుకువస్తున్నారు. ఒక్కొక్క కంటెయినర్లో సుమారు మూడువేల టన్నుల రొయ్యలను రవాణ చేయడం వల్ల రవాణ ఖర్చులు అంతంతమాత్రంగానే ఉండడంతో అక్కడ తక్కువ ధరకు దొరికే రొయ్యలను కొనుగోలు చేయడానికి ఇక్కడి వ్యాపారులు మక్కువ చూపుతున్నారని చెబుతున్నారు. –ధరలు తగ్గిపోయే ప్రమాదం ఉంది.... పి.ఏసు, రొయ్యరైతు, దెయ్యాల తిప్ప ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో ఇక్కడి రొయ్యల ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యలు దిగుమతి అయితే మేము పండించే రొయ్యలకు గిరాకీ తగ్గి మరింత ధర తగ్గిపోయే ప్రమాదం ఉంది. –ఇప్పటికే యాంటిబయోటిక్స్‌తో ఇబ్బందులు.... రొయ్యల్లో యాంటì బయోటిక్స్ ఉంటే «కొనుగోలు చేయమంటూ వ్యాపారులు అల్టిమేట్టం ఇచ్చిన తరుణంలో ఇతరరాష్ట్రాల నుంచి రొయ్యల దిగుమతి ఇక్కడి రైతులకు గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించనుంది. గతంలో యాంటి» యోటిక్స్ కార ణంగా ఇతర దేశాలు రొయ్యలు కొనుగోలు చేయడం లేదని ధరలు తగ్గించి వేశారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి రొయ్యలు దిగుమతి అయితే ఉల్లిపాయలు, టమాట రైతుల పరిస్థితి రొయ్యల రైతులకు దాపురిస్తుంది. -
ఆ హోదాయే సెప‘రేట్’
నామినేటెడ్ పోస్టుకు ఊపందుకున్న పైరవీలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ ఇదే అదనుగా క్యాష్ చేసుకుంటున్న కీలక నేత రూ. 20లక్షలకు దాటిపోయిన రేటు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆ పదవికి ఆర్థిక ప్రయోజనాలేం ఉండవు. అలా అని తీసిపారేయడానికి లేదు. రాజకీయంగా ఎదుగుదలకు ఓ అవకాశం ఉంది. అందుకే ఆ పదవికోసం ఇప్పుడు గట్టిపోటీ ఏర్పడింది. నామినేటెడ్ పదవుల్లో కీలకమైన ఈ పదవికోసం అప్పుడే లక్షలాదిరూపాయలు చేతులు మారినట్టు సమాచారం. పోటీకి అనుగుణంగా... ఓ ప్రముఖుడు ఎంచక్కా క్యాష్ చేసుకుంటున్నాడు. పోటీదారుల ఆరాటాన్ని ఆసరాగా చేసుకుని అందరినుంచీ పెద్ద మొత్తంలో గుంజేస్తున్నాడు. జిల్లాలోని నామినేటేడ్ పదవుల్లో కీలకమైనది జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి. ఇప్పుడీ పోస్టు కోసం టీడీపీ నేతల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పైరవీలు ఊపందుకున్నాయి. దాని వల్ల ఆర్థిక ప్రయోజనాల కన్నా రాజకీయంగా మైలేజ్ వస్తుందని, భవిష్యత్ రాజకీయాలకు రాచబాట అనే ఉద్దేశంతో టీడీపీ నేతలు పోటీపడుతున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని ఎవరెక్కువ ఇస్తే వారికే గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు కీలక నేతొకరు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏఎంసీ, ఆర్ఈసీఎస్, దేవాలయాల కమిటీలను మాత్రమే భర్తీ చేశారు. వీటి భర్తీలో పలుచోట్ల పెద్ద ఎత్తున మొత్తాలు చేతులు మారాయి. కాకపోతే, నియోజకవర్గాల స్థాయిలోనే ఒప్పందాలు జరిగిపోయాయి. ఆ దిశగానే నియామకాలు జరిగాయి. కానీ, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి మాత్రం నేటికీ భర్తీ చేయలేదు. ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తున్నారు. దీని కోసం ఎయిమ్స్ విద్యా సంస్థల అధినేత కడగల ఆనంద్‌కుమార్, గజపతినగరం నాయకుడు రావెల శ్రీధర్, పార్వతీపురం నాయకులు దేవరకోటి వెంకటనాయుడు, గొట్టాపు వెంకటనాయుడు తదితరులు మొదటి నుంచి ఆశిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు కూడా చేరినట్టు సమాచారం. ఇప్పటికే రూ. 20లక్షలకు దాటింది జిల్లా స్థాయి పదవి కావడంతో ప్రోటోకాల్ ఉంటుందని, భవిష్యత్ రాజకీయాలకు దోహదపడుతుందనే ఉద్దేశంతో ముగ్గురు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీన్ని ఆవకాశంగా తీసుకుని కీలక నేతొకరు క్యాష్ చేసుకుంటున్నారు. వారిలో ఒకరు ఆయనకు తొలి విడతగా రూ. 10లక్షల వరకు ముట్టజెప్పినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. మరొకరు రూ. 5లక్షలు ఇచ్చారని తెలుస్తోంది. ఇంకొకరు ఆ నేతకయ్యే విమాన చార్జీలను భరిస్తున్నట్టు తెలిసింది. ఎవరెంత ముట్టజెప్పినప్పటికీ రోజురోజుకూ పెరుగుతున్న పోటీ ఆయనలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇదే అదనుగా ఆశావహుల మధ్య రేటు పెంచేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్గతంగా జరిగిన సంప్రదింపుల ప్రకారం ఇప్పటివరకు ఆ రేటు రూ. 20లక్షలకు వెళ్లినట్టు పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. రూ. 30లక్షల నుంచి రూ. 40లక్షల వరకు వస్తే తప్ప కీలక నేత సానుకూలంగా స్పందించేలా లేరని తెలుస్తోంది. సీనియారిటీపైనే ఇద్దరి ఆశలు కాసులతో పదవి కొట్టేయాలని కొందరు యత్నిస్తుంటే ఓ ఇద్దరు మాత్రం సీనియారిటీనే ప్రాతిపదికగా పదవి కొట్టేయాలని పావులు కదుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో నామినేటేడ్ చైర్మన్ పదవితో బుగ్గకారులో తిరగొచ్చని కొన్నాళ్లు ఆశ పడిన నేత కాలక్రమంలో ఎమ్మెల్సీ పోస్టును ఆశించారు. అదీ దక్కకపోవడంతో ఇప్పుడీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేసులోకి వచ్చారు. నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాయకులకు, పార్టీలు మారి వచ్చిన నేతలకు పెద్ద పీట వేస్తున్నారని తమకు కనీసం ఈ పోసై్టనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే తరహాలో మరో నేత కూడా పార్టీకి అందించిన చిరకాల సేవలను దష్టిలో ఉంచుకుని చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. -
కేబుల్ ఆపరేటర్లను అనుమానిస్తున్నారు
సెటాప్ బాక్సుల ధరలు ఒకేలా ఉండాలి కేబుల్ టీవీ ఆపరేటర్ల జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు పి.గన్నవరం : ఒకొక్క కంపెనీ సెటాప్ బాక్సు ఒక్కో రకంగా ఉండడం వల్ల, కేబుల్ ఆపరేటర్లను వినియోగదారులు అనుమానిస్తున్నారని కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు అడపా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలపై ఈ నెలాఖరులో విజయవాడలో రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో పి.గన్నవరం నియోజకవర్గ కేబుల్ టీవీ ఆపరేటర్ల సమావేశం జరిగింది. సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు ఉలిశెట్టి బాబీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి వెంకట్రావు మాట్లాడుతూ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్పొరేట్ కంపెనీలు విక్రయిస్తున్న సెటాప్ బాక్సుల ధరలన్నీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి, భద్రత కల్పించాలని, రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. కేబుల్ ఆపరేటర్లతో పే చానల్స్ నిర్వాహకులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని విడనాడాలని సమావేశం డిమాండ్ చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని తీర్మానించింది. సమావేశంలో సంఘ నాయకులు ఎస్.సూర్యనారాయణ, ఇడుపుగంటి రామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు కంట్లో కారం
– పడిపోయిన పచ్చి మిరప ధర – కర్నూలు మార్కెట్లో 10 కిలోల ధర కేవలం రూ.30 మాత్రమే – రవాణా చార్జీలు కూడా గిట్టని వైనం – గగ్గోలు పెడుతున్న రైతులు కర్నూలు (అగ్రికల్చర్): మొన్నటి వరకు వినయోగదారులను కన్నీళ్లు పెట్టించిన కూరగాయల ధరలు ప్రస్తుతం రైతులను ఏడుపిస్తున్నాయి. ఇప్పటికే ఉల్లి, టమాట ధరలు పడిపోయి రైతులు నష్టాలు మూటగట్టుకోగా.. అదే వరుసలో పచ్చిమిరప రైతు చేరాడు. మిరప ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా నెల రోజులు క్రితం మిరప ధర సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు కొనలేనంతగా స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో పంట లేదు. అక్కడక్కడ సాగు చేసిన రైతులు కొంత లాభ పడ్డారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగుచేసిన పంట మార్కెట్‌కు చేరుతున్న సమయంలో ధరలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లోని కూరగాయల మార్కెట్లో మిరప ధరలు నేలను తాకాయి. జిల్లాలో ఈ ఏడాది దాదాపు 18వేల హెక్టార్లలో మిరప సాగు చేశారు. కర్నూలు, కల్లూరు, ఆదోని, ఆలూరు, సి.బెళగల్, కోడుమూరు, ఆళ్లగడ్డ, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి, కష్ణగిరి, దేవనకొండ, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, శిరువెళ్ల, రుద్రవరం, గోస్పాడు తదితర మండలాల్లో మిరప అత్యధికంగా సాగు చేశారు. దిగుబడులు ఎక్కువగా రావడంతో మార్కెట్‌కు తరలివస్తోంది. దీంతో ఒక్క సారిగా డిమాండ్ పడిపోవడంతో ధరలు పడిపోయాయి. బుధవారం రాత్రి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డలోని కూరగాయల హోల్‌సేల్ మార్కెట్లో 10 కిలోల మిరప ధర రూ.30 మాత్రమే పలికింది. ఎపుడూ లేని విధంగా మిరప ధరలు పడిపోవడంతో రైతులకు కూలీ, రవాణా ఖర్చులు కూడ దక్కడం లేదు. 10 కిలోలకు లభించిన ధర అయిన చేతికి లభిస్తుందా అంటే అదికూడా లేదు. అన్లోడింగ్, ఏజెంటు కమీషన్ తదతర వాటికి క్వింటాలుకు రూ.15 వరకు కోత పడుతోంది. మిరప ధరలు ఇంత దారుణంగా పడిపోవడం రెండేళ్ల కాలంలో ఇదే మొదటి సారి. మిగిలిన కూరగాయలది అదే పరిస్థితి: టమాట, ఉల్లి రైతులు కొన్ని రోజులుగా కూలి, రవాణా ఖర్చులు గిట్టక నష్టపోతుంటే తాజాగా మిరప, ఇతర కూరగాయల ధరలు పడిపోవడంతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. మిరపతో పాటు బెండ, చెవుళ, బీర తదితర వాటికి ధరలు నేలచూపు చూస్తున్నాయి. జూన్‌లో విస్తారంగా వర్షాలు పడటంతో కూరగాయల పంటలు భారీగా సాగు చేశారు. అన్ని ప్రాంతాల్లో ఒకే సారి పంట మార్కెట్లోకి రావడంతో డిమాండ్ పడిపోయి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఖర్చులకు కూడా రాలేదు: మధు రైతు వెల్దుర్తి మండలం బోయినపల్లిలో ఒక ఎకరాలో మిరప సాగు చేశాను. పెట్టుబడి దాదాపు రూ. 60వేలు పెట్టాను. బుధవారం కర్నూలు మార్కెట్‌కు 13 సంచుల్లో మిరప తీసుకవచ్చాను. మిరపను తెంపడానికి ఆరుగురు కూలీలకు రూ. 600 ఖర్చు అయ్యింది. పొలం నుంచి మార్కెట్‌కు తీసుకరావడానికి బస్తాకు రూ.30 చెల్లించాల్సి వచ్చింది. మార్కెట్లో 10 కిలోలకు రూ.30 మాత్రమే ఇస్తున్నారు. ఇందులో కమీషన్ ఏజెంటుకు కమీషన్ అన్లోడింగ్ చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. వచ్చిన మొత్తం ఖర్చులకు కూడా సరిపోలేదు. ధరలు ఇంత అధ్వానంగా ఉంటే రైతులు ఎలా బాగుపడతారు. ప్రభుత్వం మిరప రైతులకు న్యాయం చేయాలి. -
పెట్రోలు బాంబోయ్..!
జిల్లాపై అదనపు భారం.. నిత్యం రూ.40 లక్షలు కేంద్రం వాతపై రాష్ట్ర సర్కారు ‘వ్యాట్’ కారం జిల్లాపై పెట్రో ధరల తాజా పెంపు ప్రభావం పెరగనున్న నిత్యావసరాల ధరలు, రవాణా చార్జీలు సాక్షి, రాజమహేంద్రవరం : సామాన్యుడిపై పెట్రో బాంబ్ పేలింది. గత నెలలో స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. లీటర్ పెట్రోల్రూ.3.38, డీజిల్ రూ.2.67 పెరిగాయి. పెరిగిన ధరలకు అదనంగా రాష్ట ప్రభుత్వం పెట్రోల్‌పై పది పైసలు, డీజిల్‌పై 12 పైసలు వ్యాట్ పెంచింది. ఫలితంగా బుధవారం అర్ధరాత్రి వరకూ రూ.65.17 ఉన్న లీటర్ పెట్రోల్ రూ.68.65కు, రూ.56.33 ఉన్న డీజిల్ రూ.59.12కు పెరిగాయి. జిల్లాలోని 251 పెట్రోల్ బంకుల్లో రోజూ సుమారు ఐదు లక్షల లీటర్ల పెట్రోలు, ఎనిమిది లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా వాహనదారులపై రోజుకు సుమారు రూ.40 లక్షల అదనపు భారం పడుతోంది. మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు జిల్లాలో సుమారు 16 లక్షల కుటుంబాలుండగా దాదాపు 80 శాతం కుటుంబాలకు ద్విచక్రవాహనం ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఉద్యోగ, వ్యాపారావసరాలకు ద్విచక్రవాహనాలను ఉపయోగిస్తున్నారు. వీరు రోజూ కనీసం లీటర్ చొప్పన పెట్రోల్ వాడుతున్నారు. ఈ లెక్కన ప్రతి ఒక్కరూ నెలకు అదనంగా వంద రూపాయలు భరించాలి. పెరిగిన ధరల ప్రభావం చిన్నా చితకా ప్రైవేటు ఉద్యోగులపై తీవ్రంగా ఉంటోంది. పెరిగే ధరలకు అనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో ఇక్కట్లు తప్పవు. జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు పలువురు పొలాలకు నీరు పెట్టేందుకు డీజిల్ మోటార్లు ఉపయోగిస్తున్నారు. పెరిగిన డీజిల్ ధరల ప్రభావం వారిపై నేరుగా పడనుంది. వాహనం లేకపోయినా ప్రభావం... డీజిల్ ధరల పెంపు ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై పడుతోంది. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా లారీల రవాణా చార్జీలు పెరిగి, ఆ మేరకు నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగనున్నాయి. ఫలితంగా పేదల పరిస్థితి మరింత క్లిష్టం కానుంది. సామాన్యుల రవాణా సాధనమైన ఆటోల చార్జీలూ పెరగనున్నాయి. -
పెరిగిన బత్తాయి ధర..!
గుర్రంపోడు : బత్తాయి రైతులకు మంచిరోజులొచ్చాయి. గతంలో పంట ఉంటే ధర లేని..ధర ఉంటే దిగుబడి రాని పరిస్థితులు ఉండేవి. వర్షాభావంతో తగ్గిన తోటల సాగు..పడిపోయిన దిగుబడులతో మార్కెట్లో ధర కూడా దోబూచులాడింది. దీంతో నెల క్రితమే చాలా వరకు బత్తాయి తోటల్లో కాయ కోతలు ముగిసాయి. దీంతో ఇప్పటి వరకు కాయలు కోయని పది నుంచి 20శాతం తోటలకు మంచి ధర పలుకుతుంది. దళారులు తోటల వద్దకు వచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా టన్నుకు రూ25 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. నానా కష్టాలు పడి తోటలను కాపాడుకున్న తమకు ప్రస్తుత ధర ఎంతో ఊరటనిస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టన్నుకు రూ.పదివేల లోపు ఉన్న ధర ప్రస్తుతం పెరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బత్తాయి మార్కెట్ ప్రధాన కేంద్రాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లోనూ వర్షాకాలం సీజన్లో కురిసే వర్షాలపై మార్కెట్ ధర ఆధారపడి ఉంటుంది. ఐతే ఎన్నడూ లేనంతగా ఆగస్టులో ఆయా నగరాల్లో వర్షాలు లేక మన బత్తాయి రైతులకు కలిసొచ్చింది. సెప్టెంబర్‌లో టన్నుకు రూ.30 వేల వరకు ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
ప్రతి పనికి ఓ రేటు
సైదాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి కంపు చేయి తడిపితేనే పని ఇప్పటికే ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు మరి కొందరిపైనా నజర్..? సైదాపూర్ : సైదాపూర్ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఏపని కావాలన్నా అటెండర్ నుంచి అధికారి వరకు డబ్బులు ముట్టజెప్పాల్సిందే. ఇందులో కూడా పనిని బట్టి రేటు ఉంటుంది. పైసలు ఇస్తేనే ఫైళ్లు కదులుతాయి. కాసులు చేతిలో పడితేనే కాగితంపై కలం గీత పడుతుంది. కులం నుంచి భూముల రికార్డుల వరకు ధ్రువీకరణ పత్రాలు కావాలంటే రూ.100 నుంచి రూ.10 వేల వరకు లంచం ఇవ్వాల్సిందే. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు సృష్టించేది, సరి చేసేందుకు కాసులు కాజేసేది వీరే. ఇక్కడ పని చేసే అధికారులు ఖాళీ జేబులతో ఆఫీసుకు వచ్చి రోజు కనీసం రూ.2 వేలు వేసుకుని ఇంటికి వెళ్లారంటే అతిశయోక్తికాదు. డబ్బులు ముందు..పని తర్వాత..? రైతుల దగ్గర ముందు డబ్బులు తీసుకున్న కారణంగా అధికారుల్లో ఒకరికి ఒకరు పొసకకనే రైతుల పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. డబ్బులు ఇచ్చిన రైతులకు పాసు బుక్కులు లేవని, వెబ్ ల్యాండ్ పని చేయడంలేదని, లేక పని పూర్తి అయ్యింది.. కొన్ని రోజులు ఆగుమని తమదైన∙శైలిలో నచ్చజెపుతారు. ఓ అధికారి అయితే కార్యాలయానికి పనుల కోసం వచ్చేవారిని వరుస కలుపుకుని సంబోధిస్తూ డబ్బులు వసూలు చేస్తాడని స్థానికులు చెబుతున్నారు. పనులు కాక విసుగు చెందిన రైతులు గొడవ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వకుండా అప్పు పత్రం రాసి ఇస్తున్నట్లు తెలిసింది. అయితే డబ్బులు ఇచ్చినా పనులు కావడంలేదని ఏళ్ల తరబడి తిరుగుతున్నామని జూలై 4న రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట దర్నా చేశారు. సముదాయించడానికి వచ్చిన రెవెన్యూ అధికారులతో బాధిత రైతులు వాగ్వాదానికి దిగారు. డబ్బులు ఇచ్చినా ఎందుకు చేయడం లేదని నిలదీశారు. జీతాలు పెంచినా.. లంచాల కోసం డిమాండ్ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, లంచం ఆశించకుండా ఉండాలంటే వారికి సరిపోయే విధంగా వేతనాలు ఉండాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచారు. అయినా అవినీతి మరింత పెరిగిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. తహసీల్ కార్యాలయంలో ఉద్యోగులకు జీతం కన్నా లంచంపైనే మక్కువ ఎక్కువ. అధికారుల తప్పులకు.. రైతుల ఘర్షణ పహణీల్లో పేర్లు తప్పులు రాసి దరఖాస్తులు పెట్టుకుంటే సరి చేస్తామంటారు. ఆ దరఖాస్తుతో మోఖామీద ఎంక్వయిరీ అంటారు. రెండు వైపులా డబ్బులు తీసుకుని ఇక్కడ మాతో కావడంలేదని దీనికి ఆర్డీవో, లేక కోర్టుల్లో పరిష్కరించుకోవాలని రైతుకు సూచిస్తారు. ఈ క్రమంలో రైతుల మధ్య భూతగాదాలు ఏర్పడి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. అవినీతిపరులెందరో.. పేరు మార్పు కోసం రైతు నుంచి రూ.8 వేలు తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కిన వీఆర్వో గోస్కుల రమేశ్‌తో పాటు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరి కొందరు అధికారులపై ఏసీబీ దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. ఇదే కార్యాలయంలో కొందరు సిబ్బందిపై ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. అవినీతి అధికారులను అదుపు చేయడానికి అవినీతి నిరోదక శాఖ ఎన్నో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తూనే ఉంది. దొరికితేనే దొంగ, దొరక కుండా దండుకోవాలని మధ్యవర్తులను పెట్టుకుని మరీ లంచాలు వసూలు చేస్తున్నవారూ ఉన్నారు. తొమ్మిదేళ్ల క్రితం బీమా సొమ్ము చెల్లింపులో కక్కుర్తి పడి లంచం ఆశించిన ఆర్ఐ సీహెచ్.ప్రభాకర్ కరీంనగర్లో తన ఇంటి సమీపంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ]lÊడేండ్ల క్రితం మరో ఆర్ఐ రైతు వెంటబడి పొలం దగ్గర ఉన్న రైతును డబ్బులు ఇవ్వమని పీడించాడు. దిక్కులేక బాధితుడు ఏసీబీకి పట్టించాడు. దుద్దెనపల్లిలో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 9 గుంటల భూమికి రికార్డులలో పేరు మార్పు కోసం గత ఆరు నెలలుగా తిరుగుతున్న రైతు తాటిపల్లి రాజిరెడ్డిని రూ.15 వేలు డిమాండ్ చేసి రూ.8 వేలు తీసుకుంటూ వీఆర్వో రమేశ్ మంగళవారం ఏసీబీకి చిక్కాడు. అయినా రెవెన్యూ అధికారుల్లో ఏమాత్రం మార్పు రాదని మండల ప్రజలు అంటున్నారు. -
‘గుడ్లు’ తేలేయాల్సిందే..!
పాల్వంచ రూరల్: కోడిగుడ్డు ధర..క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఒక్కో ఎగ్ రేట్ రూ.6కు చేరడంతో వినియోగదారులు బాబోయ్..అంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ఒక్కోకోడిగుడ్డు ధర రూ.3నుంచి 4 వరకు ఉండేది. కొన్ని చోట్ల రూ.5కు కూడా అమ్మారు. ఇప్పుడు మరో రూపాయి పెరిగి రూ.6కు చేరింది. ప్రస్తుతం మార్కెట్లో 30 కోడిగుడ్లకు రూ.180కు అమ్ముతున్నారు. ఒక్క గుడ్డుకు ఆరు రూపాయలు వెచ్చించాలంటే పేదలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘గుడ్లు’ తేలేయాల్సిందే..!
పాల్వంచ రూరల్: కోడిగుడ్డు ధర..క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఒక్కో ఎగ్ రేట్ రూ.6కు చేరడంతో వినియోగదారులు బాబోయ్..అంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ఒక్కోకోడిగుడ్డు ధర రూ.3నుంచి 4 వరకు ఉండేది. కొన్ని చోట్ల రూ.5కు కూడా అమ్మారు. ఇప్పుడు మరో రూపాయి పెరిగి రూ.6కు చేరింది. ప్రస్తుతం మార్కెట్లో 30 కోడిగుడ్లకు రూ.180కు అమ్ముతున్నారు. ఒక్క గుడ్డుకు ఆరు రూపాయలు వెచ్చించాలంటే పేదలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
బియ్యం.. ధరల భయం
కేజీ ధర రూ.50 పైమాటే.. రైతుల వద్ద ధాన్యం నిల్వలు లేక రేటు పెంచిన వ్యాపారులు ఖరీఫ్ సీజన్ ముగిసే సరికి రూ.60కి చేరే అవకాశం సూపర్ మార్కెట్లలో మరీ ఎక్కువకు అమ్మకం వారం రోజులుగా పెరిగిన బియ్యం ధరలు ( కిలో ఒక్కంటికి) బియ్యం రకం గత వారం ధర ప్రస్తుత ధర –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– బ్రాండెడ్ (సూపర్ మార్కెట్లో) 49 54 నం.1 రకం 45 48 నం.2 రకం 38 42 కొత్త బియ్యం 35 38 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కొత్తగూడెం: బియ్యం ధరలు మండిపోతున్నాయి. రోజుకో రీతిలో ధరల్లో మార్పు చోటుచేసుకుంటుండంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. కిలో బియ్యం రూ.50కి పైగా ధర పలుకుతుండటంతో ఎలా తినేది.. అని వాపోతున్నారు. రైతుల వద్ద ధాన్యం నిల్వలు నిండుకోవడంతో... రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం నిల్వలు నిండుకోవడంతో వ్యాపారస్తులు ఒక్కసారిగా బియ్యం ధరలను పెంచేశారు. పాత బియ్యం పేరుతో మరింత ఎక్కువ రేటు చెప్తుండటంతో సామాన్యులు కొనే పరిస్థితి లేదు. వారంరోజుల వ్యవధిలోనే సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేందుకు కూడా వీలులేకుండా బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. సూపర్ మార్కెట్లో బ్రాండెడ్ బియ్యం గత వారం కేజీ రూ.49 ఉంటే ప్రస్తుతం రూ.54 పలుకుతోంది. ఇక మధ్య తరగతి ప్రజలు తినే సాంబమసూరి (నం.1 రకం) రూ.45 నుంచి కేజీ రూ.48కి ధర పెరిగింది. ఇలా వారం రోజుల వ్యవధిలో కేజీకి సుమారు రూ.3 నుంచి రూ.5 వరకు పెరగడంతో సామాన్యుల బడ్జెట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఖరీఫ్ సీజన్ ధాన్యం రైతుల వద్దకు వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది రూ.60 వరకు బియ్యం ధరలు చేరే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సూపర్ మార్కెట్లో మరీ అధికం రిటైల్ దుకాణాలతో పోలిస్తే సూపర్ మార్కెట్లలో లభించే బ్రాండెడ్ బియ్యం ధరలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. బ్రాండెడ్ పేరుతో సూపర్ మార్కెట్లలో వ్యాపారస్తులు విపరీతంగా రేట్లు పెంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రిటైల్ దూకాణాల్లో రెండు మూడు రకాల బియ్యం లభిస్తున్నాయి. వాటిల్లో ఏది తక్కువ ధరుంటే వాటినే కొనుగోలు చేస్తున్నారు. సూపర్ మార్కెట్లో ఆ అవకాశం కూడా లేకుండా బ్రాండెడ్ పేరుతో అధిక రేట్లు వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. బియ్యం ధరలను నియంత్రించకపోతే రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది. ధరలు తగ్గించాలి: రబియా, కొత్తగూడెం బియ్యం ధరలు బాగా పెరుగుతున్నాయి. వీటిని ప్రభుత్వమే తగ్గించాలి. కూలీనాలి చేసుకుని బతికే మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు రోజుకు బియ్యానికి రూ.100 ఖర్చు వస్తుంది. ఇక కూరగాయలు, నిత్యావసర వస్తువులు.. వేటి ధర చూసినా మండిపోతోంది. ధరలు అందుబాటులో ఉండాలి: సుశీల, కొత్తగూడెం సామాన్యులకు బియ్యం ధరలు ఏమాత్రం అందుబాటులో లేవు. సూపర్మార్కెట్లో బ్రాండెడ్ బియ్యం ధరలు విపరీతంగా ఉన్నాయి. రేషన్ బియ్యం నెలరోజులకు సరిపోక షాపుల్లో బియ్యం కొనాల్సి వస్తోంది. కానీ ఈ తీరుగ ధరలుంటే ఏమి కొంటాం.. ఏమి తింటాం.. -
ప్రతి పనికీ ... ఓ రేటుంది బాస్
అదృష్టం కలిసొచ్చి .. అధికార పార్టీ టికెట్‌పై తొలిసారిగా ఎమ్మెల్యే పదవి దక్కించుకున్న ఓ నేత తీరు వివాదాస్పదం అవుతోంది. ఒక మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్న సదరు ఎమ్మెల్యే ఆయన సొంత జిల్లాలో వేలు పెట్టని నియోజకవర్గం లేదట. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇక చెప్పనలవి కాకుండా ప్రతాపం చూపిస్తున్నారట సదరు గులాబీ ఎమ్మెల్యే. ఎస్సైల పోస్టింగులు, సీఐల ట్రాన్స్ఫర్లు.. అధికారులకు నచ్చిన చోట పనిచేసుకునే వెసులుబాటు .. ఇలా ఆయన పైరవీ చేయని రంగమే లేదు. కాకుంటే.. ‘ప్రతీ పనికి ఓ రేటుంది బాస్ ’ అంటూ సదరు ఎమ్మెల్యే బహిరంగంగానే బేరమాడేస్తున్నారు. ఇక, సదరు ఎమ్మెల్యే పైరవీతో అనుకున్న చోట పోస్టింగు దక్కించుకున్న కొందరు పోలీసు అధికారులు .. సంపాదన వేటలో పడ్డారని, పెట్టిన ఖర్చు రాబట్టుకోవద్దా ఏంటీ..? అంటూ తమ సహచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్టు వినికిడి. ‘చిన్నదో చితకదో మా పనులు మేం చేసుకుంటాం కదా.. తన నియోజకవర్గం సరిపోలేదని, మా నియోజకవర్గాల్లో వేలు పెడుతుంటే మేమేం చేయాలంటూ..’ పార్టీ నేతలు వాపోతున్నారు. అమాత్యునికి చెబుదామంటే.. ఆయనకే అత్యంత నమ్మకస్తుడైన ఎమ్మెల్యే కావడంతో ఫిర్యాదు చేసుడెందుకు..? అనవసరంగా మంత్రి దగ్గర చెడు కావడం ఎందుకని ఎవరికి వారు తమలో తామే మధనపడిపోతున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఓ జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్యే పోకడ చూస్తుంటే ... ‘మళ్లీ మనకు టికెట్ వ చ్చేది ఉందా...? వస్తే గెలిచేది ఉందా..? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం..’ అన్నట్టు ఉందని గులాబీ శ్రేణులు చె వులు కొరుక్కుంటున్నాయి..!! -
కోడిగుడ్డు@ రూ.5.50
తాండూరు: కోడిగుడ్డు ధర రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.5.50 కు చేరుకుంది. ఎండల దెబ్బకు కోళ్ల పరిశ్రమ దెబ్బతినడంతో ఆ ప్రభావం గుడ్డుపై పడింది. వారం రోజుల క్రితం రిటైల్ మార్కెట్లో ఒక్క కోడి గుడ్డు ధర రూ.4.50 ఉండగా తాజాగా ధర రూ.5.50కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో వంద గుడ్లు రూ.440 నుంచి రూ.460 వరకు విక్రయిస్తుండగా... అవి వినియోగదారుడిని చేరేసరికి మరో రూపాయి పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో కోళ్లు మృత్యువాతపడడం, ఫలితంగా గుడ్ల ఉత్పత్తి పడిపోవడంతోనే ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, మునుపటి కన్నా దాణా ఖర్చుకూడా రెట్టింపు కావడం ధరలపై ప్రభావం చూపిందంటున్నారు. కిలో రూ.15 ఉన్న దాణా రూ.30లకు, రూ.1500 ఉన్న వరిపొట్టు ధర రూ.6 వేలకు పెరిగాయాని, రవాణా చార్జీలు అధికమయ్యాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. -
పత్తి రైతు చిత్తు!
తేమశాతం ఉందంటూ వెనక్కు పంపుతున్న సీసీఐ పదిరోజులైనా కేజీ పత్తి కొన ని వైనం బయట మార్కెట్లో రేటు తగ్గించిన వ్యాపారులు వారంలో రూ.300 తగ్గిన పత్తి ధర ఆందోళనలో అన్నదాతలు పత్తి రేటు పడిపోతోంది. వారం కిందట క్విటా రూ.3,800 పలికిన పత్తి ధర ఇప్పుడు రూ.300 తగ్గింది. సీసీఐ కేంద్రాలను ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. బయ్యర్లు ముందు రాకపోవడం, వచ్చినా తేమ శాతం తగ్గిందనే సాకు చూపి కొనుగోలు చేయకపోవడంతో రైతులు వెనుతిరుగుతున్నారు. ఇప్పుడు దళారులు ప్రవేశించి అయినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు నష్టపోతున్నా వ్యవసాయ శాఖామంత్రి స్పందించకపోవడంపై విమర్మలు వినిపిస్తున్నాయి. నరసరావుపేటరూరల్ నరసరావుపేట వ్వవసాయ మార్కెట్ యార్డులో ఈనెల 3వ తేదీన సీసీఐ పత్తి కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బయ్యర్లకు మిల్లులు కేటాయించకపోవడంతో రెండ్రోజుల తర్వాత కోనుగోలు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత పలు గ్రామాల నుంచి రైతులు తీసుకువచ్చిన పత్తిని పరిశీలించిన బయ్యర్లు తేమశాతం ఎక్కువుగా ఉందంటూ వెనక్కు పంపారు. గిట్టుబాటు ధర వస్తుందని ఆశతో వచ్చిన రైతులకు నిరాశతో వెనుతిరిగారు. ఏఏ రోజుల్లో కేంద్రానికి రానున్నామో బయ్యర్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. అసలు వస్తారో, రారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఒక్క కేజీ పత్తి కూడా ఈ కేంద్రంలో కొనుగోలు జరగలేదు. దీంతో ఈ సీజన్లో పత్తితో నిండి ఉండాల్సిన మార్కెట్ బోసిపోయి కనిపిస్తోంది. తగ్గిన ధరలు.. వారం క్రితం వరకు పత్తి వ్యాపారులు గ్రామాల్లో క్వింటా రూ.3,800 వరకు కొనుగోలు చేశారు. తేమశాతం పేరుతో మార్కెట్ యార్డులో బయ్యర్లు పత్తిని వెనక్కు పంపడంతో గ్రామాల్లో వ్యాపారులు రేటు తగ్గించారు. ప్రస్తుతం గ్రామాల్లో క్వింటా రూ.3,500 నుంచి రూ.3,600 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు కూడా రావని ఆందోళనలో ఉన్న అన్నదాతలకు గిట్టుబాటు ధర లేకపోవడం భారంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
రాజన్‌కు మార్కెట్ ‘గురు’ల కితాబు!
- అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్: జిమ్ రోజర్స్ ప్రశంస - నోబెల్ ప్రైజ్‌కు అర్హుడన్న మార్క్ ఫేబర్ న్యూఢిల్లీ: ఎవరేమంటే నాకేంటి.. నా రూటే సెప‘రేటు’ అంటూ తనదైన శైలిలో ముందుకెళ్తున్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై దిగ్గజ ఫండ్ మేనేజర్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ‘గురు’గా ప్రసిద్ధి చెందిన రోజర్స్ హోల్డింగ్స్ చీఫ్ జిమ్ రోజర్స్ తాజాగా రాజన్ పనితీరుకు కితాబిచ్చారు. ప్రపంచంలోని అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్లలో రఘురామ్ రాజన్ ఒకరని కొనియాడారు. అంతర్జాతీయంగా డాలరుతో వివిధ దేశాల కరెన్సీ విలువలు కుప్పకూలుతున్నప్పటికీ.. వర్ధమాన మార్కెట్లలో అన్నింటికంటే భారత్ మార్కెట్ పనితీరు మెరుగ్గా ఉండటానికి ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలే కారణమనేది విశ్లేషకుల అభిప్రాయం. ఒకపక్క, వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఇతర సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీరేట్లను అత్యల్పస్థాయికి తగ్గించినప్పటికీ.. భారత్ మాత్రం ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా సమర్థంగా వ్యవహరించిందని కూడా వారు చెబుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నాని పేర్కొన్నారు. ‘చురుకైన, సమర్థవంతమైన వ్యక్తులకు కొదవలేకపోవడం భారత్‌కు చాలా మేలు చేకూరుస్తోంది. మరీ ముఖ్యంగా ఆర్బీఐ గవర్నర్ రాజన్‌ను గురించి చాలా చెప్పుకోవాలి. బహుశా అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్లలో ఒకరిగా ఆయనను పేర్కొనవచ్చు’ అని రోజర్స్ తాజాగా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన అతికొద్దిమంది ఆర్థిక వేత్తల్లో రాజన్ కూడా ఒకరు. దీంతో ఆయన పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయంగా మార్మోగాయి. రాజన్ చెప్పే విషయాలు నిక్కచ్చిగా ఉంటాయని, అందుకే ఆయనంటే తనకు అంత గౌరవమని రోజర్స్ పేర్కొన్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన భారత్ ప్రభుత్వానికి నాయకత్వం వహించడం లేదని, అందుకే దేశాన్ని కాపాడడం ఆయన చేతుల్లో లేదంటూ చలోక్తులు విసిరారు. పనితీరులో ఆయన ప్రస్తుత పంథానే అనుసరిస్తారన్న నమ్మకం మాత్రం తనకుందని రోజర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చైనా తన కరెన్సీ యువాన్ విలువను డీవేల్యూ చేయడం, అక్కడ ఆర్థిక మందగమనం కారణంగా తాజాగా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిన సందర్భంలో కూడా రాజన్ భారత్ ఆర్థిక వ్యవస్థపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిందేమీ లేదంటూ భరోసా ఇచ్చారు. అయితే, ప్రపంచ వృద్ధి చోదకంగా చైనా స్థానాన్ని భారత్ అందిపుచ్చుకోవాలంటే ఇంకా చాలా ఏళ్లే పడుతుందని కుండబద్దలు కొట్టడం కూడా ఆయనకే చెల్లింది. 2013లో ఆర్బీఐ పగ్గాలు అందుకున్న రాజన్... రూపాయి క్షీణతకు చికిత్స చేయడమే కాకుండా, పాలసీ నిర్ణయాల్లో ధరల కట్టడికే తొలి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే: ఫేబర్ మరో స్టాక్ మార్కెట్ దిగ్గజం మార్క్ ఫేబర్ కూడా రాజన్‌ను గతంలో ప్రశంసల్లో ముంచెత్తారు. ‘సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌లను సాధారణంగా నేను నమ్మను. అయితే, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అంటే మాత్రం అపారమైన విశ్వాసం ఉంది. ఇతర సెంట్రల్ బ్యాంకులు కరెన్సీ ప్రింటింగ్ కేంద్రాలుగా మారిపోతుంటే.. రాజన్ మాత్రం మానిటరీ పాలసీలపై తనకున్న పట్టును నిరూపించారు. పరపతి విధానాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఆయన అసాధారణ వ్యక్తి. ఆర్థిక శాస్త్రంలో కచ్చితంగా రాజన్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే’ అంటూ ఫేబర్ వ్యాఖ్యానించడం విశేషం. -
మరింత తగ్గిన బంగారం
-
25వేల దిగువకు పడిపోయిన బంగారం
-
గ్యాస్ ధర పెరగడమే మాక్కావాల్సింది!!
-
సిగ‘రేట్’ ఇష్టానుసారం
సిగ‘రేట్’ ఇష్టానుసారం పత్తికొండ అర్బన్, : మండలంలోని హోల్‌సేల్, రిటైల్ సిగరెట్ వ్యాపారులు ధూమపాన ప్రియులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. సిగరెట్లకు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇష్టానుసారంగా ధరలను పెంచి విక్రయాలు చేపడుతున్నారు. వాటికి రసీదులు కూడా ఇవ్వకుండా జీరో బిజినెస్ చేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే బడ్జెట్ వచ్చే వరకు ధరల నియంత్రణ సాధ్యం కాదని పేర్కొంటున్నారు. మండల పరిధిలోని దాదాపు 600 దుకాణాలకు పట్టణంలోని పది హోల్‌సేల్ షాపుల నుంచి సిగరెట్లు, బీడీలు తదితర వస్తువులు సరఫరా అవుతున్నాయి. ఆయా దుకాణాల్లో రోజూ వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు వ్యాపారాలు సాగుతాయి. గోల్డ్ఫ్లాక్ ప్యాక్ ఎంఆర్పీ రూ.59 ఉండగా హోల్‌సేల్‌లో రూ.55కే ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్యాక్‌ను రూ.60కి విక్రయిస్తున్నారు. పెద్దగోల్డ్ ఫ్లాక్ ప్యాక్ ఎంఆర్పీ రూ.75 ఉండగా హోల్‌సేల్‌లో రూ.70కి అమ్మాలి. కానీ రూ.78 నుంచి 80కి అమ్ముతున్నారు. బ్రిస్టల్, సిజర్, విల్స్ఫ్లాక్ ప్యాక్‌లు రూ.40కి విక్రయించాల్సి ఉండగా అధనంగా రూ.5 వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చిల్లర వ్యాపారులు స్మాల్ గోల్డ్ఫ్లాక్ సిగరెట్ రూ.6, పెద్దగోల్డ్ రూ.8 వరకు విక్రయిస్తూ వచ్చారు. అయితే కత్రిమ కొరత సృష్టించిన వ్యాపారులు కుమ్మక్కై స్మాల్ గోల్డ్‌ప్లాక్ రూ.7, పెద్దగోల్డ్ఫ్లాక్ సిగరెట్ రూ.9కి విక్రయిస్తున్నారు. ఈ ధరల గురించి బయట చెబితే సరుకు ఇవ్వబోమని హోల్‌సేల్ వ్యాపారులు చిరువ్యాపారులను బెదిరిస్తున్నారు. పొగతాగితే ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా పట్టించుకోని దూమపాణ ప్రియులు ఈ ధరలతో ఇబ్బందులు పడుతున్నారు.