Gold Rate today: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ మీద షాకులిస్తున్నాయి. వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 12) పీక్‌కు చేరాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు 10 గ్రాములకు ఈరోజు ఏకంగా రూ.1090 మేర పెరిగాయి.
ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.
హైదరాబాద్ నగరంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి రూ.67,200 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1090 చొప్పున పెరిగి రూ.73,310 వద్దకు ఎగిసింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ.67,200 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 ఎగిసి రూ.73,310 వద్దకు చేరింది.
♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.800 పెరిగి రూ.68,050 లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.880 చొప్పున పెరిగి రూ.74,240 ఉంది.
♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 ఎగిసి రూ.67,350 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 పెరిగి రూ.73,460 వద్ద ఉంది.
♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1000 పెరిగి ప్రస్తుతం రూ.67,200 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 ఎగిసి రూ.73,310 వద్దకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment