ఎస్బీఐ బల్క్ డిపాజిట్ల రేట్లు తగ్గింపు
న్యూఢిల్లీ: బల్క్ డిపాజిట్ల రేట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.9 శాతం వరకూ తగ్గించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో డిపాజిట్లు భారీగా వచ్చిన నేపథ్యంలో రూ.1-10 కోట్ల బల్క్ డిపాజిట్ల రేట్లను తగ్గించామని, ఈ తగ్గించిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తెలిపింది. 18-210 రోజుల డిపాజిట్లపై రేట్లను 5.75 శాతం నుంచి 3.85 శాతానికి, ఏడాది నుంచి 455 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రేట్లను 6% నుంచి 4.25%కి, ఏడు రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై రేట్లను 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించామని ఎస్‌బీఐ తెలిపింది.