bulk deposit
-
బల్క్ డిపాజిట్ రేట్లకు రెక్కలు!
ఒక శాతం పెంచిన ఎస్బీఐ పీఎన్బీ అరశాతం పెంపు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని రెండు అతిపెద్ద బ్యాంకులు పలు రకాల డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ అనూహ్య నిర్ణయం ప్రకటించాయి. ఎస్బీఐ రూ.కోటి దాటిన అన్ని డిపాజిట్లపై వడ్డీ రేటును ఒక శాతం పెంచింది. రూ. కోటిలోపున్న వాటిపై రేటులో మార్పు లేదు. 7–45 రోజుల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 4.75 శాతానికి చేరుకుంది. అలాగే, 5–10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై ఈ రేటు 4.25 శాతం నుంచి 5.25 శాతానికి పెరిగింది. పీఎన్బీ సైతం ఎస్బీఐ బాటలోనే నడుస్తూ రూ.కోటి దాటిన బల్క్ డిపాజిట్లపై అదనంగా అర శాతం వడ్డీని ఆఫర్ చేసింది. 4.50 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. వచ్చే నెల 6న ఆర్బీఐ మానిటరీ పాలసీ సమీక్షా సమావేశం నేపథ్యంలో తాజా సవరణలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ కొత్త రేట్లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
ఎస్బీఐ బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటు కోత
-
బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటు కోత
ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీరేట్లో కోతలు మొదలుపెట్టింది. బల్క్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును గణనీయంగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. బల్క్ డిపాజిట్ల వడ్డీరేటును 125 నుంచి 190 బేసిస్ పాయింట్లను (ఒక బేసిస్ పాయింట్లు 0.01శాతం) తగ్గించింది. ఈ మేరకు బ్యాంకు బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. కోటి నుంచి 10 కోట్ల రూపాయల డిపాజిట్లపై తగించిన ఈ వడ్డీరేట్లు రేపటినుంచే( గురువారం) అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎస్బీఐ వెబ్ సైట్ ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 180-210 రోజు కాలపరిమితికి స్థిర డిపాజిట్లపై 1.90 శాతం కోత పెట్టి 3.85 శాతంగా నిర్ణయించింది. ఇప్పటివరకు ఇది 5.75 శాతంగా ఉంది. ఒక సంవత్సరం నుంచి 455 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6 శాతం తగ్గించింది. ఇది గతంలో 4.25 శాతంగా వుంది. ఏడు నుంచి 45 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీఐలపై 1.25శాతం కోత పెట్టింది. ఇది గతంలో 3.75శాతం. ఈ నెల ఆరంభంలో ఒక కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా డీమానిటైజేషన్ కారణంగా దేశంలోని బ్యాంకుల్లో సుమారు రూ 5.4 లక్షల కోట్లు జమ అయినట్టు ప్రధాని ప్రకటించారు. ఇందులో పెద్ద నోట్ల రద్దుతర్వాత ఎస్బీఐలో సుమారు1.5 లక్షల కోట్ల మేర నగదు డిపాజిట్ అయింది. అయితే ఎస్ బీఐ బాటలోనే మిగతా బ్యాంకులు కూడా డిపాజిట్ల వడ్డీ రేట్ల కోత పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఎస్బీఐ బల్క్ డిపాజిట్ల రేట్లు తగ్గింపు
న్యూఢిల్లీ: బల్క్ డిపాజిట్ల రేట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.9 శాతం వరకూ తగ్గించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో డిపాజిట్లు భారీగా వచ్చిన నేపథ్యంలో రూ.1-10 కోట్ల బల్క్ డిపాజిట్ల రేట్లను తగ్గించామని, ఈ తగ్గించిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. 18-210 రోజుల డిపాజిట్లపై రేట్లను 5.75 శాతం నుంచి 3.85 శాతానికి, ఏడాది నుంచి 455 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై రేట్లను 6% నుంచి 4.25%కి, ఏడు రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై రేట్లను 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించామని ఎస్బీఐ తెలిపింది. -
బల్క్ డిపాజిట్ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ కోటి రూపాయల పైబడిన కొన్ని మెచ్యూరిటీలపై బల్క్ డిపాజిట్ రేట్లను 0.10 నుంచి 0.55 శాతం వరకూ తగ్గించింది. 7 నుంచి 14 రోజుల మధ్య వ్యవధి ఉండే టర్మ్ డిపాజిట్ రేటు ఇకపై 6 శాతంగా ఉంటుంది. 40 నుంచి 60 రోజుల మధ్య కాలానికి స్థిర రేటు 6.50 శాతంగా ఉంటుంది. 390 నుంచి 15 నెలల లోపు, 18 నెలల నుంచి రెండేళ్ల లోపు కాలానికి డిపాజిట్ రేటు 7.6 శాతానికి తగ్గించింది. రెండేళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య డిపాజిట్ రేటు 7.35 శాతంగా ఉంటుంది. ఇటీవల చిన్న పొదుపు మొత్తాలపై కేంద్రం భారీగా వడ్డీరేట్లు తగ్గిం చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలోని ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇటీవలే కోటి రూపాయల లోపు పలు మెచ్యూరిటీలపై డిపాజిట్ రేటును తగ్గించింది. ఈ వరుసలోనే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తగ్గించింది.