
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (జనవరి 3) కాస్త తగ్గాయి. మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు నిన్నటి రోజున పెరిగి మళ్లీ ఈరోజు దిగివచ్చాయి. దీంతో కొత్త ఏడాదిలో బంగారం కొంటున్నవారికి కాస్త ఉపశమనం కలిగినట్లయింది.
హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 చొప్పున తగ్గి రూ. 58,500 లకు దిగివచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల పసిడి ధర రూ. 270 చొప్పున తరిగి రూ.63,820 లకు క్షీణించింది. క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 58,500, రూ. 63,820 ఉండేవి.
క్లిక్ చేయండి: దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు
Silver Price Today: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా మోస్తరుగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 తగ్గింది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 80,000 లుగా ఉంది. ఇది క్రితం రోజున రూ.80,300 ఉండేది.