ప్రతీకాత్మక చిత్రం
టోక్యో: జపాన్‌లో జననాల రేటు దారుణంగా పడిపోవడంతో ఆ దేశం వినూత్నంగా ఆలోచించింది. అక్కడి యువతి యువకులను పెళ్లి చేసుకునేలా ప్రోత్సాహించి జననాల రేటు పెంచేందుకు కొత్త జంటకు 6 లక్షల యెన్‌లను జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జననాల రేటు తిరిగి గాడిన పడుతుందని జపాన్ ఆలోచించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ప్రోత్సాహక బహుమతి కింద 6 లక్షలు యెన్‌లు(ఇండియన్ కరెన్సీలో రూ. 4 లక్షలకు కంటే ఎక్కవ) ఇవ్వనుంది. అంతేగాక పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ ప్రోత్సాహం ఎంతగానో ఉపయోగపడుతుందని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. (చదవండి: 516కు పైగా ఆపరేషన్స్.. అయినా కానీ..)
ఈ పథకాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా విధించింది. పెళ్లి చేసుకునే జంట మొదట వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, వారి వయసు 40 ఏళ్లకు మించి ఉండకూడదు. వార్షిక ఆదాయం 5.4 లక్షల కంటే తక్కువగా ఉన్న వారే ఈ ప్రోత్సాహక బహుమతికి అర్హులుగా జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది దేశ వ్యాప్తంగా 8.65 లక్షల మంది మాత్రమే జన్మించడంతో రానురాను జననాల రేటు పడిపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దేశంలో జననాల రేటును తిరిగి పెంచేందుకు జపాన్ ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రోత్సాహాకాన్ని ఆ దేశ యువతీ యువకులు ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారో, జననాల రేటు పెరుగుదలకు ప్రభుత్వ ప్రయత్నం తోడ్పడుతుందో లేదో వేచి చూడాలి. (చదవండి: చైనా ముప్పు; భారత్- జపాన్ కీలక ఒప్పందం)
Comments
Please login to add a commentAdd a comment