ఒకనొక సమయంలో ప్రపంచం మొత్తంమీద జనాభా పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు జనాభా తగ్గుతూవస్తోంది. దీనికి కారణం లో బర్త్ రేట్. దీనికారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలు తలెత్తనున్నాయి.
Birth Rate : కొంతకాలం క్రితం వరకూ మనమంతా జనాభా నియంత్రణ గురించి మాట్లాడేవాళ్లం. అయితే ఇప్పుడు దీనికి రివర్స్ అయ్యింది. కొన్ని దేశాల్లో ఇప్పుడు జనాభా సంఖ్యను పెంచాలంటూ అక్కడి ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. భూమిపై తొలిసారి జనసంఖ్య తక్కువవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనివలన ఏమవుతుందనే ప్రశ్న మనందరిలో మెదులుతుంది. ప్రపంచంలో జననాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం మరణాల రేటు పెరగడం కాదు. జననాలు రేటు తగ్గడం.
చైనా, భారత్‌లో కూడా 2.1 కంటే దిగువకు జనన రేటు..
సంతానోత్పత్తిలో మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేసే ఆర్థికవేత్త మాథియాస్ డోప్కే తెలిపిన వివరాల ప్రకారం జనన రేటు తగ్గుదల అనేది కొన్ని సంపన్న దేశాలు, దేశంలోని సంపన్న కుటుంబాలకు మాత్రమే పరిమితం కాలేదు. చైనా, భారత్, బ్రెజిల్, మెక్సికోతో సహా 15 పెద్ద ఆర్థిక వ్యవస్థలలో జనన రేటు 2.1 కంటే తక్కువగా ఉంది. ఇందులో అమెరికా వంటి సంపన్న దేశాలు, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్ కూడా ఉన్నాయి.
తక్కువ జనన రేటుతో సమస్యలివే..
తక్కువ జననాల రేటు కారణంగా వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. గతంలో జపాన్,ఇటలీలలో ఎక్కువ మంది వృద్ధులు ఉండేవారు. కానీ ఇప్పుడు బ్రెజిల్, మెక్సికో,థాయ్‌లాండ్ కూడా ఈ జాబితాలో చేరాయి. సైకాలజిస్టులు తెలిపిన వివరాల ప్రకారం యువతకు సృజనాత్మకంగా ఆలోచించే శక్తి ఉంటుంది. యువత సమస్యను కొత్త మార్గంలో పరిష్కరిస్తుంది. యువత కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తుంటుంది.
2030 నాటికి, తూర్పు, ఆగ్నేయాసియా జనాభాలో సగం మంది 40 ఏళ్లు పైబడిన వారే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గుదల కారణంగా ఈ శతాబ్దం మధ్య నాటికి విద్యావంతులైన యువ కార్మికుల కొరత ఏర్పడుతుంది. జనం పిల్లలను కనాలని కోరుకోవడం లేదు. ఫలితంగా ప్రపంచంలో తక్కువ సంఖ్యలో యువత ఉంటుంది. ఫలితంగా దేశాభివృద్ధి కుంటుపడుతుంది.
1950-2021 మధ్య కాలంలో జననరేటు తగ్గుదల ఇలా..
దక్షిణ కొరియా: 86%
చైనా: 81%
థాయిలాండ్: 79%
జపాన్: 77%
ఇరాన్: 73%
బ్రెజిల్: 72%
కొలంబియా: 70%
మెక్సికో: 70%
పోలాండ్: 69%
టర్కీ: 68%
రష్యా: 67%
సౌదీ అరేబియా: 67%
మలేషియా: 66%
మొరాకో: 66%
ఉక్రెయిన్: 66%
ఇటలీ: 65%
కెనడా: 63%
భారతదేశం: 63%
పెరూ: 63%
బంగ్లాదేశ్: 62%
మయన్మార్: 62%
స్పెయిన్: 62%
వియత్నాం: 61%
ఇండోనేషియా: 60%
అల్జీరియా: 58%
ఈజిప్ట్: 58%
నేపాల్: 57%
ఫిలిప్పీన్స్: 56%
దక్షిణాఫ్రికా: 52%
యునైటెడ్ స్టేట్స్: 52%
ఫ్రాన్స్: 49%
అర్జెంటీనా: 47%
కెన్యా: 44%
జర్మనీ: 43%
యెమెన్: 42%
ఘనా: 41%
ఉజ్బెకిస్తాన్: 41%
ఇరాక్: 40%
యునైటెడ్ కింగ్‌డమ్: 39%
పాకిస్తాన్: 37%
నైజీరియా: 19%
ఇది కూడా చదవండి: 17కు వ్యాపారం.. 19కి సెటిల్.. 22కు రిటైర్మెంట్.. అమెరికా కుర్రాడి సక్సెస్ స్టోరీ
Comments
Please login to add a commentAdd a comment