గ్యాస్ ధరలు తగ్గించాలని ధర్నా
Published Fri, Mar 3 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
నరసరావుపేటటౌన్ : పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు అట్లూరి విజయకుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సామాన్య ప్రజలను సైతం పీక్కుతింటున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఇప్పటికే అనేకమార్లు గ్యాస్ ధరలు పెంచి వినియోగదారుల నడ్డివిరిచారని ఆగ్రమం వ్యక్తంచేశారు. నాయకులు బోయిన సుబ్బారావు, బెల్లంకొండ వెంకట్, మణికంఠ, హరిబాబు తదితరులున్నారు.
Advertisement
Advertisement