కోడిగుడ్డు ధర రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది.
తాండూరు: కోడిగుడ్డు ధర రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. రిటైల్ మార్కెట్‌లో గుడ్డు ధర రూ.5.50 కు చేరుకుంది. ఎండల దెబ్బకు కోళ్ల పరిశ్రమ దెబ్బతినడంతో ఆ ప్రభావం గుడ్డుపై పడింది. వారం రోజుల క్రితం రిటైల్ మార్కెట్‌లో ఒక్క కోడి గుడ్డు ధర రూ.4.50 ఉండగా తాజాగా ధర రూ.5.50కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో వంద గుడ్లు రూ.440 నుంచి రూ.460 వరకు విక్రయిస్తుండగా... అవి వినియోగదారుడిని చేరేసరికి మరో రూపాయి పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో కోళ్లు మృత్యువాతపడడం, ఫలితంగా గుడ్ల ఉత్పత్తి పడిపోవడంతోనే ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, మునుపటి కన్నా దాణా ఖర్చుకూడా రెట్టింపు కావడం ధరలపై ప్రభావం చూపిందంటున్నారు. కిలో రూ.15 ఉన్న దాణా రూ.30లకు, రూ.1500 ఉన్న వరిపొట్టు ధర రూ.6 వేలకు పెరిగాయాని, రవాణా చార్జీలు అధికమయ్యాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.