‘గుడ్లు’ తేలేయాల్సిందే..!
‘గుడ్లు’ తేలేయాల్సిందే..!
Published Tue, Aug 2 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
పాల్వంచ రూరల్: కోడిగుడ్డు ధర..క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ఒక్కో ఎగ్ రేట్ రూ.6కు చేరడంతో వినియోగదారులు బాబోయ్..అంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ఒక్కోకోడిగుడ్డు ధర రూ.3నుంచి 4 వరకు ఉండేది. కొన్ని చోట్ల రూ.5కు కూడా అమ్మారు. ఇప్పుడు మరో రూపాయి పెరిగి రూ.6కు చేరింది. ప్రస్తుతం మార్కెట్‌లో 30 కోడిగుడ్లకు రూ.180కు అమ్ముతున్నారు. ఒక్క గుడ్డుకు ఆరు రూపాయలు వెచ్చించాలంటే పేదలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
Advertisement
Advertisement